తిరపతయ్య సినీ రంగం లో అడుగు పెట్టేటప్పుడు చేతిలో 'కాలణా ' లేదు అని చెప్పుకోలేడు గాని . ఆ పై అదృష్టం కలసి వచ్చింది. స్వయం కృషి తో పై పై కి ఎదిగాడు. విలన్ గా, హీరో గా , క్యారెక్టర్ ఆక్టర్ గా ఇలా ఇదంటూ లేకుండా అట్లా మాస్ హీరో గాను ఇట్లా క్లాస్స్ హీరో గాను పేరు గాంచాడు.
తన జీవితం మొత్తం ఈ కళామ తల్లికేనా ? తన పేరు సార్థకం అయ్యేదేలా? అన్న సందేహం అతనికి ఓ రోజు కలిగింది. తిరపతయ్య అని తన వాళ్ళు ఊరికే పేరు పెట్టి ఉండరని అతని మనసుకి తట్టింది. ఆలోచించాడు. కొండ పైన దేవర కోసం అందరికి బోడిగుండు కొట్టేందు కు చాలామంది ఉండనే ఉన్నారు. కాని నిజం గా వీళ్ళు 'త్రికరణ శుద్ధిగా అందరికి క్షవరం చేస్తున్నారా ? అబ్బే లేదే అని వాపోయాడు.

ఆ రోజు తెల్లారి లేస్తూనే తన తమ్ముణ్ణి పిలచి - 'ఒరేయ్ అబ్బిగా నేను అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటున్నాను రా ' అన్నాడు. తమ్ముడు గాలి కన్నా వేగం ! అన్న ఆ అంటే తమ్ముడు సై అనే రకం !
' అన్నోయ్ - దానికేముంది బ్రహ్మాండం గా మనమే ఒక బోడిగుండు దుకాణం పెట్టేద్దాం ' అన్నాడు. అనడమే కాదు - వెంటనే కార్య రంగం లో కి దిగాడు. త్రికరణ శుద్ధి గా ఎవరెవ్వరు అందరికి బోడి గుండు కొట్టాలని అనుకుంటూ న్నారో వాళ్ళంతా తనని వెంటనే కలవాలని తనకో మెగా ప్లాన్ ఉందని చాటేశాడు.
అక్కడ కొండ పై ఉన్న బోడి గుండు సంఘం వాళ్లకి బెరుకు పుట్టిన మాట వాస్తవం . అయినా వాళ్ళు బింకం వదలలే.
'ఆ వీడు పేరుకే తిరపతయ్య - బోడిగుండు కోడతానంటే అందరు వీడి దగ్గరికి ఎందుకు వెళతారు? తర తరాలు గా కొండ దేవరకి 'తల' 'నీలాలు' అర్పించుకున్న అర్భకులు ఇవ్వాళ కొత్త సెలూన్ వస్తే దానికి వెళ్తారా ఎవరైనా? ' అని నిబ్బరం గా ఉన్దామానుకున్నారు.
అందులో తల పండినవాళ్ళు కొంత మంది ముందాలోచన చేసి ఎందుకైనా మంచిది - ఈ మధ్య కొండ దేవర పేరు చాల దిగ జారి పోతోంది - కాబట్టి - ఈ తిరపతయ్య ని వలలో వేసుకుని వాణ్ని తమ బోడి గుండు సంఘం లో నే చేరి అందరికి బోడి గుండు కొట్టు కో రా అబ్బిగా - నీకు ముందస్తే ఎలాంటి అనుభవం లేదాయెను - బోడి గుండు కొట్టడం అంత సులువైన పని కాదు - దానికి మెలుకువలు తెలియాలే - కొండ దేవర దీవెనలు ఉండాలే ' అని బుజ్జగించి చూసేరు. !
చత్ - బోడి గుండు కొట్టడానికి అనుభవం దేనికి - నాకున్న పేరు చాలు - తిరపతయ్య బోడిగుండు కొట్ట లేక పోవటం ఏమిటి? ' నా దుకాణం మీ కొండ మీదే కాకుంటే - కొండ కిందే పెడతాను ' అని శపథం చేసి - తమ్ముడు దుకాణానికి నాంది పలుకు ' అన్నాడు తిరపతయ్య.

తమ్ముడు నాంది వాచకం పలికాడు. దేశం లో ' బోడిగుండు' తాతయ్య ల ఫోటో లు వెతికి వెతికి పాపులర్ అయిన బోడిగుండు తాతయ్యని సూపెర్ మెగా లెవెల్ లో సెంటర్ లో పెట్టి 'తిరపతయ్య బోడిగుండు దుకాణం కనీ వినీ ఎరుగని తీరులో ప్రారంబించాడు.
ఇసుక వేస్తె రాలని జనం 'రంభోత్సవానికి' వస్తే - తస్స దియ్య ఇంత మంది బోడి గుండు కొట్టు కోవడానికి వేచి ఉండడం అతనికి కంట నీళ్ళు తెప్పించింది. 'అనాధ భాష్పాలు ' చూసి జనాలు కూడా ' ఆ హా మాకు బోడిగుండు కొట్టే దానికి కొత్త దుకాణం తయార్ ' అని కంట నీళ్ళు చిందించారు.
రెండో భాగం
తిరపతయ్య బోడిగుండు దుకాణం ప్రారంభోత్సవం తరువాయి అతనికి చాల చాలా మెప్పులు మన్నెనలు దీవెనెలు కొండొకచో 'జాగ్రత్తగా ఉండాలి సుమా' అన్న హెచ్చరికలు కూడా వచ్చేయి.
వేటూరి మావైతే - "తిరపతయ్యా ఇలా బృందవానాన్ని వదిలి బెట్టి అలా దండకారణ్యం లో వెళ్లి బోడిగుండు చేస్తానంటా వేమిటయ్యా " అని చింతించాడు కూడా.
దానికి తిరపతయ్య నవ్వి - దండకారణ్యం ఐతే ఏమి మావా - దాన్ని బృందావనం గా మార్చేస్తా అన్నాడు.
'అబ్బీ- నేను కలకత్తా పురి - యమహా నగరి అని పాటరాసిన మాట వాస్తవం. కాని వాస్తవాలకి కలలకి చాల వ్యత్యాసం ఉంది ' అని ఊరుకున్నాడు వేటూరి మావయ్య.
కొండ దేవరకి బ్రహ్మోత్సవాల సీసన్ వచ్చింది. ఇక తన బోడిగుండు దుకాణం ఎడతెరపి లేకుండా సాగి పోతుందని తమ్ముడు చెప్పాడు తిరపతయ్య కి.

బ్రహ్మోత్సవం అంటే మాటలా మరి? కాణీ కర్చుకాకుండా దేవేరి లక్ష్మమ్మ నగర సందర్శనం అవుతుందా? ఖర్చులకి జంక కుండా తన బోడి గుండు దుకాణానికి ప్రకటనలు ఇచ్చాడు తిరపతయ్య.
ప్రకటనల పేపర్లు చదివి ఆహా ఓహో అన్నారు జనాలు. ప్రకటనలే బోడి గుండు కొట్టినట్టుందని తెగ మెచ్చుకున్నాడు ఓ ప్రవాస భారతవాసి . తానూ బ్రహ్మోత్సవాల లో పాల్గొంటే తప్పకుండా తిరపతయ్య బోడిగుండు దుకాణం లో నే బోడి గొట్టించు కుంటా అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు కూడా.

బ్రహ్మోత్సవాల సీసన్ భారీ గా జరిగింది . తిరపతయ్య దుకాణం ముందు నించే చాల మంది తరలి వెళ్ళారు.
'రంభోత్సవం' నాడు కంట తడి పెట్టిన జన సందోహం, సమయం వచ్చేససరికి తిరపతయ్య దుకాణం లో బోడిగుండు కొట్టించు కోవడానికి నామోషి పడ్డారు.
అధునాతనం గా ఉంది సెలూన్. అంతా ఫ్రెష్ బ్లడ్ - స్మార్ట్ గా ఉన్న సేవకులు - రా రమ్మని పిలచే రామ చిలుకలని మరిపించే సంగీత వాయిద్యాల స్వరాలూ వస్తున్నాయి దుకాణం నించి. అయిన ఎందుకో జనాలు నామోషి పడ్డారు తిరపతయ్య దుకాణం లో బోడి గుండు కొట్టిన్చుకునేదానికి.

ముగిసన బ్రహ్మోత్సవాల తరువాయి లెక్క చూసుకుంటే తిరపతయ్య తల గిర్రున తిరిగింది. చేసుకున్న ఖర్చు గురించి తను బాధ పడలేదు గాని - తిరపతయ్య అని పేరుండి కూడా తన దుకాణం లో ఈ జనాలు ఎందుకు బోడి గుండు కొట్టించు కో కుండా వెళ్లి ఆ బోడి గుండు సంఘం వాళ్ళనే నమ్మారు ? అన్న సందేహం అతన్ని వదలలేదు.
ఇట్లా బ్రహ్మోత్సవాలు రెండు మూడేళ్ళు సాగాయి. మూడో బ్రహ్మోత్సవానికైతే - బోడి గుండు దుకాణం లో తల వెంట్రుకలు కింద కనిపిస్తే ఒట్టు అన్న స్తితి కి వస్తే - తమ్ముడు 'అన్నయ్యా - సెలూన్ లో హెయిర్ ఒకటైన కనిపించ కుంటే ఎట్లా ? ' అని వాపోతే - మచ్చుకకి తన జుట్టునే ఓ పారి లాగి కింద పడేసి - ఇది బోడి గుండు దుకాణమే సుమా ' అని చూపించు కోవాల్సిన పరిస్థితి కి వచ్చింది తిరపతయ్య గ్రహచారం.

ఈ మూడేళ్ళలో తిరపతయ్య బోడి గుండు దుకాణం గురించి చాల బాగానే ప్రాక్టికల్ గురించి కూడా తెలియ జేసుకున్నాడు.
ఏదైనా ఫీల్డ్ లో దిగితినే దాని లోటు పాటు లు, లోతుపాతులు, తెలిసి వస్తాయి అన్నది తిరపతయ్య కి తెలియని విషయం కాదు.
అందుకే చాలా సీరియస్ గా ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టి తను బృందావానాన్ని వదిలే ఆలోచన లేదే లేదని అట్లా అని దండ కారణ్యం లో బోడి గుండు దుకాణాన్ని బంద్ చెయ్య బోవడమూ లేదని ఓ మెగా స్టేట్మెంట్ ఇచ్చాడు.
దాని తో ప్రెస్ వాళ్లకి మసాల సమాచారం దొరికి వాళ్ళ రాతలకి - వాళ్ళ పేపర్ల డిమాండ్ కి కొరత లేకుండా పోవడమూ , దాని తో బాటు తెలుగు బ్లాగర్ల కి రాసుకోవడాని కి కొత్త టాపిక్ దొరకడమూ కూడా జరిగింది.
ఈ మధ్యలో - కొండ దేవరలని కొలిచే బోడి గుండు వాళ్ళ సంఘం - ఎందుకైనా మంచిదని - కొండ దేవరకి కొన్ని ఐడియా లు ఇచ్చారు. తిరపతయ్య బోడి గుండు దుకాణం సరిగా జరగక పోయినా - తను మా సంఘం లో లేదు కాబట్టి ఎప్పటికైనా అపాయమే !

అందుకే తిరపతయ్యని కొండ దేవర బోర్డు కి కుర్చీ మనిషి గా అయినా నియమించి అతన్ని కట్టి పడేయాలి లాంటి ఉపాయాలు కూడా పన్నారు. అవన్నీ ఓ కొలిక్కి రాలేక పోయాయి కూడా.
మధ్యలో - బోడి గుండు సంఘం వాళ్ళ చీఫ్ ఎవడికో షేవింగ్ చెయ్య బోయి - భస్మాసుర హస్తం స్టైల్ లో తన ప్రాణాన్ని ఆకాశ గంగలో వదిలిపెట్టడమూ, వాడి కొడుకు - తానె బోడి గుండు సంఘానికి వారస నాయకుడి నని చెప్పు కోవడమూ జరగటం - దానికి కొండ దేవర - అభ్యంతరం తెలిపి -
నీకన్న పెద్దలైన వయోవ్రుద్ధులైన బోడి గుండు తాతాశ్రీలు - నిజమైన బోడి గుండు తో వెలుగొందుతూ ఉంటే - నువ్వు అర్భుకుడివి - అదీ ఫుల్ క్రాప్ ఉన్న వాడివి - నువ్వెలా బోడి గుండు సంఘానికి చీఫ్ అవుతవోయి - అని తీసి పారేయ్యడమున్ను -
ఆ కుర్ర కుంక - తట్ - నే నేమి తక్కువ తిన్న వాణ్ని కాను సుమా అని జన సందోహం లో కలయ దిరిగి బోడిగుండు చీఫ్ గురించి చీఫ్ చేసిన త్యాగాల గురించి చెప్పుకోవడమున్నూ, ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టడమున్నూ కూడా జరిగేయి.
మూడో భాగం
బోడి గుండు చీఫ్ బాల్చీ తన్నే క - అప్పటికే మరో నియో బోడి గుండు సంఘం వాళ్ళు కొండ దేవరతో మొరలేట్టారు , ఘీమ్కరించారు - మా బోడి గుండు సంఘం కి కుంపటి వేరేగా పెట్టి తీరాల్సిందే అని.
కొండ దేవరకైతే - మరీ చీకాకు పుట్టింది. ఈ బాపతు లో వెళ్తూంటే తన పరపతి కే మోసం వచ్చేట్టు ఉందని అనిపించింది కొండ దేవరకి.
పోను పోను అసలు జనాలు బోడి గుండు కొట్టుకోవటానికి తనని కొలవడానికి అసలు కొండ కి వస్తారా అన్న సందేహం కూడా వచ్చేసింది కొండ దేవరకి.
ఇట్లా అతలాకుతలం అవుతున్న తరుణం లో తిరపతయ్య తీవ్రం గా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఇక తాను తన నిజ స్వరూపాన్ని చూపించాల్సిందే అని.
కొండ దేవర కూడా తీవ్రం గా అలోచించి తన కొండ పై జరుగుతున్నఈ సమస్యలకి ఓ సమాధానం కాకుంటే సర్దుబాటు చెయ్యాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేడు.
అల్కెమిస్ట్ పుస్తకం లో రచయిత పోలో కోఎల్హో ఒక చోట అంటాడు - ఒక మనిషి తాను కోరుకున్నది ఎట్లాగైనా జరిగి తీరాలి అనుకుంటే - ప్రపంచం మొత్తం ఆతని ఆలోచనలకి సప్పోర్ట్ ఇస్తుందని.
ఇదేమి కొత్త విషయం కాదు. యతో కర్మః తతో ఫలః అన్నదాన్ని కొద్ది పాటి మార్పులతో చేర్పులతో సుందరం గా ఇలా కూడా చెప్పవచ్చు. అంతే. !
ఇలా తిరపతయ్య , కొండ దేవరల ఆలోచనలు ఓ కొలిక్కి వస్తూనే - ఓ ఓ రోజు భారీ గా ప్రెస్ మీట్ కొండ దేవర సమక్షం లో తిరపతయ్య పెట్టి - జనాలకి షాక్ ఇచ్చాడు. - తన బోడి గుండు దుకాణం కట్టేస్తున్నాని - ఇక మీదట జనాలు కొండ మీది బోడి గుండు సంఘం వారి తో నే బోడి గుండు కొట్టించు కోవాలని -
అంతే గాకుండా - తా ను కూడా తన యావద్పరివారంతో బాటు - బోడి గుండు సంఘం లో చేరి పోతున్నాని - తన దగ్గిర ఇక బోడి గుండు కొట్టించు కోవాలని ఆరాటపడే వాళ్ళు - ఇక మీదట తనని బోడి గుండు సంఘం వాళ్ళ ద్వారానే సంప్రదించాలని కూడా వాక్రుచ్చాడు.
ఆ ప్రెస్ మీట్ లో ఓ వెధవ రిపోర్టర్ ఎకసక్కం గా అడిగాడు - " తిరపతయ్య - మొదట్లో నీ కేమి సత్తా ఉందని బోడి గుండు దుకాణం పెట్టేవు ? ఇప్పుడు ఏమి క్వాలిఫికషన్ ఉందని బోడి గుండు సంఘం లో చేర్తున్నావు ?"
తిరపతయ్య - అప్పటిదాకా - సిని ప్రపంచంలో గాని - పబ్లిక్ ప్రదర్శనలలో గాని చూపించని నిజాన్ని సవినయం గా చూపాడు- తన తలపైనున్న విగ్గు ని ఊడ బెరికి - నునుపైన , సొంపైన , నిగ నిగ మెరిసే తన బోడి గుండు ని టీవీ వాళ్లకి , ప్రెస్ వాళ్లకి సవిస్తారం గా చూపి - ఇంతకన్నా ఏమి క్వాలిఫికేషన్ కావాలి నాకు బోడి గుండు దుకాణం పెట్టడానికి, కాకుంటే - బోడి గుండు సంఘం లో చేరడానికి అని ఎదురు ప్రశ్న వేసాడు తిరపతయ్య.
శ్రీమధ్రమానంద హరీ ! హరిలో రంగ హరి ! ఈ తిరపతయ్య బోడి గుండు కథ పరిసమాప్తం ఇంతటి తో !
ఈ కథ చదివిన వారికి , విన్న వారికి , బ్లాగ్ లోకం లో కామెంటిన వారికి - అందరికి ఆ కొండ దేవర మా తిరుమలేసు ఆశీర్వాదాలు సకల వేళల ఉండాలని - మా తిరపతయ్య లా నిజాయితీ గా వాళ్ళంతా వర్ధిల్లా లని కొండ దేవర ని కోరుకుంటూ !!
(సమాప్తం)
చీర్స్
జిలేబి.
జిలేబి.
(పునః టపాకీకరణం)