Friday, August 21, 2015

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !
 
శ్రీ మన్మధ నామ సవంత్సరే
దక్షిణాయనే వర్ష ఋతౌ
శ్రావణ మాసే శుక్ల పక్షే

....


విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .

మీ మీ మోబైళ్ళ తో  పద్మావతీ మంగ తాయారు సమేత  స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .

కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)


ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;

The current trend is "selfie" mode :) Mod "I" ndia :)


స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :

స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని  శుభకరం గా మలచు కోండి .

మీకు మొబైలు లేదా ? no problem.

పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి  పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .

అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .

ఆఫర్ ఆఫర్ ఆఫర్ !

బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది

ఆలశించిన ఆశా భంగం. భలే మంచి చౌక బేరం

రారండోయ్ రారండోయ్
పిల్లా జెల్లా రారండోయ్ !


శుభోదయం
చీర్స్
జిలేబి
(Mod "I" ndia )

9 comments:

  1. ఆహా, మిమ్మల్ని దేవాదాయ శాఖ కి Chief Financial Adviser గా నియమించాలండీ :)

    ReplyDelete
    Replies
    1. Wonderful idea.

      Idea changes lives :)

      Delete

    2. ధన్య వాదాలండీ విన్న కోట వారు జిలేబి ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరిణి గా చేసి నందులకు :)

      చేసిన ఒక్క రోజులోనే మార్కెట్టు డమాల్ :)

      చీర్స్
      జిలేబి

      Delete
  2. idea.. sure this package may be implemented by TTD :)

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలు కష్టే ఫలే వారు !

      టీ టీ డీ వారు ఈ స్కీముని పెడితే దానికి జిలేబి కి క్రెడిట్ ఇస్తా రంటారా ?

      జిలేబి

      Delete
  3. స్వామివారితో సెల్ఫీ దిగాలని వచ్చే భక్తులకు గమనిక:
    నిర్ధిష్టరుసుము చెల్లించి, సంప్రదాయవస్త్రధారణలో గుండ్లు కొట్టించుకొని, పెద్దపెద్ద నామాలు పెట్టించుకొని మరీ రావలెను.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం వారు,

      గుండు కొట్టించు కొని , నామాలు పెట్టు కుని , నమో నమో అంటూ రావలెను :)

      జిలేబి

      Delete
  4. ఆహా! ఏమి ఈ జిలేబి రచనా చాతుర్యము?
    ఫేస్‌బుక్ పోస్టునే బ్లాగులో టపాగా మలచితిరి కదా!

    ఎంత మాట, ఎంత మాట. ఇది కాపి టపాయే అందునా,
    .....
    ...

    ..మన బ్లాగులోకము ఏనాడో కాపీ పేస్టుమయమైనది.

    ReplyDelete
    Replies

    1. ఆహా బోనగిరి వారు,

      ఆ ఫేసు బుక్కు లింకు అందిద్దురూ :) చూచి తరించెదము :)

      జిలేబి

      Delete