Tuesday, June 28, 2011

లవణ లావణ్యవతి - ఉప్పు భామా సౌందర్యం !

ఈ మధ్య కొన్ని వారాల మునుపు జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ నగరం సందర్శించడం జరిగింది. ఈ నగరం లో ఓ సాయంత్రం వ్యాహ్యాళి కై అలా నడక మొదలెట్టి అలా వెడుతూంటే - సాల్జ్ హెయిల్ గ్రోట్టే - మన తెలుగు లో చెప్పాలంటే - ఉప్పు ఆరోగ్య గుహలు అని చెప్పు కోవచ్చు. !

ఇది ఒక దుకాణం - ఈ దుకాణం లో తెల్లటి ఉప్పు తో చెయ్యబడ్డ గుహ లాంటి ప్రదేశం లో మనం ఓ కాంతి వంతమైన దీపాన్ని చూస్తూ కూర్చో వచ్చు. అంటే రెలేక్సేషన్ అన్న మాట ! ఇది మీ ఆరోగ్యాని కి మరే మంచిది అంటూన్నారు వీరు.


మన గాంధి గారేమో స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసారు. వారికి అప్పుడు ఈ ఐడియా వచ్చి ఉంటె - మన దేశం లో ఈలాంటి ఉప్పు గుహలని బెట్టి  అందులో సత్యాగ్రహం చేసి ఉండవచ్చు.

అయినా ఇప్పటికైనా మించి పోయినది ఏమి లేదు. మన బాబా రాం దేవ్ గారో కాకుంటే అన్నా హజారే గారో ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు.  ఆరోగ్యం కూడా కాపాడు కుంటూ ఎంచక్కా సత్యాగ్రహం చెయ్య వచ్చు.

దాని కి ' ఉప్పు గుహల తో మనో వికాసం అంటూ మన వీరేంద్రనాథ గారో కాకుంటే పట్టాభిరాం గారో ఒక ప్రోగ్రాం కూడా పెట్ట వచ్చు.

మన రాఘవేంద్ర రావు గారు ( అదేనండి - దర్శకులు ) ఓ మంచి  'రాసోత్తర' భరిత గాన సన్నివేశం పెట్ట వచ్చు. !

గాంధి గారి పేరు చెప్పి వీటన్నిటికి నో టేక్స్ ప్రకటించాలని మన లాయెర్స్ సుఒ మాటో కేసులు వేసి ఉండవచ్చు.

ప్చ్ ఎన్నెన్ని మంచి మంచి ఐడియా లో - మన దేశం మిస్సు చేసుకుంది !  ఏమంటారు ?

చీర్స్
జిలేబి.

Saturday, June 25, 2011

బ్లాగు గొలుసు కథ - ఒక ప్రయోగం

పూర్వ కాలం లో - వార పత్రికలూ , మాస పత్రికలూ ఆంధ్ర ప్రజానీకాన్ని అలరారించిన కాలం లో ( అబ్బో ఇదేదో ఓ వంద సంవత్సారాల్ ముందు కాదు లెండి - ఓ మోస్తరు ఇరవై లేక ముప్పై సంవత్సారాల ముందు - ) వార పత్రికల్లో కానివ్వండి , మాస పత్రికల్లో కానివ్వండి, గొలుసు కథలు లేక గొలుసు నవల వచ్చేవి.

అంటే ఎవరో ఒక రచయితా కాకుంటే, రచయత్రి ఓ వారం కథ రాస్తే దాని ఆధారం గా వేరొకరు కథ ని పొడిగించి ఒక మంచి మలుపు ఇచ్చి వదిలేవారు. అలా అలా సాగి పోయే గొలుసు కథా ప్రవాహం లో , ఎడిటర్ గారు అల్టిమేటం ఇచ్చి ఆఖరి అధ్యాయాన్ని రాయమనేవారు. అలా అంత మయ్యేది ఆ కథో లేక నవలో .

మరి మన కాలపు బ్లాగు లోకం లో ఈ గొలుసు కథా కాకుంటే నవల ప్రయత్నం ఎవరైనా చేసారా లేదా నాకు తెలీదు.

నా ప్రయత్నం గా ఈ పధ్ధతి కి ఈ కథ మొదటి భాగం ఇక్కడ ఇస్తున్నాను - ఇందులో ఆసక్తి ఉన్న బ్లాగ్ బంధువులు ఈ కథకి రెండో భాగం రాయ వచ్చు. దాన్ని ఈ కథ కింద కామెంటులో మీరు లింకు ఇవ్వచ్చు. మీకు అభ్యంతరం లేక పొతే ఆ లింకుని నేను మళ్ళీ ఈ టపాలో లింకు కింద కూడా ఇవ్వగలను.

ఈ బ్లాగు గొలుసు పధ్ధతి ద్వారా నాకు ఏమని పిస్తుందంటే - ఒకటి కన్నా ఎక్కువైన రెండో భాగాలు కాకుంటే వేరు వేరు భాగాలు రావచ్చు. అంటే ఒకే కథ ఆరంభానికి వేరు వేరు శాఖలు రావచ్చన్న మాట ! అంటే కథ వేరు వేరు తరహాలో వెళ్ళ వచ్చు. !  ఇక్కడ ఎడిటర్ ఎవరు లేదు కాబట్టి ఆ ఆ శాఖల కథ తదుపరి భాగాలు మళ్ళీ మరో శాఖలు కావచ్చు. !  ఆలోచిస్తూంటే చాలా అద్భుతం గా అని పిస్తుంది నాకైతే ఈ ప్రయోగం !

ఈ గొలుసు ప్రయోగం ఎంత దాక వెళ్తుందో చూద్దాం ! బ్లాగర్ల కందరికీ సుస్వాగతం ! - ఈ ప్రయత్నం సాఫల్యం మీ మీద ఆధార పడి ఉంది !

మొదటి భాగం ఇక్కడ:


విజయోత్సు !

చీర్స్
జిలేబి.
                                                    

Tuesday, June 21, 2011

శ్రీ శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారి త్రి చాతుర్మాస్య వ్రాత పూర్తి బ్లాగోపన్యాసం


(మా 'ఏకైక'   ప్రతినిధి - జిలేబి వార్తా సమీకరణ )

శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారు తమ త్రి చాతుర్మాస్య వ్రాత పూర్తి గావించినారు.
ఈ సందర్భం గా అర్ధ శత బ్లాగ్బందువులు పై గా వారి పై కామెంటు కాంక్షలు తెలిపినారు.

వారు మరీ మరీ నొక్కి వక్కానించినారు - తాము మరిన్ని క్రొంగొత్త 'వ్రాతములను' గావిన్చేదననియు, క్రొంగొత్త సంస్కృతాంధ్ర భాషా సూక్తములను , స్త్రోత్రములను భట్టీయం గావిన్చేదననియు నొక్కి ఘోషించి నారు.

వారి సుమధుర సుహాస్య సువ్రాతా వ్రతముల వల్ల పెక్కెడు బ్లాగ్ బాంధవులు కడు సంతోషముల తో ఓల లాడినారని వారి శిష్య పర మాణువు లైన తీవ్ర వాది అప్పారావు శాస్త్రీ గారు మరీ మరీ సెలవిచ్చినారు.

ఈ వ్రాత పూర్తి ' సందర్భాగంగా ' వారు ఈ జిలేబి వార్తా ప్రతినిధి కి ప్రత్యెక భేటీ ఇచ్చి సర్వ బ్లాగు బంధవులకీ ఆశీర్వాదములు శుభ కామనలు తెలిపినారు.

వారు రాబోవు త్రీ చాతుర్మాస్య వ్రాత కోతలకై తీవ్రముగా ఆలోచించు చున్నారని కూడా సెలవిచ్చినారు.

 అనగా తమ ఈ చిన్ని వేదిక ఐన బ్లాగ్ లోకమును విడనాడి బడా లోకమైన టీవీ ల లో కూడా వెళ్లవచ్చునని ఈ విలేకరి ఊహించిడం జరిగినది.


శ్రీ శ్రీ శ్రీ నవ్వండి బులుసు బ్లాగానంద గారి త్రీ చాతుర్మాస్య 'వ్రాత' పూర్తి సందర్భం గా వారికి కేజీ ల కొలది జిలేబి లు వారి ఏలూరు ఆశ్రమ్ వద్ద ఉన్న అన్గాడి నుంచి అందరు గొని పోయి ఇవ్వ వచ్చునని వారు అందరికి ఆ కీజీ ల బరువులని బట్టి వారి ఆశీర్వాదముల వెయిట్ ఉంటుందని వారి ఆశ్రమ మేనేజర్ నోటీసు బోర్డు పెట్టినారు.

(ఆ అన్గాడి వారి ఆధ్వర్యం లో నే జరుగు చున్నదేమో అని వారి శత్రువులు కొంచం సంకం గావించినా కూడా వారి శిష్య లోకం దానిని తోసి పుచ్చ్చి ఆ అన్గాడి అన్నా రావు స్వామీజీ వారి భక్త కోతులలో ఒక కోతి మాత్ర మే ని వ్రాక్కుచ్చి నారు ) .



చీర్స్
జిలేబి.

Monday, June 13, 2011

భగవంతుడికే బటాణీలు అమ్మిన భక్తాగ్రేసరుడు -1

భగవంతుడికే బటాణీలు అమ్మిన భక్తాగ్రేసరుడు

ఈ మధ్య భగవంతుడికి చీకాకు పుట్టింది. కర్మ భూమి అని తాను కొన్ని యుగాల ముందు భారత భూమిని మెచ్చుకుని మాయ మయ్యింది మొదలుకుని భగవంతుడు మళ్ళీ భారత భూమి మీద కాలు పెట్ట కుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు.

కాని భారత భూమి కి రాకుండా ఉండటం తో ఆ భగవంతునికి బోరు కొట్టింది. ఎంతైనా భారత భూమి లో జరిగినంత విశేషాలు , తనకి జరిగినంత (తాను యుగ యుగాలుగా వాళ్లకి కనిపించకుండా పోయినా - నమ్మకం గా తానున్నాని అనుకుంటూ భజనలు , పాటలు పాడుకుంటూ ఉంటున్న జనసందోహం ఉన్న దేశ  మాయే మరి ) వైభవం వేరే ఎక్కడ కాన రాలే ఆ మహాను భావునికి.

' యో అస్యాధక్షః పరమే వ్యోమన్'' అయిన ఆ భగవంతునికి  అక్కడి ఒంటరి తనం ( వేదం లో చెప్పా రాయే - ఆనీద వా తగ్ స్వధయా తదేకం తస్మ్యాద్దాన్యం న పరః న కించ నాసః " అని ) మరీ బోరు కొట్టేసింది.

ఆఖరి కృష్ణావతారం కనుల ముంది కదులాడింది ! ఏమి వైభవం ! ఏమి వైభవం ! ఎంత మర్యాద ఎంత మర్యాద ! ఏమి ఆ గోపికల ప్రేమా ను రాగాలు ! ప్చ్ ! అన్నీ పోయే - మళ్ళీ ఈ ఒంటరి తనం !

ఇక ఈ ఒంటరి తనం తగదు. భారత భూమిలో జన సందోహం తన గురించి ఒకటే ఇదిగా  స్వాములని బాబాలని ఆశ్ర్యసిస్తున్నారు.

అమ్మో వీరికి ఎంత భక్తీ నా పై ! వీరి భక్తీ కి మెచ్చి మళ్ళీ నే భారత దేశం వెళ్ళాల్సిందే అని తీర్మానించు కున్నాడు ఆ రోదసీ వాసి ( వేదం లో చెప్పారాయే - యో అంతరిక్షే రజసో విమానః అని )

అదిగో ఆ ఆలోచన కలుగగానే - భూమ్మండలం మీద - భారత భూమ్మీ ద కల కలం చెలరేగింది.

ఓ అఖండ భక్తుడికి దైవం కనబడి భక్తా - నేను భూమ్మీ ద కి వస్తున్నాని ' కలలో చెప్పాడు.

అలా మొదలయ్యింది ఈ భగవంతుడి పయనం భారత భూమి వైపు.

(సశేషం)

జిలేబి.

Sunday, June 12, 2011

బటాణీలు - బంతులాటలు - భగవంతుడు

పిల్లలు బటానీలు తింటారు
పిల్లలు బంతులాటలు ఆడుతారు
పెద్దవారు మాత్రం భగవంతుడి ఆట ఆడుతారు

దేశం లో ఎట్లాంటి వెధవాయీ అయినా కాషాయం ధరిస్తే చాలు - ఆహా ఒహో అంటూ అతన్ని ఫాలో అవడానికి జన సమ్మర్ధం ఉండనే ఉంది.

విదేశాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేస్తారు.

మన దేశం లో భగవంతున్ని తయారు చేస్తారు.

బటాణీల అబ్బీ కష్టపడి బటాణీలు అమ్ముకుంటాడు. వాడ్ని లా పేరుతో దబాయించి పోలీసోడు ఆమ్యా లాగుకుంటాడు.

మన జనాలు  ఓ రెండ్రూపాయల బటాణీలు కొనుక్కోవడానికి ఆ బటానీల అబ్బీని తీవ్రంగా కాచి వడపోసి సవా లక్షల ప్రశ్న వేసి కొనుక్కుంటారు.

కాని కాషాయం వేసిన స్వామీజీ ఇచ్చే బూడిదని ఎట్లాంటి ప్రశ్నలడక్కండా కళ్ళ  కద్దుకుని కాళ్ళ మీద పది కానీలు సమర్పించుకుంటారు మరీ ధారాళం గా !

అంతా విష్ణు మాయ కాకుంటే మరేమిటీ చోద్యం ! హాస్చ్యరం !

చీర్స్
జిలేబి.


Tuesday, June 7, 2011

బ్లాగ్ యువరాణి అడిగిన మూడో ప్రశ్న

బ్లాగ్ యువరాణి అడిగిన మూడో ప్రశ్న

యువరాజులారా - ఇదియే నా మూడో ప్రశ్న. ఈ ప్రశ్న కి సమాధానం తెలిజెయ్య గలవారు ఉంటారని అనుకుంటాను - అంటూ ఇలా అడిగింది.

ఒక రాజు ఏదైనా చూడటానికి పుట్టు గుడ్డి
ఒక రాజు ఏదైనా వినటానికి పుట్టు చెవుడు
ఒక రాజు ఏదైనా చెప్పటానికి పుట్టు మూగవాడు
అయినా అతని రాజ్యం లో ధర్మం నాలుగు పాదాల నడిచింది.
ఎవరు చెప్పగలరు ఇదెలా అని ?

ఈ మూడు ప్రశ్నలని ఇచ్చి బ్లాగ్ రాణి విశ్రామం తీసుకోవడానికి అంతః పురం వెళ్ళింది.

స్వయం వరానికి వచ్చిన కామెంటు యువరాజుల చెప్పలేక వారి వారి దేశాలకి ఏగి వారి మంత్రి వరేన్యులకిచ్చి ఈ ప్రశ్నలకి సమాధానం కనుగొనుడు ఆదేశించిరి.

ఇంతటి తో ఈ కథ సమాప్తం. (కథ అంతర్జాల లోకానికి - మనం లాగ్ అవుట్ కి ) !

చీర్స్
జిలేబి.

Wednesday, June 1, 2011

పురాణీ దేవి యువతిహి ! -

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన రెండవ ప్రశ్న
 
స్వయం వరానికి వచ్చిన యువరాజులని కలయ జూసి - యువ రాణి రెండవ ప్రశ్న ఇవ్వడానికి మొదలైంది.
ప్రశ్న అడిగే మునుపు ఒక సారి దీర్ఘం గా ఆలోచించి - సందిగ్ధా వస్త లో ఉండి సరే అడుగు దామని ఇలా ప్రశ్నించింది.
 
ఏగు తెంచిన రాజ వరేన్యు లారా - ' పురాణీ దేవి - యువతిహి ' అన్న దానికి అర్థం ఏమిటి ? విశదీకరించ
 గలరా ? అని అడిగింది.
 
ఈ మారు రాజ లోకం లో నిజం గానే ఈవిడకి మతి భ్రమించింది అన్న కల కలం చేల రేగింది. దేవి పురాణీ అంటుంది. మరి ఆవిడెట్లా యువతి కాగలదు ? అని గుస గుసలు మొదలయ్యాయి.
 
(సశేషం)
 
జిలేబి.

Sunday, May 29, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 2

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజులకి ఇచ్చిన మొదటి ప్రశ్న కథ

అలా వచ్చిన యువరాజులని బ్లాగు యువరాణి వీక్షించి , ఈ ప్రశ్న ప్రుచ్చించెను.

"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి.
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది.

ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.

ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది.

స్వయం వరానికి వచ్చిన రాజ కుమారులార ఇప్పుడు చెప్పండి -

౧. 'లేని బాణం' తో ఆ బోయ వాడు ఎలా ఆ రెండో పక్షిని కొట్టాడు ?

౨. ఆ రెండవ పక్షి ఎందుకు ప్రాణాన్ని విడిచి పెట్టింది ?

ఈ ప్రశ్న లని విని రాజ లోకం లో కల కలం చేల రేగింది. ఈ యువరాణి సుకుమారి మాత్రం కాదు - కొంత మతి భ్రమించిన లలన కూడా అని. కాని ఆ సుకుమారి ని చూడగా ఆ మె తెలివైనదిగా అగుపించింది అందరికినూ.

ఈ ప్రశ్నల కి సమాధానం చెప్ప గలవారెవ్వరు అన్నట్లు మహారాజులం వారు సభ ని ఒక మారు కలయ జూసినారు.

(సశేషం )

జిలేబి.

Friday, May 27, 2011

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ - 1

బ్లాగ్ యువ రాణి - కామెంటు యువరాజ వారల కథ

ఒకానొక దేశం లో బ్లాగ్ యువ రాణి సమ్మోహనం గా వెలుగొందు చుండెను.

పొరుగు రాజ్యాలలో పేరిన్నికగన్న కామెంటు యువరాజాలు కోకోల్లెలు గా ఉండిరి.

బ్లాగు యువరాణి  వారి కి  పెళ్లి చెయ్య దలిచి వారి రాజా వారు - తన రాజ్యం లో నూ పొరుగు రాజ్యం లోనూ డప్పు వేయించెను.

బ్లాగు యువరాణికి  సరి జోడు ఎవరైనను స్వయంవరమునకు రావలనేహో అని ఆ డప్పు వాడు డప్పు వాయిన్చుచూ రాజ్యాలు తిరిగెను.

ఈ బ్లాగు రాణి బహు సుందరాంగి కావున అన్ని కామెంటు యువరాజులు వారి వారి పనులని పక్కకు నెట్టి స్వయంవరాని కి ఏగు తెన్చిరి.

ఆ నాటి స్వయం వారానికి ఏగు తెంచిన రాజా వారలను గమనిచి బ్లాగు యువరాణి సుకుమారి వారికి కష్టమైన పనిని చెప్పెను. అది ఎవరు  సాధించెదరో వారికి తన కుమార్తెను కట్ట బెట్టెద నని రాజా వారు వ్రాక్కున్చిరి.

(సశేషం)

జిలేబి.

Thursday, May 26, 2011

'ఈ ' లాగు - బ్లాగు - ఏలాగు ? ఊ లాగు !

ఈ లాగు 
బ్లాగు  
ఏ 'లాగూ' లేని
ఈ లాగు
ఏదో  లాగూ
ఆలాగూ
ఊ లాగూ

కూత డప్పు లింకులు
కేక నెనరులు బాగు బాగు

వెరసి

బ్లాగు  బటాణీ
టపా టైం పాస్
కామెంటు కప్పు కాఫీ
హారం 'ఆ' హార్యం'
కూడలి 'కూల్ డ్రింకు'
జాలం - 'జాం ' బాజారు !

చీర్స్
జిలేబి.