మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!) ఇది సరిగ్గా ఓ యాభై నాలుగు సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు. సో , మీ కిదే , యాభై నాలుగు వసంతాల గ్రీటింగ్స్! మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయులై మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.
ఈ సందర్భం గా మా గురువులుంగారు శ్రీ శ్రీ పాద వారి చలువ గా మీ వడియాల టపా స్ఫూర్తి గా 'కండ' కావ్యం సమర్పయామి :)
శ్రీ కష్టే ఫలే బ్లాగు లోని వడియాల టపా ఈ 'కండ' కావ్యానికి స్పూర్తి ! ****
పై బడి తెలుగు బ్లాగు లోకపు కబుర్లు జనవాహిని లోకి వెళతాయో లేదో కూడా తెలియదు ! (ఇది మరో క్లోజేడ్ సిర్క్యూట్ జాలమేమో అన్న అనుమానం కూడాను !:)
అయినా చెప్పాలని అనిపించింది కాబట్టి !
ఈ మధ్య మీరు నిర్వహించిన లోక్ నాయక్ పురస్కార సభా కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో చూడడం కాకతాళీయం గా జరిగింది !
పురస్కారాన్ని మహా సహస్రావధాని ధారణా బ్రహ్మ రాక్షస శ్రీ గరికిపాటి నరసింహా రావు వారికివ్వడం ముదావహం !
శ్రీ గరికిపాటి వారు ఆ సభలో చేసిన ప్రసంగం వారి అమోఘ ప్రతిభా పాటవానికి మచ్చు తునక !
సరే , అంతా బాగున్నది ఈ పాటి దానికి విన్నపాలు ఏమిటీ అంటారా ? అవధరించండి !
ఒక పురస్కార గ్రహీత ని పిలిచి అదిన్నూ శ్రీ గరికిపాటి లాంటి సహస్రావధాని వారిని పిలిచి , వారిచే ఒకటిన్నర గంట సేపు బాటు ప్రసంగం చేయించి వారు నిలబడి మంచి నీళ్ళు కూడా తాగ నిచ్చే వీలు లేకుండా మాట లాడ జేయించడం ఎంతవరకు సబబు ?
సభా మర్యాద గా వారిని సుఖాసీనుల జేసి , వారికి తగు మర్యాద ఇచ్చి, మీరందరు కూడా హాయిగా వారి ముందు కూర్చుని ప్రసంగాన్ని ఆస్వాదించి ఉంటే , చూసి ఉంటే ఎంత బాగుండేది ? ఈ సహృద్భావం చూపడం సభా మర్యాద గాదా ?
ఒక్క సారి ఆలోచించి చూడండి !
శ్రీ గరికి పాటి వారు వారు మంచి నీరు తాగడానికై సైగ చేస్తే , అడిగితే, ఆ తెచ్చిన వ్యక్తి మంచి నీళ్ళు వెనుక కుర్చీ పై పెట్టేసి వారు తాగడానికి సౌకర్యం కలిగించ కుండా చేయడం ఎంత వరకు సబబు ?
వారు మాటల మధ్యలో ఖచ్చితం గా నీరు త్రాగడం ఎన్నో సభల్లో మనం చూడ వచ్చు ; మాట్లాడే వారికది అవసరం . ఆ వేగం లో మాట్లాడే టప్పుడు గొంతుక పిడచకట్టుకు పోవడం సర్వ సాధారణం !
అట్లాంటి ది మీరు సన్మానానికి పిలిచి వారిని ఇట్లా చెమటలు కక్కించే లా వారి చేత నిలబడి ప్రసంగం చేయించడం ఎంత వరకు సబబు ? *ఈ క్రింది వీడియో లో ప్రస్ఫుటం గా స్వేదం తో తడిసిన శ్రీ గరికి పాటి వారి క్లిప్పింగ్ చూడ వచ్చు );
ఈ టపా వ్రాసినందు వల్ల అయిపోయిన కార్య క్రమానికి జరిగే లాభం ఏమీ లేదు అని తెలుసు ,అయినా వ్రాస్తున్నది ఎందు కంటే , రాబోయే ఉత్సవాల లో నైనా సన్మాన గ్రహీత లకు ఉచిత స్థానాన్ని ఇస్తారనే నమ్మకం తో !.
మీరు పిలిచే సన్మాన గ్రహీత లు ఎట్లాగూ అరవై వసంతం దరిదాపుల్లోని వారే ఉంటారు ఖచ్చితం ఇది మన సంప్రదాయం పాటించండి !
ఇట్లాంటి సుదీర్ఘ సంభాషణ ఉన్నప్పుడు మీరు కూడా హాయిగా వారి ముందు వైపు కూర్చుని ఆస్వాదించండి వారి పాండిత్యాన్ని !
వేదిక మీద నిలబడి మాట్లాడే వారికి వీలుగా మంచి నీటి కమండలం కాకున్నా కనీసం వాటర్ బాటిల్ నైనా వీలుగా పెట్టండి !
ఒక సభలో గరికిపాటి లాంటి వారు మంచి నీళ్ళు తాగకుండా ఒకటిన్నర గంట సేపు వారి ధాటి కి మాట్లాడటం అంత సుళువైన విషయం కాదు !
నాకు తెలిసినంత వరకు యిదే అట్లాంటి వారి మొదటి సభ అయి ఉంటుంది అనుకుంటా ! ఆ క్రెడిట్ యార్ల గడ్డ వారికే దక్కే ! జేకే !
కార్య నిర్వాహకులు గా ఉన్న మీరు పని ఒత్తిడి లో మరవటం సహజమే !
అయినా కనీసం రాబోయే మీ సభ ల లో నైనా ఈ కనీస సభా మర్యాద పురస్కార గ్రహీత ల బాగోగులు వేదిక పై చూడ వలసినది గా విన్నపాలు !
సన్మాన గ్రహీత లు నిలబడే మాట్లాడా లనుకునే పక్షం లో కనీసం వారి దగ్గిర వీలుగా త్రాగడానికి మంచి నీళ్ళైనా ఉంచండి ; కనీస మర్యాద ఇదే వారికి మనమివ్వడం.
శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం ! లోక్ నాయక్ పురస్కార గ్రహీత గా వారి ప్రసంగం క్రింది లింక్ లో ఒక గంట పది నిముషాల దాపుల్లో నించి మొదలవు తుంది ! వీలు చేసుకుని వినండి !
శ్రీ గరికిపాటి వారు తమ బట్ట తల మీద చెణుకులు ప్రతి సభ లోనూ వేస్తూంటారు ! అట్లాంటి వారి బట్ట తల మీద ఆణిముత్యాల్లాంటి స్వేద బిందువులను తెప్పించిన యార్లగడ్డ వారు మరెంత గొప్ప వారు :)
క్రింది యు ట్యూబ్ లింక్ లో శ్రీ గరికిపాటి వారి ప్రసంగం సుమారు ఒక గంటా పది నిముషాల ప్రాంతం నించి మొదలవు తుంది ! హాట్సాఫ్ టు శ్రీ గరికిపాటి !
మధుమేహం ( షుగర్ )
-
*నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న
కధనం...,, *
*మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యా...
విన్నపం
-
మిత్రులందరికి. ఈ బ్లాగులో పునః ప్రచురణ మానివేశాను. నా ఇల్లాలు 06.09.2018
వ తేదీన స్వర్గస్థురాలయింది. ఆమె జ్ఞాపకార్ధం నా బ్లాగు టపాలను ఈ బుక్కులుగా
ప్రచుర...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు - 2- పిల్లలూ దయ చూపండి !
-
శర్మ కాలక్షేపం కబుర్లు
Posted on సెప్టెంబర్ 24, 2011
*పిల్లలూ దయచూపండి*
తల్లి తండ్రులమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్...
రావిశాస్త్రి చేసిన మేలు
-
"నువ్వు కథలేమన్నా రాశావా?"
"లేదు."
"రాయొచ్చుగా?"
నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి
దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత...