ఈ మధ్య మరీ బొత్తి గా పని లేక పోవడం తో అట్లా ఏదో కొంత ఓ శీర్షిక పెట్టి టైపాటు ఎలా సాగితే అలా టపా యించి బ్లాగరు చదువరులను కొంత బోరు కొట్టిద్దామని , ప్రణాళిక వేసేసు కున్నా !
బాతాఖానీ బాతాఖానీ అంటారు గదా మరి బాతా ఖానీ అంటే ఖచ్చితమైన అర్థం ఏమబ్బా అని ఆంద్ర భారతి డాట్ కామ్ వారి నిఘంటువు లో జూస్తే, ఉబుసుపోక కబుర్లు, వదురు బోతు పిచ్చాపాటి, ఇష్టాగోష్టి, పుక్కిటి పురాణం , ఊక కబుర్లు , వాగుట (!) అనే 'ప్రతి పదార్థాలు' కనిపించేయి .
ఇందులో మరీ పిచ్చా పాటి కొంత మరీ బాగుంటే పిచ్చా పాటి అన్న పేరు ఎట్లా వచ్చి ఉంటుందబ్బా అని ఆలోచించా !
అంత లో టప్ మని కరెంటు వాడు టైము చూసి కరెంటు పీకేసాడు ! అర్రెర్రె మనకి మరో కాలక్షేపం కబుర్లు కూడా తొదాయెనె ఈ శుభ సూచకం తో అనుకున్నా !
కరెంటు పోతే మనకి కాలూ చెయ్యి ఆడవు ! చూడ్డానికి టీవీ లేదు గాలాడ్డానికి ఫంఖా లేదు !
ఉక్క పోస్తే విసన కర్ర పట్టుకుని మా అయ్యరు గారికి విసురుతూ, నాకూ విసురుకుంటూ పని లేక అట్లా పుక్కటి పురాణం మొదలెట్టా
ఏమోయ్ జిలేబీ మరీ తీరుపాటు గా ఉన్నావ్ అన్నారు అయ్యరు గారు నవ్వుతూ
అబ్బే, కరెంటు లేదు గదా ఇంకేం చెయ్యాలో తోచడం లెదు. సో, కొంత బాతాఖానీ సాగిస్తా మని అన్నా !
సరేలే, 'బైటక్' గానా ' సాగించూ అన్నారు వారు
బైటక్ గానా అన్న పదం బాతాఖానీ అయ్యిందేమో మరి అనుకున్నా ! అదే మాట వారి తో చెబితే , మరి పిచ్చా పాటి ఎట్లా వచ్చి ఉంటుం దంటావ్ అని 'ఉల్టా' ప్రశ్న వేసారు వారు !
గూగులించి క్షణాల్లో తెలుసు కునే కాలం లో ఇట్లా బుర్ర కి పని జెబ్తే ఎట్లా అయ్యరు వాళ్ అన్నా వారికి ఫంకా బజాయిస్తూ .
అబ్బే ఊరికే ఉబుసుపోక అడిగా లే అంతే అన్నారు !
ఇదిగో చూడు జిలేబీ నువ్వు నాతొ ఇట్లా తీరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులు అయ్యిందో అని తనే మళ్ళీ చెప్పారు
అంతే కదా , కరెంటు పోతే గాని సిటీ మానవులకి మానవుల తో మాట్లాడ డానికి టైము దొరకని స్థితి కి వచ్చేసాం మరి ! ముఖ పుస్తకం కామెంటు గట్రా ల లో మునిగి పోయి తేలి పోతున్నా మెమో మరి !
ఇంతకీ నీనేని టపా రాస్తున్నా ?
అర్రెర్రె బాతాఖానీ కదూ ? ఇంతకీ పిచ్చాపాటి అన్న పదం ఎట్లా వచ్చి ఉంటుందబ్బా !?
చీర్స్
జిలేబి

జిలేబీగారూ
ReplyDeleteఈ టీవీలు, ఈ ఇంటర్నెట్టు, ఈ సెల్లుఫోనులు, ఈ సినిమాలూ వగైరా అన్నీ చుట్టూ లేకపోతే కాలూ చేయీ ఆడని జీవితాలైపోయాయి గదండీ! మనమేమో వీటికోసం కరెంటు అనబడే బ్రహ్మపదార్థం మనమీద చూపే దయమీద ఆధారపడి ఉన్నామన్నమాట. మా అమ్మగారు ఒకసారి "కరెంటు లేకపోతే కలియుగం లేదు" అని సెలవిచ్చారు. నూటికి నూరు పాళ్ళూ నిజంలాగా ఉంది. అయితే ఈ కరెంటు కాస్తా మాయమైపోయినప్పుడు గాని మనకు మన ఇంట్లోవాళ్ళ ఉనికి కూడా గుర్తు రానంతగా ఈ సదుపాయాల మాయలో పడి పోయాం. అందుచేత అప్పుడప్పుడు కరెంటు పోతూ ఉండాలీ - అప్పుడైనా కాస్తసేపు మనం నిజప్రపంచంలోకి వస్తూ ఉండాలీ. ఏమంటారు?
Deleteశ్యామలీయం గారు,
మా మంచి మాట సెలవిచ్చేరు ! మన దేశం లో జనాభా తగ్గించడ మేలా అని ప్రశ్నిస్తే, ఎవరో, ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి లైట్ ఇవ్వండి అన్ని సర్దు కుంటాయి అన్నారట !
జిలేబి
జిలేబి గూగులించిన క్షణాలలో తెలుసుకున్న ఊకకబుర్లు అనే మాట నాకు తెగ నచ్చేసింది!జిలేబి నిఘంటువు చూస్తే అదేమిచిత్రమోకాని నా పదసంపద వరదనీటిమట్టంలా పెరిగిపోతోంది!
ReplyDelete
Deleteసూర్య ప్రకాష్ గారు,
మీ ప్రోత్సాహానికి నెనర్లు ! పద సంపద బ్లాగు టపా రాసి రాసి అరిగి పోనాదండీ !! జేకే !
జిలేబి
మీ ఊక కబుర్లులో బోలెడంత విషయం ఉంటుంది. అందుకే మీ వెంట నేనూను.
ReplyDeleteశ్యామలీయమ్ గారి వ్యాఖ్య .. లో విషయమే నేను చెప్పాలి అనుకున్నాను. అందరిది అదేమాట కూడా .
ఇన్నాళ్ళకి అయ్యర్ గారి పంకా బజాయించడం బావుంది . :)
Deleteవనజ వనమాలీ గారు,
బహుకాల దర్శనం ! దేవాలయ దర్శనం తరువాయి మీరు మళ్ళీ rejuvenate అయినట్టు ఉన్నారు ! అట్లా మాకు కూడా మీ నించి మళ్ళీ మరిన్ని టపాలు వస్తాయని ఆశిస్తూ
ఇక మా అయ్యరు గారి కి ఫంకా బజాయించడం గురించి అంటారా ! మేము భజాయిస్తేనే వారికి ఫంకా గాలి రావాలి మరి !
జిలేబి
జిలేబి
ఎవరినో ప్రత్యేకంగా "దృష్టి" లో పెట్టుకుని వ్రాసినట్టుంది ఈ టపా... మరీ ఇంతలా rag చేయాలంటారా.... ఏమిటో .....
ReplyDelete
Deleteఅబ్బే, హరేఫలె గారు,
మిమ్మల్ని దృష్టి లో పెట్టుకుని మాత్రం కాదండీ ! జేకే !
జిలేబి
గతంలో మన పెద్దలు సాటి మనిషిపై ప్రేమ పెంచుకున్నారు, వస్తువుల్ని వాడుకున్నారు. అందుకే సుఖంగా శాంతితో జీవించారు. కాని ప్రస్తుతం మనం వస్తువులపై ప్రేమ పెంచుకుంటున్నాం, సాటి మనుషుల్ని వాడుకుంటున్నాం. అందుకే అస్తవ్యస్తంగా జీవిస్తున్నాం. మన పక్క ఫ్లాట్లోనే తీవ్రవాది ఉన్నా మనకు తెలియడం లేదు. పక్క ఫ్లాట్లో నాలుగైదు రోజులుగా శవాలు పడి ఉన్నా పక్కవారికి తెలియకుండా పోతున్న రోజులివి.
ReplyDeleteపిచ్చాపాటీ ఉండబట్టే ఆ రోజుల్లో మానవ సంబంధాలు నిలబడ్డాయోమో,,,,,, అవి పక్కవారితో చెయ్యలేక మనం సంబంధాలు కోల్పోయి, మహానగరాల్లో కుటుంబాల మధ్య ఉంటున్నా ఒంటరివాళ్లుగా మిగిలిపోతున్నామేమో...
Deleteపూర్ణ ప్రజ్ఞా భారతి గారు,
మా చక్కగా సెలవిచ్చారు !
ఇంతకీ ఈ పిచ్చా పాటి పదం ఎట్లా వచ్చిందబ్బా ?
జిలేబి
పాటి అంటే తమిళం లో మామ్మ అని అర్థం కదా! మరి ముందు మాటకూడా తమిళం నుంచే వచ్చి ఉంటుంది. మీరే చెప్పగలరు తమిళం వచ్చినవారు కనక...
ReplyDelete