Wednesday, July 31, 2013

లంగా రవిక కోక

 
తే నా లంగా అని
తెలంగాణా లగేసు కుంటే
కోక నాది అని
కోన సీమ కోరితే
రవిక నాదని
రాయలసీమ రంకాడితే
తెలుగు తల్లి నగ్నం గా 
 బిక్కు మొహం పెట్టి చూస్తోంది
 
 
మా తెలుగు తల్లికి 

ముళ్ళ పూదండ 

సంతాప 

నివాళి 

జిలేబి 
-

7 comments:

  1. హలో

    తెలుగువాళ్ళకి తెలుగుతల్లి ఎవరో గుర్తుందంటారా?

    దైనందిన రాజకీయాలూ ఓట్లపండగలూ తప్ప మరేమీ‌ గుర్తున్నట్లు లేదే.

    అన్నట్లు టీవీ సీరియళ్ళూ క్రెకెట్టు మేచ్‌లూ సినిమాలూ కూడా మనసుకు పట్టె లిష్టులో ఉన్నాయి తెలుగువాళ్ళకి.

    మనవ్వాళ్ళలో కొంచెం‌ ముదుర్లకి, అదే నండీ రాజకీయులకు ఢిల్లీతల్లి కొంపచుట్టూ ప్రదక్షిణాలూ అవీ చేయాల్సిన షెడ్యూళ్ళూ గుర్తుంటాయి.

    ఈ‌ తెలుగుతల్లి ఎవరబ్బా?

    ReplyDelete
  2. అద్భుతమైన స్పందన...

    ReplyDelete
  3. పిల్లలు అందిరినీ సరిగ్గా చూసుకునే తల్లికి ఈ తిప్పలు రావు. పదకొండు శాతం భూభాగం & పదిహేను శాతం జనాభా ఉన్నవారికి యాభయి శాతం నీళ్ళు తరిలించాక ఇది నిజం కాదనుకుంటా.

    పంటచేలు బీళ్ళయి గల్ఫ్ దేశాలకు వలసపోయిన బిడ్డలు తల్లి కన్నీళ్ళతో వీడుకోలు చెప్పిందా? పక్కనే కృష్ణమ్మ పారుతున్నా ఫ్లోరోసిస్ భూతంతో ఎముకలు కుళ్ళి ఏడ్చిన పిల్లలను హత్తుకుందా? చెరువులను, కుంటలను చివరికి బొందగడ్డలను భూబకాసరులు కబ్జా చేసినందుకు తల్లడిల్లిన బీదబిక్కి గొడవ పట్టించుకుందా?

    చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అని ఊరికే అనలేదు.

    ReplyDelete
  4. one thing i don't understand! if telanganites went to gulf for Dirhams(!?)... why srikakulam labor only relayed on hyd for less valued rupees! why didnt they opted for Gulf! are they less knowledgeable or illiterates than telanganites! a small doubt....

    ReplyDelete
    Replies
    1. అంత సీన్ లేదండీ. గల్ఫులో 45 డిగ్రీల ఎండలలో పని చేసే కూలీలకు నెలకు మూడు వేలు మాత్రమె ఇంటికి పంపించే మాత్రమె సంపాదిస్తారు. ఆ దేశంలో వాళ్ళు పడే బాధలు నిజంగా వర్ణనాతీతం. సొంత ఊరిలో ఒకటి రెండు ఎకరాలున్న సన్నకారు రైతులుకు కూడా ఈ గతి పట్టింది.

      They are really worse off than landless labor who migrate to big cities as unskilled workers/tea bandi guys.

      Delete
  5. Just a Thought - why dont they do it in Hyderabad. Mari mee TG champions unnaru kada. Vallu kuda intena, lekapote valla pillau separate na. EE TG champions mari investments ekkada unnayi

    ReplyDelete