హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)
అక్కడక్కడా చెదురు ముదురు గా తెలుగు బ్లాగు లోకం లో టపాలు రాద్దామని, వీలైతే తమకు తెలిసిన దానిని నలుగురుకి షేర్ చేసుకుందామని గట్రా 'సద్భావన' తో ఉన్న బ్లాగు మణులు, మాన్యులు బితుకు బితుకు మని నేటి టపా రాద్దామా వద్దా అని డైలమా లో పడి సరే పోనీ ఈ దురద వదిలితే పోయేదా ఏదో ఒకటి రాద్దా మని నిర్ణయించు కని కీ బోర్డ్ పట్టేరు , టపా రాసి హమ్మయ్యా ఇవ్వాల్టికి మనం రాసే సాం - ఏడుకొండల వాడా వెంకట రమణా నా టపాలు 'హ్యాక్' కాకుండా చూడు సామీ అంటూ పెరుమాళ్ళ కి నమస్కారం పెట్టి పబ్లిష్ బటన్ నొక్కేరు .
అంతలో బ్లాగు భూతాలూ , పెను భూతాలూ, లిటిల్ రాస్కేల్స్, బిగ్ 'భ్రాతర్స్' , టైనీ 'త్విట్టర్స్' ఆవులింతలు బెట్టి ముసుగు తన్ని నిదుర పోదామా లేక బ్లాగు లోకం మీద పడి కస మిస కామింట్ల తో కుదేద్దామా అని మళ్ళీ ముసుగులు పెట్టు కునేయి .
అంతలో వాళ్ళ బాస్ అందర్నీ 'జర నిద్ర లేవండహే' అని అదమాయించి తానూ టపాలకి కామెంట్లు బరకడానికి సంసిద్ధురా లయ్యింది.
అగ్రిగేటర్ ల లో కామింట్ల వరదలు తయారయ్యేయి .
కుక్కా !
నక్కా !
నంగ నాచి
ఓసీ శూర్పణఖ !
బద్మాష్ !
ఆంద్రోళ్ళ ఆగడాలు
తెలంగాణా తిట్లు
నువ్వా నేనా
సై అంటే సై
బ్లాగు భూతాలూ, రాస్కేల్స్ గుంభన గా నవ్వు కునేయి . టపాలు రాస్తారర్రా :) చూడండి మీ టపాల కన్నా పెద్ద పెద్ద కామింట్లు పెడతాం అంటూ 'బద్మాష్' అంటూ అరిచేయి .
వాళ్ళ బాస్ అందరికి ఆర్డర్ పడే సింది - ఒరేయ్ బడుద్దాయిలు, అందరూ ఓ పదో పరకో పేర్లు పెట్టు కొండర్రా మీలో కొందరు పొగుడుతూ రాయాలి . మరి కొందరు తెగుడుతూ రాయాలి . మరి కొందరు బండ 'బూట్ల' తో తల తన్నేలా కామింటా లి .
సై అంటే సై అనేయి కామింటు కామినులు, భూత ప్రేత పిశాచాలు :)
హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులో కామేంటోళ్ళం టే నే నాకు భయ్యం :)
శుభోదయం
చీర్స్
జిలేబి