నేను ఒక్క సారి సంకల్పించు కుంటే వెనుదిరగను బులెట్ లా దూసుకెళ్తా :) జిలేబి
ఆంధ్ర బ్లేడు జిలేబి ప్రత్యెక వార్తా బ్యూరో :
జాంగ్రీ జిల్లా జిలేబి పేట మంగళ వారం
జిలేబి బ్లాగు ఆంధ్రప్రదేశ్ హక్కు అని, తొలి టపా లోనే బ్లాగ్ వీక్షకులు సెహభేషు అని మెచ్చు కుని ప్రోత్సహించేరని జిలేబి వెల్లడించారు.
ప్రాధాన్యత క్రమంలో ఇక మీదట అన్ని టపాలు కాపీ పేష్టు చేసి అయినా పూర్తి చేస్తామని ఆవిడ స్పష్టం చేశారు.
జిలేబి వరూధిని బ్లాగు ఏర్పడి దాదాపు ఏడు ఏండ్లు గడుస్తోందని ఆవిడ సందర్భంగా సోమవారం జాంగ్రీ జిల్లా జిలేబి పేట లో నొక్కి వక్కాణించేరు
ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆవిడ మాట్లాడుతూ నేను ఒక్కసారి సంకల్పం చేసుకుంటే వెనుదిరగనని, బుల్లెట్‌లా దూసుకు వెళతానని స్పష్టం చేశారు.
తన బ్లాగు లో కామింటులు కొట్టిన కామింటు రైతులను ఎప్పటికీ మర్చిపోనని, విపక్ష బ్లాగు వాదులు వేడి గా రెచ్చగొట్టినా బ్లాగు రైతులు ధైర్యంగా ముందుకు వచ్చారని జిలేబి కొనియాడారు.
కామింట్లు కొట్టి న బ్లాగు కామింటు దార్ల కు ఆవిడ పాదాభివందనం చేస్తున్నా నని అని మరీ మరీ వంగి వంగి నమస్కారాలు జేస్తూ చెప్పారు.
నన్ను నమ్ముకుని నా బ్లాగు ని చదువుతున్న బ్లాగోదరుల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎట్టి పరిస్థితుల్లో నైనా టపాలు ఫాక్టరీ నించి ఉత్పత్తి చేసి చూపిస్తానని ఆవిడ ఉద్ఘోషించారు.
వరూధిని ని విశ్వబ్లాగు వీధి లో మకుటాయ మానం గా గా తయారు చేస్తానని ఆవిడ స్పష్టం చేశారు.
ఆంధ్ర రాష్ట్రంలో సహజ బ్లాగర్లు పుష్కలంగా ఉన్నారని, వారిని సద్వినియోగం చేసుకుంటే , 2020 నాటికి దేశంలోనే తెలుగు బ్లాగులు నెంబర్ వన్‌గా ఉంటాయని , 2025 నాటికి ప్రప్రపంచంలోనే తెలుగు బ్లాగులు అత్యుత్తమ బ్లాగులు గా నిలుస్తాయని జిలేబి ఆశాభావం వ్యక్తం చేశారు.
శుభోదయం
జిలేబి