హమ్మయ్య ! నారదుల వారి పని ముగిసింది :)
యిది చాలా సీరియస్ టపా .
గుండె దిటవు చేసుకుని చదవవలె ! జేకే !
నారదుల వారి ఎట్లాంటి కార్య'కళా' 'పాము' లకున్నూ కొంత ఉపోద్ఘాతం ఉండాలి ; అంటే బ్యాక్ డ్రాప్ అన్న మాట !
క్రితం సంవత్సరం డిసెంబర్ నెల లో బ్లాగు లోకం లో ఒక అన్నానిమస్సు జిలేబి ని కస్సు మనటం తో (చాలా సున్నితం గా :) జిలేబి కూడా కస్సు మంది !
దెబ్బకు టా ! బ్లాగు లోకం ఉలిక్కి పడింది ! జిలేబి యిట్లా నువ్వు దేవ భాష మాట్లాడటం బాగో లేదు అని ప్రొటెస్ట్ చేసింది !
మా గురువులుంగారేమో ఫత్వా జారీ చేసారు - జిలేబి కి నా బ్లాగు లో కామింట డ టానికి నో ఎంట్రీ ఫార్ ఒన్ ఇయర్ !
అంతే గాకుండా ఆయన రామ నామ జపం లో మునిగి పోయారు !
అంతా మన మంచికే ! ఎవరి కో దెబ్బ కొడితే పండు ఎక్కడో రాలింది ! జిలేబి దెబ్బ కి గురుని భక్తి ప్రపత్తులు పెరిగేయి అదే పది వేలు అని నారదాయ నమః అనుకున్నా !
అప్పట్లో వారు పద్యాల మీద టపాలు పెట్టడం తో ఇదేదో బాగుందే పద్యాలు (హరి బాబు గారి మాటల్లో పజ్జ్యాలు - పిజ్జ్జాలనే పజ్జ్యాలన్నారు కామోసు !) అల్లటం నేర్చు కుందా మని వారి బ్లాగు ఫాలో అయిపోతూ వారి రామ నామ సంకీర్త నని ఆస్వాదిస్తో , పద్యాల పోటీ టపా (జిలేబి కెప్పుడూ సెటైర్ / పేరడీ లైకింగు కాబట్టి ఓ డబల్ మోస్తరు పేరడీ కామిడీ బ్లాగ్జనాల తల తినే టపా లని పెట్టేస్తో ) పెట్టుకుంటూ స్వయం పాకం లా పద్యాలతో కుస్తీ పడుతో మొత్తం మీద కంది వారి బ్లాగు లోకి జిలేబి కాలు పెట్టడటం వరకు జరిగి పోయింది ! (హమ్మయ్య ఐరన్ లెగ్గు కాదను కుంటా :) జేకే !)
ఇట్లా సజావు గా పోతున్నవి దినములు, అహో రాత్రములు (రోజులు అన్నవి గ్రామ్యం ; మేం వాడం : మేమిప్పుడు గ్రాంధికాల నే నెమరు వేస్తాం :) ) పద్యాలోయ్ పద్యాలు అంటూ బ్లాగ్లోకం హోరెత్తి టారెత్తి పోయే స్టేజీ కి వచ్చేసే టట్టు అయిపోయే ! (ఈ మధ్య ఒక కామింటు దారుడు మండి, యిదే మండి బ్లాగు లోకమంతా పద్యాల హోరు తో నిండి పోయింది అని వాపోయాడు గూడా :) పజ్జ్యాలా మజాకా !
అప్పటి దాకా రామ నామ జపం చేసుకుంటున్న అయ్య వారు సడెన్ గా మే నెల లో దారి తప్పారు ! మళ్ళీ కామింటు లోకం లో కి వచ్చి పనికి మాలిన రాజ కీయాల పై చర్చల లో పాలు గొంటూ మొట్టి కాయలు తినడం మొద లేట్టేరు !తమ బాలాగు లో రాముల వారూ గాయబ్ !
ఔరా ! విధి నెవరిని విడిచి పెట్టింది అనుకోకుండా ఉండ లేక పోయా ! సజావు గా రామ నామ జపం చేసు కుంటూ వున్న పెద్దాయన ఇట్లా రాజకీయ నాన్సెన్స్ కామింటు ల గో ల లో గురువు గారు బుక్కయి పోయెనే అనుకుంటూ సరే అనుకుంటూ కొంత హింటిచ్చా !
మే నెల ఇరవై తారీఖు !
ZilebiMay 20, 2016, 9:21:00 AM
రామ రామ రామ యని నారాముగ కవి
యుండె! దారి విడిచెనుగ ! యుద్ధ భూమి
యనగ పాలిటిక్సును నాడి యతను బోయె
కాల మహిమ యనగ నిది కద జిలేబి !
జిలేబి
౦౦౦
శిష్యులు దారి తప్పితే గురువు వారిని దారిన బెడతారు ! అదే గురువులు దారి తప్పితే ఏమి చేయాలి ? శిష్యులే దారిన బెట్టాలి గదా ! అదిన్నూ ప్రథమ శిష్యురాలు జిలేబి ! (జిలేబి శతకాన్ని గూడా గురువులుంగారు ఆవిష్కరించి ఉన్నారు ఆ పాటి అయినా వారి మీద మక్కువ ఉండవలె గదా !)
సో, అప్పటి నించి వారి వెంబడి వేటాడటం మొదలెట్టా ! హోరెత్తేను మరో మారు బ్లాగు లోకం. జిలేబి కి నానా తిట్లూ దీవెనలూ దక్కేయి ! అయినా వదిలి పెడతా మా ? హూ ! హూ ! నలుగురు తిట్టి పోదురు గాని నాకేంటి భయ్యం ఓ జిలేబి యమ్మా అనుకుంటూ చలో ఆగే కదం కదం (కందం కందం) మిలాకే అనుకుంటూ వెళ్ళటం మొదలెట్టా !
మధ్య లో జూన్ రెండన తారీఖు , తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని అంత గా తిట్టు కోవాల్సిన పని ఒక రామ భక్తునికి ఉందా ? తారీఫు తో మళ్ళీ మరో డోసు :) యతో కర్మః తతో ఫలః ! తారీఫు కి డోసు పడ కుండా కర్మ కి భోగం తప్పు తుందా ! మరో మారో జిలేబి కి డోసులు పడేయి దండి గా !
అయినా వదులుతా మా ! హూ హూ ! చలో కందం కందం మిలాకే హైలేసా !
నారదుల వారి పనికి ఆ శ్రీ మన్నారాయణుడే వచ్చి నట్టు దేవుడు / దేముడు సంభాషణ వచ్చె ! హా హా ! యిది కదా రాముల వారి మహిమ అనుకోకుండా ఉండ లేక పోయా ! దేముడు బాబాయ్ కలలో కనబడి బంతాట ఆడేసు కో మన్నాడు అంటూ దేముడు బాబాయ్ టపా వచ్చెను ! ఈ టపా జూలై తొమ్మిది న వచ్చింది ! మరో మారు దుమారం !
మరో దుమారం కంది వారి టపాలో సౌజన్యుడు సాధువా కాదా అన్నది :) సౌజన్యుడు సాధువు కాకుంటే దుర్జనుండు సాధువ వుతాడా అనుకుంటూ కొంత పడతాదనం, పదభిఘావళి జేయటం టాప్ పీక్ (టాపీక్ :) అయి కూర్చుంది !
ఇట్లా వీర విహారం గావిస్తో పిల్ల గాలి ఈదురు గాలి గా మారటం తో , మొన్న జూలై ఇరవై గురుపూర్ణిమ నాడు మా గురువులుం గారు మళ్ళీ రామ జపం కి మారేస్తా అనటం తో జిలేబి మహాదానంద పడి పోయింది !
పవులో కొల్హో తన నవల 'The Alchemist' లో ఒక చోట "And, when you want something , all the universe conspires in helping you to achieve it" అంటాడు !
సో రెండు మూడు రోజులుగా చూసినాక ఈ టపా స్వస్తి వాచకం !
గురువులుంగారిని రామ నామ జపమను బడు బృహత్తర కార్య క్రమానికి త్రిప్పిన బ్లాగోదర బ్లాగూదరిణీ లందరికీ నమో వాకాలు ! అందులో కొందరు తమకు తెలియ కుండా నే ( వెనక్కి తిరిగి చూసు కుంటే !) నిర్వ హించి న పాత్రలు !
మబ్బుల మాటున దాక్కుని చల్లని కాలాన్ని ఇచ్చిన మా కష్టే ఫలే భాస్కరులు ! (మళ్ళీ మబ్బుల మాటి నించి బయటకు ఎప్పడు వస్తున్నారండీ :)
కామింట్ కింగ్ - విన్న కోట నరసింహా రావు (వీరు నారదుల వారి రైట్ హ్యాండ్ వీరికి గురువులుంగారి బ్లాగు లో కూడా ఎక్సెస్ ఉంది కాబట్టి తమకు తగు రీతి లో అక్కడ కొంత నారదాయ నమః అంటూ కార్యానికి కొంత ఊపు నిచ్చారు :) (వీరి బ్లాగు కోసం నేను వెతుకుతా నే ఉండా ! కనబడ నంటోందిస్మీ :)
మా లక్కాకుల రాజావారు - వీరు దేముడు వెర్సస్ దేవుడు లో ప్రవేశించి రాముని / రావణు ని తెచ్చి సెహ భేషు గా గురువులుం గారి ని తమ స్వకార్య నిర్వహణ లో త్రిప్ప టానికి పూనిక నిచ్చారు .
అలాగే హరి బాబు గారు ( వీరు మహా భాష్య కారులు రెండు పదాలిస్తే దాంట్లోంచి వేద సారాన్ని చటుక్కు లాక్కోచేస్తారు :) దేముడు బాబాయ్ ! హరి నస నాథుడే :)
భండారు వారు ! వీరి టపాలో మరో పెద్ద లక్ష్మీ పటాకా ! అనానిమస్సు ల హవా ! భండారు వారు అనానిమస్సుల హవేల్దారు కామోసు :) జేకే !
క్షీరగంగ శ్రీధర్ గారు - వీరు జాతకాన్ని చూసుకోండని కొంత సూక్ష్మమ్ చెప్పారు ! వీరికి జవ్వని కన్నుల గురించి మాత్రమే బాగా తెలుసనుకున్నా ! జాతకాల గురించి కూడా ఇంత బాగా తెలుసునని తెలుసుకుని హాశ్చర్య పోయా !
డీ జీ గారు - వీరు వేదాంత పరం గా కాలం యొక్క ప్రాముఖ్యత ని గురువులుం గారికి విడమర్చి చెప్పారు ! ఆహా ! కాల మహిమ యిది కాకుంటే వేరొకటుందా !
గురు పూర్ణిమ కి మూడు రోజుల ముందు హై సీన్ - కంది వారు సౌజన్యుండి ని తెచ్చి వదిలి పెట్టారు ! టపా లక్ష్మీ బాంబు లా పేలింది ! సౌజన్యుడైన మా గురువులుం గారి గురించి మరో గురువులుం గారికే కదా బాగా తెలియును :)
సో, ప్రస్తుతానికి రామ నామ జపం లో మళ్ళీ గురువులుం గారు మునిగి పోవటం శిష్య పరమాణువు కి ఆహ్లాదం కలిగిస్తోంది !
నారదాయ నమః పని బాగా జరిగిన దానికి తోడ్పాటు గా తమ వంతు కార్య క్రమాన్ని / ప్రోత్సాహాన్ని , ఇచ్చిన బ్లాగోదరీ బ్లాగోదరులకు నమః శ్శివాయ అనుకుంటూ
మా ఏడు కొండల పెరుమాళ్ళ ని కలలో దేముడు బాబాయ్ ని తెప్పించి నందులకు , ఇట్లా అందరికీ నమో వాకాలు అర్పించే సు కుంటూ జిలేబి సావేజిత సైనింగ్ ఆఫ్ ఫార్ ది డే !
౦౦౦
అదిరెను శ్యామల రాయా !
కుదురుగ రాముని మనంబు కూజిత జేయన్
మదిని తనివి జేసెడి ఆ
మదిరా పానమ్ము ముక్తిమార్గమ్ము గదా
జిలేబి
అంతా మన మంచికే ! జగమంతా రామ మయం
దేవుడని మొన్న తెలిసెను
రావుడు రాముని గనంగ రాస్తా ద్రిప్పెన్
కోవా జిలేబి పలుకుల
తావులు సరియయ్యెగాద తరుణీ భేషూ !
జిలేబి
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
జిలేబి