డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి !!
ఈ మధ్య ఓ బ్లాగు టపా లో పిడక ల వేట ! టపా లో ఓ వాక్యం - ఓ యోగి కి యోగ దృష్టి ఉన్నది . ఆ యోగి ఆవు తప్పి పోయింది . అరణ్య మంతా వెదికాక యోగ దృషి సారించి ఆ ఆవు ఎవడో ఎత్తుకు పోయాడని తెలుసు కుంటాడు . ఇదీ బ్యాకు గ్రౌండు !
డింగిరి బొంగిరి ప్రశ్న - ఆ యోగి కి మొదటే యోగ దృష్టి ఉంది కదా మరి మొదటే ఎందుకు యోగ దృష్టి సారించి తెలుసుకో లేదు ? అంతా వెదికాక ఎందుకు ఆ పై యోగ దృష్టి సారించడం అని !
టప్ మని జిలేబి ఓ జాంగిరి పారేసింది - ఆ యోగికి డింగిరి బొంగిరి కున్నంత జ్ఞానం లేక పోబట్టి అని !
వెంట నే మరో 'కా' మింట్' దారుడు - ఆయ్ అట్లా ఎలా అంటావు జిలేబి - ఏదన్న ప్రశ్నిస్తే అట్లా గా జవాబిచ్చేది ?
"బోంగిరి గారు అడిగిన దాంట్లో ఎద్దేవా చెయ్యవలసినదేమీ లేదని అనుకుంటున్నాను.
మన పురాణాలు చెప్పేవి కొన్ని కొన్ని rigorous గా ఉండవు. (ఇక్కడ రిగరస్ అనగా ఏమియో !)
ఎవరైనా ప్రశ్నిస్తే “అది అంతే” అని నోరు మూయించేవాళ్ళే ఎక్కువ.
ఈ కధలోనే, వశిష్టుడికి ఆల్రెడీ యోగదృష్టి ఉంది. కాని అలా కాదు.
తన దగ్గర యోగదృష్టి ఉండి కూడా ఎందుకు కొండలు కోనలు వెదికాడు అంటే జవాబు లేదు. మహా అయితే, “యోగదృష్టి ని చీటికీ మాటికీ వాడితే అది క్షీణిస్తుంది” లాంటి సమాధానం ఇస్తారు. లేదా “మీకున్న పాటి తెలివితేటలు ఆయనకి లేకపోయాయి” అని ఎద్దేవా చేస్తారు. అందుకే మన పురాణ కధలు విమర్శకి గురవుతుంటాయి.
నేను పైన చెప్పినది కొంతమంది బ్లాగుపండితులకి నచ్చకపోవచ్చు. కాని నా అభిప్రాయం మాత్రం ఇదే, భారతం అంటే నాకెంతో అభిమానం ఉన్నా కూడా."
వామ్మో ఈ అజ్ఞాత ఎవడో మరీ బేజారు పడి పోతున్నాడే జాంగిరి కి అని వాపోయా !
ఆ జాంగిరి రాసేటప్పుడు అస్సలు ఏమి ఆలోచించ కుండా స్ట్రైట్ గా రాసిన జాంగిరి అది . అంటే, ఇట్లా బుర్ర ఉపయో గించ కుండా ఆ యోగి అట్లా ఆరణ్య మంతా తిరగడం అవసర మా అన్నది లాజిక్కైన ప్రశ్న. సరి యైన ప్రశ్న ! అట్లా ఆ యోగి చేయలేదంటే , ఎందుకు చేయ లేదంటే మరి సరి యైన సమాధానం మనకు తెలిసిన జ్ఞానం వారి కి లేక పొవట మనేది మాత్రమె !
అబ్బా , సత్యము జెప్పినా ప్రజలు ఎద్దేవా అంటా రేమిటి మరి ?
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సత్యమప్రియం న బ్రూయాత్ అంటే ఇదే నెమో మరి !!
సరే ఈ విషయం గురించి తీవ్రం గా ఆలోచిద్దాము అని ఆలోచిస్తే అని పించింది ఏమిటంటే , వాత్సల్య మున్న చోట , యోగి కావచ్చు, భోగి కావచ్చు - తన మానవ పరిధి లో తాను ఏమి చేయ గలడో అదే మరి ప్రపధమం గా ఆలోచిస్తాడు - ఆచరిస్తాడు . ఇక్కడ దారి పోయినది ఆవు. సో వెంటనే వెదకాలి అంతే ! ఇందులో లాజిక్కు ఏమీ లేదు !
సరే దొరక లేదు - ఏమి చేద్దా మని తీరిక గా ఆలోచిస్తే , తనకున్న శక్తి గుర్తు కొస్తుంది . సో, అప్పుడే అతను తనకు యోగ దృష్టి ఉందే , కనుక్కుందాం అనో, కాకుంటే , ఈ కాలం లో పోలీసు స్టేషన్ కి వెళ్లి కంప్లైంటు ఇస్తా మనో ( ఆవు దారి పోతే పోలీసోళ్ళు వెదికి పెడతారా ?) అనుకుంటాడు !
హమ్మయ్య
ఇవ్వాల్టి కి ఒక టపా కట్టేశా !!
చీర్స్
శుభోదయం !
జిలేబి
మీ ఆలోచనా తరంగాలు నాకు తెలిసిపోయాయోచ్......!!!!!!!
ReplyDelete
Deleteఅయ్య బాబోయ్,
అన్నింటికీ ఆలోచనా తరంగాలకి ముడి వెయ్యకండి కిరణ్ కుమార్ గారు !!
జిలేబీవిధ్యలో యీ "డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి" అనేది ఒక ముఖ్యమైన ద్వాదశాక్షరీమహమంత్రం.
ReplyDeleteసాధకులు దీనిని దీక్షగా యథాశక్తిగా జపించాలి. రోజుకు ఇన్ని సార్లు అన్న నియమం ఎంతమాత్రమూ లేదు. అధికస్య అధికం ఫలం అని గుర్తు ఉంచుకుంటే మంచిది. కనీసం ఒక మండలం రోజులు పారాయణం చేయాలి. ఇబ్బడిముబ్బడిగా అభీష్టసిధ్ధి కోరుకునే వారు శతదినోత్సవం చేసుకోవచ్చు పారాయణంతో.
దీనికి యంత్రం ఒక వర్తులాకారమండలం, దానిలో జిలేబీ అనే మూడు అక్షరాలు కొంచెం పెద్దగా వ్రాయాలి.
నైవేద్యంగా ఒక పళ్ళెం నిండుగా వేడివేడి జిలేబీలు సమర్పించాలి.
పారాయణఫలం. తింగరితింగరి జనాకర్షక బ్లాగుటపాలు వ్రాసే సామర్త్యం ఇతోధికంగా వృధ్ధికావటం. ఇతరుల తింగరి కామెంట్లకు కోపం వచ్చి బీపీ పెరగకుండా ఉండటం. కొత్తబ్లాగర్లకు రీడర్ల సంఖ్యా కామెంట్లసంఖ్యా అభివృధ్ధి చెందుతుంది.
చదవండి జిలేబీయమహావిద్య గురించి శ్యామలీయంలొ వివరంగా, మంత్ర పారాయణక్రమంతో సహా.
Delete
Deleteకామెంటు కి టపా రాస్తే, ఆ టపా కి కామెంటు తో బాటు మరో టపా రాసే వాళ్ళు ఉంటారని బ్లాగ్వెత !!
మీరు సామాన్యులు కారు సుమీ శ్యామలీయం వారు !!
వామ్మో వామ్మో జిలేబి మీద శతకం కాకుండా ఇప్పుడు మహా విద్య కూడా నా !!
నెనరస్య నెనరః జిలేబి నామ్యా దురద గొంటాకుహ !!
చీర్స్
జిలేబి
యేంటో ఈ దెబ్బకు ఠా దొంగల ముఠా లాంటి వాదన్లు?!నిజమేంటో తెలీకపోగా వున్న బుర్ర క్కూడా తొర్ర పడుతున్నది?మార్క్సిజం తెలియ పోతే పుట్టిన వాళ్లం పుట్టినట్టే వుంటామంట?!నేనేమో గాఠిగా యెవర్నన్నా కోప్పడాలనుకుంటే "వ్యాస పరాశరాది షిర్డీ సాయినాధ పర్యంతం వున్న నా గురుపరంపర" అని యెత్తుకుంటుంటే తీరా వాళ్ళూ నేనూ ఇంకా పుట్టని బాపతు అయిపోయామే?అంతా బేజారుకాలం వచ్చేసింది సుమా?!
ReplyDelete
Deleteహరి బాబు గారు అంతే అంతే !!
గురు పరంపర ని ప్రతి సారీ స్మరించ కూడదుస్మీ !!
ఇక మార్క్సు ఏమని జెప్పెను ?? మనీ డబ్బు, దస్కం పారనిదే ఎకానమీ అభివృద్ధి కాదు అని కదూ !!
అట్లాగే, టపా కి కామెంటు రాస్తే, ఆ కామెంటుకో టపా కడితే, ఆ టపా కి ఒక కామెంటు ప్లస్ మరో టపా కడితే, అప్పుడే కదా తెలుగు బ్లాగ్ లోకం వర్ధిల్లు !!
నెనర్లు !
జిలేబి
అవునండి. చచ్చిపోయినవాళ్ళ జాతకాలు వేయడం, జనాల్ని "ఒరే మీరందరూ వెధవలు, నేనొక్కణ్ణే యోగిని అని చెప్పుకోవడం, ఎవరు ఏం చెప్పినా అది వెంఠనే బ్లాగులో పారేయడం, ఎక్కడ ఏం ప్రమాదం జరిగినా (కొండొకచో జరగకపోయినా!) చూసారా నేను చెప్పలే? అనడం, ఈ మానవజాతి మీద నాకెప్పుడో నమ్మకం పోయింది అనడం, తనని పుట్టించిన, ఏదైనా జ్ఞానం ప్రసాదించిన కృష్ణుడి జాతకమే వేయ ప్రయత్నించడం, అందులో మళ్ళీ "ఈ వెధవ ప్రపంచంలో అందరి జాతకలూ వేస్తే ఏం ఒరుగుతుంది?" అనుకుంటూ చెప్పడం, కుక్కతోకలా మళ్ళీ రెండూ మూడు నెలల్లో ఒక అమ్మ గారీ జాతకం పరీక్షా. భలే!!" ఇదే కదండీ, "యోగులు" చేసే పని? ఓ శివానందులో, ఓ సాయిబాబానో, ఓ రామకృష్ణులో, ఓ వివేకానందో ఉండి ఉంటే వాళ్లకి ఇవన్నీ జరుగుతాయని ముందు తెలిసినా నోరు విప్పి ఇలా జనాల్ని చెండుకు తింటారా? ఆ రోజుల్లో రామకృష్ణులకి బ్రిటిషర్లు పెట్టే బాధలు తెలియవా? ఇప్పుడైతే బాబా ఉండి ఉంటే కర్ర పుచ్చుకుని కొడతారుట. అదండి ఈయన యోగం! అవతలవాళ్ళని నిముషానికో సారి భయపెట్టి చంపుకు తినడం కాకపోతే యోగం అంటే ఇదా?
ReplyDelete
Deleteవామ్మో డీ జీ గారు,
మీరు నన్ను డాకినీ శాకినీ లకి పణం పెట్టె టట్టు ఉన్నారు !!
ఈ టపా కి మా గురువు గారికి ఎట్లాంటి సంబంధం లేదు !!
జిలేబి
జిలేబీ గారు వ్యాఖ్యల్లోనే కాక టపాల్లో కూడా అనవసరంగా ఎద్దేవా చెయ్యటం వారి అలవాటేమో అనిపిస్తోంది.
ReplyDeleteఅయినా "ఆ జాంగిరి రాసేటప్పుడు అసలు ఏమీ ఆలోచించకుండా స్ట్రైట్ గా రాసిన జాంగిరి అది." అని తన వ్యాఖ్య గురించి తనే ఈ పోస్ట్ లో చెప్పుకున్నారు గదా. There it is.
ఈ విషయాన్ని ఇంతకన్నా పొడిగించే ఉద్దేశ్యం నాకు లేదు.
ఆ, ఆ అజ్ఞాతనే.
అయ్యో. మీరు హాస్యాన్ని అపార్థం చేసుకుంటే ఎలా?!
Delete
Deleteఅజ్ఞాత గారు,
సత్యం జెబితే ఎద్దేవా అంటా రేమి టండీ !? నేను జెప్పింది సరి యైన సమాధానం.
వాత్సల్యం ఉన్న చోట కార్యాచరణ మొట్ట మొదట వస్తుంది. ఆ పైనే తన శక్తి యుక్తుల బేరీజు (అది మరీ తీరిగ్గా ఆలోచిస్తే) మరో ఉదాహరణ ఆంజనేయ స్వామీ వారు ! వారి శక్తి గురించి మరోక్కరు జెబితే గాని వారికి తెలీనంత గా 'జ్ఞానం' లేని వారు !!
చీర్స్
జిలేబి
Delete@శ్యామలీయం వారు,
మొత్తం మీద ఇవ్వాళ నా గాలి పీకేటట్టు ఉన్నారు !!
ఇట్ ఈజ్ యువర్ డే !!
చీర్స్
జిలేబి
శ్యామలీయం గారు, నేను దీన్ని పొడిగించకూడదు అనుకున్నాను గాని మధ్యలో పెద్దమనిషిగా మీరు వచ్చారు కాబట్టి, మీకు ..... మీకు మాత్రమే ..... సమాధానం ఇస్తున్నాను.
ReplyDelete- కష్టేఫలే శర్మ గారి బ్లాగులో బొంగిరి గారు అడిగిన సాధారణ ప్రశ్నని (అది సరైన ప్రశ్నే అని ఈ బ్లాగుటపాలోనే పైన ఒప్పుకున్నారు) అనవసరంగా ఎగతాళి చెయ్యడం, తద్వారా వశిస్టుల వారి తెలివితేటల్ని కూడా కించపర్చడం (యోగి, యోగి అంటున్నది శర్మ గారి కధలో వశిస్టుల వారినే). మరి మన పురాణాల్లోని విశిష్ట వ్యక్తుల మీద ఉన్న గౌరవం ఇంతేనా?
(ఇప్పుడు చెప్తున్న "మానవప్రయత్నం", "వాత్సల్యం" వగైరా మర్యాదపూర్వక వివరణ మొదట్లోనే ఇచ్చుండవచ్చు (ఈ మాత్రం దానికి మొదట్లో వశిస్టుల వారిని తక్కువ చేసినట్లు అర్ధం వచ్చేలా చెయ్యటం ఎందుకు?). లేదా మాట్లాకుండా ఊరుకుంటే, శర్మ గారు ఎలాగూ బొంగిరి గారి సందేహం తీర్చుండేవారు.)
- అలా ఎద్దేవా చెయ్యవలసిన అవసరం లేదు అని వ్రాసిన నా స్పందనని తీసుకొచ్చి తన బ్లాగుకి ఆహారంగా వేసుకోవడం. (నిన్ను కాదుగా ఎగతాళి చేసింది, నీకెందుకు నెప్పి, నువ్వెందుకు స్పందించావు అని అడుగుతారేమో? అనవసరంగా ఎగతాళి చేసేవారు ఈరోజు బొంగిరి గారిని, రేపు నన్ను, ఎల్లుండి మరొకరిని హేళన చేస్తూ ఉండే అవకాశాలు ఎక్కువ).
ఇటువంటి తీరుని "హాస్యం" కాదు, అపహాస్యం అంటాను. ఎవరికైనా, అందులోనూ సినీయర్ బ్లాగర్ కి ఇది హుందాగా ఉండదు అని చెప్పటమే నా ముఖ్య ఉద్దేశ్యం.
వశిష్టులవారిని అంచనావేసే తాహతు మనకుందని అనుకోను. అలా చేయటానికి ప్రయత్నించటాన్ని సమకాలీనసమాజంలో తప్పుపట్టి ప్రయోజనం లేదు కాని అటువంటి ప్రజ్ఞావంతుల జోలికిపో నవసరం లేదనీ, వెళ్ళటం వలన ప్రయోజనమూ లేదనీ నా ఉద్దేశం.
Deleteజిలేబీగారు మీ స్పందనను ఉటంకించటంలో అపహాస్యం చేసే ఉద్దేశం నాకైతే కనిపించలేదు. ఉభయుల అభిప్రాయాలనూ ఉటంకిస్తూ తన అభిప్రాయాన్నీ చెప్పారంతే. జిలేబీగారిది హాస్యప్రధానమైన దృష్టి అని మీకు తెలిసే ఉంటుందని భావిస్తున్నాను.
సాధారణంగా తాము ఉంచే వ్యాఖ్య మరీ పెద్దదిగా అనిపించినప్పుడు రెండు ధోరణులు చూస్తున్నాము తెలుగు బ్లాగుల్లో. అలాగే టపాలంత పెద్ద వ్యాఖ్యలూ ప్రకటించటం ఒక ధోరణి. రెండవది, విడిగా తమ బ్లాగుల్లో టపాగానే వ్యాఖ్యను ప్రకటించి దానిని సదరు బ్లాగులో ఒక లింకుగా చూపటం(ఇలా నేను అప్పుడప్పుడూ చేస్తుంటాను). ఐతే వ్యాఖ్యకూ, టపాకు ఒక ముఖ్య బేధం ఉంది కదా. వ్యాఖ్యలో సందర్భం విడిగా ప్రస్తావించనక్కర లేదు. టపాలో అది ప్రస్తావించక పోతే ఆ టపా అసమగ్రంగా ఉంటుంది. సందర్భాన్ని చూపటంలో భాగంగా మూల టపానో లేక అక్కడి కొన్ని వ్యాఖ్యలనో, లేదా రెండింటినో అవసరమైన మేరకు ఉదహరించటం తప్పదు. అది 'ఆహారం' చేసుకోవటం అనుకోనవసరం లేదండి.
మీ రన్నట్లుగా సీనియర్ బ్లాగర్ అన్న తరువాత కొంత బాధ్యతా ఉంటుంది. ఒప్పుకుంటాను. కాని టపాలు వ్రాయటంలో అప్పుడప్పుడు అపార్థాలు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. సాధ్యమైనంత వరకూ వాటిని పరిహరించేందుకే ప్రయత్నించటమూ జరుగుతుంది.
అభిప్రాయం అన్నతరువాత అది ఒకరి అభిప్రాయానికి సంబంధం లేకుండా ఉండవచ్చును. లేదా వేరొకరి అభిప్రాయానికి సమర్ఘనగానో ఖండనగానో కూడా ఉండవచ్చును. అంతమాత్రం చేత ఎవరూ దయచేసి ఎగతాళి వంటివి భావించవద్ద్దు. జిలేబీగారి సహజధోరణికి భిన్నంగా పనిగట్టుకొని ఎద్దేవా చేయటం వంటివేమీ చేసినట్లు అనిపించలేదు. ఆవిడ ఒకానొక టపాలో శ్యామలీయం ద్వారపాలకు డైపోయినట్లు గుర్తు. అంటే అది నన్ను ఎగతాళి చేయటానికి అనుకుంటే ఎట్లా? అలా అనుకోలేదుగా నేను?
హుందాగా ఉండాలనే బ్లాగర్ల ప్రయత్నం అని నా నమ్మకం. కనీసం బాధ్యత ఉందనుకొంటున్న కొందరి ఉద్దేశం అని. ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండవచ్చును
ReplyDeleteఈ అజ్ఞాత గారెవరో నాకు ఈ కామెంటు తో తెల్సి పోయిందొచ్ !!
@అజ్ఞాత గారు,
లెంపలు వేసేసు కుంటున్నా ! మీరే రైటు !!
ఇక తెలియాల్సింది సైలెంట్ డింగరి బొంగరి యే !!
డిటెక్టివ్ జిలేబి
'కామెంట్రాత' పరిశోధన!