శ్రీ రామచంద్ర ప్రభువు మళ్ళీ తల పట్టు కున్నాడు. అబ్బా తల నొప్పి అంటూ !
సీతమ్మ చూసింది.
'కుశ లవ్ కీ మా' అని సంబోధించాడు సీతనుద్దే శించి.
స్వామీ అన్నది అమ్మ వారు!
'తప్పైపోయి నిన్ను నేను ఒక్క సారి అడవులకి పంపి మరీ తప్పు చేసాను సుమీ ! జన్మ జన్మలకీ ఈ కారణం పట్టు కుని నన్ను శాంతి గా ఉండనివ్వ నంటున్నారు ఈ నరులు ' వాపోయాడు రామభద్రుడు. 'అవ్వా ళ ఆ మడవాలి మాట వినకుండా ఇప్పటి రాజకీయ నాయకుల్లా ఉండి 'వాడెవడో చస్తే నా కేంటంట అన్నట్టు ఉండి పోయి ఉండాల్సిం ది ' నిట్టూర్చాడు.
సీతమ్మ విచారం గా చూసింది.
పాపం స్వామీ వారు.
అడవులకి వెళ్ళిన తనే వగచ లేదు.
ఏమి జరిగిందో అది రాసి ఊరుకున్నాడు ఆ వాల్మీకి.
దాన్ని 'వినుడు, వినుడోయీ రామాయణ గాధ ' అని పుత్ర రత్నములు కూడా 'టాం టాం ' కొట్టేసేరు'!
అన్నీ కలిపి స్వామీ వారిని యుగ యుగ ములకీ వదిలి పెట్టె టట్టు లేదు మరి , వారి పై అభాండాలు !
'స్వామీ, బాధ పడకండి. దాన్ని 'కాంపెన్సేట్' చేయడానికే కదా,కృష్ణా వతారం లో మిమ్మల్ని కోరుకున్న వారినేవ్వరినీ మీరు కాదన లేదు ?" ముసి ముసి నవ్వులు చిందించింది అమ్మ వారు. ద్వాపర లో తన పరిణయం గుర్తు కొచ్చి మరీ సిగ్గు మొగ్గై పోయింది.
'ప్రాణే శ్వరీ , ఆ జన్మ మాత్రం ఆరోపణ లకి గురి కాలేదా ఈ మానవ మాత్రుల చేత ' మళ్ళీ వాపోయాడు రామచంద్రుడు.
'స్వామీ , అదియే కదా 'స్త్రీ' సిరి ! మీరు మమ్మల్ని ఏడిపించినా , మేము మిమ్మల్ని ఏడి పించినా , కాల గతి లో మీ పైకే ఆరోపణ లన్నీ వస్తాయి ' ఈ మారు అమ్మవారు మరీ ఆలోచించి చెప్పంది .
'ఎందు కంటావ్ ? ' అన్నట్టు చూసాడు భోళా రాముల వారు.
'ఏ కాలం లో నైనా ఓ మగ వాడు , ఓ స్త్రీని తక్కువ గా చెప్పి ఇంటి కెళ్ళి బతికి బట్ట కడతా డంటారా వాడికి తిండి ఇంట ఆ ఇల్లాలు పెడు తుం దంటా రా ?' అడిగింది సీతమ్మ.
' అవునోయ్, ఈ విషయం నాకు తట్ట లేదు సుమీ!
"ప్చ్ ఆ మానవుడికి ఇంట్లో తెల్లారి టిఫిను పెట్టలేదేమో వాళ్ళావిడ! కొంత ఆవిణ్ణి ఖుషీ చెయ్యడా నికి ఇట్లా చెప్పి ఇంటి కెళ్ళి ఉంటాడు, కనీసం 'చారన్నమైనా' దొరక్క పోదా అనుకుంటూ ' "
శ్రీ రాముడి ముఖం తేట బడింది. చింత వదిలింది.
'సీతమ్మ గుంభన గా నవ్వింది. ' ఈ మగ రాయుళ్ళ 'దిమాగ్' ఇట్లా గడ్డి పోచలా ఉంటుందెందుకో మరి ! ఓ నిమిషం లో డీలా పడి పోతారు. మరో నిమిషం లో శ్రీ మతి కొంత ఊరట కలిగిస్తే మళ్ళీ మన లోకం లోకి పడతారు !'
అంతా విష్ణు మాయ మరి !
దీపావళీ శుభాకాంక్షల తో -
యా దేవీ సర్వ భూతేషు ... ఇవ్వాళే 'మా సత్య' శ్రీ కృష్ణుని సాక్షి గా నరకాసురుడి సంహారం గావిం చిందట !
శుభోదయం !
భళీ !!
జిలేబీవళీ !!!