పంచు లచ్చి కి టీవీ ప్రోగ్రాం ఒకటి చెయ్యాలని పించింది. రాణి తలచు కుంటే రాష్ట్రం లో ఛానల్ ల కి కొదవా ? వెంటనే ఓ టీవీ వాడు వెంటనే లచ్చి కి ఛాన్స్ ఇచ్చాడు.
పంచు లచ్చి ఆలోచించింది. తన ప్రోగ్రాం అన్నీ వెరైటీ గా ఉండాలి అని. అంటే - తనకి తెలిసిన అందరంకుల్ని, ఆంటీలని పిలిచి వాళ్ళతో బాతా ఖాని పెట్టి వాళ్ళని ప్రతి ఐదు నిముషాలకోమారు అంకులనో ఆంటీ అనో ముద్దు గా పేమ తో పిలిచి , తన ముద్దు ముద్దు మాట ల స్టైల్ ఒక టి ఎస్టాబ్లిష్ చేస్తే మంచిదని పంచు లచ్చి పీ ఆర్ ఓ సలహా ఇచ్చాడు.
దీంట్లో అశేష ఆంధ్రావనికి పొపులర్ ఐన తిరపతయ్య ( తిరపతయ్య కథ చదవ దలచుకుంటే ఇక్కడ నొక్కండి ) ని కూడా పంచు లచ్చి పిలచి 'అంకుల్' అని ముద్దు ముద్దు గా పిలచి ప్రోగ్రాం జరిపించింది పంచు లచ్చి. దానితో తిరపతయ్య కి మరీ చికాకు పుట్టి ( అసలే కొత్త చిత్రం ఒకటి చెయ్యాలని తిరపతయ్య ప్రయత్నం - ఈ అంకుల్ గొడవ ఏమిటి మద్య లో అని చికాకు పడ్డాడు తిరపతయ్య - ) ' ఇదిగో చూడు - నన్ను తీరూ అనే పిలవ వచ్చు అంకుల్ వద్దులే అన్నా కూడా ఆ పంచు లచ్చి నవ్వుతో - అంకుల్ మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ లో తిరు అంకుల్ అనే ఉంది అని పంచు డైలాగు చెప్పింది. తిరపతయ్య ఉసూరు మని ఊరుకున్నాడు. మిగతా భాగం తేరా పై చూడుడు వచ్చే వారం.
చీర్స్
జిలేబి.