అయ్యరు గారి తో కాఫీ విత్ జిలేబి !
పొద్దుట పెందరాళే లేచి చక్కగా సజాయించు కుని ఒద్దిక గా అయ్యరు గారి కాళ్ళ కి ముక్కోటి మార్లు మొక్కి వంటా వార్పూ కార్యక్రమం లో పడింది జిలేబి !
ఫోటో కర్టసీ గూగులాయ నమః !
అయ్యరు గారు నిద్ర లేచి 'కాలై కడంగల్' తీర్చుకుని సంధ్య వార్చి చేతిలో హిందూ పేపరు తెరిచిన ఆ క్షణా న జిలేబి నిండు ముత్తైదువ లా ముఖాన యాభై పైసల కుంకుమ్ బొట్టు తో చేతి లో ఘుమ ఘుమ లాడే కాఫీ కప్పుతో , అయ్యరు గారి ముందు ప్రత్యక్షమై 'స్వామీ' కాఫీ' అంది .
అయ్యరు గారు అదిరి పడేరు !
జిలేబి నువ్వేనా ! హాశ్చర్య పోయేరు !
అవును నాధా ! నేనే నేనే నేనే ముమ్మార్లు 'గణీల్' మని నొక్కి వక్కాణించి, జిలేబి, అయ్యరు గారి కాళ్ళకి మరో మారు నమస్కరించి , శ్రీ మహావిష్ణువు సమీపం లో లక్ష్మీ దేవేరి లా అయ్యరు గారి పక్కన ఆశీను రాలైంది .
స్వామీ !
ఏమీ ! ఈ వేళ ఏమైనా సూర్యుడు పడమట పొడిచినాడా జిలేబి ! అయ్యరు గారు మేళ మాడేరు !
స్వామీ ! నేటి నించి నేను మీ పద దాసీ ని . మీ పద పద్మ ముల చెంతనే నా జీవనము మళ్ళీ మరో మారు కాళ్ళకి మొక్కింది జిలేబి .
ఆహా ఏమి నా జీవన సౌభాగ్యము అని అయ్యరు గారు మురిసి , 'దేవీ జిలేబి ! ఏమి ఈ అకాల మార్పు ! పెళ్లి అయిన కొత్తల్లో ఎంత వినయ విధేయ తల తో నన్ను గోలిచినావో గుర్తు కోస్తోంది స్మీ ! అన్నారు అయ్యరు గారి తలని తలపై బొప్పిని తడివి చూసు కుంటూ ! అంతా కాల మహిమ !
స్వామీ ! నేను సతీ అనసూయ సావిత్రి వారల జీవన చరిత్రలను రేతిరి కి రేతిరి 'కాంతా' పాటం గా చదివా ! చెప్పింది జిలేబి మళ్ళీ స్వామీ వారి కాళ్ళకి మొక్క బోతూ !
అయ్యరు గారు అదిరి పడేరు ! ఇట్లా నిమిషానికి పదేసి మార్లు తన కాళ్ళకి ఈవిడ వందనాలర్పించు కుంటూ ఉంటె , తను ఎప్పుడు హిందూ పేపరు చదివేది !
స్వామీ ! ఇక మీదట నేను బ్లాగు లు గట్రా చదవను ! టపాలు వ్రాయను ! కామెంట్లు కొట్టను !" జిలేబి చెప్పింది !
జిలేబి నీలో ఇంత మార్పా ! అయ్యరు గారు నోరు వెళ్ళ బెట్టేరు .
అంతే స్వామీ అంతే! ఇక మీదట ఆ బ్లాగు లు గట్రా మీరే చదవండి మీ స్వరంలో వాటిని వింటూ నేను ఆనంద డోల లోఊయ లూగుతూ అట్లా పతి సేవలో తరి స్తాను ! కళ్ళ నిండు గా భాష్ప ధారా వాహిని అయి చెప్పింది జిలేబి . "అంతే కాదు స్వామీ , వాటి కి కామెంట్ లు కూడా మీరే నా తరపున వ్రాయాలి "
వాట్ ! ఆ యూజ్ లెస్ బ్లాగులూ , పని లేక వ్రాసే వాళ్ళ బ్లాగు లు, కాలక్షేపం కోసం వ్రాసే కబుర్లు నేను చదవాలా ! అయ్యరు గారు నిటారు గా అయ్యేరు ! - ఇట్లా నీకు బ్లాగు లు గట్రా నేను చదివితే , నేనెప్పుడు హిందూ పేపరు చదివేది ?
ఇక మీదట మీరు హిందూ పేపరు చదవద్దు స్వామీ నా కోరిక మీద ! మరో మారు కాళ్ళ కి నమస్కరిస్తూ విన్న వించు కున్నది జిలేబి .
అయ్యరు గారు ఈ మారు తటాల్ మని కాళ్ళు లాగేసు కున్నారు ఈ మారు ! ఆ మహా విష్ణువు లక్ష్మీ దేవేని సర్వ వేళ లా అట్లా కాలి దగ్గర ఎట్లా భరిస్తున్నాడో అని సందేహ పడి పోతూ .
అంతే కాదు స్వామీ ! ఇవ్వాల్టి నించి నేనే వంటా వార్పూ కూడా గమనిస్తా !
వాట్ మళ్ళీ అదిరి పడేరు అయ్యరు గారు . పెళ్లి కొత్తల్లో జిలేబి వంట రుచి ని గాంచి, సేవించి ఆస్పతాల్లో గడిపిన రోజులు వారి కళ్ళ ముందు కదులాడింది ! ఈ బాధ కన్నా వేరే ఏదైనా బాధ జీవితం లో ఉంటుందా మరి అనుకునేంత గా వారు బేజారై పడి పోయిన దినాలు కళ్ళ ముందు గిర గిరా తిరిగేయి !
జిలేబి ! నీ పతి ప్రాణములు నీకు వద్దా ! ఈ మారు సీరియస్ గా అడిగేరు అయ్యరు గారు !
అబ్బే, పతి ప్రాణములు ఎక్కడి పోతాయి స్వామీ ! మించి పోతే సతీ సావిత్రి లా ఆ యముడి తో నైనా పోరాడి మళ్ళీ నా కొంగు కి ముడి వేసేసు కోనూ ... రాత్రి చదివిన సావిత్రి కథ జోష్ లో రెండు వంద ల శాతం 'రాంభరోసా' తో చెప్పింది జిలేబి .
వామ్మో ! ఏడు జన్మల్ బంధం ఏడడు గుల బంధం అంటే ఇట్లా బందీ అవట మేనా ! అనుకుంటూ అయ్యరు గారు హటాత్తు గా వాలు కుర్చీ నించి లేచి కాషాయ వస్త్రాలు ధరించి హిమాలయం మార్గం పట్టేరు ఆ పాటి పెర్సనల్ స్పేస్ కూడా ఈ 'ఆండోళ్లు' మగాళ్ళ కి ఇవ్వకుంటా ఉంటె ఎట్లా అని ఆలోచిస్తో !
"స్వామీ ! స్వామీ ! పతియే ప్రత్యక్ష దైవం ! నేను మూడు పొద్దులా మీకు కాఫీ విత్ జిలేబి నైవేద్యం గావించి గాని పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టనని ఆన చేసేను ! నా బాస ఏమి గాను " అంటూ , గజేంద్ర మోక్షం ఘట్టం లో లక్ష్మీ దేవి లా అయ్యరు వెంట పడింది జిలేబి 'కాటి కి పోయినా నిన్ను నే వదలను స్వామీ' అంటూ !!
చీర్స్
జిలేబి