Wednesday, June 3, 2015

గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

ఈ గుండు జ్ఞానము గురించి టపా కట్టిన వేళా విశేషము ఎట్టిదనిన అది గుండులా, గుమ్మడి కాయలా డమాల్ డమాల్ అని పేలినది .

ఆ విషయము పై కడుంగడు ఆనందము తో ఆ హా గుండు జ్ఞానము ఇంత గొప్పదా ఇన్ని కామింటులు వచ్చినవా అను ఆనంద పరవశము తో జిలేబి నాట్యము చేయ మొదలు పెట్టినదో లేదో అంత లో మరో దుమారం లేచినది . గుమ్మడి కాయ దొంగ కథ లాగా భుజాలు తడుముకుని తమ పై ఈ జిలేబి టపా అత్యాచారము గావించినది అను సందేహము లేచు వరకు దాని ప్రాబల్యము ప్రబలినది . హత విధీ ! గుండు మహాత్యమము ఇంత గుండా తి గుండైనదా అని दांतों पर उंगली दबायी !

అంత లో మరో విషయము అడిగినారు బ్లాగోదరులు - శ్రీ మాన్ కష్టే  ఫలే శర్మ గారు అనబడు చిర్రావూరి భాస్కర (ఇదియిను అనగా సూరీడున్నూ గుండె సుమీ !) శర్మ గారు !

"ఈ గుండు టపాలో కుట్ర కోణం ఏదైనా ఉన్నదా అని .  (భాస్కరుడు అనగా ఎవరు ? SUN ! స్ కిన్నూ ఎన్ కిన్నూ మధ్య నీ లో ని ఐ ని తొలగించి యు అనే పరతత్వాన్ని గ్రహించిన మీరు భాస్కరులు అగుదురు ! )

లేదు ఈ టపా లో కుంభ కోణము మాత్రమె ఉన్నదని జిలేబి అంటే, కుంభకోణము లంబ కోణము లన నేమి వాటిని వివరించుడీ అని శర్మ గారు కోరిన కోర్కె ని మరువ లేక - వారి చేత ప్రశ్నలు పెట్టి టపాలు కట్టించిన సందర్భములు గుర్తు కొచ్చి సరే పోనీ వారి ఆశ కూడ ఎందుకు కాదన కూడదను సదుద్దేశము తో ఈ టపా మొదలు పెట్టినాను .

చదువరీ  చదువుటకు మునుపు ముఖ్య గమనిక ! ఇది తెలంగాణా కి గుండున్న వారి కి సంబంధించిన విషయము గాదు కావున గుమ్మడి కాయ కథ వోలె ఏదియును తడుము కొనరాదు . ప్రాంతీయ భాషాభి మానముల్ కట్టి పెట్టి పూని ఏదైనను తెలుగునందు టపా కట్ట వోయ్ అని గురజాడ వారన్నారని భోగం రాజు సీతారామయ్య వారి ఉవాచ !

కుంభము అనగా బానె . బానె అనగా అది ఏదియో ఒక విధమైన మూర్తి. మూర్తీ అనగా ఒక రూపము గలది.

కుంభము ను కుండ అని కూడా అని అందురు. కుండ అనగా మీకు 'మానవా ! నీవు పాత కుండవు ! నేను ఉత్త ముండను అను ప్రఖ్యాత వాక్యము గుర్తు కొచ్చిన దీని లో జిలేబి గుండు ప్రమేయము ఏమియును లేదు ! అదియే కుంభ కోణ విద్యా రహస్యము !

ఉప ని 'ఖత్' లో ఏమని చెప్పినారు ? ఘటా కాశం - కుండలో ఉన్న ఆకాశం ఆత్మ అయితే , మహాకాశం పరమాత్మ ! ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని !
అంటే కుంభము ని పగుల గొట్టిన ఒకటే ఆకాశం ! కుండ 'కోన' అయి ఉన్నంతవరకు వేర్వేరు 'ஆகாயம் !

ఇక లంబ కోణము అన నేమి !

లంబోదర లకుమికరా అను పద గీతి ని మీరు వినియె ఉందురు .

అటులే త్రికోణ మితి శాస్త్ర పురాణం లో రెండు గుండైన చుక్కల మద్య అతి స్వల్ప దూరం ఒక సరళ రేఖ అని చెప్ప బడి ఉన్నది

అనగా ఈ సరళ రేఖ ఒక లంబము .

ఈ కుండ లో నుండు ఆకాశ మునకున్ను ఆ పై నున్న ఆకాశామునకును సరళ రేఖ అనబడు లంబ కోణము shortest distance !

కావున లంబ కోణము యొక్క మహాత్మ్యము ఎట్టి దనిన లంబ కోణము లో పయనము గావించిన ఈ గుప్పెడు మనసు ఆ విశాల హృదయము లో ఐక్య మగును !

గుండు డామ్మని పగిలి కపాల మోక్షము గలిగిన ఆ హా ఏమి స్వామీ వారి మహాత్మ్యము అని జనములు పొగిడేదరు !

ఇట్లు ఈ కుంభ కోణము లంబ కోణము లను తెలుసు కున్న మానవుని కి గుండు జ్ఞానము పరి పూర్ణము గా 'కిట్టును' !

ఇంతటి తో ఈ గుండు జ్ఞానము భాగము రెండు అనబడు కుంభస్య లంబమేవ ఆకాశం లభ్యతి అనబడు విద్యా రహస్యము పరి సమాప్తము !

ఈ జ్ఞానము మీకున్నూ మెండు గా కలుంగ వలె నను గుండు జిలేబీయము తో ఇవ్వాళ్టి కథా కాలక్షేపము సంపూర్తి !

ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ !!

జిలేబి
 

Monday, June 1, 2015

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న కి జవాబు ఇచ్చు దమ్మున్న ధీరులెవ్వరు ??

ఉపోద్ఘాతం :

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్నకి మూలభూతమైన ఈ టపా లింకు చదవవలె :

http://varudhini.blogspot.in/2015/01/blog-post_9.html

ఇప్పుడేమో వారి ప్రశ్నల న్న మాట :

"ఈ ప్రశ్న ఎప్పుడు మీకెప్పుడు రాలేదా? బ్రిటీష్ వాడి పాలన కింద ఉన్నపుడు భారతదేశం లో హిందూ, ఇస్లాం మతాలు రెండు ఉంటే, వాడికి హిందూ మతంలోమాత్రమే దురాచారాలు ఎందుకు కనిపించాయి? మీకు తెలిస్తే చెప్పండి.  "

రెండో ప్రశ్న :

ప్రశ్న,    కోస్తాఆంధ్రా మార్క్సిస్ట్ రచయితలు రాసినట్లు హిందూమతంలో అన్ని దురాచారాలు ఉంటే, నేటికి పాకిస్థాన్ లో హిందూమతం  ఎందుకు ఉన్నట్టు? వీరేవ్వరు అగ్రవర్ణాల వారు కూడా కాదు. అయినా వారు ఎన్నో ప్రతికూలతల మధ్య ఆమతంలోనే ఎందుకు కొనాసాగలనుకొన్నట్లు?   



ఇది చాలా మంచి ప్రశ్న : దీనికి జవాబు నా కైతే తెలీదు . బ్లాగు లోకం లో తెలిసిన వాళ్ళు కామెంట గలరు ;

నా వరకైతే నాకనిపించింది ఇది:

  ఎట్లాంటి సంక్లిష్ట వాతావరణం లో నైనా సనాతన ధర్మ పద్దతి - ఇంకా కొన సాగుతూనే ఉంది- 

మనిషి ప్రగతి కి - ఆధ్యాత్మిక శిఖరాని అతను అందుకోవ డానికి - ఎలాంటి నిర్బంధాలు లేకుండా- వ్యక్తి  స్వేఛ్చ తో - భగవంతున్ని అనంతం తో నిలబెట్టి - నీకంటూ ఓపిక , ఇచ్ఛా ఉంటె- ఆ సర్వాంతర్యామి ని - రాయి లో నించి అనంతం దాక ప్రత్యక్షం చేసుకో - అన్న ఉదాత్త వేదాన్ని అతని ముందు సనాతన ధర్మం ఉంచుతుంది. ఆ వైశాల్యమే సనాతన ధర్మ 'పురాణీ దేవీ యువతిహి ' అని పించేలా చేస్తుందని అనుకుంటున్నా .


బుద్ధ పూర్ణిమ వస్తోంది కాబట్టి :-గుండు జ్ఞానం అందరికి పరి పూర్ణం గా రావాలని వేడుకొంటూ ...

యూ జీ శ్రీ రామ్ గారి ప్రశ్న లకి జవాబిచ్చిన వారికి బెనారస్ వేడి పాలు ప్లస్ హాట్ హాట్ జిలేబి లు ఉచితం !!

Signing off
from & for Benaras!

cheers
Zilebi

(బెనారసీ  జిలేబీయం)

Friday, May 29, 2015

గుండు జ్ఞానము అనగా నేమి ? అది ఎట్లు వచ్చును ?

గుండు జ్ఞానము అనగా నేమి ? అది ఎట్లు వచ్చును ?

గుండు అనగా పూర్ణము. పూర్ణము అనగా అసంపూర్ణము కానిది.  అసంపూర్ణము అనగా అది ఏదియో తెలియనిది కొంత వదిలి వేయ బడినది.

అది ఏదియో తెలియనిచో అది వదిలి పెట్ట బడినది అని ఎట్లా తెలియును ?

అనగా అది ఏదియో తెలియనది వదిలి బెట్ట బడినది అను కించిత్తు జ్ఞానమే గుండు జ్ఞానమా అన్న ప్రశ్న ఉదయించును .

అనగా ఆ కించిత్తు దేనినో సూచించును . కాని అది ఏదియో తెలియదు .

కావున ఆ కించిత్తు ని వలవేసి పట్టు కుని అది ఏదియో దానిని పట్టుకొనుట కుదురును అను జ్ఞానమే గుండు జ్ఞానము అని అనుకోనవచ్చునా ??

గుండు జ్ఞానము కలదు అని విశ్వసించిన గుండు కాని జ్ఞానము కూడా ఉండ వచ్చును అని అనిపించు ను. కాని  పూర్తి గా మనసును బెట్టి పరిశీలించిన ఉంటె గుండు జ్ఞానము మాత్రమె గలదు . అది లేని చొ ఏదియును లేదు అని సూక్ష్మము గా తెలుసు కొన వచ్చును .

ఇట్లాంటి గుండు జ్ఞానము ను తెలుసుకొనుటకు ఏది సౌలభ్యమైన మార్గము ? మనస్సు ద్వారా ఆ గుండు జ్ఞానము అవగాహన అగునా ? హృదయము ద్వారా అది అవగాహన అగునా అను సందేహము వచ్చును .

అసలు మనసు అనగా నేమి ? బుద్ధి అనగా నేమి ? అహం కారము అనగా నేమి ? హృదయము అనగా నేమి ? ఇవన్నీ తెలిసిన గుండు జ్ఞానము తెలిసినది అని నిర్దారించ వీలగునా ??

తెలుగు భాషలో అన్ని అచ్చులు హల్లు లు కొన్నింటి ని తప్పించి అనగా క, గ చ ఛ ద వంటి కొన్నింటి ని తప్పించి 'గుండు' నిబిడీ కృతమై ఉండడమును మనము గమనించ వచ్చును . ఇదియు ఒక విధమైన గుండు జ్ఞానమే !

జిలేబి గుండుగా ఉండును. గుండు గుండు గా ఉండే వన్నీ గుండు జ్ఞానము కలిగి ఉండునా ? అన్నది ప్రశ్న .

కావున గుండుగా ఉన్నంత మాత్రమున గుండు జ్ఞానము వశీకరణము అగునా అన్నది ప్రశ్నార్థకమే .

అటులే , గుండు కాని చో కూడా గుండు జ్ఞానము సాఫల్యము అగును అని ఖచ్చితము గా చెప్పలేము.

ఇటులు  సర్వ వ్యాప్తమై ఉండి, సర్వ అవ్యాప్తమై ఉండి గుండు ఉండీ , అసలు ఉందా లేదా అన్న సందేహము ను ప్రతి క్షణము లోను లేవదీయు గుండు అసలైన సర్వ జ్ఞానము.

యస్య జ్ఞాన దయా సింధో ....

(గోడ దూకితే అదే సందు !)


ఇంతటి తో గుండు జ్ఞాన కాండ పరి సమాప్తము. దీని ని చదివిన వారికి గుండు జ్ఞానము మెండు గా నిండుగా గలుగ వలె నని జిలేబి ఆ గుండు గుండు ని వేడు కుంటూ ..


జిలేబి

Thursday, May 28, 2015

తాటాకు గొడుగు క్రింద 'తరుణుడు' !

తాటాకు గొడుగు క్రింద 'తరుణుడు' !


 
 
ఫోటో కర్టసీ: హిందూ దినపత్రిక
 
 
చీర్స్
జిలేబి
 

Monday, May 25, 2015

విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

విగ్రహం లో దేవుడా ! ఇట్లాంటి వి మా ఇంటా వంటా లేదండీ ! ఇవన్నీ పాప భూయిష్టం ! చెప్పేడు ఆ శాల్తీ . 

విగ్రహం లో అప్పటి దాకా జోగుతూ, తూగుతూ, కురై ఒండ్రుం ఇల్లై మరై మూర్తి కన్ణా అంటూ ఎమ్ ఎస్ ఆర్ద్రత తో పాడుతూ ఉంటె, ఆహా ఏమి ఈ గాన మహిమ అనుకుంటూ డోలాయ మాన మైన  విగ్రహం లో ని దేవుడు ఉలిక్కి పడ్డాడు !

కళ్ళు చిట్లింటి చూసాడు . ఎవడో శాల్తీ - పదునాలుగు వందల సంవత్సరాల మునుపు శాల్తీ - ధ్యానం లో ఏకమై , మమేకమై , ఏకత్వాన్ని ప్రతి పాదిస్తే, ఈ కాలం మానవుడు దానికి వక్ర భాష్యం చెప్పుకుంటూ ఉంటె, ఆలోచనలో పడ్డాడు . 

అవును కదా అదే సమయం లో భారద్దేశం లో తన పంపు శంకరుడు కూడా అద్వైతాన్ని ప్రతి పాదిం చేడు . 

తన వా డైన కృష్ణుడు చెప్పలే ? యే యథా మాం ప్రపద్యంతే  తాం తదైవ భజామ్యహమ్ ? అంటూ ?

అబ్బ ! ఈ మానవులకి అతి తెలివి ఎక్కువై పోయిన్దిస్మీ అనుకుని నిట్టూ ర్చేడు కొండ దేవర . 

కొండల లో నెల కొన్న కోనేటి రాయా ! మరో శాల్తీ పాడటం మొదలెట్టేడు . 

ఓం ఓం అంటూ మరో శాల్తీ ఓంకార నాదాన్ని పూరించే డు . 

అల్లాహో అంటూ మరో మానవుడు గొంతెత్తే డు . 

మై లార్డ్ ఇన్ ది హెవెన్ .... అంటూ మరొక్కడు .... 

హృదయేషు లక్ష్మీ అని మౌనం లో, ధ్యాన మార్గం లో మరో మానవుడు ... 

కర్మ మార్గమే సరి దేవుడూ లేదూ, దెయ్యమో లేదూ అనుకుంటూ మరో మానవుడు !

కొండ దేవర చుట్టూ తా పరికించి చూసేడు !

తాను నెల కొల్పిన ఈ ప్రకృతి ఎంత వైవిధ్యం తో ఉంది ?

అట్లాంటింది ఆ ప్రకృతి ని నెలకొల్పిన తన్ను ఒక్క మార్గం లో నే చేరు కోగలాడా ఈ కోన్ కిస్కా మానవుడు ?

ఏమిటో వీండ్ల వెర్రి !

ప్చ్ ప్చ్ ఈ మానవుడు కి జ్ఞానం ఇచ్చేడు తను . దాన్ని సద్వినియోగం మాత్రమె చేసుకోవోయ్ అని చెప్పి ఉండాల్సింది  నిట్టూర్చేడు . 

దేవేరి ముసి ముసి నవ్వులు నవ్వింది స్వామీ వారిని చూసి - ఆ సమయం లో తనే కదా విష్ణు మాయ యై హాయ్ డియర్ అంటే, స్వామి మాయలో పడి ఆ చెప్పడాన్ని మరిచి పోయేడు !??



చీర్స్ 
జిలేబి 

Saturday, May 23, 2015

లోచనా కమల 'ఆలోచనా '!

లోచనా కమల 'ఆలోచనా '!
 
లోచనా ల లో నించి
భువిని గమనిస్తోంటే
భువి దివి మాయమై
ఆలోచనా సంద్రం లో
ఆరని నీటి బొట్టు
తగుదునమ్మా అనుకుంటూ
ఆవిరి అయి విశాల విశ్వం లో
కరిగి ఆకాశమై పోయింది !
 
 
శుభోదయం
జిలేబి

Monday, May 18, 2015

కదలిక లో నిశ్శబ్దం !

 
కదలిక లో నిశ్శబ్దం !
 
అడుగుల సవ్వడి లో 
గుస గుస లాడుతూ 
నిశ్శబ్దం కరిగి పోతోంది 
 
నిశ్శబ్దాన్ని ఛేదిద్దామని 
ప్రయత్నిస్తే అడుగులు 
గుస గుస లాడేయి !
 
కదలిక లో నిశ్శబ్దం !
నిశ్శబ్దం లో కదలిక ! 
 
ఎవ్వాడు వాడు ఈ 
ప్రబంధకర్త ??
 
 
శుబోదయం 
 
జిలేబి 

Monday, May 11, 2015

లైఫే బిజీ అయి పోయింది ! నో టైం టు బ్లాగ్ !


లైఫే బిజీ అయి పోయింది ! నో టైం టు బ్లాగ్ !

 
చీర్స్ 
జిలేబి 
 

Tuesday, May 5, 2015

డాక్టర్లు జెబ్తే ఆహా ఓహో ! బాబా జీలు చెబ్తే -- అబ్బే అంతా మూఢ నమ్మకముస్మీ !

డాక్టర్లు  జెబ్తే ఆహా  ఓహో ! బాబాలు చెబ్తే -- అబ్బే అంతా మూఢ నమ్మకముస్మీ !




చీర్స్
జిలేబి

Friday, May 1, 2015

శ్యామలాలీ ! 'మేఘ' శ్యామ లాలీ - శ్యామలీయ ముఖాముఖీయం !

శ్యామలాలీ ! 'మేఘ' శ్యామ లాలీ - శ్యామలీయ ముఖాముఖీయం !
 
 

శ్యామలీయం ......

ఈ పేరు వినగా నే వామ్మో మాష్టారు గారి బెత్తం తో వస్తున్నార్రోయ్ అనిపించ క మానదు ! ఎక్కడెక్కడ తెలుగు కి గంటి పడుతుందో అక్కడ ఒక కామెంటు 'వేటు' వీరిది ఉండక మానదు !

ఈ పేరు వినగానే 'మాష్టారు' అని వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే ఆయన మాష్టారు కాదు.......

ఈ పేరు వినగానే తెలుగు పండితుడిని తలచుకున్నట్లుంటుంది.

కానీ ఆయన తెలుగు పండితుడూ కాడు. కేవలం మాతృ భాషపై అభిమానంతో! 

తెలుగుపై పట్టు ని సాధించిన వీరు వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నారు.

నేటి నెటిజెనులకు తెలుగులో తప్పులను సవరించాలన్నా, సలహాలివ్వాలన్నా ముందుగా గుర్తుకువచ్చే పేరు శ్యామలీయం గారిదే.

అనేక విషయాలపై పట్టున్న శ్యామలీయం గారిని ' ప్రజ ' వివిధ ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వివిధ అంశాలపై  తాడిగడప శ్యామలరావు గారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.(కొండల రావు)

పూర్తి గా 




http://praja.palleprapancham.in/2015/04/blog-post_37.html?showComment=1430323537014#c2587559448091242776
(తాడిగడప శ్యామలరావు గారు)

శుభాకాంక్షల తో

చీర్స్
జిలేబి