Wednesday, November 26, 2014

'శంకరాభరణం పద్యాలు అంత ఓపిగ్గా ఎలా చదివే దండి !??


'శంకరాభరణం పద్యాలు అంత ఓపిగ్గా ఎలా చదివే దండి !??
 
ఆంధ్రపత్రిక 10th May 1968

 
 
చీర్స్
జిలేబి

Tuesday, November 25, 2014

అచ్చు పప్పు ! - అలవాట్లో పొరపాటు !

అచ్చు పప్పు ! -  అలవాట్లో పొరపాటు !
 
ఆంధ్ర పత్రిక 28th August 1957
 

Cheers
జిలేబి

Monday, November 24, 2014

హిరణ్యా క్షవరం !


హిరణ్యా క్షవరం !
 
ఆంధ్ర పత్రిక 29 April 1959

 

Sunday, November 23, 2014

చెవులకి గాజులు వేసుకున్న జిలేబి !


చెవులకి గాజులు వేసుకున్న జిలేబి !

 

Saturday, November 22, 2014

ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !



ఉత్తర దేశ యాత్ర ! యాభై రెండు రోజులు - మూడు వందల రూపాయలు మాత్రమె !
 
ఆంధ్ర పత్రిక 19th Jan 1955 !


చీర్స్
జిలేబి

Monday, November 17, 2014

ప్రవీణ్ లా పేషంట్ ఫర్ కామెంట్ గల కామెంటర్లు తెలుగు బ్లాగ్ లోకానికి ఎంతైనా అవసరం !


ప్రవీణ్ లా పేషంట్ ఫర్ కామెంట్ గల కామెంటర్లు తెలుగు బ్లాగ్ లోకానికి ఎంతైనా అవసరం !
(ఇది చాలా సీరియస్ టపా)

కామెంటడం ఒక కళ .

తెలుగు బ్లాగ్ లోకం లో ఒక కాలం లో ది స్పిరిట్ ఆఫ్ తూచ్ తూచ్ ల తో బాటు కామెంట్ల కోలాహలం , కామెంట్ల గార్బా, కామెంట్ల దాండియా, కామెంటర్ల దర్పం, డాంబికం, నువ్వంటే నువ్వేంటి అన్న వాదం, ప్రతి వాదం, పిడివాదం, మిత వాదం, అమిత వాదం, వ్యర్థ వాదం, చెణుక్కుల చమక్కులు, రేపొర్టాయిరీలు, ముసుగుల్లో ముషాయిరీలు , టై పాటుల్లో కత్తులు కటారులు, రాతల్లో వీరం, శౌర్యం , భయానకం, మేధ, కవితల్లో కారుణ్యం, విరుపులు, వివేకం లో విచారం, విచారం లో వివేకం, పద కేళీ లలో సరిగమ పద నిసలు ....

ఇలా రాసు కుంటూ పోతోంటే ఇవి, అవి, అన్నీ కలగలసి ఓ తెలుగు పీటం లా జిగేలు మనేది !

ప్చ్,ప్చ్ ఇప్పుడు కాలం మారి పోయింది .

ఆయ్ అంటే ఓయ్ అని కామెంటర్ల ని వాళ్ళ ధోరణి ని దబాయించి నోరు మూయించే వారే ఎక్కువై పోయేరు !!

ఆ కాలపు బ్లాగర్లారా ! కామెంటర్లారా ! ఏమై పోయేరు మీరంతా ! ?? తెలుగు రౌడీ లు, రౌడీ రాణులు వీళ్ళంతా ఎక్కడ కళ తప్పి పోయేరు ??

సో కాల్డ్ సీనియర్ బ్లాగర్లు వార్షికోత్సవానికి ఒక్క మారు టపా పెట్టి ఇది నా ఆరో వార్షికోత్సవం అంటూ టపా పెట్టె స్థాయి కి వచ్చేసింది !

కామెంట్లలో ఎక్కువగా ఉన్న కామెంట్ల బ్లాగుల్ని వేరే గా పెట్టేయమన్న ఆర్త నాదాలతో వెలుగొందు తోంది ! ఇది ఏమి సబబు ?? (రాబ్ పాల్ తో పే ది పీటర్!)

పాపం ఈ అబ్బాయి ప్రవీణు డొక్కడే కుస్తీ పడుతున్నాడు ఏటికి ఎదురీదు తున్నాడు .

బ్లాగ్ లోకానికి మరిన్ని ప్రవీణ్లు రావాలి !

ఇదియే జిలేబి విన్నపం - బ్లాగర్లారా, కామెంట్లల్ని తుంచ కండి . కామెంటర్ల ని వెలి వేయకండి . కామెంట్లు లేని టపాలు దీపం లేని ఇండ్లు . 

కామెంట్ల పరిధి ఇంతే ఉండాలన్న రూళ్ళ కర్ర ల తో దబాయింపులు, రుమాళ్ళ తో నోటి కి మూతలు తాళాలు పెట్టడం భావ్యమా ? ఇది అవసరమా ??

తెలుగు బ్లాగ్ లోకమా ! కళ్ళు తెరు !


జిలేబి
(ఇది చాలా సీరియస్ టపా)

 

Saturday, November 15, 2014

ఫ్లాష్ ఫ్లాష్ !మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదు ! భోరు మన్న జిలేబి !


ఫ్లాష్ ఫ్లాష్ !మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదు !
భోరు మన్న జిలేబి !

ఏమోయ్ జిలేబి మరీ అట్లా ముక్కు చీదేస్తున్నావ్ ! అయ్యరు గారు పృచ్చ !

జిలేబి ముక్కు చీదేస్తూ, భోరు మంది ! కళ్ళ లో కన్నీళ్లు కారి పోతున్నాయి

ఇదిగో జిలేబి చెప్పి ఏడువు ! నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో అస్సలు తెలీకుండా నేనేమి సహాయం చేసేది అయ్యరు గారు విసురు కున్నారు , కసురు కున్నారు

నా కామెంట్లు , నా కామెంట్లు .... మరో మారు ముక్కు చీదింది జిలేబి

అయ్యరు గారి గుండె గల్లంతయ్యింది ! ఈ జిలేబి కామెంటు పక్షి ! దీని కామెంట్లు ఏమయ్యాయో అనుకునేరు !

జిలేబి స్వాంతనం గా పలికేరు అయ్యరు వారు - నీ కామెంట్ల కేమయ్యింది జిలేబి అడిగేరు బుజ్జాయిస్తో .


నా బ్లాగు కామెంట్లు మాలిక లో , వ్యాఖ్యల క్రింద కనిపించడం లేదండి !! జిలేబి కన్నీరు మున్నీరైంది !

నీ టపాలు మాలికలో వస్తున్నాయా ?? అయ్యరు గారి పృచ్చ !

అవునండి !

హమ్మయ్య కొంతలో కొంత మేలు ! సో ఓన్లీ కామెంట్లు అంతే గదా ఓస్ ! చెప్పేరు అయ్యరు వారు

వాట్ ! ఓన్లీ కామెంట్స్ అంటారా ! కామెంటే కదా మనకి భోజనం! అట్లాంటి కామెంట్లు మాలిక లో రాక పోతే నా కెంత
'క్లిక్కులు' తక్కువై పోయేయి !! మళ్ళీ ముక్కు చీదింది జిలేబి

జిలేబి - ఈ మాలిక నువ్వు బ్లాగు మొదలెట్టి నప్పటి కన్నా ముందే ఉన్నది ! అప్పట్నించి అంటే ఓ మోస్తరు నాలుగు సంవత్సరాలు ఈ విషయం తెలీకుండా హ్యాపీ గా ఉండి పోయేవు ! ఇప్పుడు ఎట్లా నీకు తెలిసింది ?

విన్న కోట వారు జేప్పేరు ! మాలిక లో నా బ్లాగు కామెంట్లు కనిపించడం లేదని జెప్పింది జిలేబి .

అయ్యరు గారు ప్రార్థించేరు !

"పంచ దశ లోకంలో ఉన్న పరమ మాలిక!
వినుము ఈ బ్లాగు బందీ జిలేబి విన్నపము !
తన బ్లాగు కామెంట్లు మాలికలో వచ్చేటట్టు జేయుము ! --> ఆమెన్''!


విన్నపాలు వినవలెను వింత వింతలూ !!

జిలేబి
(దురదస్య దురదః జిలేబి నామ్యా దురద గొంటాకుహ )!

Friday, November 14, 2014

స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు !!

స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు !!

ఇవ్వాళ  నవంబరు పదు నాలుగు. చాచా నెహ్రు జన్మ దినం.

పిల్లల్లారా పాపల్లారా అంటూ చిల్ద్రెన్ పాటలు పాడేసుకుని చాచాజీ ని ఓ మారు తలచుకుని మళ్ళీ మరిచి పోయే దినం.

మోడీ పుణ్య మా అని, స్వచ్చ భారత్ పుణ్య మా అని మళ్ళీ నెహ్రూ గార్ని గాడం గా పట్టేసు కోవాలని పించే సింది జిలేబి కి. !!

అవును ఈ మధ్య మా మీ మీడియా లో నెహ్రూ హోరు (ఉదాహరణ కి ది హిందూ వారు ! - అబ్బా ఈ జిలేబి ది హిందూ వారిని వదిలి పెట్టదే మరి !!) !

సరే నెహ్రూ హోరు ఒకే !

మధ్య మధ్య లో మోడీ పేరు ఉటం 'కిచడీ' యమో, స్వచ్చ భారత్ ని ఉటం 'కుస్తీ'యమో చేయ కుంటే వారి ఆర్టికల్ కి చదివే నాధులు లేక పోయినట్టు ఉన్నారు !

అందుకే ఏ నెహ్రూ వీయం ఆర్టికల్ చదివినా మధ్య మధ్య లో  'మిర్చీ'బర్ఫీ' లా ఈ రెండు 'ఊత' పదాలు ( గూగల్ వారి ఆడ్ వర్డ్స్ లో పాపులర్ వర్డ్స్ లా అన్న మాట !) మోడీ , స్వచ్చ భారత్ మద్య మధ్య లో ఇరికించి విశేషం గా , ఓహ్ ఈ స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరు అంటూ రాసేస్తున్నారు !!

కాబట్టి నేను సైతం ఇవ్వాళ స్వచ్చ భారత్ తో నెహ్రూ ని మరిపించ లేరని వారి ని తలుస్తూ ... ఈ రెండు పదాల తో టైపాటు సాగించి టపా కట్టేస్తున్నా !!

చీర్స్
జిలేబి

Monday, November 10, 2014

నా ఆత్మ కథ రాస్తున్నా!!!


ఏమోయ్ జిలేబి మరీ సీరియస్సు గా బర బర టైపాడిస్తూ ఉన్నావ్ అయ్యరు గారు పృచ్చ !


నా ఆత్మ కథ రాస్తున్నా చెప్పా మా అయ్యరు గారితో

అంటే ఏమిటీ ? బ్లాగు లోకం నించి విరమణా  ? అయ్యరు గారు మరో పృచ్చ !

అదేమిటండి ! మా మంచి బ్లాగు లోకం ! ఏదో అని వెలగ బెడుతున్న 'జనారణ్య'  ఉద్యోగం తో బాటు 'బాతాఖానీ', పని లేక , కాలక్షేపం కబుర్లు అప్పుడప్పడు రాసేసు కుంటూ ఏదో నా మానాన నేను బతికేస్తూ ఉంటె , మీరేమో ఉద్యోగానికి రాజీ నామా అంటారు  అడిగా మా అయ్యరు గారిని .

ఈ మధ్య ఈ వాక్యం 'ఆత్మ' కథ అన్న మాట వింటూంటే , వెంటనే రిటైర్ మెంటు గుర్తు కోచ్చేస్తోంది అదేమిటో మరి !
జేప్పేరు అయ్యరు గారు .

నా ఆత్మ కథ రాస్తున్నా అని ఎవరైనా 'టెండర్' పెడితే, టెండూల్కర్ గుర్తు కోచ్చేస్తున్నాడు !

ఈ మధ్య సానియా మీర్జా ఆత్మ కథ రాస్తున్నా అంటే , ప్చ్ పాపం ఈ అమ్మాయి కి రిటైర్ మెంట్ ఏజ్ వచ్చేస్తోంది అన్న మాట అనుకున్నా !!

ఆ మధ్య వరుస బెట్టి గవర్న మెంటు లో ఉన్న వాళ్ళు రిటైర్ అయ్యి, 'మీ' మేడం' గార్ని 'ఏకి' పెట్టేరు !

మళ్ళీ నువ్వూ రిటైర్ అయి ఎవరెవర్ని 'ఏకు' తావో ' .... అయ్యరు గారు సాగించేరు !


వామ్మో వామ్మో, రిటైర్ మెంటు అయ్యే ఉద్దేశ్యాలు నాకు లేవండి !

ఈ టపా వెనక్కి లాగేసు కుంటున్నా ! నా ఆత్మ కథ రాయడం లేదు !!

ఆకతాయి
జిలేబి

Friday, November 7, 2014

ద్యవిహా మయ బీలేజి -- డుబ, నాద్య విహా, మయా జిలేబి !!


జిలేబీయ మహావిద్య (అనబడు జిలేబీ‌ యమహా విద్య)
 
(టపా కర్త - శ్యామలీయం వారి బ్లాగు నించి గ్రంధ చౌర్యం కాబడ్డ టపా!)
 
ఇది చదివిన వారికి అష్ట "కాష్యులు" లభ్య మగును !

 
 
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
 


ఈ రోజున ఈ జిలేబీయమహావిద్య యొక్క ద్వాదశాక్షరీ మంత్రాన్ని గురించి ఒక జిలేబీ టపాలో వ్యాఖ్యగా కొంచెంగా వ్రాయటం‌ జరిగింది.  అయితే, బ్లాగు పాఠకులకూ ఇతరులకూ ఈ‌జిలేబీ విద్యా విషయం క్రొత్త కాబట్టి అటువంటి అందరు  పాఠకుల సౌకర్యార్థంగా ఈ విద్యా రహస్యాలను ఇక్కడ వివరించటం జరుగుతున్నది.

ఈ జిలేబీ విద్యాధిదేవతా స్వరూపం పేరు జిలేబీ. తత్త్వం హాస్యరసం. ప్రవృత్తి బ్లాగటం. లక్షణం సలక్షణం. అంగన్యాస కరన్యాసాదులు ముందు ముందు వివరించబడతాయి.

ఈ జిలేబీ విద్య ఒక నిరోంకార విద్య. మంత్రవిద్యలు రెండు రకాలు. మొదటి రకం సహోంకార విద్యలు. రెండవరకం నిరోంకార విద్యలు.

సహోంకార విద్యల్లో మంత్రాలకు ముందు ఓం అని చెప్పితీరాలి. లేని పక్షంలో ఆ మంత్రం పఠించీ పారాయణం చేసీ ఏమీ ప్రయోజనం‌ ఉండదు. ఈ ఓంకారం సాక్షాత్తూ పరబ్రహ్మస్వరూపం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ అని శ్రుతి.

అదే విధంగా నిరోంకార విద్యలకు ముందు చచ్చినా ఓం అని చెప్పకూడదు. అమాయకంగా ఓం అని ముందు చేర్చి మంత్రాన్ని పఠించినా పారాయణం చేసినా ఏమీ‌ ప్రయోజనం ఉండదు. పైగా సంప్రదాయం ఉల్లంఘించినందుకు గాను జిలేబీ దేవతకు కోపం వస్తుంది. ఓంకారాన్ని అస్థానపతితం చేసి చెప్పినందుకు గాను ఓంకార వాచ్యుడైన పరబ్రహ్మానికి కూడా అమిత మైన కోపం వస్తుంది. ఈ విధంగా ఉభయులకూ కోపం తెప్పించటం వలన పాపం వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత.

ఐతే మంత్రాన్ని బోడిగా ఉపాసిస్తారా అంటే అటువంటిదేమీ లేదు. ఇది హాస్యవిద్య. కాబట్టి ఈ విద్యలో ఓం అనే బ్రహ్మ బీజం బదులుగా అహహా అనే హాస్యబీజం ప్రయుక్తం అవుతుంది. దీనినే హాసబీజం అని కూడా వ్యవహరిస్తారు. ఈ విద్యలో మంత్రానికి ముందు విధిగా అహహా అని హాసబీజం పలకాలి. ఏ విధంగా ఓంకార విద్యల్లో ఓం‌ అనేది, నిష్ఠగా ఒక పధ్ధతి ప్రకారం ఉఛ్ఛరిస్తారో అలాగే ఈ విద్యలో అహహా అనేది కూడా జాగ్రత్తగా ఒక పధ్ధతిగా హాసపూర్వకంగా ఉఛ్చరించాలి. ఆ విద్యల్లో ఎలా గైతే ఓంకారం సరిగా పలకకపోతే మంత్రం‌ నిష్ప్రయోజనం. ఈ విద్యలో హాస్యం విడిచి ఉదాసీనంగానో ఏడుపుముఖంతోనో‌ ఉత్తినే మొక్కుబడిగా అహహా అని బీజం పలికినా మంత్రం నిష్ప్రయోజనం ఐపోతుంది. ఇది మనస్సులో బాగా గుర్తుపెట్టుకోవాలి సాధకులు.

సహోంకార, నిరోంకార విద్యల మధ్యన మరొక ముఖ్యమైన బేధం కూడా ఉంది. సహోంకార విద్యామంత్రాలను చివర నమః అని నమస్కారం చెప్పకుండా అనుష్ఠించరాదు. ఐతే నిరోంకారవిద్యా మంత్రాలకు చివరన ఎట్టి పరిస్థితులలోనూ‌ నమః అని చెప్పరాదు. వాటి మంత్రాల చివరన నమః అనే దానికి బదులుగా మనః అని చెప్పాలని నియమం. అంటే నమః అనేది తిరగబడుతున్నదీ అన్నమాట!

ఈ జిలేబీ విద్యలో డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి అనేది ముఖ్యమైన ద్వాదశాక్షరీ మంత్రం.

ఈ మంత్రాన్ని అహహా డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని చెప్పాలన్న మాట పారాయణం చేసే వారు.

బీజాక్షరాలు లేకుండా అంగన్యాసకరన్యాసాలు లేకుండా ఉత్తినే పారాయణం చేయవచ్చును సమయాభావం ఉన్నవారు. ఐతే ఫలితం కొద్దిగానే ఉంటుంది. మరి నైవేద్యం పెట్టటం‌ లేదుగా. పెట్టకుండా పుట్టదు మరి పూర్ణఫలం

సహోంకార విద్యలలో బీజాక్షరాలు ఉన్నట్లే, ఈ జిలేబీ నిరోంకార విద్యలో కూడా అలాంటివి ఉన్నాయి. ఈ విద్యలో ఉన్న బీజాలను షడ్బీజాలు అంటారు. షట్ అంటే ఆరు అని తెలుసు కదా. కాబట్టి ఈ విద్యలో బీజాలు అరు అన్నమాట. అవి ఢాం ఢీం ఢం హుష్ తుస్ బుస్ అనేవి.

జిలేబీ ద్వాదశక్షరీకి ముందుగా బీజాలను చేర్చి చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్పవచ్చును.

ఈ షడ్బీజాల్లో ఢాం‌ ఢీం ఢం అనేవి ప్రక్రియాబీజాలు అంటారు. హుష్ బుస్ తుస్ అనేవి అభిచార బీజాలు అంటారు. మనకు ప్రయోజనం కోరి పారాయణం చేస్తున్నప్పుడు మంత్రానికి ముందు ప్రక్రియాబీజాలు మూడింటినీ చేర్చాలి. ఇతరులకు భంగ కలిగించటం ఉద్దేశంగా చేసే పారాయణానికి అభిచారం అని పేరు. అభిచారం చేసే వాళ్ళు మాత్రం మంత్రానికి ముందు అభిచారబీజాలు మూడింటినీ చేర్చి చెప్పాలన్నమాట.

ఈ ప్రకారంగా ప్రక్రియోపాసకులు అహహా ఢాం ఢీం ఢం డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

అభిచారం చేసేవారు మాత్రం అహహా హుష్ బుస్ తుస్ డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి మనః అని మంత్రపారాయణం చేయాలి.

ఉభయులూ కూడా ఉపాసించవలసిన యంత్రం ఒక్కటే అది ఒక వృత్తాకార రేఖావలయంలో జిలేబీ అని నామం వ్రాసి దగ్గర ఉంచుకోవటం పారాయణం చేసేటప్పుడు. ఎదురుగా ఉంచుకోవటం మంచిది. నెత్తిమీద పెట్టుకుని పారాయణం చేయటం మహాప్రసస్తం. ఈ యంత్రాన్ని లోహాదులపైన చెక్కించటం వంటివి చేయకూడదు. అటువంటి యంత్రాలు కేవలం సహోంకారవిద్యలలోనే వాడాలి. నిరోంకార విద్య ఐన జిలేబీ యంత్రాన్ని కేవలం ఒక తెల్ల కాగితం పైన గీస్తేనే‌ ప్రశస్తం.

ఈ మంత్రానికి పారాయణంలో అంగన్యాసకరన్యాసాలు కూడా ఉన్నాయి. అన్ని మంత్రోపాసనల్లో ఉన్నట్లుగానే ఈ జిలేబీ మంత్రవిద్యలోనూ ఒక ధ్యాన శ్లోకం ఉంది. దానిని ఖచ్చితంగా ముందు చెప్పి మరీ పారాయణం చేయాలి.

అస్యేతి జిలేబీ ద్వాదశాక్షరీమహామంత్రస్య శ్రీ శ్యామలీయో ఋషిః జిలేబీదేవతా హాస్యప్రదేతి బీజం హాస్యప్రసంగిణీ ఇతి శక్తిః జిలేబీజాంగిర్యేతి పరమోమంత్రః డింగిరీతి కీలకం బ్లాగ్సంచారిణీ ఇతి అస్త్రం హాస్యప్రసంగిణీ ఇతి నేత్రం జిలుంగుప్రసంగ మత్యేతి కవచం హాస్యస్వరూపిణ్యేతి యోనిః డింగిరి బొంగిరీ ఇతి దిగ్భంధః సర్వబ్లాగ్సంచారిణీ ఇతి ధ్యానమ్‌

కరన్యాసం.
హాస్యప్రదేతి అంగుష్ఠాభ్యాం హఠ్
హాస్యప్రసంగిణ్యేతి తర్జనీభ్యాం కట్
జిలేబీ‌జాంగిర్యేతి మధ్యమాభ్యాం ఉఠ్
బ్లాగ్సంచారిణీ ఇతి అనామికాభ్యాం గుట్
జిలుంగుప్రసంగ మత్యేతి కనిష్ఠికాభ్యాం రట్
డింగిరి బొంగిరీ ఇతి కరతల కరపృష్ఠాభ్యాం ఫట్

అంగన్యాసం.
హాస్యప్రదేతి హృదయాయ మనః
హాస్యప్రసంగిణ్యేతి శిరసే ఆహా
జిలేబీ‌జాంగిర్యేతి శిఖాయై ఓహో
బ్లాగ్సంచారిణీ ఇతి కవచాయ హాహా
జిలుంగుప్రసంగ మత్యేతి నేత్రాభ్యాం హీహీ
డింగిరి బొంగిరీ ఇతి కరతల అస్త్రాయ హైహై
హాస్యస్వరూపిణ్యేతి దిగ్భంధః

ధ్యానం.
జయహే జయహే డింగిరి బొంగిరి జిలేబి జాంగిరి హాస్యప్రదే
జయహే జయహే తింగర తింగర నిత్యప్రసంగ విలాసరతే
జయహే జయహే బ్లాగు ప్రపంచ నిరంతర సంచరణైక వ్రతే
జయహే జయహే అంబ తెలుంగు వెలుంగు జిలుంగు ప్రసంగ మతే

ఈ విధంగా కరన్యాస అంగన్యాసాదులు చేసి, ధ్యానశ్లోకం చదివి మంత్రపారాయణం చేయాలి. ఈ ధ్యానశ్లోకాన్ని కఠగతం చేసుకుంటారో, చూసి నిత్యం చదువుతారో అన్నది కాక తప్పులు లేకుండా చదవటమూ, మరచిపోకుండా చదవటమూ అన్నవి చాలా ముఖ్యమైన విషయాలు. లేక పోతే పారాయణం చేసి ఏమీ లాభం లేదు.

అంగన్యాసకరన్యాసధ్యానశ్లోకాలతో పారాయణక్రమం పాటించే వారు పైన చెప్పిన ప్రక్రియా మంత్రం కాని అభిచారమంత్రం కాని యథాశక్తిగా పారాయణం చేయాలి.

ప్రక్రియాపారాయణానికి నైవేద్యంగా వేడివేడి జిలేబీలను పళ్ళెం నిండా ఉంచి నివేదన చేసి హాయిగా భుజించాలి.

అభిచారపారాయణం చేసేవారు పిండివడియాలు కాని బొంగులు కాని కారంకారంగా చేసి వాటిని నివేదన చేసి కసికసిగా కరకరలాడించాలి. మరీ హెచ్చుగా కారం వేస్తే మీకే ఇబ్బంది అని తప్పక గ్రహించవలసింది.

ప్రక్రియా విధానంలో పారాయణం చేసేవారికి తింగరితింగరి జనాకర్షక బ్లాగుటపాలు వ్రాసే సామర్థ్యం ఇతోధికంగా వృధ్ధికావటం. ఇతరుల తింగరి కామెంట్లకు కోపం వచ్చి బీపీ పెరగకుండా ఉండటం. కొత్తబ్లాగర్లకు రీడర్ల సంఖ్యా కామెంట్లసంఖ్యా అభివృధ్ధి చెందుటం అన్నవి ఫలితాలు.

అభిచారవిధిగా పారాయణం చేసేవారికి తత్ఫలితంగా ఇతరుల తింగర తింగర కామెంట్లను చీల్చి చెండాడే శక్తి వస్తుంది.
 
వీరి బ్లాగుల్ని దుర్వాఖ్యానం చేసేవారి పప్పులుడకవు.
 
వీరి బ్లాగుల్ని దొంగిలించే వారి బ్లాగుల్ని వ్యాఖ్యల్నీ కష్టాలు చుట్టుముడతాయి.
 
 
 
చీర్స్ 
జిలేబి 
(టపా కర్త - శ్యామలీయం వారి బ్లాగు నించి గ్రంధ చౌర్యం కాబడ్డ టపా!)