శరీరము ఆత్మ విడివోకుండా
ఏకీకృతంగా వుండగలవా?
అన్ని పనులూ చేసుకుంటూ
మృదుత్వాన్ని పెంపొందించుకుంటూ
అప్పుడే పుట్టిన పసిపాపలా నిర్మలంగా
వుండగలుగుతావా ?
నిర్మలీకరించుకుంటూ నీ అంతర్దృష్టిని మలినం
కాకుండా చూసుకోగలుగుతావా?
అందరిని ప్రేమిస్తూ దేశాన్ని పాలిస్తూ
నిస్వార్థుడవై వుండగలుగుతావా?
దివికి సింహద్వారమైన శక్తి స్వరూపిణి
గా మనగలుగుతావా ?
సమీక్షించుకుంటూ నిష్కపటంగా
నిష్కామివై నీ పని చేయగలుగుతావా?
క్రొంగొత్తదనానికి జీవంపోస్తూ
అన్నిటినీ కలిగి నిర్మోహంగా
నిష్కామకర్మతో
నిరంకుశత్వం లేక పరిపాలించటమే
ధర్మ ప్రవర్తన.
దావొ దే జింగ్
లావొ జు.
Source-10
Carrying body and soul and embracing the one,
Can you avoid separation?
Attending fully and becoming supple,
Can you be as a newborn babe?
Washing and cleansing the primal vision,
Can you be without stain?
Loving all men and ruling the country,
Can you be without cleverness?
Opening and closing the gates of heaven,
Can you play the role of woman?
Understanding and being open to all things,
Are you able to do nothing?
Giving birth and nourishing,
Bearing yet not possessing,
Working yet not taking credit,
Leading yet not dominating,
This is the Primal Virtue.
This is the Primal Virtue.
స్వేచ్ఛానువాదం
జి లే బి.