Wednesday, March 31, 2010

అమ్మాయీ అబ్బాయీ నీ పేరేమిటి?

మీకు బాబు ఇష్టమా లేక పాప అంటే ఇష్టమా అని ఎ ఆడవాళ్ళని అడిగినా వెంటనే బాబు అనో కాకుంటే పాప అనో కాకుంటే ఇద్దరూ అనో - కాకుంటే ఓ బాబు ఓ పాప అనో జవాబు వస్తుంది. అట్లాగే మగవాళ్ళని అడిగితె కూడా ఇట్లాంటి జవాబే ఏదో వస్తుంది.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే - అబ్బాయి అమ్మాయి ఎవరైనా - ఇష్టా ఇష్టాలు ఏదైనా మన మిష్ట పడిన దాన్ని బట్టి బాబో కాకుంటే పాపో పుట్టడం జరుగుతుందని కొందరి ఉవాచ. అంటే యతో మనః తతో మన సంతతి.
మీ పర్సనల్ విషయాలలో ఇలాటివి ఎదుర్కోవడం జరిగిందా? అంటే మీ ఇష్టం అబ్బాయి అయితే - మొదటి సంతతి బాబు పుట్టడం లాంటి జరిగిందా? ( ఉదాహరణకి - మా వారికి బాబు పుట్టడం అన్న కల వచ్చింది. మా బాబు పుట్టే కొన్ని నెలల ముందు- స్కాన్నింగ్ చెయ్యలేదు - తెలుసుకోవాలన్న కోరిక లేక పోవడం తో - కాని వస్తుతః మనలో ఏదో ఓ మూల బాబు పుట్టడం అయితే బాగుణ్ణు అన్న కోరిక ఇలా బాబు పుట్టడంలో ప్రతి ద్వనిస్తుందా ? మీరు ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Wednesday, March 24, 2010

జర్మనీ యాత్ర విశేషాలు - త్రిబెర్గ్

కూకూ క్లాక్ - లోపలి భాగం

జర్మనీ ఈ దక్షిణ భాగం లో ఉన్నది బ్లాక్ ఫారెస్ట్ గా ప్రసిద్ధి గాంచిన స్థలం . ఇక్కడ ప్రపంచపు అతి పెద్ద కుకూ గడియారం ఉన్నది. కుకూ గడియారం విశేషం ఏమిటంటే - ప్రతి గంటకి గడియారం నుంచి ఓ కుకూ బయటకి వచ్చి కుకూ కూత తో సమయాన్ని సూచిండడం ! త్రిబెర్గ్ వెళ్ళినప్పుడు తీసిన కొన్ని చిత్రాలు -

Friday, March 19, 2010

మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్

ఈ టపా టైటిల్ గాంధిజీ గారి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ ట్రూత్ లాగ ఉందేమిటి ఆనిపించ వచ్చు మీకు. పడకకి సత్యానికి మధ్య పొందిక ఏమిటి అన్న సందేహం రావచ్చు మరి కొందరికి.

పడక సత్య దూరం కాదని ఈ మధ్య పడక లో పుణ్యాత్ములు కొందరు నిర్దా రించారు కూడా!

కాబట్టి మై ఎక్స్ పెరి మెంట్స్ విత్ బెడ్ అన్నది ఈ ఇరవై ఒక్క శతాబ్దపు పాపులార్ సబ్జెక్టు.

వాటర్ బెడ్ అన్నది వెస్ట్రన్ వరల్డ్ లో ప్రసిద్ధి. ఈ వాటర్ బెడ్ లో పడుకుని నిద్రించిడం అన్నది ఓ త్రిల్- ఇది రోగ నివారిణి అని కూడా చాల మంది నమ్ముతారు.

ఆ కాలం లో భీష్ముడు అంబుల పడక పై పడుకుని పుణ్య లోకాలకి వెళ్ళ డానికి వేచి ఉన్నాడు.

ఈ కాలం లో స్వామీజీ లు కూడా "అమ్ముల" తో పుణ్య లోకాలగురించి ఎక్స్ పెరి మెంట్స్ ఇన్ బెడ్ చేస్తున్నారు.

చాల మందికి బెడ్ కాఫీ చాల పసందైన విషయం.

మహా విష్ణువు శేష సాయి ఐ పవళించి ఉండడం సదా మనం చూసే ఆయన గారి ఫోసు.

యోగా లో శవాసనం "బెడ్"ల పై చేసే వాళ్ళు ఉన్నారు.

సో , ఇలా రాసు కుంటూ పోతూంటే ఈ బెడ్ మహిమ ఇంతింత కాదయా "విశ్వ దాభి రామా" అని పించక మానదు!

చీర్స్
జిలేబి.

Thursday, March 18, 2010

అరవం అమ్మాయీ- ఆంధ్రా అబ్బాయీ - ఇడ్లీ సాంబార్

ఈ చిత్తూరు పాత కాలం నాటినుంచి అరవ దేశం లో ఉండటం తో ఇక్కడ అరవం వాళ్ళ ప్రాబల్యం ఎక్కువే అని చెప్పొచ్చు. బోర్డర్ ఏరియా కాబట్టి - ఇప్పటికి అరవం వాసన చిత్తూర్ లో ఎక్కువే ఉంటుందనుకుంటా.
ఓ మోస్తరు అరవై ఎనభై ప్రాంతాలలో ఈ ఊళ్ళో తెలుగు కన్నా అరవం తో నే కాలం గడప వచ్చు. ఇప్పటికి మారి ఉంటుందనుకుంటా.
ఈ అరవం అమ్మాయిలూ స్కూళ్ళల్లో గానివ్వండి - కాలేజీ లలో గానివ్వండి చేసే "కిసిమిసు" (అరవం వాళ్ళు మాట్లాడితే - ఏమంటారు - గులక రాళ్ళ డబ్బా సౌండా?) ఇంతా అంతా కాదు.
అబ్బాయిలని గలాటా చెయ్యడం లో వీళ్ళ చాతుర్యం వేరే వేరు. అప్పటిదాకా మాట్లాడుతున్నఅరవం యాస తెలుగు సడన్ గా అరవం లో కి మారిపోయి గల గల నవ్వు ల పరంపర ఎక్కువవడం - ఈ అబ్బాయిలు బిక్క మొహం వెయ్యడం చాల సాధారణ విషయం! ఆ పై పక్క గ్రామాలలోనించి వచ్చే తెలుగు అమ్మాయిలు(నా లాంటి వేరే ఊళ్లలో నించి వచ్చి చదిన వాళ్ళు ఇంకా చాల తక్కువే ) ఆ కాలం లో తక్కువే కాబట్టి ఈ ఆంధ్రా అబ్బాయిలకి - ఈ పాటి కాలక్షేపం వీళ్ళతోనే సరి పెట్టు కోవలసి వచ్చేది.
ఈ అమ్మాయిలకి తెలుసు - ఇడ్లీ , సాంబార్ లేకుంటే అంత గొప్పదనం దానికి లేదని. అయినా ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ ఇంక వేరే ఎ కాంబినేషన్ లోను లేదు కాబట్టి - ఇడ్లీ లేకుంటే సాంబార్ వేల్యూ తక్కువే కాబట్టి - వీళ్ళ చాతుర్యానికి కొదవే లేకుండా ఉండేది.
ఇంక స్కూల్ అయ్యవార్లకి ఈ అరవం అమ్మాయిలని వాళ్ళ భాష - అంటే తెలుగు ఉచ్చారణ - మీద ఓ పాటి కామెంట్లు విసరడమూ కద్దు.
స్కూళ్ళల్లో అరవం క్లాసులు కూడా ఉండేవి.( ఇప్పుడూ ఉన్నాయా? నాకైతే తెలీదు) - ఈ గల గలా అమ్మాయిలు - ఆ ప్రక్క క్లాస్సుల్లలో "కిసిమిసు" ఈ పక్క క్లాస్సుల్లలో ఆంధ్రా అబ్బాయిలకి జోకులు వేసుకోవడానికి ఫస్ట్ క్లాసు మేటర్.
వీళ్ళ ట్రేడ్ మార్క్ - నెత్తి పై విభూతి బొట్టు- (అరవం వాళ్లకి ఈ భస్మం పెడితే నే పొద్దు పొడిచినట్టు అనుకుంటా) - దానికింద కుంకం బొట్టు - ఇవన్ని ఆ (మా ) కాలపు ముచ్చట్లు !

చీర్స్
జిలేబి.

Wednesday, March 17, 2010

వికృతి - వినా కృతి ?

వికృతి
ఆకృతి
వినా కృతి యా?
వేచి చూడవలసినదే
వికృతి గవాక్షం ఇవ్వాళ తెరుచుకుంది
గవాక్ష వీక్షణం మానవాళికి ఇప్పుడు లభ్యం

శుభాకాంక్షలతో

జిలేబి.