Monday, April 15, 2013

సొగసరి అబ్బాయికి కి గడసరి అమ్మాయి జవాబు !

మూడు రాత్రుల ముచ్చట అయ్యింది 
 
సొగసరి అబ్బాయి అన్నాడు 
 
నా హం కర్తా హరిహి కర్తా !
 
గడసరి అమ్మాయి అన్నది కదా 
 
క్రియా సిద్ధిహ్ రసత్వే భవతి !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

Sunday, April 14, 2013

தமிழ் புத்தாண்டு நல் வாழ்த்துக்கள் !

 
తెలుగు బ్లాగ్ లోకం లో 
 
 ' అనైవరుక్కుం' ,
 
வாசகர் கள்  அனைவருக்கும்,
 
 தமிழ்  புத்தாண்டு
 
 நல் வாழ்த்துக்கள் !
 
 
చీర్స్ 
 
జిలేబి !

Thursday, April 11, 2013

ఉగాది 'ఫన్' చాంగ 'జిలేబీయం !

బ్లాగ్ చదువరు లందరికి
జిలేబీ యమైన
శ్రీ విజయ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !

ఇక ఉగాది అంటే మనం ప్రతి ఒక్కరం ఫన్ చాంగ శ్రవణం కోసం వేచి వుంటాం !

పూర్వ కాలం లో ఇంట్లో పెద్దలు పంచాంగం తెరిచి చదివి చెప్పే వారు, కాకుంటే గుళ్ళో అయ్యవారు చెప్పే వారు.

పచ్చడి లాగించి వారు చెప్పే గళ్ళూ, ఆ గళ్ళలో అట్లా ఇట్లా మారే గ్రహాలూ అవి మన పై జరిపే అగాయిత్యాలు , ప్రేమాయణాలు ఒక్కటని ఏమిటి అవన్నీ కలిపి మనల్ని వచ్చిన ఈ ఉగాది లో ఎట్లా 'దీవించును ' అని తెలుసుకుని అర్థమైతే మనకు నచ్చితే వాటిని గుండెల్లో పెట్టేసుకుని మహాదానంద పడి  పోయే వాళ్ళం .

ఆ  గ్రహాలు మనతో చెడు గుడు లాడతాయంటే కొంత గాభరా పడి ముక్కోటి దేవత ల లో సెలెక్టివ్ representative ని మస్కా కొట్టో , కాకుంటే నవ గ్రహాల లో వారిని సెలెక్టివ్ గా తాజా చేసుకునో వగైరా వగైరా mitigation ప్రాసెస్ మొదలెట్టే వాళ్ళం !

ఈ e-కాలం లో మనం మరీ మా గొప్ప జ్ఞాన వంతు లయిన వాళ్ళం !

కాబట్టి ఈ కాలం లో బ్లాగుల్లోను , ఇంటర్నెట్ లో ను, టీవీ ల లోను 'ఫన్' చాంగ శ్రవణం కంటాం  వింటాం ! ఓ పది పదిహేను దాక   ఈ ఫన్ చాంగ e-పటన , శ్రవణ తరువాయి మన బుర్ర గిర గిరా తిరుగును !

ఒక మహార్జ్యోతిష్ శర్మ గారు ఓయీ జిలేబీ జాగ్రత్త సుమ్మా నీకు రాబోయే కాలం కడు గడ్డు కాలం అంటే, మరో బ్లాగ్ జ్యోతిష్ శాస్త్రి గారు 'ఇదిగో జిలేబమ్మా , నీకు రాబోయే కాలం భేషైన కాలం అంటే , కొంత జుట్టు గీక్కుని, వాటికి బేరీజు వేసు కుని, పోనీలే రాబోయే కాలం ఓ మోస్తరు ఉంటది అని అనుకుంటాం !

ఇవన్నీ కలగలిపి పంచ దశ లోక వాసుల కోసం ఈ జిలేబీ చెప్పు ఈ శ్రీ విజయ నామ సంవత్సర ఫన్ చాంగ బ్లాగ్ టపా పటనం  ఏమనగా ... 

అయ్య లారా అమ్మ లారా ... 

ప్రతి రోజు మీరు జిలేబీ టపా ని వీక్షిం చండి మీకున్న ఏ విధమైనట్టి 'కాల' దోషాలు ఉన్నా అవి re-solve అయి పోవును ! అనగా అవి సాల్వ్  తమకు తామే అయి పోవడమో, లేకుంటే re-solve అయి పోవడమో జరుగును. 

ఆ పై 
మీరు జిలేబీ రోజు వారి టపా వీక్షించి టపా కి తప్పక కామెంటు కొట్టి న మీకు శ్రీ విజయ నామ సంవత్సరం లో అంతా శ్రావ్యం గా, సవ్యం గా కనసోంపు గా దివ్యంగా మంగళం గా అన్నీ మీకు శుభములే జరుగును !

ఇతి శ్రీ విజయనామ సంవత్సర జిలేబీ నామ్యా 'ఫన్' చాంగ బ్లాగ్ టపాః !

అందరికీ ఉగాది శుభ కామనలతో 

శుభోదయం !
జిలేబి
 

Monday, April 8, 2013

వనజవనమాలి: ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే )

వనజవనమాలి: ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే ): ప్రతి మనిషి  జీవితం లోను  అనేకానేక పరిచయాలు ఉంటాయి    కొంతమంది మన ప్రక్కనే నివశిస్తున్నప్పటికి కూడా పరిచయస్తులగానే  మిగిలి పోతుంటారు  ...

Saturday, April 6, 2013

చిత్తూరు నాగయ్య వెర్సస్ 'డాటేరు ' రమణ గారు !

చిత్తూరు నాగయ్య గారంటే మన బ్లాగ్ లోకపు టపా 'సామ్రాట్' డా టేరు  రమణ బాబు గారి కి మరీ గురి !

ఇక ఈ వి నాగయ్య గారు రమణ గారి గుంటూరు జిల్లా 'వాస్తవ్యులు' కావడం,  మా చిత్తూరు నాగయ్య గారవడం  వల్ల  (వారి సినీ లోకపు చమక్కులకు మునుపు చిత్తూరు రామ విలాస సభ లో నాటకాలలో విశ్వ రూపం గావిం చిన వారున్నూ!)  , రమణ గారి టపాలు తప్పి చదవడం వల్ల  ఈ జిలేబీ టపా అన్న మాట !

చిత్తూరు నాగయ్య గారు మరీ చాలా సినిమా ల లో ఏడ వడానికే  పుట్టిన మానవుళ్ళా  నా కనిపించడం అదేమీ ఖర్మో నాకు తెలీదు మరి. వారు చాలా వెరైటీ రోల్స్ చేసినా ఎక్కువ గా చేసిన రోల్స్ ఏడుపు కి సంబంధించి న వేమొ అని నా  అనుమానం !

(కాకుంటే, నేను చూసిన చిత్రాలలో వారు ఎక్కువగా ఏడుపు గొట్టు రోల్స్ చేసేరేమో!- 'ఆండోళ్లు - అర్ధ సేరు కన్నీళ్లు ఫ్రీ గా ఉన్నవాళ్ళం కదా మరి )


ఎందుకిట్లా అంటారా ? ఈ మధ్య పాత కాలపు చిత్రం నల దమయంతి యు ట్యూబ్ లో కనిపించింది సరే చూద్దారి అని చూస్తున్నా

(ఆ కాలం లో చూడడానికి మా వారు తీసు కెళ్ల లే మరి - కొట్టాయి లో సినిమా చూడ్డం ఏమిటే అని నామోషీ పడి పోయేరు అయ్యరు గారు -విషయం ఏమిటంటే కొట్టాయి చిత్రానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చే జమా చాలదు అదీ విషయం!)

చూస్తూంటే అప్పటి దాకా హ్యాండ్ సమ్  గా ఉన్న హీరో నలుడు (నటుడు - కెంపరాజ్ ) అట్లా దమయంతి ని వదిలి బెట్టి చెట్టూ పుట్టా పట్టుకుని అడివి లో కెళ్తే, అక్కడ ఓ సర్పం ఆ నలుణ్ణి కాటేస్తే వికారి రూపి అయిపోతాడు నలుడు !  అంటే మన హీరో ఆరడుగుల అంద గాడు  వికారి అవ్వాలి. ఎట్లా మరి ? హీరో కెం ప రాజ్ మరీ అంద గాడైన నలుడాయే ?

డైరక్టరు బాబు కెంప రాజు బుర్ర పెట్టేడు .

అప్పటి దాకా ఉన్న హీరో కెంప రాజ్ మారి ఏడుపు గొట్టు మొహం తో ధబాల్మని నాగయ్య గారు కనబడ్డేరు !

 నా కళ్ళు చిట్లించు కొని చూసా - నాకు కళ్ళు కనిపించవు సరిగ్గా అది నిజమే కాని ఇట్లా హీరో రూపమే మారి దభీ మని వేరే హీరో నాగయ్య గారు కనిపించట మేమిటీ  అని హాశ్చర్య పోయా !

ఇది మన డా టేరు  రమణ బాబు గారి టపా లు చదవడం వల్ల  వచ్చిన 'సైకో' కళ్ళ జోడు ప్రాబ్లెమ్ ఏమో అని సందేహం వచ్చినాది కూడాను !

ఇంతకీ విషయం ఏమిటంటే ఆ సర్ప కాటు తో హీరో నలుడు రూపు వికారమవ డం తో, ఎట్లా అందరూ యితడు నలుడు కాదు సుమా అని తెలుసు కునేది ? అని ఆ డైరెక్టరు మానవుడు హీరో నే మార్చేసేడు - అది మన నాగయ్య గారయ్యేరు ! అక్కడి నించి ఇక నాగయ్య గారు నలుని రూపం లో మనకు చిత్రం లో కన బడతారు, ఆహా అని మొదటి పాటే వారిది ఏడుపు రాగమై కన్నీళ్ళ కెరటమై మనల్ని స్పృశిస్తుంది !

ఆహా ఇప్పటి కాలం లో మారు వేషం లో హీరో అట్లాగే వచ్చినా ఎవరూ కని బెట్ట లేరే ! -

ఇక్కడేమో పాపం డైరెక్టరు అంత కష్టపడి హీరో నలుడు రూపం 'బదలాయించ ' డానికి ఇట్లా ఏకం గా హీరో నే మార్చేసేడు సుమీ అని ముక్కు మీద వేలేసు కున్నా !

అప్పుడేమో సందేహం వచ్చింది - అరె టైటిల్ లో చిత్తూరు నాగయ్య కనబడ లేదే అని ? ఆ పై మళ్ళీ వెనక్కి తిప్పి చూస్తే , వి నాగయ్య అన్న పేరు కని పించింది . ఓహో అప్పట్లో నాగయ్య గారికి చిత్తూరు నాగయ్య అని పేరు స్థిర పడ లేదు కామోసు అనుకున్నా!

సరే , ఇక మీ కోసం ఆ నాగయ్య గారి కన్నీళ్ళ గంగా ప్రవాహం ! దానికి ముందు కెంప రాజు గారి మజా ఐన సాంగు భానుమతి గారి తో కూడా చూడాలి మరి !

మొదట గా ..  భానుమతి దమయంతి గా అమోఘమైన ప్రేమాయణ గానమాధురీ  ఝురి !- ఓహో మోహన మానసమా !


హీరో కెంప రాజ్ - భానుమతి - నల దమయంతి గా



ఆ పై ఇక మన డా టేరు రమణ గారి నాగయ్య గారి అమోఘమైన నటనా ప్రతిభ !



చీర్స్
జిలేబి 

Wednesday, April 3, 2013

ఏప్రిల్ ఒకటి నాడు మూత బడ్డ బ్లాగు తెరిచిన ఏమగును ?

ప్రశ్నా మీదే !
జవాబూ మీదే!

ప్రశ్న:
ఏప్రిల్ ఒకటి నాడు మూత బడ్డ బ్లాగు తెరిచిన ఏమగును ?

జవాబు

ఒకటి

రెండు

మూడు

నాలుగు

వగైరా ..
వగైరా...

ఖాళీ లను పూరిం చుము !!


చీర్స్
జిలేబి 

Monday, April 1, 2013

ఎంటెంట తిరుగుతున్న జంట సోకు సూడరే!

ఈ మధ్య శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం చూస్తోంటే, కృష్ణ, శోభన్ బాబు మరో ఇద్దరు నటులు కలిసి శిల్పం నించి పుట్టిన లతాంగి తో ఐటం సాంగు చేసేరు ! అంటే special appearance అన్న మాట !
ఆహా ఆ కాలములో నే పద్మనాభం గారు ఐటం సాంగు కి special appearance సాంగు లకి నాందీ పలికేరు సుమీ అను కున్నా !

ఆ పై వేదాంతం రాఘవయ్య గారి భలే అమ్మాయిలు  చూస్తోంటే, దాంట్లో కూడా మరో ఐటం సాంగు (ఆ కాలం స్టైల్ లో) హీరొయిన్ గిరిజ గారే పాడేసేరు  !

ఇదే సినిమాలో , ఎమ్టీ వోరు సావిత్రమ్మ కలిసిన సందర్భం లో మరో 'గ్రూపు' ఐటం సాంగు కూడా పెట్టేరు ! (హీరో హీరొయిన్ అసలు డ్యూయెట్ పాడ కుండా వారి మనో భావాన్ని తెలిపే పాట ను గ్రూపు ఐటం వారు పాడేరు !




మొత్తం మీద ఐటం సాంగు అన్నది ఏమీ కొత్త పోకడ కాదు సుమీ అనిపిస్తున్నది ! ఈ చిత్రం 1957 లో తీసినది !

కొస రాజు కలం !- ఎస్ రాజేశ్వర రావు సంగీతం !


జిప్సీ : చకచక ఝుణతా - తకధిమికిటతా

పకపక నవ్వుతా - పంతమాడతా

ఎంటెంట తిరుగుతున్న జంట సోకు సూడరే "2"

కోరస్ : హేయ్! చకచక ఝుణతా - తకధిమికిటతా

పకపక నవ్వుతా - పంతమాడతా

టెంట తిరుగుతున్న జంట సోకు సూడరే "2"

జిప్సీ : పక్కనున్న పిల్లా! పంచదారబిళ్ళ

టక్కులెన్నో చేస్తున్నది

కోరస్ : ఆ అందగాణ్ణి బుట్టలోన వేసుకున్నది

జిప్సీ : మనసు లాగినాది! వయసు దోచినాది

మత్తుమందు చల్లినాది

కోరస్ : అబ్బబ్బ ఉచ్చువేసి పట్టినాది - హైహో "చక"

జిప్సీ : సూదంటురాయల్లె! లాగుతున్నదీ!! వాలు

సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది

కోరస్ : వాలు సూపుల్తో లోకుల్ని ఊపుతున్నది

జిప్సీ : వొళ్ళు తెలినీయకా! కళ్ళు గాననీయకా

గీటు దాటకుండకన్ను గీటుతున్నదీ

కోరస్ : దీని నాటకాలు తెలిసెనని నవ్వుతున్నదీ

జిప్సీ : మంచికులుకులాడీ

కోరస్ : తళుకుబెళుకులాడీ

జిప్సీ : మంచికులుకులాడీ

కోరస్ : ఆహా! వలపుజూపీ!! మోసపుచ్చుమాయలాడి

జిప్సీ : మురిసిపోయె రాజా!! ముచటైన రాజా

అంతు తెలిసి అడుగువెయవోయ్

కోరస్ : ఓహోహో అందమంత అనుభవించవోయ్ "చక"

 
Lyrics Courtesy: Site : http://www.telugump3lyrics.com/


Enjoy a Nice Song

Cheers

జిలేబి !

Friday, March 29, 2013

శ్రీ చాగంటి హొమ్ విజిట్ - జిలేబీయం !

శ్రీ చాగంటి హొమ్ విజిట్ - జిలేబీయం !
 
శుభోదయం !
 
 
చీర్స్ 
జిలేబి 

Thursday, March 28, 2013

పోలీసు టాణా లో పోకిరి అమ్మాయి

నిన్న మా టాణా కాడికి ఓ అమ్మాయి వచ్చినాది 
 
ఏందిబే  గిట్లా అమ్మాయిలు ధైర్యం జేస్తుం డ్రు 
 
పోలీసు టాణా కి అమ్మాయి ఒంటరి గా వచ్చినాది 
 
అని జర్రంత హాశ్చర్య పోయా !
 
వచ్చిన పోరి కస్సు మన్నాది , నీవేనా పోలీసు వెంకిట సామి వి ?
 
అవునే, నీ  వెవ్వర్తవె అనబోయి,
 
అమ్మాయి సూటు బూటు లో ఉండండం జూసి
 
కూసింత గవు రవం గా  యెస్  మేడం అన్నా 
 
నిన్ను డిస్మిస్ జేస్తాండా అంది టపీ మని 
 
జర్రంత గోపం వచ్చి 'నువ్వె వర్తవే నన్ను డిషు మిషు 
 
చేసే దానికి అంటే ఆ పోకిరి పోరి అన్నాది గదా 
 
నే కొత్త గా వొచ్చిన బడా పోలీసు దొరసాని నని !
 
చీర్స్ 
జిలేబి 

Monday, March 25, 2013

ముళ్ళ పూడి వారి మీద కేసు - శ్రీ భమిడిపాటి(బాతాఖానీ) ఫణి బాబు గారిది -ఇదీ!


ముళ్ళ పూడి వారి మీద కేసు - శ్రీ భమిడిపాటి(బాతాఖానీ) ఫణి బాబు గారిది  -ఇదీ!

కోతీ కొమ్మచ్చి స్వాతి లో సీరియల్ గా వస్తున్న రోజుల్లో శ్రీ భమిడి పాటి వారి ఆనందం ఇంతా అంతా కాదన్న మాట ! ముళ్ళ  పూడి వారి పై, వారు రాస్తున్న 'ఆత్మ కథ' పై మురిపెం ఎక్కువై జాగ్రత్త సుమీ , ముళ్ళపూడి వారు మీ పై 'ప్రజాహిత ' వ్యాజ్యం బనాయిస్తాం అని భయ పెట్టిస్తున్నారు శ్రీ ఫణి బాబు గారు !


ఎంజాయ్ రీడింగ్ !

చీర్స్
జిలేబి