చిత్తూరు నాగయ్య గారంటే మన బ్లాగ్ లోకపు టపా 'సామ్రాట్' డా టేరు రమణ బాబు గారి కి మరీ గురి !
ఇక ఈ వి నాగయ్య గారు రమణ గారి గుంటూరు జిల్లా 'వాస్తవ్యులు' కావడం, మా చిత్తూరు నాగయ్య గారవడం వల్ల (వారి సినీ లోకపు చమక్కులకు మునుపు చిత్తూరు రామ విలాస సభ లో నాటకాలలో విశ్వ రూపం గావిం చిన వారున్నూ!) , రమణ గారి టపాలు తప్పి చదవడం వల్ల ఈ జిలేబీ టపా అన్న మాట !
చిత్తూరు నాగయ్య గారు మరీ చాలా సినిమా ల లో ఏడ వడానికే పుట్టిన మానవుళ్ళా నా కనిపించడం అదేమీ ఖర్మో నాకు తెలీదు మరి. వారు చాలా వెరైటీ రోల్స్ చేసినా ఎక్కువ గా చేసిన రోల్స్ ఏడుపు కి సంబంధించి న వేమొ అని నా అనుమానం !
(కాకుంటే, నేను చూసిన చిత్రాలలో వారు ఎక్కువగా ఏడుపు గొట్టు రోల్స్ చేసేరేమో!- 'ఆండోళ్లు - అర్ధ సేరు కన్నీళ్లు ఫ్రీ గా ఉన్నవాళ్ళం కదా మరి )
ఎందుకిట్లా అంటారా ? ఈ మధ్య పాత కాలపు చిత్రం నల దమయంతి యు ట్యూబ్ లో కనిపించింది సరే చూద్దారి అని చూస్తున్నా
(ఆ కాలం లో చూడడానికి మా వారు తీసు కెళ్ల లే మరి - కొట్టాయి లో సినిమా చూడ్డం ఏమిటే అని నామోషీ పడి పోయేరు అయ్యరు గారు -విషయం ఏమిటంటే కొట్టాయి చిత్రానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చే జమా చాలదు అదీ విషయం!)
చూస్తూంటే అప్పటి దాకా హ్యాండ్ సమ్ గా ఉన్న హీరో నలుడు (నటుడు - కెంపరాజ్ ) అట్లా దమయంతి ని వదిలి బెట్టి చెట్టూ పుట్టా పట్టుకుని అడివి లో కెళ్తే, అక్కడ ఓ సర్పం ఆ నలుణ్ణి కాటేస్తే వికారి రూపి అయిపోతాడు నలుడు ! అంటే మన హీరో ఆరడుగుల అంద గాడు వికారి అవ్వాలి. ఎట్లా మరి ? హీరో కెం ప రాజ్ మరీ అంద గాడైన నలుడాయే ?
డైరక్టరు బాబు కెంప రాజు బుర్ర పెట్టేడు .
అప్పటి దాకా ఉన్న హీరో కెంప రాజ్ మారి ఏడుపు గొట్టు మొహం తో ధబాల్మని నాగయ్య గారు కనబడ్డేరు !
నా కళ్ళు చిట్లించు కొని చూసా - నాకు కళ్ళు కనిపించవు సరిగ్గా అది నిజమే కాని ఇట్లా హీరో రూపమే మారి దభీ మని వేరే హీరో నాగయ్య గారు కనిపించట మేమిటీ అని హాశ్చర్య పోయా !
ఇది మన డా టేరు రమణ బాబు గారి టపా లు చదవడం వల్ల వచ్చిన 'సైకో' కళ్ళ జోడు ప్రాబ్లెమ్ ఏమో అని సందేహం వచ్చినాది కూడాను !
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ సర్ప కాటు తో హీరో నలుడు రూపు వికారమవ డం తో, ఎట్లా అందరూ యితడు నలుడు కాదు సుమా అని తెలుసు కునేది ? అని ఆ డైరెక్టరు మానవుడు హీరో నే మార్చేసేడు - అది మన నాగయ్య గారయ్యేరు ! అక్కడి నించి ఇక నాగయ్య గారు నలుని రూపం లో మనకు చిత్రం లో కన బడతారు, ఆహా అని మొదటి పాటే వారిది ఏడుపు రాగమై కన్నీళ్ళ కెరటమై మనల్ని స్పృశిస్తుంది !
ఆహా ఇప్పటి కాలం లో మారు వేషం లో హీరో అట్లాగే వచ్చినా ఎవరూ కని బెట్ట లేరే ! -
ఇక్కడేమో పాపం డైరెక్టరు అంత కష్టపడి హీరో నలుడు రూపం 'బదలాయించ ' డానికి ఇట్లా ఏకం గా హీరో నే మార్చేసేడు సుమీ అని ముక్కు మీద వేలేసు కున్నా !
అప్పుడేమో సందేహం వచ్చింది - అరె టైటిల్ లో చిత్తూరు నాగయ్య కనబడ లేదే అని ? ఆ పై మళ్ళీ వెనక్కి తిప్పి చూస్తే , వి నాగయ్య అన్న పేరు కని పించింది . ఓహో అప్పట్లో నాగయ్య గారికి చిత్తూరు నాగయ్య అని పేరు స్థిర పడ లేదు కామోసు అనుకున్నా!
సరే , ఇక మీ కోసం ఆ నాగయ్య గారి కన్నీళ్ళ గంగా ప్రవాహం ! దానికి ముందు కెంప రాజు గారి మజా ఐన సాంగు భానుమతి గారి తో కూడా చూడాలి మరి !
మొదట గా .. భానుమతి దమయంతి గా అమోఘమైన ప్రేమాయణ గానమాధురీ ఝురి !- ఓహో మోహన మానసమా !
హీరో కెంప రాజ్ - భానుమతి - నల దమయంతి గా
ఆ పై ఇక మన డా టేరు రమణ గారి నాగయ్య గారి అమోఘమైన నటనా ప్రతిభ !
చీర్స్
జిలేబి

బావుంది . ఇంకా చూసి తరించలేదు . ఖాళీ సమయంలో .. చూసి తరించెదమ్ . ధన్యవాదములు
ReplyDelete