Friday, November 7, 2014

ద్యవిహా మయ బీలేజి -- డుబ, నాద్య విహా, మయా జిలేబి !!


జిలేబీయ మహావిద్య (అనబడు జిలేబీ‌ యమహా విద్య)
 
(టపా కర్త - శ్యామలీయం వారి బ్లాగు నించి గ్రంధ చౌర్యం కాబడ్డ టపా!)
 
ఇది చదివిన వారికి అష్ట "కాష్యులు" లభ్య మగును !

 
 
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
 


ఈ రోజున ఈ జిలేబీయమహావిద్య యొక్క ద్వాదశాక్షరీ మంత్రాన్ని గురించి ఒక జిలేబీ టపాలో వ్యాఖ్యగా కొంచెంగా వ్రాయటం‌ జరిగింది.  అయితే, బ్లాగు పాఠకులకూ ఇతరులకూ ఈ‌జిలేబీ విద్యా విషయం క్రొత్త కాబట్టి అటువంటి అందరు  పాఠకుల సౌకర్యార్థంగా ఈ విద్యా రహస్యాలను ఇక్కడ వివరించటం జరుగుతున్నది.

ఈ జిలేబీ విద్యాధిదేవతా స్వరూపం పేరు జిలేబీ. తత్త్వం హాస్యరసం. ప్రవృత్తి బ్లాగటం. లక్షణం సలక్షణం. అంగన్యాస కరన్యాసాదులు ముందు ముందు వివరించబడతాయి.

ఈ జిలేబీ విద్య ఒక నిరోంకార విద్య. మంత్రవిద్యలు రెండు రకాలు. మొదటి రకం సహోంకార విద్యలు. రెండవరకం నిరోంకార విద్యలు.

సహోంకార విద్యల్లో మంత్రాలకు ముందు ఓం అని చెప్పితీరాలి. లేని పక్షంలో ఆ మంత్రం పఠించీ పారాయణం చేసీ ఏమీ ప్రయోజనం‌ ఉండదు. ఈ ఓంకారం సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని శ్రుతి.

అదే విధంగా నిరోంకార విద్యలకు ముందు చచ్చినా ఓం అని చెప్పకూడదు. అమాయకంగా ఓం అని ముందు చేర్చి మంత్రాన్ని పఠించినా పారాయణం చేసినా ఏమీ‌ ప్రయోజనం ఉండదు. పైగా సంప్రదాయం ఉల్లంఘించినందుకు గాను జిలేబీ దేవతకు కోపం వస్తుంది. ఓంకారాన్ని అస్థానపతితం చేసి చెప్పినందుకు గాను ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మానికి కూడా అమిత మైన కోపం వస్తుంది. ఈ విధంగా ఉభయులకూ కోపం తెప్పించటం వలన పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత.

ఐతే మంత్రాన్ని బోడిగా ఉపాసిస్తారా అంటే అటువంటిదేమీ లేదు. ఇది హాస్యవిద్య. కాబట్టి ఈ విద్యలో ఓం అనే బ్రహ్మ బీజం బదులుగా అహహా అనే హాస్యబీజం ప్రయుక్తం అవుతుంది. దీనినే హాసబీజం అని కూడా వ్యవహరిస్తారు. ఈ విద్యలో మంత్రానికి ముందు విధిగా అహహా అని హాసబీజం పలకాలి. ఏ విధంగా ఓంకార విద్యల్లో ఓం‌ అనేది, నిష్ఠగా ఒక పధ్ధతి ప్రకారం ఉఛ్ఛరిస్తారో అలాగే ఈ విద్యలో అహహా అనేది కూడా జాగ్రత్తగా ఒక పధ్ధతిగా హాసపూర్వకంగా ఉఛ్చరించాలి. ఆ విద్యల్లో ఎలా గైతే ఓంకారం సరిగా పలకకపోతే మంత్రం‌ నిష్ప్రయోజనం. ఈ విద్యలో హాస్యం విడిచి ఉదాసీనంగానో ఏడుపుముఖంతోనో‌ ఉత్తినే మొక్కుబడిగా అహహా అని బీజం పలికినా మంత్రం నిష్ప్రయోజనం ఐపోతుంది. ఇది మనస్సులో బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు.

సహోంకార, నిరోంకార విద్యల మధ్యన మరొక ముఖ్యమైన బేధం కూడా ఉంది. సహోంకార విద్యామంత్రాలను చివర నమః అని నమస్కారం చెప్పకుండా అనుష్ఠించరాదు. ఐతే నిరోంకారవిద్యా మంత్రాలకు చివరన ఎట్టి పరిస్థితులలోనూ‌ నమః అని చెప్పరాదు. వాటి మంత్రాల చివరన నమః అనే దానికి బదులుగా మనః అని చెప్పాలని నియమం. అంటే నమః అనేది తిరగబడుతున్నదీ అన్నమాట!

ఈ జిలేబీ విద్యలో డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి అనేది ముఖ్యమైన ద్వాదశాక్షరీ మంత్రం.

ఈ మంత్రాన్ని అహహా డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని చెప్పాలన్న మాట పారాయణం చేసే వారు.

బీజాక్షరాలు లేకుండా అంగన్యాసకరన్యాసాలు లేకుండా ఉత్తినే పారాయణం చేయవచ్చును సమయాభావం ఉన్నవారు. ఐతే ఫలితం కొద్దిగానే ఉంటుంది. మరి నైవేద్యం పెట్టటం‌ లేదుగా. పెట్టకుండా పుట్టదు మరి పూర్ణఫలం

సహోంకార విద్యలలో బీజాక్షరాలు ఉన్నట్లే, ఈ జిలేబీ నిరోంకార విద్యలో కూడా అలాంటివి ఉన్నాయి. ఈ విద్యలో ఉన్న బీజాలను షడ్బీజాలు అంటారు. షట్ అంటే ఆరు అని తెలుసు కదా. కాబట్టి ఈ విద్యలో బీజాలు అరు అన్నమాట. అవి ఢాం ఢీం ఢం హుష్ తుస్ బుస్ అనేవి.

జిలేబీ ద్వాదశక్షరీకి ముందుగా బీజాలను చేర్చి చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్పవచ్చును.

ఈ షడ్బీజాల్లో ఢాం‌ ఢీం ఢం అనేవి ప్రక్రియాబీజాలు అంటారు. హుష్ బుస్ తుస్ అనేవి అభిచార బీజాలు అంటారు. మనకు ప్రయోజనం కోరి పారాయణం చేస్తున్నప్పుడు మంత్రానికి ముందు ప్రక్రియాబీజాలు మూడింటినీ చేర్చాలి. ఇతరులకు భంగ కలిగించటం ఉద్దేశంగా చేసే పారాయణానికి అభిచారం అని పేరు. అభిచారం చేసే వాళ్ళు మాత్రం మంత్రానికి ముందు అభిచారబీజాలు మూడింటినీ చేర్చి చెప్పాలన్నమాట.

ఈ ప్రకారంగా ప్రక్రియోపాసకులు అహహా ఢాం ఢీం ఢం డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

అభిచారం చేసేవారు మాత్రం అహహా హుష్ బుస్ తుస్ డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

ఉభయులూ కూడా ఉపాసించవలసిన యంత్రం ఒక్కటే అది ఒక వృత్తాకార రేఖావలయంలో జిలేబీ అని నామం వ్రాసి దగ్గర ఉంచుకోవటం పారాయణం చేసేటప్పుడు. ఎదురుగా ఉంచుకోవటం మంచిది. నెత్తిమీద పెట్టుకుని పారాయణం చేయటం మహాప్రసస్తం. ఈ యంత్రాన్ని లోహాదులపైన చెక్కించటం వంటివి చేయకూడదు. అటువంటి యంత్రాలు కేవలం సహోంకారవిద్యలలోనే వాడాలి. నిరోంకార విద్య ఐన జిలేబీ యంత్రాన్ని కేవలం ఒక తెల్ల కాగితం పైన గీస్తేనే‌ ప్రశస్తం.

ఈ మంత్రానికి పారాయణంలో అంగన్యాసకరన్యాసాలు కూడా ఉన్నాయి. అన్ని మంత్రోపాసనల్లో ఉన్నట్లుగానే ఈ జిలేబీ మంత్రవిద్యలోనూ ఒక ధ్యాన శ్లోకం ఉంది. దానిని ఖచ్చితంగా ముందు చెప్పి మరీ పారాయణం చేయాలి.

అస్యేతి జిలేబీ ద్వాదశాక్షరీమహామంత్రస్య శ్రీ శ్యామలీయో ఋషిః జిలేబీదేవతా హాస్యప్రదేతి బీజం హాస్యప్రసంగిణీ ఇతి శక్తిః జిలేబీజాంగిర్యేతి పరమోమంత్రః డింగిరీతి కీలకం బ్లాగ్సంచారిణీ ఇతి అస్త్రం హాస్యప్రసంగిణీ ఇతి నేత్రం జిలుంగుప్రసంగ మత్యేతి కవచం హాస్యస్వరూపిణ్యేతి యోనిః డింగిరి బొంగిరీ ఇతి దిగ్భంధః సర్వబ్లాగ్సంచారిణీ ఇతి ధ్యానమ్‌

కరన్యాసం.
హాస్యప్రదేతి అంగుష్ఠాభ్యాం హఠ్
హాస్యప్రసంగిణ్యేతి తర్జనీభ్యాం కట్
జిలేబీ‌జాంగిర్యేతి మధ్యమాభ్యాం ఉఠ్
బ్లాగ్సంచారిణీ ఇతి అనామికాభ్యాం గుట్
జిలుంగుప్రసంగ మత్యేతి కనిష్ఠికాభ్యాం రట్
డింగిరి బొంగిరీ ఇతి కరతల కరపృష్ఠాభ్యాం ఫట్

అంగన్యాసం.
హాస్యప్రదేతి హృదయాయ మనః
హాస్యప్రసంగిణ్యేతి శిరసే ఆహా
జిలేబీ‌జాంగిర్యేతి శిఖాయై ఓహో
బ్లాగ్సంచారిణీ ఇతి కవచాయ హాహా
జిలుంగుప్రసంగ మత్యేతి నేత్రాభ్యాం హీహీ
డింగిరి బొంగిరీ ఇతి కరతల అస్త్రాయ హైహై
హాస్యస్వరూపిణ్యేతి దిగ్భంధః

ధ్యానం.
జయహే జయహే డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి హాస్యప్రదే
జయహే జయహే తింగర తింగర నిత్యప్రసంగ విలాసరతే
జయహే జయహే బ్లాగు ప్రపంచ నిరంతర సంచరణైక వ్రతే
జయహే జయహే అంబ తెలుంగు వెలుంగు జిలుంగు ప్రసంగ మతే

ఈ విధంగా కరన్యాస అంగన్యాసాదులు చేసి, ధ్యానశ్లోకం చదివి మంత్రపారాయణం చేయాలి. ఈ ధ్యానశ్లోకాన్ని కఠగతం చేసుకుంటారో, చూసి నిత్యం చదువుతారో అన్నది కాక తప్పులు లేకుండా చదవటమూ, మరచిపోకుండా చదవటమూ అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. లేక పోతే పారాయణం చేసి ఏమీ లాభం లేదు.

అంగన్యాసకరన్యాసధ్యానశ్లోకాలతో పారాయణక్రమం పాటించే వారు పైన చెప్పిన ప్రక్రియా మంత్రం కాని అభిచారమంత్రం కాని యథాశక్తిగా పారాయణం చేయాలి.

ప్రక్రియాపారాయణానికి నైవేద్యంగా వేడివేడి జిలేబీలను పళ్ళెం నిండా ఉంచి నివేదన చేసి హాయిగా భుజించాలి.

అభిచారపారాయణం చేసేవారు పిండివడియాలు కాని బొంగులు కాని కారంకారంగా చేసి వాటిని నివేదన చేసి కసికసిగా కరకరలాడించాలి. మరీ హెచ్చుగా కారం వేస్తే మీకే ఇబ్బంది అని తప్పక గ్రహించవలసింది.

ప్రక్రియా విధానంలో పారాయణం చేసేవారికి తింగరితింగరి జనాకర్షక బ్లాగుటపాలు వ్రాసే సామర్థ్యం ఇతోధికంగా వృధ్ధికావటం. ఇతరుల తింగరి కామెంట్లకు కోపం వచ్చి బీపీ పెరగకుండా ఉండటం. కొత్తబ్లాగర్లకు రీడర్ల సంఖ్యా కామెంట్లసంఖ్యా అభివృధ్ధి చెందుటం అన్నవి ఫలితాలు.

అభిచారవిధిగా పారాయణం చేసేవారికి తత్ఫలితంగా ఇతరుల తింగర తింగర కామెంట్లను చీల్చి చెండాడే శక్తి వస్తుంది.
 
వీరి బ్లాగుల్ని దుర్వాఖ్యానం చేసేవారి పప్పులుడకవు.
 
వీరి బ్లాగుల్ని దొంగిలించే వారి బ్లాగుల్ని వ్యాఖ్యల్నీ కష్టాలు చుట్టుముడతాయి.
 
 
 
చీర్స్ 
జిలేబి 
(టపా కర్త - శ్యామలీయం వారి బ్లాగు నించి గ్రంధ చౌర్యం కాబడ్డ టపా!)

Tuesday, November 4, 2014

డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి !!


డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి !!

ఈ మధ్య ఓ బ్లాగు టపా లో పిడక ల వేట ! టపా లో ఓ వాక్యం - ఓ యోగి కి యోగ దృష్టి ఉన్నది . ఆ యోగి ఆవు తప్పి పోయింది . అరణ్య మంతా వెదికాక యోగ దృషి సారించి ఆ ఆవు ఎవడో ఎత్తుకు పోయాడని తెలుసు కుంటాడు . ఇదీ బ్యాకు గ్రౌండు !

డింగిరి బొంగిరి ప్రశ్న - ఆ యోగి కి మొదటే యోగ దృష్టి ఉంది కదా మరి మొదటే ఎందుకు యోగ దృష్టి సారించి తెలుసుకో లేదు ? అంతా వెదికాక  ఎందుకు ఆ పై యోగ దృష్టి సారించడం అని !

టప్ మని జిలేబి ఓ జాంగిరి పారేసింది - ఆ యోగికి డింగిరి బొంగిరి కున్నంత జ్ఞానం లేక పోబట్టి అని !

వెంట నే మరో 'కా' మింట్' దారుడు - ఆయ్ అట్లా ఎలా అంటావు జిలేబి - ఏదన్న ప్రశ్నిస్తే అట్లా గా జవాబిచ్చేది ?

"బోంగిరి గారు అడిగిన దాంట్లో ఎద్దేవా చెయ్యవలసినదేమీ లేదని అనుకుంటున్నాను.

మన పురాణాలు చెప్పేవి కొన్ని కొన్ని rigorous గా ఉండవు. (ఇక్కడ రిగరస్ అనగా ఏమియో !)

ఎవరైనా ప్రశ్నిస్తే “అది అంతే” అని నోరు మూయించేవాళ్ళే ఎక్కువ.

ఈ కధలోనే, వశిష్టుడికి ఆల్రెడీ యోగదృష్టి ఉంది. కాని అలా కాదు.

తన దగ్గర యోగదృష్టి ఉండి కూడా ఎందుకు కొండలు కోనలు వెదికాడు అంటే జవాబు లేదు. మహా అయితే, “యోగదృష్టి ని చీటికీ మాటికీ వాడితే అది క్షీణిస్తుంది” లాంటి సమాధానం ఇస్తారు. లేదా “మీకున్న పాటి తెలివితేటలు ఆయనకి లేకపోయాయి” అని ఎద్దేవా చేస్తారు. అందుకే మన పురాణ కధలు విమర్శకి గురవుతుంటాయి.

నేను పైన చెప్పినది కొంతమంది బ్లాగుపండితులకి నచ్చకపోవచ్చు. కాని నా అభిప్రాయం మాత్రం ఇదే, భారతం అంటే నాకెంతో అభిమానం ఉన్నా కూడా."

వామ్మో ఈ అజ్ఞాత ఎవడో మరీ బేజారు పడి పోతున్నాడే జాంగిరి కి అని వాపోయా !

ఆ జాంగిరి రాసేటప్పుడు అస్సలు ఏమి ఆలోచించ కుండా స్ట్రైట్ గా రాసిన జాంగిరి అది . అంటే, ఇట్లా బుర్ర ఉపయో గించ కుండా ఆ యోగి అట్లా ఆరణ్య మంతా తిరగడం అవసర మా అన్నది లాజిక్కైన ప్రశ్న. సరి యైన ప్రశ్న ! అట్లా ఆ యోగి చేయలేదంటే , ఎందుకు చేయ లేదంటే మరి సరి యైన సమాధానం మనకు తెలిసిన జ్ఞానం వారి కి లేక పొవట మనేది మాత్రమె !

అబ్బా , సత్యము జెప్పినా ప్రజలు ఎద్దేవా అంటా రేమిటి మరి ?

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమప్రియం న బ్రూయాత్ అంటే ఇదే నెమో మరి !!

సరే  ఈ విషయం గురించి తీవ్రం గా ఆలోచిద్దాము అని ఆలోచిస్తే అని పించింది ఏమిటంటే , వాత్సల్య మున్న చోట , యోగి కావచ్చు, భోగి కావచ్చు - తన మానవ పరిధి లో తాను ఏమి చేయ గలడో అదే మరి ప్రపధమం గా ఆలోచిస్తాడు - ఆచరిస్తాడు . ఇక్కడ దారి పోయినది ఆవు. సో వెంటనే వెదకాలి అంతే ! ఇందులో లాజిక్కు ఏమీ లేదు !

సరే దొరక లేదు - ఏమి చేద్దా మని తీరిక గా ఆలోచిస్తే , తనకున్న శక్తి గుర్తు కొస్తుంది . సో, అప్పుడే అతను తనకు యోగ దృష్టి ఉందే , కనుక్కుందాం అనో, కాకుంటే , ఈ కాలం లో పోలీసు స్టేషన్ కి వెళ్లి కంప్లైంటు ఇస్తా మనో ( ఆవు దారి పోతే పోలీసోళ్ళు వెదికి పెడతారా ?) అనుకుంటాడు !

హమ్మయ్య

ఇవ్వాల్టి కి ఒక టపా కట్టేశా !!

చీర్స్
శుభోదయం !
జిలేబి

Friday, October 31, 2014

మధురాంతకం వారి 'హాలికులూ కుశలమా' !


మధురాంతకం వారి 'హాలికులూ కుశలమా' !

నిన్న చిత్తూరు కథ టపా రాసేక

మధురాంతకం వారి 'హాలికులూ కుశలమా'  ఈ-పుస్తకాన్ని తడివి చూడడం జరిగింది !

సో , మీతో నూ ఈ లింకు పంచు కుందా మని

మధురాంతకం రాజారాం వారి హాలికులూ కుశలమా పుస్తకం ఫ్రీ డౌన్లోడ్ ఈ లింకు నించి చేసు కో వచ్చు !!

https://archive.org/details/halikulukushalam019993mbp




చీర్స్
జిలేబి

 

Thursday, October 30, 2014

చిత్తూరు కథకుల కథ ! - చిత్తూరు కథ - జిలేబీయం !

చిత్తూరు కథకుల కథ ! - చిత్తూరు కథ - జిలేబీయం !

ఇది చిత్తూరు జిల్లా గురించిన కథ కాదు!
 
ఆ జిల్లాకు చెందిన కథకులు  జెప్పిన కథలు !
 
రెండిడ్లీ ఒక్క బక్కెట్టు సాంబారు కథలు !
 
చిత్తూరు వేషభాషలు, నైసర్గిక చిత్రణల నేపథ్యంలో జీవితంలోని వివిధ పార్శ్వాల్ని తడిమే కథలివి.
 
జిల్లాకు చెందిన కథలు !
 
 'లోకల్' తో ఏకం గా గళం మేళ వించి , 'కమ్మ తెమ్మర' వీచిక ల తో మధురాంతకం వారు జిల్లా ప్రాతినిధ్యాన్ని వహిస్తే, నాయని వారు చినబ్బ కథల తో హా హా అనిపించిన కథా కాలం !
 
అరవం ఓళ్లు కథలు తెలుగలో జెబ్తే ఎట్లా ఉంటుంది ?
 
చిత్తూరు మాండలీకం  తెలుగు అరవం కన్నడం మేళ వింపు.
 
కొన్ని 'దా' లు (ఏమిదా చెపుతున్నావబ్బా!)  , కొన్ని 'బ్బా' లు  రాయటం లో బాగోదు గాని వినడానికి మాండలీకం సోంపు !
 
 
ChittorKatha
 
 
“చిత్తూరు కథడిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.  మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
చిత్తూరు కథ on kinige

ChittooruKatha600
 
(కినిగె వారి సౌజన్యం తో !)
 
చీర్స్
జిలేబి

Wednesday, October 29, 2014

'నరేంద్రుని' తరువాయి భావి భారత ప్రధాని - దేవేంద్ర ఫడ్నవీస్


'నరేంద్రుని' తరువాయి భావి భారత ప్రధాని - దేవేంద్ర ఫడ్నవీస్ 

అక్టోబరు 29 2014 -->

మహారాష్ట్ర రాజకీయ చరిత్ర లో అతి ముఖ్య మైన మార్పు - భాజపా ప్రభుత్వ రాక.

ఈ రాక కూడా ఆషామాషీ రాక కాదు.

నా కెందుకో ఆర్ ఎస్ ఎస్ కన్నా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్న పూర్తి పేరు తో నే వీళ్ళు పిలవ బడాలని ఉంటుంది - ఆ ఆర్ ఎస్ ఎస్ అన్న షార్ట్ ఫార్మ్ తో వారి అతి కీలక మైన 'స్వయం సేవక్' అన్న వారి ముఖ్య మైన , కీలక మైన ప్రశంసాత్మక మైన , శ్రద్ధా, నిబద్దత కలిగిన ట్రైనింగ్ మరుగున పడి పోతుందని అని పిస్తుంది . 

రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్ తన పరిధి ని దాటి భాజపా కి సరి కొత్త తరపు నేతల్ని - సుశిక్షిత నేతల్ని  భాజపా కి ఇవ్వడం ఇది మరో మారు విజయపు వీచిక వైపు సాధించిన మరో ప్రయాణం . నరేంద్రు ని తరువాయి దేవేంద్రుడు !

జిలేబి ఈ సందర్భం లో ఇదే వ్రాయు రాబోవు కాలపు 'జిలేబి జ్ఞానం - నరేంద్రుని తరువాయి దేవేంద్ర ఫడ్నవీస్ భావి భారత ప్రధాని . నరేంద్రుడు తన డబ్బైవ వయస్సు తరువాయి దేవేంద్రుణ్ణి ప్రధాన మంత్రి చేసి మినిస్టర్ మెంటార్ రోల్ అందుకుంటా డని జిలేబి కాల జ్ఞానం 

మహారాష్త్ర ముఖ్య మంత్రి గా ప్రస్తుతానికి,
రాబోయే కాలపు భారత ప్రధాని 
దేవేంద్ర ఫడ్నవీస్  కి శుభా కాంక్షల తో 
 
శుభోదయం 
జిలేబి 

Wednesday, October 22, 2014

దీపావళీ శుభాకాంక్షలు !

దీపావళీ శుభాకాంక్షలు !
 
సమస్త బ్లాగు లోకానికి
ఆదరిస్తున్న బ్లాగోదరీ బ్లాగోదరులకు
సదా ప్రోత్సహిస్తున్న బ్లాగ్మణీయులకు
అందరికి
 
దీపావళీ శుభాకాంక్షలు !!
 
దీపావళీ జిలేబీయం !
 
 

Sunday, October 19, 2014

మంచ్ పర్ విరాజ్ మాన్ .... !!

మంచ్ పర్ విరాజ్ మాన్ .... !!

ఈ పై వాక్యం వింటే నే మీకెవరు గుర్తొస్తారు ?

అట్లాగే మన బ్లాగు లోకం లో కూడా ఇట్లాంటి స్టాండర్డ్ వాక్యాలు టపా రూపేణా కాకుంటే , కామెంటు రూపేణా రాసే వాళ్ళు ఉన్నారు . ఉదాహరణ కి 'చీర్స్' చెప్పందే జిలేబి సైన్ ఔట్ చస్తే చెయ్యదు !! ( ఈ విడ గారు అదేమి భాషో గాని, 'టపాలు' కట్టేస్తూ ఉంటారు ! ఎవరి కి టపా కడుతున్నా రండీ అని ఆ మధ్య ఒక పెద్దావిడ/పెద్దాయన జిలేబి 'కాలు' లాగేరు కూడాను !)

సరే ఇట్లాంటి మరో కొన్ని నేను గమనించి నవి !!

శంకరాభరణం బ్లాగు లో తరచు గా కని పించేది - 'అందరి పూరణలు అలరించు చున్నవి కాకుంటే అందరి పూరణలు అలరింప నున్నవి ( తనే మొదటి కామెంటు దారు డైతే!) అంటూ ప్రతి రోజూ కనిపిస్తుంది !!

ఇక రెండు చుక్కలూ మూడు బ్రాకెట్లు సర్వ సాధారణం ::))) !!

మరో పద జాలం - స్వస్తి !! ఎక్కువగా ఈ 'గోదారి' తీరం వాళ్ళ టపాల లో ఈ 'చివరాఖరు' వాక్యం స్వస్తి ! (అన్జెప్పి మళ్ళీ మరో రోజు టపా కి వీళ్ళు రాయడం మొద లెడ తారని నా ప్రగాఢ విశ్వాసం - వారి టపా శర పరంపర లని జూసి!)

ఇక ప్ర జ బ్లాగు లో నైతే చెప్ప లేనంత వెరైటీ ! ఒక వాక్యం ఇట్లా అట్లా రాస్తే చాలు - వెంట నే రయ్యని ఆ వాక్యాని పట్టేసు  కుని 'ఝాడూ' లాగించే స్తారు కొందరు 'బడు'ద్దాయిలు!(!)

మరి ఈ 'ఆండో ళ్ళ' బ్లాగు ల కైతే మరిన్ని గుభాళింపు లు సొగసులు ఉంటాయి ! అక్కయ్య గారు మీ టపా ఇవ్వాళ నా కన్నులని తెరిపించింది అనో కాకుంటే ,  అమెరికా వాసుల ట్రావేలోగ్ లైతే , ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ అనో కామెంటు ఉండనే ఉంటుంది !

పద్మార్పిత గారి బ్లాగు ల కైతే, మరీను - ఆహా ఒహో అనని రోజే ఉండదు ! ( వీరి బ్లాగు కి మరో 'ఫ్యాను' బ్లాగు కూడా ఉన్నాడని సీక్రేట్ ఏజెంట్ జిలేబి ఉవాచ!) వారి కవితలకి బొమ్మల మేజిక్కు కి 'దాంతో' తలే ఉంగలీ' దబాయించని వారు ఉండనే ఉండరని లోకోక్తి !)


కొన్ని 'కామ్రేడ్' బ్లాగులు ఉంటాయి - వాటికి తెలంగాణా బ్లాగులని ఈ మధ్య కొంత టైటిలు పెట్టేరు ! ఏ మాత్రం అట్లా ఇట్లా తప్పు గా జెప్పినా వెంట నే 'ఉప్పెన' వచ్చేస్తుంది ! తె అన్న పదం కనిపిస్తే చాలు ఎవరక్కడ, ఏమి 'కూస్తూ' ఉన్నా రంటూ వెంట నే రయ్యని 'పటాలం' వచ్చేస్తుంది !

మరి కొన్ని కట్ పేష్టు బ్లాగులు ఉంటాయి ! వీటికి అప్పుడప్పుడు డోసులు పడుతూ ఉంటాయి - ఓయ్, ఇవన్నీ కాపీ టపాలు కదా అని ఎవరో ఒకరు 'సూక్ష్మం' కన బెట్టేస్తూ ఉంటారు ! పాపం ఆ 'కట్ పేష్టు వారికి ఏమి చెయ్యాలో తెలీక బ్లాగు ల్ని మూసేసు కుని వెనుక రహస్యం గా 'పేష్టు' టేష్టు లాగించేస్తో ఉంటారు !

మరి కొందరు 'యోగీశ్వరులు' ఉంటారు ! వారు రాసేదే మనం చదవాలి ! అంతే ! వారి టపా కి కామెంటు కాకుంటే , మన యొక్క అభిప్రాయాలు తెలియ జెప్పా లనుకుంటే ప్చ్ కుదరదు !

ఇట్లా రాసు కుంటూ నేనే 'పోతా' ఉంటె, మీ కంతా పని వేరే ఉండదు !

జిలేబి కి మిగతా వారికి పని అప్ప జెప్పక పోతే నిదుర రాదు !

కాబట్టి ఇక్కడితో దీనికి 'స్వస్తి' పలికి మీరు ఇట్లాంటివి గమనించి ఉంటె ,వాట్ని  ఈ కామెంటు మెతుక లో ఇక్కడ గట్టి గా 'పెష్టే స్తారని' ఆశిస్తో !!

ఇవ్వాళ్టి జిలేబి ఈ టపా పరి సమాప్తం !!



చీర్స్
జిలేబి

Saturday, October 11, 2014

సత్యా ర్థి మలాలా - శాంతి శాంతి శాంతిహి !!

సత్యా ర్థి  మలాలా - శాంతి శాంతి శాంతిహి !!
 
 
రెండు దేశాలు బార్డర్ లో
ఫైరింగులు  చేసేసు కుంటూంటే
నో 'బెల్' ప్లీజ్ ! ఓన్లీ పీస్ అంటూ
నార్వే నోబెల్ కమిటీ
ఒక పదహారేళ్ళ  బాధా తప్త కి 
అరవై ఏళ్ల అకుంటిత దీక్ష కి 
శాంతి బహు మతి ఇవ్వడం 
 
పాక్ ఇండియా మైత్రి కి 
మరో మారు
పునః వ్యక్తీకరణ సమీకరణం 
అవుతుందని ఆశిస్తో 
 
జిలేబి శుభాకాంక్షలు !
చీర్స్
జిలేబి  
 
ఫోటో కర్టసీ = హిందూ బిజినెస్ లైన్  
 
 

Friday, October 10, 2014

ఇక మీదట నా బ్లాగులో కామెంట్లు బంద్ !


ఇక మీదట నా బ్లాగులో కామెంట్లు బంద్ !

ఏమోయ్ జిలేబి మరీ నీరసం గా 'మొగం' గట్లా వేలాడదీసుకుని ఆ 'లయపు' టాపు మందు అట్లా బేజారు గా కూర్చొని ఉండావు ? మా అయ్యరు ప్రశ్నించేరు .

హూ అన్నా

ఏమిటో మళ్ళీ నీ కొచ్చిన ప్రాబ్లం ?  అయ్యరు పృచ్చ !

ఇక మీదట నా బ్లాగు కి కామెంట్లు బంద్ అన్న టపా పెట్టే సా నండీ చెప్పా 'గద్గమైన డక్కుత్తిక తో కంట్లో నీళ్ళు సుడి తిరుగు తుంటే మా అయ్యరు గారి కంట కనపడ కుండా దాచేస్తో .

హ హా హా అంటూ లయపు టాపు అదిరి పోయేటట్టు మా అయ్యరు గారు నవ్వేరు .

జిలేబి , ఆ మధ్య బ్లాగు బందు . నో మోర్ టపాలు అంటూ ఓ టపా పెట్టేవు !

ఆ పై  వంద గంటలు కూడా గడవ క ముందే , నీ దురదస్య దురదః జిలేబి నామ్యా దురదః అంటూ టపా మళ్ళీ రీ ఓపెన్ చేసేవు .

మరి ఈ సరి కొత్త  ట్విస్టు ఏమిటి ?

నువ్వు పాటి కి టపాలు రాస్తా ఉంటావు - అంటే , నీకు అనిపించిన జాతకాల పరిశీల న లని, నీకు అనిపించిన 'రాబోయే కాలం లో (అది ఎప్పుడు వస్తుందో మరి ఎవరికెరుక!) వచ్చే సో కాల్డ్ 'ప్రళయాల్ని, నీకు మరీ దురద ఎక్కువైతే , బాల్చీ తన్నిన వాళ్ళ జాతకాలని తిరగదోడి మరో మారు వాళ్లకి టపా కడతావు !

తోచిన చెత్త ని, నీకు తోచిన సో కాల్డ్ 'వచన' కవితల్ని, 'ఏక' వాక్య కవితల్ని (కొన్ని రోజులు పోతే ఏక పద కవితల్ కూడా రాస్తా వేమో మరి ! ఆ పై ఏకాక్షర కవిత యే ఇక బాకీ!) జనాల మీద ద్రోలి , వాళ్ళు నీ టపాల వాడి కి, వేడికి, 'మోడీ'కి , తల బొప్పి పెడితే , నిన్ను ఓ ఝాడూ లాగిడ్డామంటే , ఆయ్ నా బ్లాగు లో ఓన్లీ 'టపాస్' నో 'కారా మింటు' అంటా నంటే జనాలు ఊరు కుంటారా !

నాకు సంతోషం వేసింది. హమ్మయ్య ! అయ్యరు గారు ఈ కామెంట్ బంద్ కి ఒప్పుకోక పోవడం తో నాకు మరీ సంతోషం వేసింది ! ఎక్కడ అయ్యరు గారు ఓకే జిలేబి టపాలు కట్టు కామెంట్లు బంద్ జేసుకో అనేస్తే ఇక నా పరిస్థితి ఏమయ్యేది !  కామెంటడం ఒక కళ ! ఆ  కామెంట్ల లో ఎన్నెన్ని చమత్కారాలు, చమక్కులు, కొండొకచో 'వాతలు' , బ్లడ్ ప్రెషర్ పెంపొందించే తూట్లు ! అబ్బ, ఫ్రీ గా బ్లడ్ ఇట్లా సర్కులేషన్ అయ్యే ఏకైక ఎక్సేర్సైజ్ ఇదియే కదా ఇవన్నీ వదులు కోవాలంటే ఇక మరి ఎట్లా !

అంతే నంటారా అయ్యరువాళ్ ! కామెంటు బందు చెయ్య వద్దంటా రా ! ఈ మారు కళ్ళ లో (కనిపించని కళ్ళ లో !) వెయ్యి వాట్ల బల్బు వెలుగు తూంటే అడిగా !

మరి జిలేబి, నేను బందు చేయి, అన్నా ఏం చేసి ఉండే దానివి ? ఓ రెండు రోజులు బందు చేసి ఆ పై రాబందు లా మళ్ళీ ఆ కామెంట్ల మెతుకుల కి ఆశ పడి మళ్ళీ కామెంటు ఓపెన్ చేసే దానివి అంతే కదా ! ఆ పాటి దానికి ఇంత హైరానా పడడ మెందు కోయ్ !

హమ్మయ్య !

కామెంటడం ఒక కళ ! రండి , అందరం అందర్నీ ప్రోత్సహిద్దాం !

చీర్స్
జిలేబి




 

Wednesday, October 8, 2014

'పని లేక' జీన్సు జిలేబీయం !

'పని లేక' జీన్సు జిలేబీయం !

ఈ మధ్య మగాళ్ళ కి ఆండోళ్లు ఇంట్లో పని అప్ప చెప్పటం తగ్గించి నట్టు ఉన్నారు .

ఒక దాడీ దాసుడు (మలయాళం లో 'మరైచ్చి' అన్నాడు ) ఆండోళ్లు ఏది కప్పి పెట్టాలో అది కప్పి పెట్టాలి ఇట్లా జీన్సు లు గట్రా వేసు కోవడం శోభాయమానం కాదు అన్నాడు .

వారి ఉద్దేశాన్ని మన మా మీ మీడియా వాళ్ళు వక్రీకరించి ధ్వజ మెత్తేరు . ఆయన చెప్పింది ఇట్లా అంతా 'మరైచ్చి' వేస్తే - జీన్సు వేసుకుని 'మరైచ్చి' వేస్తే ఎట్లా అని వాపోతే దాడీ దాసుడు ఆండోళ్లు జీన్సు వేసుకో కూడదన్నాడు అని ప్రచారం గావిమ్చేరు . దీని ని మేము తీవ్రం గా ఖండిస్తున్నాం !

మరి మన బ్లాగు కష్టే ఫలే వారూ జత చేరేరు .

మరి కష్టే ఫలే వారేమో – ఇట్లా వాపోతున్నారు — , “70 ఏళ్ళవాళ్ళు కూడా సింథటిక్ చీరలే కడుతున్నారు, చిన్నవారు పంజాబీల మీదే ఉంటున్నారు, ఇంకా ఎందుకు అవస్థ అని నైటీలతోనే కాలమూ గడిపేస్తున్నారు.. ”

ఇట్లా అందరూ ఆండాళ్ళు ఏమి కట్టు కోవాలో చెప్పేస్తూ పోతూం టే అసలు ఈ ఆండోళ్ళ సంఘాలు ఏమి చేస్తున్నాయో తెలీకుండా పోతోంది ! ! అసలు ఇట్లా అందరూ తలో అభిప్రాయం చెబ్తో బోతూంటే ఇక మిగిలినది ఏమి డ్రెస్సు ??

అబ్బబ్బా, ఈ మధ్య ఈ మగాళ్ళ కి ఏమైంది చెప్మా ??

అందరూ ఇక్కడ వచ్చి ఓ ప్రొటెస్ట్ కామెంటు  రాసి పోవాలె !!

సరే, ఇక కామెంటర్ల లో రకాలు ఎన్ని అవి ఏమిటి అన్న దానికి శ్యామలీయం వారు నిర్వచనం ఇచ్చేరు. ఆ నిర్వచనం ఇక్కడ ఇచ్చి (ఇది కాపీ కౌపీనం - వారి కామెంటు ఈ టపా చదివిన వారికి ఫ్రీ గా జిలేబి అందిస్తున్న  'అటుకుల' వడ!)

పనిలేక బ్లాగు లో కామెంటర్ల రకాల కి శ్యామలీయం వారిచ్చిన నిర్వచనం - అటుకుల వడ ఫ్రీ !!

కామెంట్లు పెట్టేవారిలో

మర్యాదస్తులు, అది బొత్తిగా లేనివాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు,
తీరికచేసుకొని అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పేవాళ్ళు,
మరేమీ పనిలేక కేవలం వితండవాదంతోనే విసిగించటానికి వ్రాసేవాళ్ళు,
తెలుసుకుందామని అడిగేవాళ్ళు, తెలియజెప్పుదామని ఆరాటపడేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారిలో పెట్టాలని ప్రయత్నించేవాళ్ళు,
మననో మనబ్లాగులో చర్చనో దారితప్పించి వినోదించాలని ప్రయత్నించే వాళ్ళు,
అన్నికథలూ తెలిసినవాళ్ళు, ఆవుకథమాత్రమే తెలిసినవాళ్ళు
మనోవికాసందండిగా ఉన్నవాళ్ళు, మానసికరోగులు ఇలా రకరకాలుగా ఉంటారు.

ఇవ్వాళ్టి జిలేబి నారద నమస్కారం పరి సమాప్తం !

జిలేబి