భగవంతుడికే బటాణీలు అమ్మిన భక్తాగ్రేసరుడు
ఈ మధ్య భగవంతుడికి చీకాకు పుట్టింది. కర్మ భూమి అని తాను కొన్ని యుగాల ముందు భారత భూమిని మెచ్చుకుని మాయ మయ్యింది మొదలుకుని భగవంతుడు మళ్ళీ భారత భూమి మీద కాలు పెట్ట కుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు.
కాని భారత భూమి కి రాకుండా ఉండటం తో ఆ భగవంతునికి బోరు కొట్టింది. ఎంతైనా భారత భూమి లో జరిగినంత విశేషాలు , తనకి జరిగినంత (తాను యుగ యుగాలుగా వాళ్లకి కనిపించకుండా పోయినా - నమ్మకం గా తానున్నాని అనుకుంటూ భజనలు , పాటలు పాడుకుంటూ ఉంటున్న జనసందోహం ఉన్న దేశ మాయే మరి ) వైభవం వేరే ఎక్కడ కాన రాలే ఆ మహాను భావునికి.
' యో అస్యాధక్షః పరమే వ్యోమన్'' అయిన ఆ భగవంతునికి అక్కడి ఒంటరి తనం ( వేదం లో చెప్పా రాయే - ఆనీద వా తగ్ స్వధయా తదేకం తస్మ్యాద్దాన్యం న పరః న కించ నాసః " అని ) మరీ బోరు కొట్టేసింది.
ఆఖరి కృష్ణావతారం కనుల ముంది కదులాడింది ! ఏమి వైభవం ! ఏమి వైభవం ! ఎంత మర్యాద ఎంత మర్యాద ! ఏమి ఆ గోపికల ప్రేమా ను రాగాలు ! ప్చ్ ! అన్నీ పోయే - మళ్ళీ ఈ ఒంటరి తనం !
ఇక ఈ ఒంటరి తనం తగదు. భారత భూమిలో జన సందోహం తన గురించి ఒకటే ఇదిగా స్వాములని బాబాలని ఆశ్ర్యసిస్తున్నారు.
అమ్మో వీరికి ఎంత భక్తీ నా పై ! వీరి భక్తీ కి మెచ్చి మళ్ళీ నే భారత దేశం వెళ్ళాల్సిందే అని తీర్మానించు కున్నాడు ఆ రోదసీ వాసి ( వేదం లో చెప్పారాయే - యో అంతరిక్షే రజసో విమానః అని )
అదిగో ఆ ఆలోచన కలుగగానే - భూమ్మండలం మీద - భారత భూమ్మీ ద కల కలం చెలరేగింది.
ఓ అఖండ భక్తుడికి దైవం కనబడి భక్తా - నేను భూమ్మీ ద కి వస్తున్నాని ' కలలో చెప్పాడు.
అలా మొదలయ్యింది ఈ భగవంతుడి పయనం భారత భూమి వైపు.
(సశేషం)
జిలేబి.