Wednesday, June 3, 2015

గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

గుండు జ్ఞానము - భాగము రెండు - కుంభ కోణము లంబ కోణము లన నేమి ?

ఈ గుండు జ్ఞానము గురించి టపా కట్టిన వేళా విశేషము ఎట్టిదనిన అది గుండులా, గుమ్మడి కాయలా డమాల్ డమాల్ అని పేలినది .

ఆ విషయము పై కడుంగడు ఆనందము తో ఆ హా గుండు జ్ఞానము ఇంత గొప్పదా ఇన్ని కామింటులు వచ్చినవా అను ఆనంద పరవశము తో జిలేబి నాట్యము చేయ మొదలు పెట్టినదో లేదో అంత లో మరో దుమారం లేచినది . గుమ్మడి కాయ దొంగ కథ లాగా భుజాలు తడుముకుని తమ పై ఈ జిలేబి టపా అత్యాచారము గావించినది అను సందేహము లేచు వరకు దాని ప్రాబల్యము ప్రబలినది . హత విధీ ! గుండు మహాత్యమము ఇంత గుండా తి గుండైనదా అని दांतों पर उंगली दबायी !

అంత లో మరో విషయము అడిగినారు బ్లాగోదరులు - శ్రీ మాన్ కష్టే  ఫలే శర్మ గారు అనబడు చిర్రావూరి భాస్కర (ఇదియిను అనగా సూరీడున్నూ గుండె సుమీ !) శర్మ గారు !

"ఈ గుండు టపాలో కుట్ర కోణం ఏదైనా ఉన్నదా అని .  (భాస్కరుడు అనగా ఎవరు ? SUN ! స్ కిన్నూ ఎన్ కిన్నూ మధ్య నీ లో ని ఐ ని తొలగించి యు అనే పరతత్వాన్ని గ్రహించిన మీరు భాస్కరులు అగుదురు ! )

లేదు ఈ టపా లో కుంభ కోణము మాత్రమె ఉన్నదని జిలేబి అంటే, కుంభకోణము లంబ కోణము లన నేమి వాటిని వివరించుడీ అని శర్మ గారు కోరిన కోర్కె ని మరువ లేక - వారి చేత ప్రశ్నలు పెట్టి టపాలు కట్టించిన సందర్భములు గుర్తు కొచ్చి సరే పోనీ వారి ఆశ కూడ ఎందుకు కాదన కూడదను సదుద్దేశము తో ఈ టపా మొదలు పెట్టినాను .

చదువరీ  చదువుటకు మునుపు ముఖ్య గమనిక ! ఇది తెలంగాణా కి గుండున్న వారి కి సంబంధించిన విషయము గాదు కావున గుమ్మడి కాయ కథ వోలె ఏదియును తడుము కొనరాదు . ప్రాంతీయ భాషాభి మానముల్ కట్టి పెట్టి పూని ఏదైనను తెలుగునందు టపా కట్ట వోయ్ అని గురజాడ వారన్నారని భోగం రాజు సీతారామయ్య వారి ఉవాచ !

కుంభము అనగా బానె . బానె అనగా అది ఏదియో ఒక విధమైన మూర్తి. మూర్తీ అనగా ఒక రూపము గలది.

కుంభము ను కుండ అని కూడా అని అందురు. కుండ అనగా మీకు 'మానవా ! నీవు పాత కుండవు ! నేను ఉత్త ముండను అను ప్రఖ్యాత వాక్యము గుర్తు కొచ్చిన దీని లో జిలేబి గుండు ప్రమేయము ఏమియును లేదు ! అదియే కుంభ కోణ విద్యా రహస్యము !

ఉప ని 'ఖత్' లో ఏమని చెప్పినారు ? ఘటా కాశం - కుండలో ఉన్న ఆకాశం ఆత్మ అయితే , మహాకాశం పరమాత్మ ! ఘటాకాశం మహాకాశ ఇవ ఆత్మానం పరాత్మని !
అంటే కుంభము ని పగుల గొట్టిన ఒకటే ఆకాశం ! కుండ 'కోన' అయి ఉన్నంతవరకు వేర్వేరు 'ஆகாயம் !

ఇక లంబ కోణము అన నేమి !

లంబోదర లకుమికరా అను పద గీతి ని మీరు వినియె ఉందురు .

అటులే త్రికోణ మితి శాస్త్ర పురాణం లో రెండు గుండైన చుక్కల మద్య అతి స్వల్ప దూరం ఒక సరళ రేఖ అని చెప్ప బడి ఉన్నది

అనగా ఈ సరళ రేఖ ఒక లంబము .

ఈ కుండ లో నుండు ఆకాశ మునకున్ను ఆ పై నున్న ఆకాశామునకును సరళ రేఖ అనబడు లంబ కోణము shortest distance !

కావున లంబ కోణము యొక్క మహాత్మ్యము ఎట్టి దనిన లంబ కోణము లో పయనము గావించిన ఈ గుప్పెడు మనసు ఆ విశాల హృదయము లో ఐక్య మగును !

గుండు డామ్మని పగిలి కపాల మోక్షము గలిగిన ఆ హా ఏమి స్వామీ వారి మహాత్మ్యము అని జనములు పొగిడేదరు !

ఇట్లు ఈ కుంభ కోణము లంబ కోణము లను తెలుసు కున్న మానవుని కి గుండు జ్ఞానము పరి పూర్ణము గా 'కిట్టును' !

ఇంతటి తో ఈ గుండు జ్ఞానము భాగము రెండు అనబడు కుంభస్య లంబమేవ ఆకాశం లభ్యతి అనబడు విద్యా రహస్యము పరి సమాప్తము !

ఈ జ్ఞానము మీకున్నూ మెండు గా కలుంగ వలె నను గుండు జిలేబీయము తో ఇవ్వాళ్టి కథా కాలక్షేపము సంపూర్తి !

ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ ఓం జిలెబిహ్ !!

జిలేబి
 

4 comments:

  1. ఘటాకాశం, మహాకాశం వేరు వేరా?
    లంబకోణంలో ఊర్ధ్వంగా ప్రయాణిస్తే బ్రహ్మరంధ్ర విఛ్ఛిత్తి జరిగితే, ఘటం భిన్నమైతే, ఘాటాకాశం మహాకాశం లో కలుస్తుందా? కలిసినట్టనిపిస్తుందా? వివరించగలరు.

    ReplyDelete
  2. శర్మ గారు,

    ఘటాకాశం మహాకాశం 'వేరు' వేరు కాదు ! కాని verily వేరు కుండ ఉన్నంత దాకా !
    ఘటాకాశం మహాకాశం లో కలవడం కన్నా మహాకాశం ఘటాకాశం లో కలవడం మిన్న !

    టీ కప్పులో తుఫాను !

    When the Ocean comes into the tea cup దాని సొబగు వేరు !

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  3. ఘటమనగా గుండు. ఆకాశమనగా ఏమీ లేనిది. అంటే బుర్రలో శూన్యము అని అర్ధం. దీనికి ఇంకా ఎక్కువ సమాధానం కావాలంటే ఆంధ్రా వారి కన్యాశుల్కం పుస్తకం చదవాలి. అందులో ఆకాశంబు శూన్యంబు అనిన్నూ గురజాడ అప్పారావు గారు రాసారు. మరి ఆయన పేరులో ఎక్కడా "త" గానీ "తెలంగాణా" కానీ లేదు. చూసుకోగలరు. లేకపొతే మీ అబోరు దక్కదు (ముందో మీకో అబోరు అనేది ఒకటి ఏడిస్తే మాట). జిలేబీగారికింత చిన్న విషయం అర్ధం కాలేదంటే ఇదంతా గుండు డిస్కషన్ వల్ల వచ్చిన శూన్యమేనని మాకునూ (!)తోచుచున్నది.

    [నమస్తే ఘటం సౌజన్యంతో (అనగానేమి మధుర కవి జిలేబీ?)]

    పై ప్రశ్నకి సమాధానం: రేప్పొద్దున్న ఏదైనా అయితే గియ్తే నా మీదకి కేసు రాకుండా ఉండడానికి. విషం జల్లుతూ వచ్చి కామెంటండి అంటే ఏమౌతుంది? మిగిలేది గుండే. శ్లేష్మంలో పడ్డ ఈగలా తన్నుకుంటూ మీరు చిరకాలం బతికెదరు గాక. గుండు భూయాత్.

    ReplyDelete
  4. నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వు

    ReplyDelete