స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో!!!
స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో బ్లాగు వేణీ వేణులు గొంతెత్తి ఓహో ఆహా అని స్వామీ వారిని కొనియాడు తూంటే స్వామీజీ వారు తమ బవిరి గడ్డం తడుము కుంటూ తమ భక్త బ్లాగు జనవాహిని ఆసాంతం గమనించి , తలయాడించి తమ సంతోషాన్ని వెలుబరచి చిరు నగవు చిందించేరు .
బ్లాగు భక్త జనవాహిని 'ఆనంద' డోలికలో తూగు లాడేరు .
భక్తులారా ! స్వామీ వారు గొంతు సవరించు కునేరు .
వెంటనే జనవాహిని స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ వారికి జయ్ అంటూ మరో మారు గళం ఎత్తింది .
స్వామీ వారు చేయి ఊపేరు - జనవాహిని నిశ్శబ్దం గా స్వామీ వారి వైపు ఆతురత తో చూసింది .
బ్లాగ్ భక్తులారా ! మీకు ఇవ్వాళ నేను జ్ఞాన బోధ చేయడానికి ఉపక్రమిస్తున్నా . చెప్పేరు స్వామీ వారు .
"భగవంతుడు భక్త జన మందారుడు అంటారు కదా ! అసలు ఆ భగమంతుడు కి భక్తుడి కి అసలు సంబంధం కలిగించే వారు ఎవరు " స్వామీ వారు ప్రశ్నించి నిదానించేరు .
వెంట నే బ్లాగు భక్తుల గుసగుసలు, రుస రుసలు మొదలయ్యేయి . టప టపా చేతులు తట్టేయి . స్వామీ వారు ముదావహం గా తలూపేరు .
బ్లాగ్ 'భక్తులూ' కానివ్వండి ఇక మీ కామింటులు ! స్వామీ వారు చేయి పై కెత్తి గాలి లో ఊపేరు .
భక్తులు తమ తమ లేపుటాపు లను తెరచి తాపము తో కామింట డటం మొదలెట్టేరు .....
అవి ఎట్లన .....
చీర్స్
జిలేబి
అదేవిటండి, స్వామీజీలకి దణ్ణవెట్టుకుని తరించాలి గాని కూర్చుని చర్చించే సాహసానికి పూనుకోవడమే !! అపచారం కదా.
ReplyDeleteబహుశః ఇదియే చర్చాసేవ కానోపును.
Deleteస్వామీజీవారు కూడా మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వస్వరూపతేజోవిరాజితులు అనుకుంటాను. జిలేబీగారే ఎఱుకపరచాలి వివరం.
అంబికాదర్బార్ బత్తి :)
ReplyDeleteఅహం భో అభివాదయే చిచ్చరపిడుగు నామ్నా ఆషాఢభూతిః
ReplyDeleteకధం పశ్యామి జ్ఞానేన తుదజ్ఞానం ప్రవక్ష్యామి స పరిప్రశ్నయాః