నేను ఒక్క సారి సంకల్పించు కుంటే వెనుదిరగను బులెట్ లా దూసుకెళ్తా :) జిలేబి
ఆంధ్ర బ్లేడు జిలేబి ప్రత్యెక వార్తా బ్యూరో :
జాంగ్రీ జిల్లా జిలేబి పేట మంగళ వారం
జిలేబి బ్లాగు ఆంధ్రప్రదేశ్ హక్కు అని, తొలి టపా లోనే బ్లాగ్ వీక్షకులు సెహభేషు అని మెచ్చు కుని ప్రోత్సహించేరని జిలేబి వెల్లడించారు.
ప్రాధాన్యత క్రమంలో ఇక మీదట అన్ని టపాలు కాపీ పేష్టు చేసి అయినా పూర్తి చేస్తామని ఆవిడ స్పష్టం చేశారు.
జిలేబి వరూధిని బ్లాగు ఏర్పడి దాదాపు ఏడు ఏండ్లు గడుస్తోందని ఆవిడ సందర్భంగా సోమవారం జాంగ్రీ జిల్లా జిలేబి పేట లో నొక్కి వక్కాణించేరు
ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆవిడ మాట్లాడుతూ నేను ఒక్కసారి సంకల్పం చేసుకుంటే వెనుదిరగనని, బుల్లెట్‌లా దూసుకు వెళతానని స్పష్టం చేశారు.
తన బ్లాగు లో కామింటులు కొట్టిన కామింటు రైతులను ఎప్పటికీ మర్చిపోనని, విపక్ష బ్లాగు వాదులు వేడి గా రెచ్చగొట్టినా బ్లాగు రైతులు ధైర్యంగా ముందుకు వచ్చారని జిలేబి కొనియాడారు.
కామింట్లు కొట్టి న బ్లాగు కామింటు దార్ల కు ఆవిడ పాదాభివందనం చేస్తున్నా నని అని మరీ మరీ వంగి వంగి నమస్కారాలు జేస్తూ చెప్పారు.
నన్ను నమ్ముకుని నా బ్లాగు ని చదువుతున్న బ్లాగోదరుల నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎట్టి పరిస్థితుల్లో నైనా టపాలు ఫాక్టరీ నించి ఉత్పత్తి చేసి చూపిస్తానని ఆవిడ ఉద్ఘోషించారు.
వరూధిని ని విశ్వబ్లాగు వీధి లో మకుటాయ మానం గా గా తయారు చేస్తానని ఆవిడ స్పష్టం చేశారు.
ఆంధ్ర రాష్ట్రంలో సహజ బ్లాగర్లు పుష్కలంగా ఉన్నారని, వారిని సద్వినియోగం చేసుకుంటే , 2020 నాటికి దేశంలోనే తెలుగు బ్లాగులు నెంబర్ వన్‌గా ఉంటాయని , 2025 నాటికి ప్రప్రపంచంలోనే తెలుగు బ్లాగులు అత్యుత్తమ బ్లాగులు గా నిలుస్తాయని జిలేబి ఆశాభావం వ్యక్తం చేశారు.
శుభోదయం
జిలేబి
శుభాకాంక్షలు.
ReplyDeleteకామెంట్ వ్రాయడానికి మాకీ ఎంట్రన్స్ టెస్టులేమిటి జిలేబీ గారు? సుషీలు, స్టీక్ ల గురించి నాకు తెలియదు తల్లీ.
This comment has been removed by the author.
ReplyDeleteకం. మొన్నేమో కట్టేస్తా
ReplyDeleteనన్నారే బ్లాగుకొట్టు అన్నంతపనీ
తిన్నగ చేస్తారేమో నను
కున్నామే హాస్యనీతి కుశలజిలేబీ
కం. ఈ రోజేమో లెక్చర్
వీరాలాపాలతోడ వినిపించారే
ఈ రైతు కంద శతకం
మీరడిగిన హాస్యసస్యమేను జిలేబీ
మహా సంకల్పం. కాపీరైట్‍కు ఐదేండ్లు ముందే తెలుగు బ్లాగులంతగా వృద్ధి చెందుతాయన్న మాట :)
ReplyDelete:))
ReplyDeleteఈ టపా కి పెట్టిన పేరు తెలుగు సినిమాల్లో హీరో గారి "పంచ్ డయలాగ్" లా ఉంది :) సినిమాలకి సంభాషణలు వ్రాయటానికి ప్రయత్నించరాదా?
ReplyDeleteకామింట్లు కొట్టి న బ్లాగు కామింటు దార్ల కు ఆవిడ పాదాభివందనం చేస్తున్నా నని అని మరీ మరీ వంగి వంగి నమస్కారాలు జేస్తూ చెప్పారు. ..paadabhivandanam vangi maree cheyaaligaa.. mallee mallee vangaddani cheppandi vaariki....super andee.. happy anniversary....keep posting..
ReplyDelete"కామింట్లు కొట్టి న బ్లాగు కామింటు దార్ల కు ఆవిడ పాదాభివందనం చేస్తున్నా నని అని మరీ మరీ వంగి వంగి నమస్కారాలు జేస్తూ చెప్పారు"
ReplyDeleteమీ అభిమానానికి పొంగి పోయాము. కాకపొతే మీరు పెద్దవారు మాబోటి వాళ్లకు దండం పెడితే వయోక్షీణం. కామెంటుదార్లను ఇలా చంపుకుంటే మీకే నష్టం సుమండీ!
nice...
ReplyDeleteTelugu Typing