మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
సహనము, నేర్పుగ యత్నం
బహరహము గనుచు పదమ్ము పలుకు మధురిమల్
నిహతంబై, వాణిశ్రీ!
మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
బహరహము గనుచు పదమ్ము పలుకు మధురిమల్
నిహతంబై, వాణిశ్రీ!
మహిత హితంబగు జిలేబి మాలిక లిడుదున్
శుభోదయం
జిలేబి
ReplyDeleteభళి! మురళీధర రావుల్
జిలేబి బీలేజి నడుమ సిద్ధ విలోమం
బులగనిరి శుభాంగి నమ
స్సులు యేల్చూరి కవివర్య ! సోహం హంసో !
జిలేబి
ReplyDeleteఈ హర్మ్యము లీతురగము
లీహేమము లీభుజిష్య లీధాన్యము లీ
దేహము నాతో వచ్చునె ?
యూహింపగ పుణ్య కర్మ మొక్కటి దక్కన్ !
కాశీ ఖండం
ReplyDeleteపయ్యెద ముసుంగు బాలిండ్ల బ్రాకనీరు
తరచు పూయుదు రోల గంధంబు బసుపు
బందికత్తెలు సురతప్రసంగ వేళ
గంచి వ్రేతలు కుసుమాస్త్ర ఖడ్గ లతలు !
కాశీ ఖండం
ReplyDeleteహరినామ కీర్తనంబును
హర నామ జపంబు నెవ్వ డాత్మ బఠించున్
నరక మహావేదన య
న్నరునకు బ్రాపింప కుండు నయతత్త్వ నిధీ !
కాశీ ఖండం
ReplyDeleteప్రతి దినంబును బ్రాత రారంభ వేళ
నిర్ణిబంధన నిరుపాధి నిరవ గాధ
నిర్నిరోధ నిరాఘాట నిరుపమాన
భక్తి సంభజియింతు రీ పద్మ బంధు !
కాశీ ఖండం
ReplyDeleteఉపనిషత్తుల కంటెను నూర్ధ్వ పదవి
మంత్ర రాజంబు గాయత్రి మహిమ గాంచు
ప్రణవ మను క్రేపుతో గూడి పాడి బిదుకు
నవని సురులకు గాయత్రి యనెడి సురభి !
కాశీ ఖండం
ReplyDeleteవిమల విజ్ఞాన దీపంబు వెలుగుచుండ
శాంతి ధారా జలంబుల జలక మార్చి
భవుని బూజించె భావపుష్పముల భక్తి
నతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞ దత్తి !
కాశీ ఖండం
ReplyDeleteచేయని ఘనకార్యంబున
కై యొనరిచిరిట జిలేబి కరతాళములన్
సాయమ్మొచ్చె లలితయున్
మాయ యెవరిదో ఫలమ్ము మాకొచ్చెనహో !
జిలేబి
ReplyDeleteమాయా నగరమ్మిది లలి
తా! యొజ్జల పలుకులన్ని తాళింపు లహో !
మా యిరువురికిన్ మామూ
లౌ యొకరిన్నొకరు గిచ్చు లౌక్యంబంతే :)
జిలేబి
Oh really?!!! 😔Was it not true ?
Delete
ReplyDeleteఅందరి కోసం బొక్కరు
బంధమ్మైనెరయ నొక్క రందరి కోసం
డెందం బరయ జిలేబీ
గంధం బూయవలెనమ్మ కష్టే ఫలికిన్ !
జిలేబి
ReplyDeleteసుముహూర్తమొకటి కుదరం
గ మన మనువట తపియించి కరిగి కలిసినా
క మదితెలిసినాక తనువు
లమరచి వలపమెరనమ్మ లవ్లీ మైనా :)
జిలేబి
ReplyDeleteఅమ్మయు నిజము మనవరా
లమ్మియు యప్పచ్చులున్ను లలితా యుద్యో
గమ్మున జేరుటయు నిజము
కమ్మని తెమ్మర జిలేబి కరుణయు నిజమౌ !
జిలేబి
ReplyDeleteగణములు సరిపడు పదముల
గుణములు చందము యతిగతి గురువులు లఘువుల్
కణిక జిలేబీ ప్రాసల్
గణగణ గునగున సొబగగు గరగరి శాస్త్రీ !
జిలేబి
ReplyDeleteనిండు మనసున మెచ్చుచు నిర్మ లమగు
పండు వెన్నెల కురిపించె భాస్కరుండు
సుదతివి జిలేబి యొజ్జల శూకమున్ను
బొందితివిగాదె శుభదిన మందు సూవె !
జిలేబి
ReplyDeleteతాకింగౌ లలిత సుమా !
మీ కందరికీ తెలిపెద మిన్నా తరహా
లో కొసరు నామములు గల
నాకథ నాదైన తీరునవిను జిలేబీ :)
జిలేబి
ReplyDeleteమత్తేభ జిలేబీ ! నీ
యత్తారిల్లమెరికా సయాటంబో ? హా!
బెత్తము గొనెనౌ ట్రంపూ
చిత్తము గను రీతి బోయె చిటపట యనుచున్ :)
జిలేబి
ReplyDeleteసార్థక 'కేశ ' వు డతడౌ !
యర్థంబులనాడలేదు యమకీటకముల్
వ్యర్థంబులవ్వన సహా
యార్థం జీవన విధాన యానము గాంచెన్ !
జిలేబి
ReplyDeleteయమకీటక సంహారము
సముచిత ముగ జేతురోయి సార్థక రావుల్
గమనిక ! ప్రభాత కాలము
న మందు నిత్తురట గోకవరమున మేలౌ !
జిలేబి
ReplyDeleteచంద్రన్న నుపాధ్యాయులు
కేంద్రంబుగ గనుచు నాడు కేండ్రించిరటన్!
యాంధ్రా కై తా నెంతగ
యింద్రియ నిగ్రహమొనరిచె యిటనుడివెన్బో !
జిలేబి
ReplyDeleteచెలికత్తె చెళ్ళు మనిపిం
చి లబ్ధి గాంచెను జిలేబి చిన్నమ్మగనన్
నలుదెసల జనుల యచ్చెరు
వుల యమ్మణి రాజ్య మేలు "వున్నతి" గానన్ :)
జిలేబి
ReplyDeleteసంకర సమాసములతో
బింకము గా చాకిరేవు పిటపిట లాడన్
టెంకాయ చిప్ప పగులన్
వంకన చను పండితుండు వాటము గాంచెన్ :)
జిలేబి
~పరార్~
ReplyDeleteలలితా ! జిలేబి బుట్టన
సులభముగా బడితి వీవు సూక్షిని గనవే,
పొలతి, యమాయకురాలా
కలహంసిని నారదీయ కమలనయనియౌ :)
జిలేబి
అమ్మ, ఈవాళ కాశీఖండపు పన్నీటీజల్లులు కురిపించడానికి గల కారణమేమి? కొంత అర్థం అయ్యి కొంత అర్థం కాకుండా ఉంది.
ReplyDelete
Deleteఅన్యగామి గారు,
మనం చదివి 'పారేస్తున్నామని' పదిమందికి తెలియాలి కదుటండీ ! జేకే !
చీర్స్
జిలేబి
కాశీఖండం తరవాత పాండురంగ మహాత్మ్యం చదవండి. నిగమ శర్మ అక్కపాత్ర చాలా గొప్పగా ఉంటుంది.
Delete
ReplyDeleteమూర్ఖత్వంబన నేమోయ్ ?
కార్ఖానాకవిత బేర్చి కామెంటులనన్
చెర్ఖా లాడించటమే
కర్ఖత్ పదముల జిలేబి గావించడమే :)
జిలేబి
ReplyDeleteచతురత తాతా "కాదో"
యి! తురగ వేగము చెవులవి యిట పని గనలే !
కత 'కాదిది', వచ్చెను శో
ష, తరుణ చెవిపోటు సూవె ! సలహా వలయున్ !
జిలేబి
ReplyDeleteజీవి కిన్న రుండు ! జీవము సత్యము
వలయు వారుణి యిట వలయు సోమ
పాన మట, జిలేబి, పారవలెను రెండు
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త
జిలేబి
ReplyDeleteమాయాడువారి మాటల
తాయా రమ్మల జిలేబి తరుణుల పలుకుల్
మాయా జాలము లరయ
న్నాయొజ్జకు, ధరణి యందు నలవియవునటే :)
జిలేబి
ReplyDeleteఇచ్చ లేకుండినను నగ్ని నెట్లు గాల్చు
దన్ను నంటిన వారిని దాహ శక్తి
నిచ్చ లేక క్రుంకినను దహించు నట్ల
తైర్థికుని బొంది యున్న పాతకుము గంగ !
కాశీ ఖండం
ReplyDeleteఓ యమ్మో ! నీ వ్యాఖ్యల
తోయములను విన్నకోట తోడిరి షెర్లా
క్సే యమ్మో జర జాగ
ర్తా! యేమో యెవరికెరుక రక్ష జిలేబీ :)
జిలేబి
ReplyDeleteముంబయి వెళ్తా వంటే !
గుంభనగా యమెరికాయు , గునగున బెంగ్లూ
ర్యాంబ! తమాష కుసుమ జగ
దంబా! మాచన డిటెక్టి వౌ ! హుష్ కాకీ :)
జిలేబి
ReplyDeleteభామాప్సరా ! జిలేబీ !
నీమోము గని మనసునుగని నీప్రాణంబుల్
మామదిని తాకె పద్మ
మ్మా! మము విడువకు విడువకు మా నయగారీ :)
జిలేబి
ReplyDeleteతేటగీతి
-----+
తేట గీతిని జూడగ నేను గంటి
యైదు యేడును యైదును యగును హైకు
తెలుగు పద్యపు మహిమను తెలుసు కొనుడు
పద్య మనెడు జిలేబులు పరిఢ విల్ల !
హైకు
జిలేబి
ReplyDeleteఅనసూయ ! సుమ! జిలేబీ!
వినురో యీయమ్మలార ! విపరీతం బా
యెనుబో మీ యైటము సాం
గ్సను పద్యముల మళయాళ గానము లున్నూ !
జిలేబి
ReplyDeleteతేటగీతి! హై! కూల్ !
చెక్కు వెనుతిరి గిందట చిన్న బోయి
పక్క తడిపెను బాబు సపర్య కోరి
నిగ్గు దేల్చగ నిజమగు నేత వచ్చె
పెగ్గు లాగుచు పటమట పెండ్లి యాడె
జిలేబి
ReplyDeleteదేహత్యాగము దానము
దేహనిపాతంబు దపము ధృతి బరికింపన్
దేహ వియోగ మయోగం
బాహా ! కాశీ పురీకృతావాసులకున్ !
కాశీ ఖండం
ReplyDeleteసౌమ్య రూపంబు వహియించు సజ్జనులకు
బాపమతులకు వికృత రూపంబు దాల్చు
పింగళాక్షుండు దీర్ఘ గంభీర మూర్తి
చండికాపతి ప్రియథుండు దండపాణి !
కాశీ ఖండం
ReplyDeleteఆలింగనమ్ము సేసెం
బాలిండ్లను ముట్టె వదన పద్మము తావుల్
గ్రోలె మగ డనగ నెవ్వం
డా లనగా నెద్ది ? భర్త యతడే నాలిన్ !
కాశీ ఖండం
ReplyDeleteవర్ణముల లోన బ్రాహ్మణ వర్ణ మెక్కు
డాశ్రమంబుల లోన గార్హస్థ్య మధిక
మనఘ ! లక్షణవతి యైన యాలు సూవె
తగిన యవలంబనంబు తద్ధర్మమునకు !
కాశీ ఖండం
ReplyDeleteఆత్మ దప్పించి యెరుగ డన్యంబు నెవ్వ
డాత్మ సంతుష్టు డెవ్వడహర్నిశంబు
నాత్మ నాత్మనె కను నెవ్వ డాత్మ మిథును
డెవ్వ డాతండు యోగ లక్ష్మీశ్వరుండు
కాశీ ఖండం
ReplyDeleteధర్మ నిర్మల హృదయ ! శ్రోతవ్య మాత్మ
తారకబ్రహ్మ నిష్ఠ ! మంతవ్య మాత్మ
సర్వ శాస్త్ర ప్రవీణ ! ద్రష్టవ్య మాత్మ
దంభ రహిత ! నిదిధ్యాసితవ్య మాత్మ !
కాశీ ఖండం
ReplyDeleteఉడ్డి యాన ముద్ర యును మహా ముద్రయు
మూల బంధ గగన ముద్రికలును
సారతర వివేక ! జాలంధరంబును
ననగ యోగముద్ర లైదు సుమ్ము !
కాశీ ఖండం
ReplyDeleteప్రాణాపానవ్యానో
దానసమానములు తృప్తి దలకొన జేయం
గా నోపెడు నది యన్నము
ప్రాణం బన నన్న మనగ పర్యాయంబుల్ !
కాశీ ఖండం
* ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన
ReplyDeleteకోయిల దిరుమల బెరుమా
కోయిల దిరుపతుల గుంభ కోణాదికపు
ణ్యాయతనంబుల మాయం
బై యెక్కడ బోయెనొకొ మురాంతకు ప్రతిమల్
కాశీ ఖండం
ReplyDeleteకదలకుండును మది నెంత కాలమేని
ధర్మ మతి సుకరంబయి కర్మ సాక్షి !
యంత గాలము నరునకు నావహిల్ల
దే యపాయంబు నీ సూక్ష్మ మెరిగి కొనుము !
కాశీ ఖండం
ReplyDeleteఆత్మజుడ వన్న మిత్రుండ వన్న భటుడ
వన్న సచివుండ వన్న నా కెన్న నీవు
నిన్ను నెబ్భంగి వర్ణింప నేర వచ్చు ?
గంఠపీఠాగ్రకరి రాజ ! డుంఠి రాజ !
కాశీ ఖండం
ReplyDeleteసిద్ధి వినాయకు గెడ వర
సిద్ధి ద్రిసంధ్యంబు సేవ సేసిన నెరయన్
సిద్ధించును మానవునకు
శ్రద్ధావంతునకు విభవసంపత్సిద్ధుల్ !
కాశీ ఖండం
ReplyDeleteఉద్దాలక తీర్థంబున
నుద్దాలక నామ ధేయు డుడుపతి మకుటం
డుద్దండ దండ ధర మద
భిద్దోఖట్వాంగు డుండు బ్రియ మెసలారన్ !
కాశీ ఖండం
ReplyDeleteనైన వదనంబు దెరచి బ్రహ్మాండ పిండ
కబళన మునకు జేసాచి కాళ రాత్రి
కాశి శుష్కోదరీ దేవి గదల కుండు
జర్మ ముండకు జెలికత్తె శైలదమన !
కాశీ ఖండం
ReplyDeleteహితము సెప్పితి విన నిచ్చ యేని లెస్స
జగము బాధింప కుండుట చాలు మాకు
దుహి నగరి కన్య యానతి ద్రోచి తేని
యీడ్చికొని పోదు వెండ్రుక లిరియ బట్టి !
కాశీ ఖండం
(మొదటి రెండు పాదాలు జిలేబి కి వర్తిస్తుందా ? :)
ReplyDeleteఅవిముక్తం బవిముక్తం
బవిముక్తం బనుచు బ్రాత రారంభ ములం
దవధాన పరత నెవ్వం
డు వచించును వాడు ధన్యుడు మునిప్రవరా !
కాశీ ఖండం
ReplyDeleteపాడి మెచ్చించె నొక యింతి పంజళమున
నాడి మెచ్చించె లేమ లాస్యమున నోర్తు
పొగడి మెచ్చించె నొక్క లే జిగురు బోడి
కరుణ గలవాడు కాశి నోంకార భర్త !
కాశీ ఖండం
ReplyDeleteమా మనవరాలి చిత్రము
లౌ! మా నందిత జిలేబి లాస్యము లమ్మీ !
ఓమాచన సీ తాకో
కా ! మా పలుకు వినవమ్మ గజ్జెల రమణీ :)
చీర్స్
జిలేబి
ReplyDeleteఅండ దండలు గానగ యమ్మి శశియు
దండిగను తమిళమ్మగ దస్క ములను
గాంచె కోరెనొకొ పదవి, గడగడ యని
బెండ చెట్టుకుఁగాచెను బీరకాయ :)
జిలేబి
ReplyDeleteచదువుకు సంస్కారమునకు
కుదురదు సంబంధమున్ను కూచి జిలేబీ
చదువన చదువన బోయెను
మదియు, వివేకము, మతియును మానవ విలువల్
జిలేబి
ReplyDeleteబెదురక సమస్యల గన
న్నెదురిం చవలెను జిలేబి నిబ్బరముగనన్
కుదురై నజీవితంబను
నది మిథ్య! గనవలె శక్తి నమ్ముచు నీశున్
జిలేబి
ReplyDeleteతగు మనవరాలు ! చేయి తి
రిగిన కళాకారిణి పసిడి యొలుకు చిత్రం
బుగనన్ మీపో లిక యౌ
యగుపించెను సౌష్టవంబు యనపర్తీశా !
జిలేబి
ReplyDeleteనా పిచ్చి నాదహో ! సిని
మా పిచ్చి వదల జిలేబి మనసే రాలే :)
ఆ పిక్చరులో యేముం
దో పర్తీశా ! విడువ నదో మనసేలే :)
జిలేబి
ReplyDeleteమాయమ్మ! తల్లుల పలుకు
లే యమ్మ జగత్తునేలు లేపమ్ము జిలే
బీ! యన్నియు తెలిసిన తరు
ణీ! యనపర్తీశు తెలిప నేయమ్మ వినౌ :)
జిలేబి
దత్తపది
ReplyDeleteధార్మిక మనస్వి సద్గురు
ధర్మము నెరిగిన తపస్వి తన భాషణతో
నిర్మల వచస్వి జగతీ
మర్మంబెరిగిన యశస్వి మమ్మున్ బ్రోచున్ !
గరికపాటి
ReplyDeleteఓ యమ్మో! చిన్నమ్మా !
మాయమ్మ జయల లలితను మాటయడిగితిన్ !
న్యాయమ్ముగాన పన్నీ
రూ యుద్ధముజేయమనెను, రుంజాయింతున్ :)
జిలేబి
ReplyDeleteఏంటోయ్ ! యెంగిలి పీసూ !
యింటెల్ వాడుకనిబెట్టె యిడియట్ యిన్ సైడ్ !
చింటూ జిలేబి బిల్చెన్ ,
కం టెల్ మీ గాడ్ది గుడ్డు ! కంకర పీచూ !
ReplyDeleteఏమయ్య చాకిరేవూ !
శ్రీ మాచన లాంటివారు చిన్నగు ఫాంట్లన్
మీ మిణుకు మిణుకు చెణుకుల
తామెట్లాగయ్య చదువుతారు జిలేబీల్ :)
జిలేబి
ReplyDeleteకొంప గూలె కోట్ల కొలది రొక్కములకు
కాళ్లు వచ్చు నయ్య కంది వరద !
యెన్నిన జను లెల్ల యేమారి రయ్యరో
ట్రంపు చేష్ట లేవగింప ? యింప ?
జిలేబి
ReplyDeleteమురిపెంపు తెలుగు వాళ్ళకు
సరిముంపుగ చర్నకోల ఝాటీ ట్రంపౌ !
మరి సొంపులమ్మ లకికన్
సరిజోదగు యింపులీను సౌధంబేదౌ :)
జిలేబి
ReplyDeleteసినిమా కెళ్తామ్మామోయ్
మునిమాపున రమ్మ నన్ను మురిపెంబాడన్
గనెదమ్ము నీవు నేనౌ
జనరంజక చిత్రమునిక చట్టని రమ్మా :)
జిలేబి
ReplyDeleteవలయును జిలేబి మేలగు
తులసీదళము మనకు, విషతుల్యమ్ము గదా
యలకల కొలికికి జీవగ
తులనివ్వని తోరమల్లి దురిముడి పూవుల్ !
జిలేబి
ReplyDeleteఓ శార్దూల జిలేబీ !
ఓ సరసీ! తేటగీతి! ఓలమ్మమ్మో !
నో! సారి! దుల జిలేబీ !
వేసారితిమమ్మ వేణి వెతవెత తోడన్
జిలేబి
ReplyDeleteతానెయ్యి గిన్నె గొనుచున్
మానెయ్యంబందు యజ్య మావిడ వెయ్యు
న్నో! నే బోతా మాచ
న్నా! నా దారిన, జిలేబి నారద యదిగో :)
జిలేబి
ReplyDeleteకామేశ్వర రావు పోచిరాజు
పితృ సద్వచన చయ మనో
వితృప్త సంతప్త చిత్త వివశాత్మ కృతా
వితృహీనునిం దృణీకృత
పితృవాక్పాలనమె సుతుని వృషలుం జేయున్
శ్రీ పోచిరాజు కామేశ్వరరావు
ReplyDeleteతమాష కుసుమ ! అంబే ! జగదంబే ! పాహి పాహి :)
అసలే పందుం తడిసిన
మిసి ముప్పందుంబగున్ను మిరియాల జిలే
బి! సఖుండా రాజన్నా !
రుసరుస రమణియిటువచ్చు రుంజాయింపన్ :)
జిలేబి
ReplyDeleteపద్యరచనకు గణ,యతి ప్రాస లేల
రా మదిని చిలుకనవచ్చు రాగ భావ
తాళముల జత పదములు తన్ను కొనుచు
నవి యగును మాలికవలెను నాదముగను !
జిలేబి
ReplyDeleteఅనగననగ నెమ్మి యతిశయ మగుచుండు
తిరగ తిరగ వేణి తిమ్మి రెక్కు
మీదు మెప్పు బడసి తినదియె మేలయ్య
విశ్వ దాభి రాజ, విదుర యొజ్జ !
జిలేబి
ReplyDeleteదశరథుడు కైకతో కోపగృహంలో అంటున్న మాటలు:
సీ.
చిదిమినపాల్గారు చెక్కుటద్దములపై
జిలిబిలి చిరునవ్వులొలయువాడు
కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లుమనంగ నం
దరి కనుల్ చల్లగా తిరుగువాడు
బుడిబుడినుడువుల పూర్వ భూపాల గా
ధల నేను నుడువుచో పలుకువాడు
రాఘవా! ముద్దీయ రా! యన్న ఎగిరి గం
తిడుచు హాయిగ కౌగెలించు వాడు
అట్టి పదునాలుగేడుల బొట్టెనెట్టు
లసురభీకర వనసీమ కంపువాడ
ననుచు ఏడ్చితి నెపుడో యపుడు, మరల
నిపుడునీ మూలమున నట్టు లేడ్చుచుంటి!
పానుగంటి
ReplyDeleteఓయీ ఘృతాచి ! మరి యే
మాయెను మావ్యాఖ్యలన్ని ? మన్నింపవలెన్
మాయయ్యలార స్పామున్
బాయెన్ మీ చిరుబురులు సభాసదులారా !
జిలేబి
ఈ పద్యం తేలికగా అర్ధమయిందండోయ్ 👌.
ReplyDelete
ReplyDeleteవృత్తం బేదో యర్థము
బొత్తిగ గాలే జిలేబి బోవే బామ్మా !
గుత్తుగ పదముల బేర్చిన
బెత్తము గొనెదను లతాంగి బెహతరు గానన్ :)
జిలేబి
ReplyDeleteగోదావరి నీళ్లాయే
మేధా దేవిల లితమ్మ మెరిసే తారల్
సాదా సీదా కాదోయ్
గౌతమి తీరపు రమణులు గౌరీ మాతల్ :)
జిలేబి
మీ అమ్మకడుపు చల్లగా, అత్తకడుపు చల్లగా ఉన్నమాటన్నారండీ. చూశారా అందుకే పద్యం అంత సొగసుగా కుదిరింది. :)
Delete
ReplyDeleteప్రస్తుతమున యత్నము గొన
మస్తుగ రాబోవు కాల మందున పుణ్యం
గిస్తరు యూపర్ వాలా
బిస్తరు పరచుచు ఫలముల బీజం వోలెన్ !
జిలేబి
ReplyDeleteమీయమ్మ కడుపు చల్లగ
నోయమ్మో చెబితివీవు నొప్పారెను బో !
మాయమ్మ జిలేబికి తా
నై యిత్తును పదపు సొంపు నరయ జిలేబీ !
జిలేబి
ReplyDeleteశివుడు దాత భోక్త శ్రీ మహాదేవుండు
సర్వమును హరుండు శాశ్వతుండు
శంభు వేరు సేసి సాగింప వచ్చునే
క్రియలు? వెర్రి బేల వయితి ? చెపుమ !
కాశీ ఖండం
ReplyDeleteఅణచునది దంభ ముజ్జగించునది యీర్ష్య
యుడుగునది రాగ లోభ గర్వోదయములు
శాంతి దాంతి తితిక్షా నృశంససత్య
నిరతు డగునది కాశిలో నిలుచు నరుడు !
కాశీ ఖండం
ReplyDeleteదత్తపది- నిధనము - శవము - పాడె - చితి
నీలాంబరి ! తెరిచితివి మ
నో లావణ్యముల, పాడెనొక కోయిలటన్,
మాలిని, ధనమిక పతియే !
కాలపు శైశవము విడుము కాత్యాయినివౌ !
జిలేబి
ReplyDeleteకమలలోచన ! కిన్న రాంగనవె నీవు
నీవు గంధర్వ భామ వే నీలవేణి ?
యప్సరస్త్రీవె నీవు బింబాధరోష్టి ?
రమణి ! నీవు విద్యాధర రాజ సుతవె ?
కాశీ ఖండం
ReplyDeleteసేసినను కాశికా భర్త శివుడు విశ్వ
నాయకుడు లక్ష్మి యిచ్చు దీర్ఘాయు వొసగు
బ్రాభవంబు బ్రసాదించు భక్తతతికి
శ్రీ విశాలాక్షి కృప సేయు జింతితములు
కాశీ ఖండం.
ReplyDeleteతాతా! ఫాంట్లవిబాగుబాగు ! గనలేదాకళ్ళ చెక్కప్ సుమా
ఫాంట్ల ప్రాబ్లెమ్ కాదండీ
మీ బ్రౌజర్ లో వ్యూ శాతం ౧౨౫ చేయండి :)
చీర్స్
జిలేబి
ReplyDeleteఎరుడైటు వంట వమ్మా
యెరుకలసానీ జిలేబి యేమన్నా నీ
గరిమే వేరమ్మా ! తం
పు రావడుల రాములమ్మ పున్నెం కొలదీ :)
జిలేబి
ReplyDeleteఉన్నాడంటున్నారే !
యెన్నటి కైన కనిపించి యేకం సత్యం
బన్నాడా యేలికయౌ ?
యెన్న యెచటగలడు విభుడు యెవరికి తెలియున్ !
జిలేబి
ReplyDeleteఅవనిన్ జనులందరు యిహ
భవ సుఖముల నాడువారు బాంధవ్యగతిన్
గవనముగ జూడ గలరే
యవనారినిగన తపించు యతిభూషణులున్ !
జిలేబి
ReplyDeleteమాటుగా నటు నెవ్వరు మాట జెప్ప
క నటు కళ్ళటు ముంతను గాంచ గాను
గునగున జిలేబి గుప్తమగుచును, యడుగు
తాటి, తోపులోఁ బాలను ద్రాగవలెను !
జిలేబి
ReplyDeleteబంగారు గనివట!జిలే
బింగార్చు నవనవ వజ్ర భింగంపు గనీ !
చెంగున చెంగురులను దీ
ర్చంగను కందంబు గూర్చి రవళించు సుమా !
జిలేబి
ReplyDeleteఅంతర్నేత్రము నటు ర
వ్వంత గ న విభుడటు యెంత వటువో తెలియున్
గొంతయు లేడు యనంతుడు
వింతగ పేస్మేకరు,తను విచ్చిన సూక్ష్మం !
జిలేబి
ReplyDeleteరొంబో రొంబో సరిదా
తంబీ పన్నీరు సెల్వ తంబి జిలేబీ !
యేంబా యినిక్కి చొల్వా
రాంబ గవర్నరు డమాలె ఢమ్మాలే దా :)
జిలేబి
నల్లతంబి సమస్య:
Deleteతప్పని తల్లిని తిట్టియు
చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ!
Deleteతప్పని తల్లిని తిట్టియు
చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ !
పప్పులుడకలే దయ్యా
కప్పులు సాసర్లికకడు గవలెను శాస్తీ :)
జిలేబి
నిప్పులు జెరిగెడి టెండలొ
Deleteఛుప్పున నడిచేటి రాము జూసిన వాడై
తప్పని తల్లిని తిట్టియు
చెప్పులు దోచెగద తంబి ఛీఛి జిలేబీ!
ReplyDeleteమనసన్నది రాలేదో
యి, నాపదములటు సయాట యిసుమంత గనన్
మనరాముని పదముల పలు
కును పలుక తగు సమయంబు కుదురన వీలౌ !
జిలేబి
ReplyDeleteవారటు జెప్పిరి జెప్పిరి
వీరటు పలుకుల చమక్కు విదురుల పలుకుల్
సారము గాంచితి వటవే
పారమ్యంబున్ స్వకీయ పాకము గానన్ !
జిలేబి
ReplyDeleteఆవొక్కటి తెలియగనన్
బావుణ్ణనుకొనెనుగాద పారుడు జూడన్
తా వలచిన చిత్సత్యము
నావన్ గ్రమ్మెను జిలేబి నాకము వోలెన్
జిలేబి
ReplyDeleteతెలియదు తెలియదనుచు నిటు
ల లలితముగ యుండ నెట్లు లభ్యంబగునౌ
ఫలములు నరసింహన్నా !
కలకలముల లేపవలె సకలము తెలియనౌ :)
జిలేబి
ReplyDeleteబండన్నా! కిను కేలర
గుండమ్మయెడల జిలేబి ఘుమఘుమ లెడలన్ :)
గండమ్మికవచ్చు సుమా
చెండా డెదమిక గణగణ చెకచెక తోడన్ :)
జిలేబి
ReplyDeleteపన్నీరాయెను పళనీ !
కన్నీరే మిగిలెను శశికళకు జిలేబీ !
మున్నెప్పుడు కనరాని స
మున్నయ మిది!తమిళనాడు ముందే మగునో :)
జిలేబి
ReplyDeleteఅంతయు నొకటే నండీ !
యంతయు బంగా రమేను ! యసలిది యేనౌ
వింతగ గాజులు గొలుసులు
కొంత ధనము దస్కమున్ను కుసుమ జిలేబీ :)
జిలేబి
మీ బ్లాగుని ఏం చేసేరు? ఫాలో అప్ కామెంట్లు రావటం లేదు?
ReplyDelete
Deleteఫాల్ అప్ కామెంటులు అనగా ఏమి ?
జిలేబి
Follow up comments of posts
DeleteIt appears the google is not sending follow up comments of any blogger.
Delete
Deleteఅంతా విష్ణు మాయ గా ఉంది : ఎక్కడికి sending అండీ ?
జిలేబి
ReplyDeleteపుట్టక మును పుట్టినదో
పుట్టిన తరువాత బుద్ధి పుట్టినదో రా
పట్టికి శ్రీహరి పదముల
పట్టు విడువనట్టి భక్తి ; భాగ్యము గాదే !
బృందావనము వేంకటపార్వతీశ్వర కవులు
ReplyDeleteకమలనిభచరణ కోమల
కమలకుసుమపాణి, కనక కమలానన, యి
క్కమలదళ నయన నిజముగ
కమలామల గేహ యైన కమలయె సుమ్మీ !
బృందావనము
ReplyDeleteనడచునెడ నిలచు నెడలన్
గుడుచు నెడల ముడుచు నెడల గూర్కొను నెడలన్
గడయైన మఱచి యైనన్
విడువదు రాకన్నె కృష్ణ విగ్రహ మెపుడున్
బృందావనము
ReplyDeleteబాలా యెంతటి బేలవె
యాలోక విభుండు సులభుడని యెంచితివే
లీలా మయుడాతని యి
ల్లాలగు భాగ్యంబు మానవాంగన కగునే !
బృందావనము
ReplyDeleteఫాలోయప్పు కమింట్లు బోయె గదవే భామా జిలేబీ గనన్ :)
జిలేబి
ReplyDeleteజీవితపు సింహ భాగము
లో విస్మృతి కిప్పటి వలె లోనవ లేదోయ్ !
యీ విపరీతము గానన్
మావే బంగరు సమయము మహిలో లలితా :)
జిలేబి
ReplyDeleteకొచ్చెను పేపరు టప్ఫుగ
యిచ్చిరి గురువర్యులకట ! యివ్వవ లెన్ మా
కిచ్చట గ్రేస్మార్కులనన్
మెచ్చుచు పద్యము లనయ్య మీరు, భళిభళీ :)
జిలేబి
ReplyDeleteఓకన్ను వేసి తెలుపుడు
మా కందంబమరెనో సమాసము సరియో !
శ్రీ కామేశ్వర రావుల్
మాకున్ తెలుపుదురుగాక మా విన్నతియౌ!
జిలేబి
ReplyDeleteకంచంబులోన యన్నము
కొంచెము లేదు సరి తీరు కోరిక లన్నీ
దంచిరి గాద కథలనుచు
పంచాంగము చూచి బసిని పక్కున నవ్వెన్
జిలేబి
ReplyDeleteకిట్టించితినయ్యా రే
రాట్టు గగనమణిని శంకరాభరణమునన్
పట్టువిడువను సుమా స
మ్రాట్టును విదురుల సదనపు మణిని జిలేబీ !
జిలేబి
ReplyDeleteశశికళ ! సుధాకర ! యిళవ
రసి!పన్నీర్సెల్వ! పళని ! రాజ్యం బేలన్
కసకస పుసపుస లాడిరి
పొసగుట లేదౌ జనులకు పోరామిగదా !
జిలేబి
శంకరాభరణమదొక సర్కసవగ
ReplyDeleteతెర తెరువగ బఫూనోడు పరుగునొచ్చు
అందమైన యువతులింత గంతులేయ
లయను టేమరు కొరడతో భయము లొలక!
...సరదాకు వ్రాసితిని...
Deleteఏక్ కలి బెలగ్ బెలగ్ పత్తియా :)
జిలేబి
ReplyDeleteమంచునధిగమించెను తె
ల్లంచులనూ సూర్యుడు కమ లాప్తుని పత్రం
కుంచెను సాగించెనుగద
వింజోవి విరియ జిలేబి విశ్వవినోదం !
జిలేబి
ReplyDeleteకరుణ! కరుణ ! వలయునురా
యరుణోదయ భాస్కరన్న! యన్యాయముగా
దుర ! సామీ ! నాపైనన్
సురటీ యూదంగతగును సూర్యాత్మజనౌ !
జిలేబి
ReplyDeleteఉండే వారు నిజానికి
గుండెలదురు చురుకుచొరవ గుమ్మలు నాడౌ
నిండుగ జిలేబు లయ్యిరి
మెండుగ పతులెడ మురిపెము మీరన్ లలనా !
జిలేబి :)
ReplyDeleteవసవస లాడెడి వయ్యా
రి సయాటలనన్ జిలేబి రింజిమ్ రింజిమ్
మిసిమిసి పూబో డియ రూ
పసిబాలునిఁ బెండ్లి యాడెఁ బ్రౌఢ ముదమునన్ :)
జిలేబి
ReplyDeleteపోషక రూపంబల్లుడు
భేషౌ విష్ణువన జామి పెద్దమ్మయునౌ!
ఆశీస్సుల కోరి పదము
లాసాంతము కడుగుదురు యిలతయేనులిడన్ !
జిలేబి
జిలేబి
ReplyDeleteబుధజన సాంగత్యము వల
యు, దుండికిన్ రాజు వారి యుక్తియు వలయున్
సదరము బండి బతుకు తెరు
వు ధరణి లో నారద దరువులును జిలేబీ :)
జిలేబి
ReplyDeleteఅలుపెరుగని యెవరెడివీ
జిలేబి పొగిడిన దినముల చిక్క పొగిడితిన్
పలుకుల దునుమాడుట వల
దు, లలన, బండినడువ వలె ధుమధుమ వలదోయ్ :)
జిలేబి
ReplyDeleteభూతద్దము బెట్టుకొనుచు
వాతలు వేయగ డిసైడ వంగ జిలేబీ,
తాతన్నాపనెవరితర
మౌ! తొయ్యలి కుంతి పాపమా కర్ణుండౌ !
జిలేబి
పరార్
ReplyDeleteకామెంటు పెట్ట రాదే
యేమరుచును పెట్టగాను యెప్పటి కిన్నీ
తామై వెనుకాడ వలదు
యీ మాటవినవె జిలేబి యిక్కట్లుండవ్ :)
జిలేబి
ReplyDeleteచెన్నై లోనున్నారా !
పన్నీ ర్కన్నీ రు తుడువ పట్టణ మొచ్చే
రన్నది తెలిసెన్ బండికి
విన్నా వంటే జిలేబి విదుషీ రమణీ :)
జిలేబి
ReplyDeleteనడినెత్తికొచ్చె నౌ సూ
ర్యుడు గడగడ నడకలన చురుక్కు జిలేబీ
సడుగుడు లాడన వచ్చె గు
రుడిని గనంగ నొకటిచ్చె రుంజాయింపౌ :)
జిలేబి
ReplyDeleteరీటయిరుడుబండ్లకిటన్
రోటీ కపడా మకాను రొక్కము లివ్వన్
చీటికి మాటికి మహిలో
కూటికి వచ్చును టికాణ గువ్వల చెన్నా :)
జిలేబి
This comment has been removed by the author.
Delete"ప్చ్...
Deleteగుట్టు చప్పుడు లేక, ఉట్టి దాపెట్ట తెలియక
నట్టు జారి గుట్టు రట్టు చేయడ మెంత
పుట్టి ముంచెర, అకటా పుట్టు జగడపు
పట్టి మొట్ట చేతికి చిక్కి వట్టినై పోతిరో వినుమురన్నా!
:)"
ReplyDeleteపట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు గట్టి గాను గొట్ట చట్టు బూమురాంగగునుర బండి యన్న, వినుము
గుట్టు తెలుప రాదు తెలుప చిక్కు గట్టి గొచ్చు, గిట్ల గొట్ట గాంచు సరి జిలేబు లొచ్చు ఖతరునాకు గనుము
విట్టు వేయ వచ్చు జోడు విట్టు నిట్టు బట్టు బట్టి వీలు గాను విజయమంగళ రగడ వోలె గండమ్ము
నెట్టు మీద నెక్కు నెట్టి వేయ జూడు మయ్య రావు నేటి రీతు లివియె గాద నెట్టు లోన నిజము నమ్ము !
జిలేబి
This comment has been removed by the author.
Deleteకొట్టియో తిట్టియో గిల కొట్టియో జగడము బెట్టియో గొంతెత్తున పనిముట్లను పెట్టున విసిరెట్టియో
Deleteగొట్టాము నెత్తిన గొట్టియో గట్టిగ దూరము నెట్టియో పై పట్టున గూట్లోని బెట్టును ఫట్టున నెట్లోన బెట్టియో
రట్టు జేయుచు నిట్లన ఆరట్లన విట్లన బొట్టిని నట్టువాడించియో ఫిట్లొచ్చ చిట్లి నవ్వ నదేమి జెట్టీ!
ఛట్! ఇదె బెట్టరు, చట్టున తట్టా బుట్టల పట్టి చెట్టూ పుట్టల దారట్టి బోయెద రాతలిక గుట్టుగ కట్టివెట్టి
...హ్ హ్ హ్ ...
లోల...
Deleteసంసారి సన్యాసమా :)
జేకె
చీర్స్
జిలేబి
ReplyDeleteమబ్బులు తొలగె గగనమణి
యబ్బురము గదా జిలేబి యందము గానన్
నెబ్భంగిని వీలగునౌ
కబ్బమున వినురతనమ్ము కథను తెలుపగన్ !
జిలేబి
ReplyDeleteకలజూచె మహా రాణి, స
కల భోగముల కలహంసి కనుకొలకులన
న్నెలవు చెలిని, చిలుకల పలు
కుల, టంగని పిలిచి సీత కురు లల్ల మనెన్ !
జిలేబి
ReplyDeleteభార్యామణి నప్పు నడుగు
కార్యంబగు భమిడిపాటి ఘనుడు జిలేబీ
యార్యుల సలహా సరి చా
తుర్యంబన యిదియె యిచ్చి పుచ్చుకొనదగున్ :)
జిలేబి
ReplyDeleteచీకటిలో మగ్గు జిలే
బీ! కనిపించదు గద సురభిత హిందూత్వం !
శాకిని ! ఢాకిని హాంఫట్ !
బాకా నూదెదను మూల పథమది మాదే !
జిలేబి
ReplyDeleteఅమ్మ వారికి మక్కువ యాడ పిల్ల
లనగ వత్తురు కసబుస లాడుచు నిట
గాంచుదురు నేడు బండన్న, కాచు కొనుడు
యెక్కు వగునౌ జిలేబమ్మ లెంప కాయ :)
జిలేబి
ReplyDeleteఅయ్యో మాచన గారూ
సయ్యా టలనగ కమింట్లు సారీ కాదం
డయ్యా మీపై చంద్రిక,
నెయ్యపు తొయ్యలి జిలేబి నెరజాణలపై :)
జిలేబి
ReplyDeleteచాలెంజులు వలదన్నా
జిలేబి బటనొక్కటి గని జిలిబిలి పాటల్
గలగల లాడించు ను సూ
వె! లవణి తీరుగని వాయి వేగము గానన్ :)
జిలేబి
ReplyDeleteరాజ శేఖరుడనెనోయి రత్నసువున
హిందువులు, యేసు ప్రాఫేటు లందరున్ను !
లెస్స! గనెనోయి కతల జిలేబి , మేలు
చర్చిలో సంధ్యవార్చెను సాయబయ్య.
జిలేబి
ReplyDeleteముసలావిడాయెను జిలే
బి! సయాటల మరిచెనోయి బీలేజీ బీ !
కసకస బుసుబుస లాడెడి
రసజ్ఞ నిదురో యెనోయి రావడి బోవన్ :)
జిలేబి
ReplyDeleteసద్దు మణుగు చుండె సభికులు డస్సిరి
గిట్టు బాటు లేని గీర లేల !
పొద్దు బోయె నమ్మ బోవ దగు జిలేబి
ఫేసు బుక్కు గాడ భేషు గాన :)
జిలేబి
ReplyDeleteపెళ్లాముల కోసము గా
దల్లా కొరకై యహమ్మదనుయాయులు బి
స్మిల్లా హిర్రహమానన
ముల్లోకములు పొగుడంగ మూలంబాయెన్ !
ReplyDeleteసినిమా పైత్యం బెక్కువ
గనవచ్చెగదా జులాయి గాళ్లందరిలో
ఘనుడౌ మాచన విశ్లే
షణలన్ చదువవలెనోయి చక్కని చిలుకా :)
జిలేబి
ReplyDeleteమొసలాయె ముసలిగ జిలే
బి! జాము వేగు దరిగాన భీతిల్లగన
న్నసలే వలదౌ! బండి యి
రుసులటు నిటు దిప్పి వేయు రొంజుడు లాడన్ :)
జిలేబి
ReplyDeleteతనయింటి పేరు మధ్యన
తన కొప్పదు ఖాళి జాగ, తరుణి జిలేబీ
వినవే విదురులు నిన్జూ
చి నేడు కాపీల జేయ చిరుచిరు చిరులే :)
జిలేబి
ReplyDeleteబొత్తాముల నొక్క మరిచి
చిత్తంబు లలర జిలేబి చీర్సు టపానున్
కొత్తగ వేయ మరిచితిన్,
చిత్తము, ముదుసలి సమయము చిక్కుల దేల్చెన్ :)
జిలేబి
ReplyDeleteహౌ క్యూట్ టపా యిది గదా !
పెక్యూ లియరు తెలుగోళ్ళు పెద్దచదువుల
న్నైక్యూ లన్గాంచి తమ య
నూక్య మగు తెలుగును మరిచి నోడిరి యిలనౌ !
జిలేబి
ReplyDeleteముసలై పోయి మరిచి పో
యి చల్ల నౌ మజ్జిగ సరి యించితి నయ్యా !
విసిరెద టపాను మరునా
డు జిలేబమ్మ కతలెల్ల డుమ్మా గావన్ :)
జిలేబి
ReplyDeleteఅరవం వాడు మొళి ( ఆ ழி అరవానికే సొంతం) అన్నాడు
ఆంగ్లేయుడు మదర్ టంగ్ అన్నాడు)
తెలుగు వాడు సంస్కృత పదమైన భాషను అరువు తెచ్చుకున్నాడు!
భాషను తెలుగులో ఏమందురు ?
భాషకు సరిపడు తెలుగు పదము లేదు
యుత్సవము లేల యన్నరో యున్న తెలుపు
డచ్చ తెనుగున భాషకు ఢంక బేర్చి
జరుప తగు దినోత్సవముల చక్క గాను
జిలేబి
నారదా !
ReplyDeleteహైకూలు :)
రోడ్డును
డివైడు
చేస్తోంది
రొష్టు గీర
**
బొడ్డు
అందాన్ని
తిరగేసె
బోడి గుండు
**
మెట్ల
పైనించి
బొమ్మలమ్మి
తిరిగింది
*"
గిట్ల
రాయి
హైకూలను
జిగి జిలేబి
**
తేటగీతి
రోడ్డును డివైడు చేస్తోంది రొష్టు గీర
బొడ్డు అందాన్ని తిరగేసె బోడి గుండు
మెట్ల పైనించి బొమ్మలమ్మి తిరిగింది
గిట్ల రాయి హైకూలను జిగి జిలేబి
జిలేబి
ReplyDeleteపండితోత్తముడను పేరు పడసినాడు
దేవదేవుని సత్కథల్ తెలిపినాడు
దాసనారాయణాఖ్యను దనరినాడు
అట్టి మద్గురువును భక్తి నభినుతింతు !
శ్రీవేంకటేశ్వర కర్ణామృతము
సోమయాజుల సూరదాస కవి
ReplyDeleteఏమి చేయుదు దినములు నెగిరిపోయె
నింకనేమౌదునో యను శంకలాయె
నిన్ను గానక కన్నులు నిలిచి పోయె
విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !
సోమయాజుల సూరదాస కవి
ReplyDeleteరాముడవు నీవె శ్రీ బలరాముడవును
కృష్ణుడవు నీవు శ్రీమహావిష్ణు వీవు
నీవులేనిది లేదెందు నీరజాక్ష
విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !
సో సూ దా క
ReplyDeleteనవరసంబుల కందని నల్ల వాడ
వెన్ని జేసితివని వ్రాతు నెరుక తోడ
మూడుకన్నుల వేల్పైన జూడగలడె
విమలగిరి వాస తిరుపతి వెంకటేశ !
సో సూ దా క
ReplyDeleteహరహర శంభో శంకర
వరహా రంబై జిలేబి వరుసగ జపియిం
చు రవాళి, చంద్రమశ్శే
ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!
జిలేబి
ReplyDeleteమందమతి భార్యలు సదా
తొందర బెట్టుచు రమణుని తోలెదరు సుమీ !
యిందువదన! పెనిమిటి నీ
డెందపు రీతి పనిజేయ రెచ్చల యేలన్ :)
జిలేబి
ReplyDeleteఏమండోయ్ లక్కుపేట రౌడీ గారు కుశలమేనా :)
(మత్తు వదలరా నిద్దుర మత్తు వలదురా :))
మాలికన నా మనో డై
రీ లావై టాపు గాంచె రించోళీనన్ :)
మీ లాజిక్కులు మళ్లీ
యేలా చిక్కెను జిలేబి యేమరు లేలా :)
చీర్స్
జిలేబి
నారదా !
బ్రేవ్ ! ( తెలుగు బ్రేవ్ )
ReplyDeleteనకులము వలె యన్నానిమ
సు కిరికిరి వలదు జిలేబి సూపరు సుమ్మీ !
యెకసక మాడుచు కిసిమిసు
లకుముకి చెకుముకి సురసుర లాడన్నేలా :)
జిలేబి
ReplyDeleteవాత్సాయనుడు జిలేబీ
వాత్సాపై వచ్చెనోయి " వాగేశ్వరు" లా
దిత్సుల దీర్చన్, వలదే
వత్సల! మనకసలు వలదు వాత్సాపు సుమా !
జిలేబి
ReplyDeleteహరహర శంభో శంకర !
ఈశాన! శంభు ! ఆనం
దా! శంకర! శివ ! మహేశ! దహనాంబక! దే
వేశ! దిగంబర ! ధూర్జటి !
కాశీనాథా! కపర్ది ! ఖట్వాంగధరా !
జిలేబి
ReplyDeleteఆషా మాషీ కాదోయ్,
ఆషీమా యేమి చెప్పె ? ఆవిడ చెప్లే :)
ఘోషలు చేసిరి తెలుగును
ఘోషా నించి విడుదలకు గోజీ గోష్టీ :)
ReplyDeleteకందము డెందపు చందము
చందన గంధము జిలేబి సారము లద్దన్
నందన వనమున పద్యము
కెందమ్మియతావి గూడి కెంపులు జేర్చున్
జిలేబి
ReplyDeleteఒళ్లంత బూడిద భయద!
యిల్లట నౌ వల్లకాడు యీశుడ వంట
న్నుల్లము పొంగెను దేవా
చల్లగ చూడుము కపర్ది! శంకర ! శంభో !
జిలేబి
ReplyDeleteకొసమెరుపుల సుశ్రీ! కథ
కసలౌ ట్విస్టు నటు పెట్టి కప్పెట్టగన
న్నసలైన దొంగను మరి తె
లుసుకొను టెట్లౌ జిలేబి లుకలుక విననౌ :)
జిలేబి
సుశ్రీ గారి కొసమెరుపులు బాగుంటాయి. కానీ ఇబ్బందేమిటంటే వారి బ్లాగ్ లో వ్యాఖ్య వ్రాయాలంటే అంత తేలిక కాదండి. Comments on this blog are restricted to team members అని ఓ హెచ్చరిక కామెంట్ బాక్స్ క్రింద కనిపిస్తుంది. ఏవిటో తెలియదు. ప్చ్, మెచ్చుకుంటూ వ్యాఖ్య వ్రాద్దామన్నా మన బోంట్లకు వీలవదు (ఒకప్పుడు వీలయ్యేది; ఇప్పుడెందుకు restrict చేసారో?) 🙁. ఈ feedback ఇద్దామన్నా వారి బ్లాగ్ లో వీలవదు, అందువల్ల మీ బ్లాగ్ లో వ్రాస్తున్నాను (టాపిక్ వచ్చింది కాబట్టి). సరే వారి బ్లాగ్, వారిష్టం అనుకోవడమే 🙏.
ReplyDelete
ReplyDeleteఆ టీం మెంబర్లెవరో ఎప్పుడూ కామెంట్ పెట్టి చూళ్లే :)
జిలేబి
🙂
Delete
ReplyDeleteశరణాగతి నాడి జిలే
బి రాముని కొలువ మనము సుభిక్షము గనుచున్
శరపంక్తి తలపులు తొలగి
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్
జిలేబి
ReplyDeleteరక్తుడు విరక్తుడాయెన్
శక్తియు శివమును గురువును సాంఖ్యంబవగన్
భోక్తయు భుక్తము నొకటై
భక్తుని దైవమ్మె కొలిచి వరముల నందెన్!
జిలేబి
భక్తి ముదిరి భోంచేసెను
ReplyDeleteభుక్తాగ్రేసరుడు నిధులు , పూజలు లేకన్
శక్తి దొరగి బ్రతిమాలుక
భక్తుని దైవమ్ము కొలిచి వరముల నందెన్ .
ReplyDeleteసప్తాశ్వంబుల సారథి,
తప్త హృదయ మరువపత్ర తత్వంబులన
న్నాప్తుని యుషోదయముల
న్వ్యాప్త మహీతలపు చిత్ర వాసక మరువం !
జిలేబి
ReplyDeleteఅలకేలరా టపానన్
వలపుల గర్మాగరమ్ము వయ్యారంబౌ
పలుకుల చూడ తెరచు కొన
నలతేల కమింటు బాక్సునకటు జిలేబీ !
జిలేబి
ReplyDeleteపరుగున వచ్చెడు భాస్కరు
ని రసమయ పదముల నియమ నిష్టల రీతిన్
నిరుడు కురిసిన హిమసమూ
హ రుక్కులవి, లలితమైన హర్మ్యంబగుచున్ !
జిలేబి
ReplyDeleteగోజి వారలము జిలేబి, గొప్ప వార
మమ్మ! విద్వత్తు, లాలిత్య మలక మెరుపు
శోభయు గలవారము!యొజ్జ సొబగు గాంచు
బులుసు రామ గోవింద శాస్త్రులు నిజమరి !
జిలేబి
ReplyDeleteతాడిగడప కవి రాయా !
చాడీకత్తియ జిలేబి చార్మీ గాదోయ్ !
గూఢముగాన పదమునటు
రూఢింపగ వాడినాను రుబ్బుచు రోలున్ :)
ReplyDeleteగోజి వారలము లలిత, గొప్ప వార
మమ్మ! విద్వత్తును, జిలేబి మలక మెరుపు
శోభయు గలవారము! యొజ్జ, సొబగు గాంచు
బులుసు రామ గోవింద శాస్త్రులు, నిజమరి !
జిలేబి
ReplyDeleteపనిచేయని టెంప్లేటులు
మన బండన్న వరులకటు మర్షము నేర్పెన్
పనిలేని జిలేబమ్మటు
గునగున వచ్చెను డిలీటు గోళీ లాడన్ :)
జిలేబి
ReplyDeleteఇదియొక కవిసమయము విను
మ! దగు పదములను సమాసమను పేరిట ది
మ్మదిరుగు రీతిని బేర్చ న
లు దిక్కులలరంగ వలయు లూటీ పడుచున్ :)
జిలేబి
ReplyDeleteఇదియొక కవిసమ యము విను
మ! దగు పదములను సమాసమను పేరిట ది
మ్మదిరుగు రీతిని బేర్చ న
లు దిక్కు లటు పిక్కటిల్లు లూటీ పడుచున్ :)
జిలేబి
ReplyDeleteఅతడు టమోట కథల నా
ర్ద్రత జొప్పించినటి సుంక రుడు సుశ్రీ ! విం
త తళుకులను కొసమెరుపుల
ను తనకథల మలకమెరుపును సవరన గనెన్ !
జిలేబి
ReplyDeleteసాధు వసాధువు లనుచున్
జోదుల రీతి సిగపట్లు జోరుగ గనుచున్
బాదుడు కవివరులము మే
మౌ ! దురదలన నిదియేను మౌనులకున్నూ :)
జిలేబి
నారదా!
ReplyDeleteఏదో భయంబు గాయు
న్నది బండన్న, విను, మాచనార్యుల పలుకుల్
ప్రోదిగను, జిలేబీ యే
దో దావానల మిటులన దోసెలు గనునౌ ! :)
జిలేబి
ReplyDeleteతడబాటును కనవేమిర
యెడబాటునటు గనవేమి యేమని చెప్పన్
విడనాడకు నను వీడకు
జడిముద్దుల ఝరి జలజల జవ్వన మురళిన్ :)
జిలేబి
ReplyDeleteఇది యది కాదోయి జిలే
బి,దీనికిన్ని మరిదానికి, యెరవు గలదే
యది వేరిది వేరుగదా
యదియదియే యిది మరి యిది, హమ్ముల గంటిన్ :)
జిలేబి
ReplyDeleteహనుమంతుడే కదా ర
క్ష నూతనత్వము నొసంగ క్షతగాత్రులకున్
గన యమెరికాకు మనకు
న్ను నెల్లరకును గల దిక్కు నున్నతి గానన్
జిలేబి
ReplyDeleteబ్లాగు గలాటా మొదల
య్యే! గుండమ్మయిక కిక్కు లేమిచ్చున్ ? స్వా
మీ! గురువర్యుల గతియే
మౌ! గుణికి తెలుపుము నాకు మాచన వినతుల్ :)
జిలేబి
ReplyDeleteకారెరుపు నాకు నచ్చును
దోరగ వేయించినవియు దోసిలి గానన్
మారంగమ్మత్త జిలే
బీ రహదారిన తెలిపెను బెహతరు గానన్ :)
జిలేబి