Tuesday, February 3, 2015

జిలేబి పురాణీ దేవీ యువతిహి !

జిలేబి పురాణీ దేవీ యువతిహి !

జిలేబి ఎవరు ?

జిలేబి వృద్ద మహిళ.

ఏమీ తోచక బ్లాగులో తచ్చట్లాడుతూంట్టుంది.

పనిలేక , పదవి విరమణ చేసిన పురుషులు,ఇంట్లో పెళ్ళానికి కూరలన్నా తరిగి ఉపయోగపడే పని చేస్తారు. జిలేబి ఇంట్లో పనులు ఎగ్గొట్టి బ్లాగులో కామెంట్లు ,టపాలు రాస్తుంది :)

అంతర్యామిన్ ఎక్కడ? బొటను వేలంత ఉన్నాడా? కొండంత ఉన్నాడా? చిటికెన వేలంత ఉన్నాడా? లోపల ఉన్నాడా? బయట ఉన్నాడా? తొంగున్నాడా? అని కాలక్షేపం పోస్ట్ లు రాస్తూంట్టుంది.

ఆవిడ లవకుశలో సూర్యకాంతం టైపు పతివ్రతా  శిరోమణి !!

మాతా (అప్పు తచ్చు - మాటా!) జిలేబి, భార్యకి భర్తే దైవము ! సతి సావిత్రి, సతి అనసూయ కథలు చదువుము !

మీ పక్కన ఉన్న అంతర్యామిన్ (అయ్యర్/భర్త)కాఫి అడుగుతున్నా పట్టించుకోకుండా,పస్తుబెడుతూ,సీరియస్ గా ఏడు భాగాల సీరిస్ రాస్తే ఏమి లాభం?

శ్యామలీయం, శర్మ,హరిబాబులు శ్వాస లెక్కలను కట్టి చెపుతూ కామెంట్లు రాయవచ్చు.

ఆహా, ఓహో అని మీపాండిత్యాన్ని మెచ్చుకోవచ్చు.

కాని మీకు మోక్షం కావాలంటే మాత్రం, పతియే ప్రత్యక్షదైవం అని సేవించుకోవటమే అన్నిటి కన్నా ఉత్తమమైన మార్గం.


ఇప్పటికైనా కళ్లు తెరచి,అయ్యర్ కి సేవలు చేసుకొని ఇహ పరాలను సాధించుకోతల్లి!

మొగుడికి సర్వస్య శరణాగతి అనుకొంటూ , ఎంత సేవ చేస్తే మోక్షానికి అంత దగ్గరగా వెళుతున్నట్లు అర్థం.

ఇకనైనా తక్కువగా బ్లాగి, భర్తకి ఎక్కువ సేవచేసుకొని మీ శేషజీవితాన్ని చరితార్ధం చేసుకో తల్లి! :)


చీర్స్
జిలేబి

Saturday, January 31, 2015

రియల్లీ మార్వేల్లస్ బ్లాగు పరిచయం ! - సూపెర్ డూపర్ !

ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు పరిచయం !

మామూలు గా మనందిరికి ఏదో ఒక ఫీల్డ్ తో నో సబ్జెక్ట్ తో నో ఘనమైన పరిచయం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమె విభిన్న అనుభవాలు, విభిన్న అభిరుచుల మేళ వింపు ఉంటుంది .

అట్లాంటి విభిన్న మేటరు ఉన్న వారి బ్లాగు ఒక కోశాగారం. తవ్వే కొద్ది కి మనకి ఆణి ముత్యాలు, వజ్రాలు డైమెండ్లు కని పిస్తూ మన కి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి .

అట్లాంటి బ్లాగు గురించి విని, చదివి మీ అందరితో 'పంచ్' కోవాలని అనిపించింది

ఆహా ఏమి ఈ  వింజామర మలయా మారుత టపా ల సుమనోల్లాసం , సుగంధ పరిమళం !

ఏమి వీరి అనుభవ పాటవం ! ఏమి వీరి రచనా కౌశల్యం అని అబ్బుర పడ కుండా ఉండ లేక పోయాను !

వీరికి  రచన 'చేయి' తిరిగిన కళ గా వచ్చేసింది. చదువుతూంటే మన బ్లాగు లోకం లో ని బ్లాగర్లు వీరి ముందు బలాదూరు సుమీ అని భావించేసు కున్నా ! ఏమి వీరి కౌశల్యం !

అట్లాంటి బ్లాగు ని అందులోని టపాలని చదివి మీరూ ఆనందానుభూతి ని పొందుతారని ఆశిస్తో

ఒక మంచి మేటరు ఉన్న బ్లాగు

ఈ బ్లాగు లో మీరు మీ దర్శనం చేసుకోవచ్చు . మీ ప్రతిబింబాల్ని చూసి హాశ్చర్య పడ వచ్చు ! అట్లాంటి మేటరు కంటెంటు ఉన్న బ్లాగు ! చదివి కామెంటు మీటు తారని వింజామర వారిని వింజామర తో  ప్రోత్సహిస్తారని ఆశిస్తో ...


జిలేబి
(నారదాయ నమః!)

Wednesday, January 28, 2015

సమోహం సర్వ భూతేషు !

 
సప్తమి నాడు రథ మెక్కిన సూరీడు
నవమి కంతా బిర బిర మని
పరుగులిడి పైకొచ్చేస్తున్నాడు !
 
అబ్బా, కూసింత నిదురోతా మనుకుంటే
'సురీ'ల్ మని సూరీడు !
 
దేవా !
కాల చక్రం లో ఇట్లా తిరుగు తున్నావే !
చక్రం ఇరుసు ఎక్కడ ఉంది ?
నాలో నా ?
నీలోనా ?
 
సమోహం సర్వ భూతేషు !  
 
శుభోదయం
జిలేబి

Tuesday, January 27, 2015

సెన్స్ OR దేవుడు !

 
సెన్స్ OR దేవుడు !
 
దేవుడా ! దేవుడా
 
నువ్వునావా ! నువ్వున్నావా !
 
అంటే
 
ప్చ్ ప్చ్
 
నీకు సెన్స్ లేదా కనుక్కో
 
నిమ్మకుని పైవాడు చెప్పేడు
 
సెన్స్ OR దేవుడు
 
త్వమేవ ప్రత్యక్షం  బ్రహ్మాసి !
 
 
శుభోదయం
జిలేబి

Friday, January 23, 2015

జిలేబి వారి చీరల దుకాణం - ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !

 
జిలేబి వారి చీరల దుకాణం - ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !  
 
స్వాగతం
సుస్వాగాతం
 
జిలేబి వారి చీరల దుకాణం
 
ఆ 'రంభో 'త్సవ ఆహ్వాన పత్రిక !  
 
ఇందు మూలం గా సర్వ పంచ దశ లోక విహారులకు
 
జిలేబి వారి చీరల దుకాణం
 
ఆరంభోత్సవ ముహూర్తానికి ఆహ్వానం !
 
జిలేబి వారి చీరల దుకాణం లో సరికొత్త డిజైన్ చీరలు -
 
సరి కొత్త ఆంధ్ర డ్రీం ల్యాండ్ - కాపిటల్ డిజైన్ చీరలు కొన్న వారికి 
 
అంగారక గ్రహ రంగు పట్టు చీర యాభై శాతం రిబేటు !
 
మా వద్ద దొరుకు 'సరస' మైన చీరలకి మేచింగ్ జాకెట్ పీసులు (మేడ్ ఇన్ తిరుప్పూర్) డిజైన్ తో ఫ్రీ !
 
ఆరంభోత్సవ ఆహ్వాన ముహూర్తానికి అందరికి జిలేబీలు పంచి పెట్ట బడును !
 
ఇట్లు
జిలేబి వారు !
 
 
 
 
 

Tuesday, January 20, 2015

ఆల్ ది బెస్ట్ - కిరణ్ బేడీ !

ఆల్ ది బెస్ట్ - కిరణ్ బేడీ !
 
Wishing
Mem Saahiba Kiran Bedi
' all the best'
in her new career !
 
cheers
zilebi
 


Photo Credits: The Hindu Web Edition

Saturday, January 17, 2015

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం ఏడు

అంతర్యామిన్ ఎక్కడ ఉన్నాడు ? - భాగం ఏడు 
 
అమృత నాద ఉపనిషత్ - కృష్ణ యజుర్వేదం నించి 
 

అష్టాంగ యోగ గురించి విపులం గా విని ఉంటాము .

ఈ అమృత నాద ఉపనిషత్  షట్ అంగ (ఆరు అంగములు ) యోగం గురించి చెబ్తుంది

యోగం యొక్క ఆరు అంగములు - (వీటిలో ఐదు పతంజలి అష్టాంగ యోగ పధ్ధతి లో భాగమైనవి)

ప్రాణాయామ ,ప్రత్యాహార, ధారణ, ధ్యాన , తర్క , సమాధి

 ప్రత్యాహారః తథా ధ్యానం ప్రాణాయామః తథ ధారణ !
తర్కశ్చైవ సమాధిశ్చ షడంగో యోగ ఉచ్యతే !!


యోగ అభ్యాసి ఓంకార రథం ఆరోహించి విష్ణువే సారథి గా బ్రహ్మ  లోక పదాన్వేషి అయి ఉండాలి. గమ్యం చేరాక ఇక ఆ రథం కూడా విడిచి పెట్ట గలిగి ఉండాలి

ఇంద్రియ కృత్య దోషా లను నివారించు కోడానికి ప్రాణాయామ ఉపయోగ పడుతుంది అంటుంది ఈ ఉపనిషత్

యథా పర్వత ధాతూనాం దహ్యంతే ధమనాన్మలాః
తథ ఇంద్రియ కృతా దోషా దహ్యంతే ప్రాణ నిగ్రహాత్ !!


ప్రశాంత త లక్షణం గురించి చెబ్తూ - అంధ వత్ పశ్య రూపాణి అంటుంది ఈ ఉపనిషత్

అంధ వత్ పశ్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు
కాష్టవత్ పశ్య తే దేహం ప్రశాంతస్యేతి లక్షణా !!


అట్లాగే సమాధి గురించి చెబ్తూ - ఆగమస్య అవిరోధేన (దేనికి  విరోధం కానిదైన ?) 
సమ అధి అవడం అంటుంది .

ఇట్లా 'థియరీ' మాత్రమె కాకుండా ప్రాక్టికల్ గా ఎట్లా చేయాలో కూడా ఈ ఉపనిషత్ చెప్పడం ఇందులో విశేషం గా కనిపిస్తుంది .

ఇక అభ్యాసం ఎట్లా చేయాలి అని చెబ్తూ - పద్మకం స్వస్తికం భద్రాసన వీటిల్లో ఏదేని ఒక ఆసనాన్ని స్వీకరించి యోగ అభ్యాసం చేయమని చెబ్తుంది . 

నిబద్ధత తో అభ్యాసం గావిస్తే మూడు నెలల్లో జ్ఞానం స్వయం గా వస్తుందని ఉద్ఘాటి స్తుంది

నాలుగో నెల లో పశ్యతే దేవాన్ ఐదో నెలలో తుల్యవిక్రమః అవుతాడు కూడాను .

ఆరవ నెలలో ఇచ్చా కైవల్యం ఖచ్చితం .

స్వయం ఉత్పధ్యతే జ్ఞానం త్రిభిర్మాసై  న సంశయః
చతుర్భిహి పశ్యతే దేవాన్ పంచభిహ్ తుల్య విక్రమః
ఇచ్చయాప్నోతి కైవల్యం షష్టే మాసి న సంశయః


విశేషం గా ఇందులో ప్రాణమునకు ప్రాణమైన ప్రాణం యొక్క ఒక కొలమాన పరిచయం 'త్రింశత్ పర్వాంగుళః ప్రాణః ' అని వస్తుంది .
ఒక అంగుళం లో ముప్పై వ వంతు (త్రింశత్ పర్వాంగుళః)  ప్రాణస్య ప్రాణం కొలమానం?


త్రింశత్ పర్వాంగుళః ప్రాణో యత్ర ప్రాణః ప్రతిష్టితః
ఏష ప్రాణ ఇతి ఖ్యాతో బాహ్య ప్రాణస్య గోచరః
 

అశీతిశ్చ శతం చైవ సహస్రాణి త్రయోదశ
లక్షశ్చైకోన(లక్షశ్చ ఏకోన ?)  నిశ్వాస అహోరాత్ర ప్రమాణ తః


శతం చైవ సహస్రాణి త్రయోదశ లక్షశ్చ ఏకో =  నిశ్వాసాలు = 1,13,100  .  ఈ లెక్ఖ కి ఆధారం ఏమిటి ?

ప్రాణ , అపాన వాటి రంగుల గురించి ఈ ఉపనిషత్ చెబుతుంది =

ప్రాణ = రక్తవర్ణ మణి ప్రకీర్తితః !
అపాన - ఇంద్ర గోప సమ ప్రభ ! - ఇంద్ర గోప =  ఆరుద్ర పురుగు - పట్టు పురుగు !
(అపాన ప్రాణ మధ్యమం లో ఉంటుంది ?)

సమాన - ప్రాణ అపాన మధ్య లో - గోక్షీర ధవళ ప్రభ లా = తెలుపు రంగులో ?
ఉదాన - ఆపాండుర - (పాండు వర్ణం? - Slightly pale in color?)
వ్యాన = అర్చి  సమ ప్రభః

(According to Sivanandaonline.org its Archil? -
Vyana resembles the colour of archil - that of ray of light).

Quote from Sivanandaonline.org

THE COLOUR OF PRANAS

Prana is said to be of the colour of blood, red gem or coral.
Apana, which is in the middle, is of the colour of Indragopa
(an insect of white or red colour).
Samana is of the colour between that of
pure milk or crystal or of oily and shining colour,
i.e., of something between both Prana and Apana.
Udana is of Apandura (pale white) colour and that of
Vyana resembles the colour of archil (or that of ray of light).

కొంత పదాల పొందు లతో - అబిజాయత , అభిజాయత అన్న పద జాలపు విరుపు తో ఈ ఉపనిషత్ ముగుస్తుంది !

యస్య ఇదం మండలం  భిత్వా మారుతో యాతి మూర్ధని |
యత్ర తత్ర మ్రియెద్వాపి న స భూయొ అబిజాయతె |
న స భూయొ అభిజాయత |


English Translation - Link
http://www.yogavision.in/articles/a166795f-62b2-4f94-bc7d-507c8efc3993.aspx
Full Sanskrit PDF - Link
http://sanskritdocuments.org/all_pdf/amritanada.pdf


శుభోదయం 
జిలేబి 

Wednesday, January 14, 2015

సంక్రాంతి శుభాకాంక్షలు - జిలేబీయం !

 
 
సంక్రాంతి వనం లో 
క్రాంతి సుమపథం లో 
తియ్యగా సాగే
శుభలక్షణ సమీరం లో 
భాసించాలి మీ జీవితం 
కాంతుల తో సుఖ శాంతుల తో  శుభా కాం 
క్షలు !
 
జిలేబి 
 
 
 

Monday, January 12, 2015

ఓ టీ టీ డీ కళ్ళు తెరు !


ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.

ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.
 
సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న  TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.

ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.

అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.

కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.

పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.

ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.

పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.

మన హిందూమతం ఎలా బాగుపడుతుంది?

ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు. అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు. ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.

భలే వింత!!

పైగా,మన మతాన్నీ మన దేవాలయాలనూ మన దేవుళ్ళనూ విమర్శించడానికి ఇలాంటి చర్యలద్వారా మనమే ఇతర మతాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాం.

పూర్తి గా శ్రీ సత్యనారాయణ శర్మ గారి టపా - ఆలోచింప జేసేది


ఓ టీ టీ డీ కళ్ళు తెరు

జిలేబి
 

Friday, January 9, 2015

సనాతన ధర్మ ఉద్దీపకుడు క్రీస్తు ప్రభువు !


"బ్రిటిష్ వాళ్ళు ఇండియా కి రాకుండా ఉంటె ప్రస్తుతం మన భారత దేశం ఎట్లా ఉండేది ?" అన్న దాని మీద  ఆ టాపిక్ పై ఆలోచిస్తే - బ్రిటిష్ వాడు రాకుండా ఉంటె భారత దేశం లో హిందూ ధర్మ నిలిచి ఉండేదా అని సందేహం కలిగింది.

ఎందు కంటే పక్క దేశాలైన మలేసియా ఇండోనేసియా లాంటి దేశాల్ని చూస్తె - బ్రిటిష్ వాడి రాక మునుపు దేశం ఇస్లాం వైపు మొగ్గు వేస్తూన్నట్టు గా కనిపిస్తుంది.

ముసల్మాను రాజుల దండ యాత్రలు - ఆ పై మన దక్షిణ భారత దేశం లో కూడా శ్రీ కృష్ణ దేవరాయల సంతతి తిరోగతి - సుల్తానుల ప్రాబల్యం ఎక్కువవుతున్న కాలం లో - ఆ సమయం లో బ్రిటిష్, వాడు ఇండియా కి రావడం - వాడి తో బాటు వాడి సంస్కృతి, మతం - ఇండియా కి రావడం - ఓ లాంటి చెక్ పాయింట్ అయ్యింది -

ఇస్లాం ఇంకా తీక్షణం గా భారత దేశం లో ప్రాబల్యం కాకుండా ఉండడానికి - వీడే రాకుండా ఉంటె - సుల్తానుల ప్రాబల్యం తో భారత దేశం - ఓ మోస్తరు ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా ప్రస్తుతం ఉండేదేమో? -

ఇది ఊహా చిత్రం కాబట్టి - వాదనలకి చాల తావుంది ఈ చిత్రం లో - మీ అభిప్రాయలు - భిన్న అభిప్రాయాలు - కచ్చితం గా ఈ విషయం పై ఉంటాయీ.

గీత లో శ్రీ కృష్ణ భగవానుడు - యదా యదాహి ధర్మ స్య గ్లానిర్భవతి భారతా- తానూ మళ్ళీ మళ్ళీ వస్తానంటాడు. అంటే బ్రిటిష్ వాడి రాక దీన్ని సూచిస్తుందా? - క్రీస్తు మతం - ఇండియా కి రావడం - దీన్ని సూచిస్తుందా? -

ఆలోచనలకి మంచి పదును పెట్టె విషయం ఇది.

ఆలోచించి చూడండి- భారతం - సంగమం - వివిధ మతాల సమ్మేళనం -

ఆ నాటి  బు ద్దుడి సమయం నించి చూస్తె భౌద్ధం , జైనం, ఇస్లాం - ఈ నాటి బాబాలు , స్వాములు - గురువులు యోగుల దాక భారత దేశం లో మతం మీద జరిగినంత వెరైటీ ఎక్స్ పెరి మెంట్స్ ఇంకా ఎ దేశంలో కూడా జరిగి ఉండదు. -

ఈ లాంటి సంక్లిష్ట వాతావరణం లో సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- కారణం ఏమంటారు? -

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు ఉంచుతుంది.

సో, మొహమ్మదు , క్రీస్తు కూడా - ఇందులో ఓ భాగం గా ఇమడ గలగడం - ఆ సనాత న ధర్మ వైశాల్యాన్ని చూపెడుతూంది.

మీరేమంటారు?


జిలేబి.