Thursday, November 8, 2012

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివి అనుభవించితే  తెలియును లే! !

ఈ మధ్య ఎవరో ఒక అజ్ఞాత మానవుడు శంకరాభరణం బ్లాగు కామెంట్లు వ్యాఖ్యల పేజీ లో ఎక్కువై పోయిందని పేచీ పెట్టాడు!

మొదట్లో చాలా సీరియస్ గా బ్లాగులు గట్రా చదివే దాన్ని. ఆ పై ఈ వ్యాఖల పేజీ కనబడింది. ఏమిటో అని చూస్తే, కొన్ని రోజుల తరువాయి బ్లాగుల లిస్టు కన్నా ఈ వ్యాఖ్యల పేజీయే  మరీ రంజు గా ఉన్నట్టు అనిపించింది.

వా హ్ వా హ్  అనుకున్నా.

ఈ వ్యాఖ్యలు ఇచ్చే కిక్కు బ్లాగ్ టపా కూడా ఇవ్వదేమో మరి అన్నంత గా వ్యాఖ్యలు మాత్రమె చదివే దాన్ని.

ఈ పైత్యం నాకు మాత్రమె ఉందనుకున్నా !

కాదన్నమాట !

వ్యాఖ్యలు చదవి టపా చదివే వాళ్ళూ ఉన్నారన్న మాట నాలా మరి ! ఈ కేటగరీ వాళ్ళే ఎక్కువేమో మరి ? అగ్రిగేటర్ వాళ్ళు (మా హారం రెడ్డి గారి లాంటి వాళ్ళు, కాకుంటే సంకలిని శాస్త్రీ ) ఏమైనా ఓ 'విచారణ' కమిటీ వేసి ఈ విషయం తేల్చి చెప్పితే బాగుణ్ణు ! కామెంటు పేజీలకి ఎక్కువ  క్లిక్కులు వస్తాయా లేక బ్లాగు పేజీ కి ఎక్కువ క్లిక్కులు వస్తాయా అని అన్న మాట !

ఆ మధ్య 'ప్రవీణుడు' వరసబెట్టి కామెంటులు రాసే వాడు. ఈ మధ్య ఈ అబ్బాయి మరీ కనిపించటం లేదు మరి ! ఏమయ్యాడో మరి ప్చ్ !  అసలు ప్రవీణుడి కామెంట్లు లేక కామెంటు పేజీ లు మరీ 'సన్న' బడి పోయేయి !

సో,
వ్యాఖ్యల లో ఉంది మజా, అది చదివితే తెలియును లే!

అబ్బా, చూడండి, కామెంట్లకి ఎంత పవరు ఉందో, కామెంటు చదివి ఓ టపా రాసేసా నొచ్!

దురదస్య దురదః జిలేబీ నామ్యాః దురద గొంటాకు హ!


చీర్స్
జిలేబి.

Friday, November 2, 2012

ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ పూర్వ జన్మ లో జిలేబీ ఎవరు ?


నేనెవరు అన్నారు రమణ మహర్షి వారు . who am I ?

నేనెవరు ? అన్నా మా అయ్యరు గారితో.

జిలేబీ అన్నారు వారు.

మరి పూర్వ జన్మలో నేనెవరిని ?

చచ్చాం పో. ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధం. కాబట్టి పూర్వ జన్మలో కూడా నీవె నా జిలేబీ వేమో ? అన్నారు శ్రీ వారు.

అంతే  నంటారా ?

కాదనడానికి నాకు ధైర్యం చాలడం లేదు సుమీ అన్నారు అయ్యరు  గారు ! జిలేబీ యా మజాకా మరి ?

జోక్స్ అపార్ట్,, చాలా సీరియస్ టపా ఇది. పూర్వ జన్మలో మీ రెవరు అని తెలుసు కోవటం ఎలా ? అసలు పూర్వ జన్మ అంటూ ఉందా ? (ఉందనే వాదన ఎక్కువే మరి కాబట్టి ఉంది అనుకోవాలి )

ఈ ప్రశ్న ఎందు కొచ్చింది అంటారా ? శ్రీ సత్యనారాయణ శర్మ గారి పునర్జన్మలు - అప్పనాచార్య సర్ థామస్ మన్రో ఒక్కరేనా అన్న టపా చదివాకా మరి !

ఈ విషయం మీద చాలా రీసెర్చ్ అమెరికా లో జరిగినంతగా ఇంకెక్కడా జరిగి ఉండదేమో మరి. ఆ మద్య మా హిందూ వారు పాస్ట్ లైఫ్ ఆఫ్ గ్రేట్ మెన్ మీద ఒక పుస్తకం రివ్యు చేసారు. అందులో మన అబ్దుల్ కలాం గారు ఇంతకు మునుపు జన్మలో ఏమై ఉండే వారని ఆ పుస్తక రచయిత విశ్లేషించారు . అంతే  కాక జవహర్ లాల్ నెహ్రు గురించి కూడా విశ్లేషించి నట్టు గుర్తు.

అట్లా , ఈ విషయం కొంత సీరియస్ గా ఆలోచించ వలసిన విషయం మరి ! ఏమంటారు మరి ?

సరే ఈ విషయం లో స్వామీ శివానంద (డివైన్ లైఫ్  సొసైటీ సంస్థాపకులు ) గురించి చదివిన ఓ సంఘటన ఇక్కడ రాసి నేనూ గాయబ్ అవుతాను మరి !

స్వామీ గారిని ఓ విదేశీయుడు అడిగాడట (ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఈ విదీశీయులకి ఎట్లా తడతాయో మరి ?) - పూర్వ జన్మలో నేనెవరో ఎట్లా తెలుసు కోవడం అని ? అందుకు స్వామీ గారు , పూర్వ జన్మ గురించి నీ కెందుకోయ్ , మరిచి పోయి, ఈ జన్మలో నువ్వేం చెయ్యాలో అది చూడు అంటే, వాడు కుదరదు నాకది తెలుసుకోవాలి అని పట్టు బడితే నువ్వు డైరీ రాయడం మొదలెట్టు అంటే ఇవ్వాళి టి వి ఇవ్వాళ రాయి. రేపు రేపటికి ఇవ్వాళి టికీ చేర్చి రాయి. వారాంతం లో ఆ వారం మొత్తం మీదా కలిపి రాయి. ఇట్లా రాసుకుంటూ పోతే అంటే ఓ సంవత్సరం పాటు చేయి. వారాంతం లో ఆ వారం జరిగిన వాటిలో నీకు గుర్తు ఎంత ఉండేదో చూడు. ఇట్లా చేసుకుంటూ పోతే నీ జ్ఞాపక శక్తి పెరుగు తుంది. అంటే నీ మెదడు పదును పట్టిందన్న మాట . ఆ పై నీకు పూర్వ జన్మ జ్ఞాపకాన్ని బయటికి తీయడానికి వీలవ్వొచ్చు  అన్నారట !

మరి ప్రయత్నించి చూద్డా మంటారా ?

శుభోదయం !

చీర్స్
జిలేబి. 

Monday, October 22, 2012

ఈ బులుసు గారు ఎక్కడ చెప్మా ?


నమస్కారం 'సుబాల సుబ్రహ్మణ్యం' గారు,

చాలా రోజులుగా మీ టపాలు పంచ దశ లోకం లో కనిపించడం లేదు. అసలు కామెంట్లలో కూడా కూసింత నవ్వుకుందా మంటే అసలు కనబడడం లేదు మరి !
పునర్దర్శనం తో మళ్ళీ దసరా కో దీపావళీ కో మరో  మారు టపా వేయ వలెను. 

అయ్యా, ఏమిటి మాయమై పోయారు ? టపాలు అసలు రాయడం లేదు ?

అంతా కుశలమేనా ?

జిలేబి.

Friday, October 19, 2012

Master of Chaos Administration!(MCA)


' మన దేశం లో అన్ని విశ్వ విద్యాలయాలో మనం MCA -  - మాస్టర్స్ అఫ్ కేయాస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రేడ్యు వేషన్  పెట్టిన్చాలండీ అన్నా 'మన మోహనుల వారితో.


అబ్బా, మీకు ఇట్లాంటి అయిడియా లు ఎట్లా వస్తాయండీ అన్నారాయన.

ఏముందండీ మన పండిట్ గారు ధామ్మని సిటి బ్యాంకు నించి బయట పడి  పోయారు. ఆ వార్త చదివే వచ్చిందండీ అన్నా.

అంటే ?

ఓ ఐదు సంవత్సరములపు మునుపు సిటి దివాలా తీస్తా నంటే, ముక్కు బట్టి పండిట్ ని బెట్టి రెండు సంవత్సరాలలో లాభాలకు తెచ్చేరు. ఈ మానవుడు మాత్రం తక్కువ వారా? రెండు సంవత్సరాల బాటు ఒక్క డాలరు కి పని చేసి ( మన రామారావు గారి లా అన్న మాట - ఆయన ఓ రూపాయి అన్నారు వీరు ఓ డాలరు అన్నారు అంతే  తేడా మరి ) లాభాలు వచ్చాకే నేను పూర్తి జీతం అడుగుతా అని శపథం పట్టేరు. అట్లాగే ఓ రెండు సంవత్సారాల తరువాయి బ్యాంకు లాభాలలో కోచ్చేక ఓ రెండు మిలియన్ డాలర్ల సంవత్సరాదాయానికి వచ్చేసేరు. ఇంత భోగట్ట ఎట్లా దొరికింది జిలేబీ అంటారా ? అంతా మన ది హిందూ వారి చలవ . మరి బ్యాంకు బతికి బట్ట కట్టింది కదా - ఇక హుష్ కాకి అన్న మాట పండిట్ గారికి ఉద్వాసన మరి !

ఇంతకీ, ఈ సమీకరణం లో తేలిన విషయం ఏమిటంటే, మన ఇండియన్లు కేయాస్ మేనేజ్ మెంటు బ్రహ్మాండంగా చేస్తారని  తేలిం దన్న మాట. ! (మన మోహనుల వారు మాత్రం తక్కువా ? తొంభై ప్రాంతం లో ఆయన కూడా ఇట్లాంటి స్థితి లో నే కదా దేశాన్ని బయటకు తీసుకొచ్చేరు మరి ?)

కాబట్టి మన దేశ భావి పౌరులకి  MCA - - మాస్టర్స్ అఫ్ కేయాస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రేడ్యు వేషన్  లో తర్ఫీదు ఇచ్చి (ఇది జన్మతః ఇండియన్ లకి అబ్బిన కళ  అంటారా? నో ప్రాబ్లెం, అదీ సరి అయిన పాయింటే మరి !) ప్రపంచ మీద పంపిచాలి మరి !

సరే, మీకు ఓ ప్రశ్న (అబ్బ, టపా చదివితే ప్రశ్నలకి జవాబివ్వాలా అంటారా ?) ఈ మధ్య ఇట్లాగే ఒక ఇండియన్ మానవుడు మరో ప్రఖ్యాత ఇంటర్నేషనల్ బ్యాంకుకి అత్యున్నత పొసిషన్ లో కొచ్చేరు. అంటే ఈ మానవుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంటు కోసమేనా మరి ? అది అయ్యేక వీరికి కూడా టాటా బాయ్ బాయ్ నా మరి ?

ఏమంటారు ?

చీర్స్
జిలేబి.

Monday, October 15, 2012

తెలవారదేమో స్వామీ !


తెలవారదేమో స్వామీ, నీ తలపుల మునుకలో ... అని పాడేసేరు  ఆచార్యులవారు.

స్వామీ తలపుల మునుకల గురించి మాటేమో గాని, మా అయ్యరు  వారి తలపుల మునుకలో మేము పరేషాను ! మొదట్లో మా అయ్యరు  వారికి మనసు పారేశాను , దాని పర్యవసానం ఇప్పుడు పరేషాను !

జిలేబీ నీకో సంబంధం తెచ్చేరు మీ నాన్న గారు చెప్పింది మా బామ్మ.

నేను చేసుకోను అన్నా.

ఫోటో తెచ్చేరు లే చూసాకే చెప్పు అంది బామ్మ, అబ్బా ఈవిడకి చాలా టెకినీకులు తెలుసు సుమీ అంది మనసు.

చూస్తె పోలే. చూసి నచ్చలే  అని చెబ్తే పోయే అనుకున్నా. మా బామ్మ నే వద్దంటే కాదంటుందా అన్న రాంభరోసా అన్న మాట. బామ్మ పెంపకమాయే  మరి మనది.

బ్లాకు అండ్ వైటు ఫోటో. అయ్యరు మూడు పట్టీలు నుదిటి పై పట్టి ఉన్నారు. బానే ఉన్నాడను కున్నా.

ఏం  చేస్తారేమిటి ? అడిగా

మా బామ్మ ఊరుకుంది.

మళ్ళీ అడిగా .

'వాళ్ల్లకి  హోటలు ఉందట అది ' అంది బామ్మ  వంటా వార్పూ బాగా వచ్చట ' మళ్ళీ ఆశ పెట్టింది. అట్లా అనటం లో మరో ఆంతర్యం కూడా ఉందాయే మరి. బామ్మ పెంపకం లో లేడీస్ కి వంట నేర్వడమన్నది  లేనే లేదు. కాబట్టి వంట చెయ్యడం లో జిలేబీ జీరో. కాబట్టి బామ్మ  జిలేబీ చూసుకో నీకు మరో లాభం అన్నట్టు చెప్పింది ఆ ' వంటా వార్పూ బాగా వచ్చట' అని చెప్పటం లో '

'అరవ దేశం కాబట్టి తెలుగు తెలీదు, హిందీ అసలే రాదు' మళ్ళీ అంది.

నన్ను హిందీ ప్రావీణ్యత ఉన్న మేధావి వర్గం గా మా బామ్మ తయారు చేసిందాయే  మరి ! మా ఫ్యామలీ లో నేనే మొట్ట మొదట హిందీ తెలిసిన దాన్న ట ! కాబట్టి ఇది మైనసు పాయింటు ఆయే మరి అయ్యరు  వారికి!

మొత్తం మీద ఇట్లాంటి శుద్ధ పప్పుచారు అయ్యరు  వారిని మాకంట బెట్టి మా బామ్మ బాల్చీ తన్నేసింది.

అబ్బ , మనసు పారేసుకుంటే, పరేషానే  పరేషాన్ మరి !

కాబట్టి పారేసుకున్నా పరేషాను  కాకండీ మరి !

జిలేబి.

Thursday, October 11, 2012

గోడ మీద పిల్లి


ఓ గోడ మీద ఓ పిల్లి ఉండే దట 

మరి ఓ రోజు ఆ గోడ డామ్మని  కూలి పోయిందట 

గోడ మీద పిల్లి ధభీల్మని కింద పడిందట 

దానికి భయమేసి మళ్ళీ ఏ గోడా  ఎక్క కూడదని అనుకుందట 

కొన్ని రోజుల తరువాయి కూలిన గోడని కట్టించారట 

ఆ గోడని చూస్తూనే పిల్లికి ఆతురత కలిగిందట 

ఒక్క ఎగురు పై కెగిరి గోడ మీద కూర్చుని తన తోకని ముడిచి 

చుట్టూ కలయ జూసిందట 

అబ్బా , మళ్ళీ గోడ మీద పిల్లి!


చీర్స్ 
జిలేబి.
 

Saturday, October 6, 2012

ఎంతెంత దూరం ?

 
రెండు చుక్కల మధ్య 
నిలువ గీత 
అతి తక్కువైన దూరం
అది గణితం 
 
మరి ఈ జీవి ఆ పై జీవి 
మధ్య దూరం ఎందుకు మరీ ఎక్కువ ?
 
మరో బిందువు ఎక్కడుందో తెలీకా ?
దూరమనేది లేనే లేక పోవడం వల్లా?
నిలువు గీత లోపయనిస్తే,
రెండో బిందువు దర్శనం అవుతుందా ?
అసలు రెండో బిందువనేది లేనే లేదా ?
రెండు బిందువులు మమేకమా?
 
 
అబ్బా జిలేబీ, ఇన్ని ప్రశ్నలు ?
జవాబులు ఎక్కడ ?
 
 
చీర్స్ 
బీలేజీ
శుభోదయం!

Wednesday, October 3, 2012

గాంధీ గాండీ గండీ

 
గాంధీ సత్యాన్ని  సంధించే గాండీ రవం గా 
గాంధీ గండీ న సంధించే  సత్యాగ్రహం గా 
 
తా పుట్టి దేశానికి విముక్తి తెచ్చే  
జనన మరణాల కావల  ముక్తి మోక్షమట 
 
మరి ఈ జననం ఒక దేశానికి
ఒక జాతి కి ముక్తి ప్రసాదించే 
 
ఈ విముక్తి తో గాంధీ 
ముక్తి మతుడాయే 
 
ఈ దేశం ఎప్పుడు నిజమైన 
విముక్తి చెందునో మరి ?
 
మరో గాంధీ రావా లా ?
 
 
జిలేబి.

Tuesday, October 2, 2012

ఇవ్వాళ్టి టపా

ఇవ్వాళ్టి  టపా 
 
మేటరు ఏమీ లేదు.
 
అయినా బ్లాగాడాలని ఉంది 
 
ఇవ్వాళ్టి  కామెంటు 
 
ఏ బ్లాగైనా  మనదే !
 
కామెంట డం మన వంతు
 
రాసిన వాళ్ళు ధన్య జీవులు 
 
చదివిన వాళ్ళు కారణ జన్ములు 
 
 
అబ్బా, బ్లాగు భలే బాగు !
 
అమ్మో, టపా భలే బయాసు !
 
 
చీర్స్
జిలేబి.  

Wednesday, September 19, 2012

జిలేబీల గణపతయ్య



కుడుముల గణపతయ్య అని రాయక ఇవ్వాళ జిలేబీల గణపతయ్య అంటే ఎట్లా అండీ ?
 
ఏమిటో మరి.
 
ఇవ్వాళ సెలవు వచ్చింది కాబట్టి జిలేబీలు చుట్ట టానికి తీరిక చిక్కింది మరి.
 
అందుకే కుడుముల గణపతయ్య కూడా జిలేబీల గణపతయ్య అయిపోయినాడు.
 
బ్లాగ్ లోకం లో అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !




యే యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం !
 
జిలేబి.