అమ్మగారు పిలుస్తున్నారండీ మిమ్మల్ని - తాకీదు వచ్చింది మనమోహనుల గారికి
ఆయ్ హాజర్ అని వెంటనే ప్రత్యక్ష మయ్యేరు అయ్యగారు .
ఏమండీ మాన్ గారూ ఓ రెండు మూడు రోజులు ఆటో నడపండీ చెప్పింది అమ్మ గారు .
మొహనులవారు ప్రశ్నార్థకం గా చూసేరు
మా ఐరోపా లో నార్వే ప్రధాన మంత్రి మారు వేషం లో టాక్సీ నడిపి ప్రజల బాగోగులు గట్రా తెలుసు కుంటున్నాడు అట్లా మీరూ చేయండి !
ఎస్ మేడంజీ
సీన్ రెండు :
హైదరాబాదు మహా నగరం
పాత ఆటో లో ఓ సర్దారీ బాబు తీరిగ్గా గోళ్ళు గిల్లు కుంటూ కూర్చున్నాడు . సవారీ ఎవరైనా వస్తే బావుణ్ణు అనుకుంటూ .
ఆయేగా ...
సర్దార్ జీ కి మరీ ఖుషీ ఐ పోయింది హా హా అన్నాడు .
సవారీ ఆటో ఎక్కాడు .
వెంటనే ఎందుకో సందేహం వచ్చి ... సర్దార్ జీ ని చూసి తూ తుమ్ .. ఆప్ మన్మోహన్ జీ హై క్యా ! అన్నాడు హాశ్చర్య పోయి
బిత్తర పోయాడు మన మోహను !
అసలు తను అంటూ ఓ మానవుడు ఉన్నాడని తన గురించి అసలు ఎవరైనా పట్టించు కుంటారా అనుకున్న మానవుడి కి కన్నీళ్ళు వచ్చేసేయి . తాను మారు వేషం లో ఉన్నా తన్ను కనుక్కున్నాడు కదా అని సంతోష పడి పోయాడు . కానీ తానె తను అని చెప్పలేక, 'నహీ సాబ్ సబ్ ఐసే హీ దీక్తే హై' అన్నాడు
ఓ, నువ్వే వారేమో అనుకున్నా . పోనీ లే దోమల్గూడా పోలీస్ టాణా కెల్లు చెప్పేడు సవారి .
దోమల్గూడా పోలీస్ స్టేషన్ లో ఏమి జరిగింది ?
జవాబు చెప్పిన వారికి మిటాయి పొట్లం ఫ్రీ !
జిలేబి