Monday, May 23, 2011

ఉత్తరం - మా తరం - 'ఈ' తరం - మీ తరం

ఒరేయ్ మనవడా  ఉత్తరం ఏమైనా వచ్చిందా చూడరా అంది బామ్మ మనవాడి తో

కరంటు లేదే బామ్మ అన్నాడు ' పంఖా' వై పు చూసి - తిర గ దేమిటి చెప్మా ఇది - కరంటు వస్తే బాగుండు - కంపూటర్ ఓపెన్ చెయ్యొచ్చు. వాడి కి తెలిసిన ఉత్తరం - 'ఈ' మెయిలు !


అదేమీ చోద్యం రా - ఉత్తరం రావడానికి - కరంటు కి సంబంధం ఏమిట్రా అబ్బిగా అదీను - పైకి చూసి దేవుడికి దండం పెట్టేదేందుకు ? -

బామ్మ - నీకేమి అర్థం కాదె ! ఈ లోకం లో ఉండి - 'ఈ ' లోకం గురించి తెలియ కుండా ఉండావేమిటే అంటూ వాపోయాడు మనవడు .

'మా కాలం ' లో మేమూ ఇలానే వాపోయాము లేవోయి - అని కళ్ళు మూసుకుంది బామ్మ - ! ఎండ వేడి - వడ గాడ్పు - ఆ విసన కర్ర ఇలా ఇవ్వరా అబ్బిగా అంటూ !-

చిన్నప్పట్టి పల్లెను - చల్ల గాలిని తలుచు కుంది బామ్మ - అబ్బే ఈ మహా నగరం లో ఒంటి స్థంభం మేడలో - ఒకటిన్నర గదిలో - ఆ పల్లె ని తలుచు కుని ఏమి ప్రయోజనం ?

ఎ కాలం ? ఈ కాలం ? మీ కాలం ?  మా కాలం - అంతా పోయే కాలం రా అబ్బిగా అంటూ నిద్ర లోకి జారుకుంది బామ్మ . ఈ మారు ఏమి అర్థం కాక బుర్ర గోక్కున్నాడు మనవడు.

జిలేబి.

No comments:

Post a Comment