Monday, November 2, 2020

తృప్తి

 


మొత్తం నిండేలా చూడకు.
కొంత వదిలిపెట్టు‌.

కత్తికి పూర్తిగా పదునుపెట్టాలనుకోకు
మొక్కవోతుంది.

అంతా నీకే కావాలనుకోకూ
ఎవరూ దానిని కాపాడలేరు‌.

సంపదలసంఖ్యాకం
కీర్తిబావుటాలు
నాశనానికే మార్గాలు.

నీ పని అయ్యాక విశ్రామం తీసుకో.
దివికి మార్గమిదే.

దావొ దే జింగ్

లావొ జు.

Source-9

Better stop short than fill to the brim.

Over-sharpen the blade, and the edge will soon blunt.
Amass a store of gold and jade, and no one can protect it.
Claim wealth and titles, and disaster will follow.
Retire when the work is done.
This is the way of heaven.

స్వేచ్ఛానువాదం


జి లే బి.

ప్రవాహం

 


అత్యున్నత మైన సాయం‌
నీరు లాంటిది‌.

నీరు కోటానుకోట్లకు జీవనాధరం
సునాయాసంగా‌‌.

జీవనం నేలకు దగ్గిర వుండేలా చూడు.
ధ్యానంలో హృదయాంతరాళాలోకి వెళ్లు‌.
ఇతరులతో సున్నిత ప్రవర్తన,కరుణ తో వుండు.


మాటల్లో సత్యం
ప్రభుతలో ధర్మం
వ్యాపారంలో స్పర్థ
కార్యశీలత్వంలో సమయపాలన
వుండేలా చూసుకో.


పోట్లాటలు వద్దు.
దూషణలూ వద్దు.

దావొ దే జింగ్
లావొ జు

Source-8

The highest good is like water.

Water gives life to the ten thousand things and does not strive.
It flows in places men reject and so is like the Tao.
In dwelling, be close to the land.
In meditation, go deep in the heart.
In dealing with others, be gentle and kind.
In speech, be true.
In ruling, be just.
In business, be competent.
In action, watch the timing.
No fight: No blame,
స్వేచ్ఛానువాదం

జి లే బి.

Sunday, November 1, 2020

మౌని

 


దివి, భువి శాశ్వతం.
ఎందుకు శాశ్వతం?
వాటికి పుట్టక లేదు కాబట్టి.

మౌని నిస్స్వార్థుడు.
అందుకే ముందంజ‌ వేయగలుగుతాడు‌.

అతడు నిస్సంగుడు.
అందుకే అందరితో మమేకం.

నిష్కామ కర్మ నిచ్చెన అతని 

పూర్ణత్వానికి.

దావొ దే జింగ్

లావొ జు

Source - 7

Heaven and earth last forever.

Why do heaven and earth last forever?
They are unborn,
So ever living.
The sage stays behind, thus he is ahead.
He is detached, thus at one with all.
Through selfless action, he attains fulfillmen

స్వేచ్ఛానువాదం
జి లే బి.

అంతర్లీనపు చైతన్యం

 

అంతర్లీనపు చైతన్యానికి మరణం లేదు.
తానొక మహిళ ~ మూలపుటమ్మ.

ఆవిడ సింహద్వారం మూలం దివికి భువికి.
అది ఓ కనిపించని ముసుగు.

దాన్ని ఉపయోగించు.
అపజయమన్నది ఉండదెప్పుడు.



దాావొ దే జింగ్   

లావొ జు 

Source-6

The valley spirit never dies;

It is the woman, primal mother.
Her gateway is the root of heaven and earth.
It is like a veil barely seen.
Use it; it will never fail.


స్వేచ్ఛానువాదం

జి లే బి.

Friday, October 30, 2020

కేంద్రంతో మమేకం

 

దివి, భువి నిరంకుశం.

కోటానుకోట్లు వాటికి లెక్క లేదు.

జ్ఞాని నిరంకుశుడు.
జనులాతనికి దిష్టిబొమ్మలు.


దివికి భువికి నడుమ స్థలం కొలిమి తిత్తిలాంటిది.
రూపం మారుతూంటుంది.
కాని‌ స్వరూపం మారదు.

దాని గమనంలో పుట్టేవెన్నెన్నో.

అంతులేని మాటలకర్థంలేదు‌.

కేంద్రంతో మమేకమే శరణ్యం.

దావొ దే జింగ్

లావొ జు‌

Source- 5

Heaven and earth are ruthless;

They see the ten thousand things as dummies.
The wise are ruthless;
They see the people as dummies.
The space between heaven and earth is like a bellows.
The shape changes but not the form;
The more it moves, the more it yields.
More words count less.
Hold fast to the center.


స్వేచ్ఛానువాదం

జి లే బి.

ఆది మూలము

 

అది ఒక ఖాళీ పాత్ర
ఉపయోగించబడుతుంది
నిండదు పూర్తిగ‌ యెప్పటికి.

కోటాను కోట్లకు
అంతు లేని మూలమది.

తీక్ష్ణతను తగ్గించు
ముడిని విప్పు
తీవ్రదృష్టిని నునుపార్చు.
ధూళిలో మమేకవ్వు.

ఎక్కడోదాగివుంది
ఎప్పూడూ వుండేది.
ఎక్కడి నుండి వచ్చింది
ఎవరికెరుక?

ఆది మూలమది‌.

దావొ దే జింగ్
లావొ జు‌.

Source-4


The Tao is an empty vessel; it is used, but never filled.

Oh, unfathomable source of ten thousand things!
Blunt the sharpness,
Untangle the knot,
Soften the glare,
Merge with dust.
Oh, hidden deep but ever present!
I do not know from whence it comes.
It is the forefather of the emperors.

స్వేచ్ఛానువాదం

జి లే బి.

Thursday, October 29, 2020

నేతృత్వం

 


సామర్థ్యాన్ని ఆకాశానికెత్తకుంటే
పోటీ వుండదు.

విలువైనదని అనవసర విలువ చేర్చకుంటే
కొల్ల గొట్టబడదు.

చూడకూడని దాన్ని చూపించకుంటే
మది చంచలత్వమొందదు‌.

సరియైన నేత అనవసరమైన కోరికల్ని మదిలోనుంచి తొలగిస్తాడు‌ కడుపు నిండేలా చూస్తాడు. దురాశలను త్రుంచి, సంఘజీవుల దారుఢ్యాన్ని పెంపొందిస్తాడు.

జనులు సామాన్యులై అత్యాశ పడకుంటే
తెలివిపరుడు చెలగాటమాడలేడు‌.

కౌశల్యంతో పని చేయి~
అంతా శ్రేయస్కరమౌతుంది‌.


దావొ దె జింగ్

లావొ జు

Source-3

Not exalting the talented prevents rivalry.

Not valuing goods that are hard to obtain prevents stealing.
Not displaying desirable things prevents confusion of the heart.
Therefore, the True Person governs by emptying the heart of desire
and filling the belly with food, weakening ambitions and strengthening bones.
If the people are simple and free from desire, then the clever ones never dare to interfere.
Practise action without striving and all will be in order.


స్వేచ్ఛానువాదం

జి లే బి.

ద్వంద్వం

 



అందం అందంగా వుందంటే
కారణం వికారం.

మంచి మంచిగా కనిపిస్తోందంటే
చెడేదో వున్నట్లు.

ఉండటం, లేకుండటం,
కష్టం, సుఖం,
పెద్ద, చిన్న,
పైన, క్రింద,
గోల, సంగీతం
ముందు, వెనుక
ఇరువైపులకు
ప్రతీకలు.

ద్వంద్వాలకతీతంగా
మౌని మాటలాడక
తన పని చేస్తూ పోతుంటాడు
నిష్కామంగా
ఓ పని అయిపోతే మరొక్కటి,
యెల్లప్పటికి నిలిచి పోయేలా.

లావొ జు.
దావొ దే జింగ్

Source-2

Under heaven all can see beauty as beauty only because there is ugliness.

All can know good as good only because there is evil.

Therefore having and not having arise together.

Difficult and easy complement each other.
Long and short contrast each other;
High and low rest upon each other;
Voice and sound harmonize each other;
Front and back follow one another.
Therefore the sage goes about doing nothing, teaching no-talking.
The ten thousand things rise and fall without cease,
Creating, yet not possessing,
Working, yet not taking credit.
Work is done, then forgotten.
Therefore it lasts forever.

స్వేచ్ఛానువాదం
జి లే బి‌.

Wednesday, October 28, 2020

చీకటి లో చీకటి

 

అవ్యక్తుని
వ్యక్తీకరిస్తే
అవ్యక్తుడు కాడు.

పేరెట్టేవంటే
అనంతుడు కాడు‌.

పేరులేని వాడి
పెన్నిధి ఈ విశ్వం.
పేరున్నావిడ
తల్లి కోటానుకోట్లకు.

కోరికలను మీరి చూడు
నిగూఢత బట్టబయలు.
కోరి చూడు
మాయ ఒక్కటే కనులముందు‌.

ఉద్భవించినప్పుడు
ద్వైతం.
మూలం లో అద్వైతం.

మూలం గూఢం.

చీకటిలో చీకటి.

పెంజీకటి
ద్వారం
నిగూఢతకు‌.


తావొ తే చింగ్
(దావొ దే జింగ్)
లావో జు.
Tao Te Ching
Dao de Jing
Lao Tzu.

Source -1


The Tao that can be spoken of is not the eternal Tao.

The name that can be named is not the eternal name.

The nameless is the beginning of heaven and earth.

The name is the mother of the ten thousand things.

Send your desires away and you will see the mystery.

Be filled with desire and you will see only the manifestation.

As these two come forth they differ in name.

Yet at their source they are the same.

This source is called a mystery.

Darkness within darkness, the gateway to all mystery.



స్వేచ్ఛానువాదం
జి లే బి .


Thursday, October 22, 2020

అలెక్సా ఎవరు ?

 


ఈ మధ్య మా తాతగారు అలెక్సా ఎవరో తెలియదు పో 

అన్నారు :) వారి కోసమీ సమ్ జాయ్ షీ :)





చీర్స్

జిలేబి