ఒక వాత్సాపు కథనం :)
అన్ని కాపీ హక్కులు అందరివి.
*తెలుగు - యొక్క గొప్పతనం*
♦️ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
♦️ మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
♦️ ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
♦️ క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
♦️ చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
♦️ ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
♦️ త థ ద ధ న……నాలుక కొస భాగం
♦️ప ఫ బ భ మ……..పెదవులకు
♦️ య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
♦️ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది
♦️తెలుగు భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
♦️తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ
సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేము.
♦️తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
♦️తెలుగులో మాట్లాడండి. .
♦️తెలుగులో వ్రాయండి. . .
♦️తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
♦️తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . .
ఇదండీ తెక్నీకు :)
ఇట్లు
మంద్ స్మిత్ వదన్ హాఫ్ విండ్
దరసల్ హౌస్ ఉజ్జ్వల్ ఉంద్ మికి :)
మందస్మిత వదనారవింద దరహాసోజ్జ్వలనముఖులమై వెలగటమెలా?
ReplyDelete:)
వెంటనే ఈ తెక్నీకు అందిపుచ్చుకోండి
భలే మంచి చౌక్ బేర్ :)
జిలేబి
meeku meere saati
ReplyDelete-
ReplyDeleteప్రారంభమాయె నాశ్రమ
మే! రా గలిగిరి జిలేబి మిత్రుల్ శిష్యుల్!
ఆరునెలల శ్రమ ఫలితము
ప్రేరేపించె పరమాత్మ శ్రీరస్తు యనన్
ఏదేదో జరిగిపోతాంది :)
జిలేబి
-
ReplyDeleteనమకము కాదోయీ చక
కము! కల్పిత మైన మేధ గాన "కమే"! కృ
త్రిమ మేధస్సనటము క
న్న మేలటంచు తలచితి సునాయాసముగా!
జిల్ జిల్ జిలేబి
బూడిదలో పోసిన ప
ReplyDeleteన్నీరను నానుడియు తింత్రిణీ ఫలమును నా
నీరమ్మున పిసికిన కత
తీరు తమరు తెలిపిన కథ తెరగులొకటకో ?
-
ReplyDeleteపిల్లికి మాత్రము హెయిరు స్ట
యిల్లుండంగాను తప్పయినటులకో ? అ
మ్మల్లార! అయ్యలారా
పిల్లలు తిరు బోనగిరికి విశదించండీ!
-
ReplyDeleteబుజ్జమ్మేను తెలుపగల
దుజ్జాయింపుగ బిడాలమునకు గలదకో
గజ్జుగెలయు బొచ్చొ తలయొ!
వజ్జల మాచన తెలివిడి వచ్చున మనకున్
జిలేబి
-
ReplyDeleteరాయి వైనను పరమేశ్వరా హృదయపు
కల్ప నా శక్తి రూపముగా నిలచిన
వాడి వైనను నీవె పరాత్పర నను
గాచు స్వామివి దైవము గగనకుసుమ!
జిలేబి
-
ReplyDeleteసదమల గురువుల మాటా!
అదియేమొ పరాయిభాష ! అర్థమవదు ! మా
చదువులరకొరయినను త
ప్పదు బ్లాగు టపాల వెల్లువ నరసరాయా!
జిలేబి
-
ReplyDeleteనరుడెవ్వడు ఢీకొట్టం
గ రయ్యనుచు వచ్చు నమ్మ కంద జిలేబీ
పరుగులతో వచ్చి గులా
బి రాధనముతోడొసంగు విజ్ఞత తోడై!
జిలేబి
విందుల విధుషీమణి , రా
ReplyDeleteకం దలచి , కనులు చెమర్చె , గతము స్మరించన్ ,
అందు కొనుడు , హిత భాషిత
కందమ్మా ! మంగిడీలు 🙏 , ఘనులు , జిలేబీ !
-
ReplyDeleteరండి రాజన్న ! మా బ్లాగ్పురమ్ము నకిదె
స్వాగతమ్ము! చాన్నాళ్లకు సదనమందు
దర్శనమ్ము! బండివరు మధ్వాసవంపు
కొప్పరింత, ఘాటు, తెలిసె కొల్లకొల్ల!
కుశలమాండీ !
జిలేబి
అనురాగ రాగ వల్లిత
ReplyDeleteఘన మానస మున్న ఘనులు గాన , జిలేబీ
ఘనులకు , వందనములు , హిత !
మును మీ రగుపడమికి , మనములు కలతవడెన్ .
“జిలేబి” గారు,
ReplyDeleteఇవాళ (నవంబరు 30) గురజాడ అప్పారావు గారి వర్ధంతి 🙏. ఆయన మీద మీరో పద్యం కడతారేమో అనుకున్నానే 😏.
ఎవరండీ ఆయన ? సేటు బ్యాంకులో గుమాస్తా గా పనిచేసేరా ఏమైనా ?
Deleteపెద్ద గురువు లెల్లరు వచ్చి
Deleteబెత్తము తో వాయించక మునుపే
ఓ కితాబు పడేయడం మంచిది :)
గురజాడ తెలుగు వారికి
దొరికిన ముత్యాలసరము! దోచెను కవిశే
ఖరుడై కన్యాశుల్కమ
ను రచన తోడెల్లకాలము నిలచి మదిలోన్
వికోనరా
వారి కోర్కెగా
జిలేబి
బెత్తాలకు జడియుదురా !
Deleteఉత్తది , బెదరదు జిలేబి , ఓ యబ్బో ! ఆ
చెత్తల తాటాకుల , ఈ
జిత్తులు , మనకాడనా ! ఇసీ ! చెల్లదు లే !
“జిలేబి” గారు,
ReplyDeleteమీ వెటకారానికి హద్దు లేదా?
గురజాడ తెలియనివారు “దున్నపోతై పుట్టున్”.
నేను కోరితే పద్యం కట్టారా ? ఎవరూ కోరక పోతే తెలుగు తేజాల్ని పట్టించుకోరా? వెరీ బాడ్.
వెటకారానికి హ
ReplyDeleteద్దే విశ్వంకరమున కనదేమి జిలేబీ !
హా! వెరి బ్యాడ్! తెలుగు జనుల
వేవెల్గుల తలచరే కవిత్వపటిమలన్
జిలేబి
-
ReplyDeleteఉప్పు ఉప్పటంచు ఉప్పును దట్టింప
వ్యాధు లెల్ల జేర పరితపించు
టేల భాస్కరా! విరివిగాను కాయగూ
రలను గైకొనండి రాధనమదె!
జిలేబి
తాళపు కప్పను మెష్షుకు
ReplyDeleteమాలవలెను కట్టివేసి తాళపు చెవి నే
జాలీ గా వేయ నదిని
బాలా ప్రేమ అమరమగు చాలా తెలియన్ :)
జిలేబి
-
ReplyDeleteమోతాదున ఉండాలోయ్
తాతల పలికిరచట వెటకారమ్ము ! జిలే
బీ తగు మోతాదు వలయు
నేతావాతా సకలము నీ పై కలదోయ్
జిలేబి
కటు కారము , వెటకారము
Deleteఅటు నిటు కన్ఫ్యూజు జేసె , అరవ జిలేబీ ,
వెటకారపు సాంబారును
నిటలాక్షా ! తినుట లేన ? , నీవిక నుండీ !
లక్కాకుల వారూ పద్యం బాగుంది.
Delete🙏
Delete-
ReplyDeleteఅది యిదియే ను జిలేబీ
మదమ్ము వెటకారమై ప్రమాదంబాయెన్
సదనమ్మున నెల్లరు సి! య
నెదరు వినవె పడతి ! మానిని! మదిరనయనా !
జిలేబి
రాజారావు మాస్టారూ, మీ “సుజన-సృజన” బ్లాగు “మాలిక” లో కనబడడం లేదే?
ReplyDeleteகாக்கா தூக்கிங்டு பொச்சு
Deleteఅదే నాకూ బోధపడడం లేదు , సార్ ,
ReplyDeleteఅప్పటికీ , మాలిక యాజమాన్యాన్ని అభ్యర్థించాను .
ఫలితం శూన్యం .
' మిత్ర శ్రీ ' జిలేబి వారు చుట్టిన అరవ జిలేబీ
చుట్టలు తవరికేమయినా అవగతమైతే కాస్త
తెలపండి .
We had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.
DeleteNaayanaa , manavaDa,
DeleteAa left sidu scrolling kasvaDamuludu :) jara chuuDavale :)
మీరు ఒకటి గమనించారా .. మాలిక మీద రాసిన కామెంట్లు మాలికలో రాకుండా చేశారు .. రౌడీ జీ
Deleteచాల మంచి గమనిక మీది.
Deleteఎలా చేసి వుంటారంటారు ?/ ఆశ్చర్యం గా వుంది.
రాజారావు గారు, మాలిక పనిచేయటం లేదు. నాకు ఆసైటు తెరుచుకోవటమే లేదు. ఆసక్తి ఉంటే మీరు శోధిని చూడండి మాలికకు బదులు. మాలిక విషయంలో నేను భరద్వాజ గారికి మెయిల్ ఇచ్చి చాలా కాలమే ఐనది కాని వారు పట్టించుకోలేదు.
ReplyDeleteWe had technical issues and the site was down for a few days. But it has been working for the last many weeks.
Deleteమిత్రులు శ్యామలరావుగారికి నమస్సులు.
Deleteఅదేపని చేస్తున్నానండి . మిత్రులందరూ
మాలిక టపాలు వెదుకుతున్నారు .
శ్రీ భరద్వాజగారు మాలికలో నా ' సుజన సృజన ' కనపడేట్లు చూడమని అభ్యర్థనం.
నాక అరవం రాదు, మాస్టారూ. కాస్తో కూస్తో వస్తే గిస్తే నెల్లూరు ప్రాంత వాసులయిన మీకు రావాలి.
ReplyDeleteఅయినా “జిలేబి” గారు కావాలని చేసే కొంటె పనులను పట్టించుకోకపోవడమే ఆరోగ్యకరం కదా 🙂.
పెద్దలు నరసింహరావు గారూ ,
Deleteనమస్సులు .
నాకు తెలుగే సరిగా రాదు . ఇక ద్రమిళం
కూడానా ?
తెలుగే సరిగా రాదే !
Deleteభళిరా ! ద్రమిళమ్ము కూడ ? పదపద సింహా !
కెలికిరదేమో యెవరికి
తెలుసండి ? జిలేబి కమ్మతెమ్మర అంతే!
Vaaav
Delete-
ReplyDeleteగలగల కాంగిరేసు తెలగాణని గెల్చెను! బొక్కసమ్ములో
కలదకొ దస్కమౌర తమకై పథకమ్ముల జల్ల జోరుగా?
గెలిచినవాఁడు దుఃఖపడె; గెల్వనివానికి దక్కె సౌఖ్యమున్
ఫలితము మంచిదాయెను! సభాభవనమ్మున నిద్ర బోవగాన్!
జిలేబి
ZilebiDec 5, 2023, 5:17:00 AM
ReplyDeleteచెప్పుకోండి చూద్దాం! :)
మీ తెలివి మాకెట్ల వచ్చు తాతగారు
Deleteమీరే సెల వివ్వాలె :) ఐపీ కూపీల ... :)
-
ReplyDeleteజయహో !
అందల మెక్కిన రెడ్డికి
కందం బిదిగో ! త్వరితముగా పడతుల కా
నందమును జేర్చితివయా
పందెమ్మున గెలిచి నావు వర్ధిల్లుమికన్
చైంచిక్
జిలేబి
-
ReplyDeleteతమ్రి కెన్నేళ్లు బామ్మా! పదపడి యడిగె
మనవడు జిలేబినరె! ప్రమదల వయసడు
గుట సరియకొ వడ్డించె గుర్రుమని తేట
గీతి నందిపుచ్చుకొనుచు కెలుకులమ్మి :)
జిలేబి
ముదుసలియనుకొని తమ్రి కెన్నేళ్లు బామ్మా యని నొక పోరడు
Deleteఓ యెనుబదేండ్ల నవ యవ్వనవతి నడగ కందిన బుగ్గల యా
జవ్వని "ప్రమదల వయసడుగుట సరియొకో" యటంచు ఎర్రని
కనుల గిర్రున తిరిగి గుర్రుగ మందలించ, బుర్ర గిర్రన, డుర్రున,
సర్రని ఉడాయించెనా వెర్రి కుర్రడు ... 😁😁😆🤝🙏🙏🙏 ...
This comment has been removed by the author.
Deleteఔర్ ఏక్ టుమ్రీ ...
Deleteవయసుడిగిన బామ్మను వయసడుగుట
సరసమెటులగును వరసకు మనుమడైనను?
ముసిముసి చూడక విసురుగ, విరసమున
కసురుకొనె, వసి వాడని యా పసివాని బట్టుక
మొసలి చూపుల కరిసెనట ఆ ముషలి మసలి ...
(సిర్ఫ్ jk/jf బామ్మో 😁😁😆🤝🙏🙏🙏 ...)
-
Deleteఓరోరీ మనవడ! టు
మ్రీరో నా పైన ? గుర్రు మించారింతున్
కారాల్ మిరియాలు జిలే
బీ రావళ్లు గొనుచు అరి భీకరముగ నే !
:)
టుమ్ రీ బావుంది కొనసాగించండీ :)
జిలేబుల్స్
-
ReplyDeleteసీతక్క అందలమ్మున
మా తెలగాణ ప్రగతి పథమందు జిలేబీ
లా తీయగసాగి జనుల
కై తరమైనట్టి సేవ కన్బడు గాకన్!
జాల్రా
జిలేబి
-
ReplyDeleteఆసుపత్రి లోన అందలమున్ దిగి
నట్టి కేసి యారు నడచు రీతి
మరల మరల చూపి మార్కెట్టు రేటింగు
పెంచు కొనిరి టీవి విదురు లెల్ల !
జిలేబి
-
ReplyDeleteఅందరి పైనా నరికా
లెందరి పైనో జిలేబులింకెందరి పై
డెందంబారగ పద్యాల్
కొందరి తోదోస్తి , కోరి కోరి జగడముల్
జిలేబుల్స్
ఓరోరి వెంకటేశా!
ReplyDeleteస్త్రీరత్నమె కెలను పబ్లిసిటి నీ కేలా
హేరాళము నీ మొల్లమి
సారీ! వ్యామోహ మేల సాధనములపై
జిలేబుల్స్
-
ReplyDeleteఇటలీ మిలాను నగరము !
తటిత్తు కాంతులను జూడ తనువూగెన్ వె
న్కటి భవనమ్ముల సొబగుల
హొ టింగు రంగా యటంచు హొయలన్ జూపెన్
జిలేబి
-
ReplyDeleteదంపతు లేక వచనమే
కొంపలెగిరి బోవునట్లు కొట్లాడిననూ
కెంపులమరు వైవిధ్యము
చెంపలు వాయించుకున్న సిరిసిరి మువ్వా :)
జిలేబి
భావం అర్ధం కాలేదుగానీ కెంపుల చెంపలు బాగున్నాయి.
Delete-
ReplyDeleteభావంబర్థము కాలే!
మీ వరుస గొలుసు పదములు మించారె జిలే
బీ! వారెవ్వా కెంపులు
జావళి తో చెంపపెట్టు సరసమ్ములునూ
జిలేబుల్స్
-
ReplyDeleteకుంచము తోడై విదురుల
కుంచిక కదిలెను వరుసగ కొలమానమ్ముల్
మించారగ తెలిసెను ప్రా
పంచిక విషయములు రామ బంటు చలువగా
జిలేబుల్స్
కొట్టు కొచ్చిన కొలమానమ్ముల పట్టిక
ReplyDelete( సేత - తాగశ్యారా)
కొలమానం (పేరు మరిచిపోయేను
దానిని కుంచం అంటారండీ.
పూర్వపుకొలత అది. ధాన్యాదులు కొలవటానికి ఇదివరకు వాడేవారు. ఒక బస్తాబియ్యం అంటే అప్పట్లో ఇరవైనాలుగు కుంచాలు. ఒక కుంచం అంటే రెండు మానికలు (మానికను అడ్డ అని కూడా అనేవాళ్ళం). అడ్డెడు అంటే రెండు శేర్లు. శేరులో సగం తవ్వ. తవ్వలో సగం సోల. సోలలో సగం గిద్ద అని కొలతల పేర్లు. (సరిగా ఎప్పుడూ కొలిచి చూడలేదు కాని ఒక గిద్ద అంటే రమారమి ముఫ్ఫై లేదా నలభై మి .లీ. ఉంటుందేమో అనుకుంటున్నాను). ఒకప్పుడు అంటే ఎనభైల దాకా ఈగిద్దలు చిన్నచిన్నజంగిడీల వాళ్ళ వద్ద ఉండేవి – పావలా ఇస్తే ఒక గిద్దెడు వేయించిన వేరుశెనగ గింజలు వచ్చేవి.
ద్రవాలను కూడా శేర్లలో కొలవటం ఉండేది ఈ లీటర్ల కొలతలు ప్రచారం అయ్యే వరకూ. అరవైల్లో అరవైపైసలకు ఒక శేరు కిరోసిన్ నూనెను ఇచ్చేవారు బీరు సీసాల్లాంటి వాటిలో. పాలనూ ఇతర ద్రవాలనూ శేర్లలోనే కొలిచేవారంతా.
కొన్ని ద్రవాలను తూకం వేసేవారు. కొబ్బరినూనె, వంటనూనె వంటివాటిని. ఆ తూకాలు వీశెల్లో ఉండేవి. వీశ అంటే 1400 గ్రాములు. వీశలో సగం పదలం (700gr). పదలంలో సగం ఏబులం (350gr). ఆ ఏబులంలో సగం పంపు(175gr) అని వాడుక చేసే వాళ్ళం. ఈవీశను మరొక రకంగా తులాలుగా భాగించే వారు. వీశకు 120 తులాలు. ఈతులాల లెక్కను విలువైన పదార్దాలు ( ఉదా. బంగారం) కోసం వాడేవారు. మళ్ళా తులం అంటే ఒకటిన్నర కాసులు! ఇప్పుడు ఇవన్నీ పోయి గ్రాముల్లో వాడుక చేస్తున్నాం. ( కొంతమంది తులం అంటే పది గ్రాములు అనుకుంటున్నారు పొరపాటున.
పెద్దల ఫాలో ఔతూ ,
ReplyDeleteతద్దయు శిష్యరిక మొనసి , తకధిమి యను , మీ
పధ్ధతి , మా బోంట్లకు కడు
ముద్దు , జిలేబి విబుధా ! ప్రమోదము విహితా !
-
ReplyDeleteపెద్దల మాటలు మనకై
చద్దియె సుమ్మీ ! జిలేబి చప్పున బోవన్
వద్దకు నమస్కరింపిము
దద్దోజనమా రగించి తడిని జరుపుమా
జిలేబి
దద్దోజనము రుచించదు ,
ReplyDeleteతద్దయు పులిహోర కూడ తగదు తినంగా ,
ముద్ద దిగదు చేప పులుసు
పద్దతిగా వండి తినక , పాడు రసన , హా !
ఎంత మాంసాహారులకైనా ఎముకలు మెళ్ళో కట్టుకుని తిరగడం తగదని మా చిన్నతనంలో పెద్దలు, గురువులు చెప్పిన మాట, మాస్టారూ.
ReplyDeleteఉన్నది ఉన్నట్లు పలుకు ,
ReplyDeleteటన్నది సహజాతమయ్యె , నయ్యా ! రావూ !
మన్నింతురు గాక ! తినుట
కెన్నున్నను ' చేప పులుసె ' ఎంపిక సేతున్ .
చేపలు వెజ్జని విందును
ReplyDeleteఓపికతో ఇండ్ల బెంచుకుని బెంగాలీల్
సూపులు వేపుళ్ళు తరచు
ఆపోపగ తిందురంటగా ! ఆహా ! సార్ !
-
ReplyDeleteచేప పులుసా! కుదరదు! మ
హా పాపంబగను సారు ! హాట్ హాట్ సాంబార్,
సాపాడు, రసము, మజ్జిగ
బాపురె ! దాని రుచి సాటి వచ్చున రాజా !
జిలేబుల్స్
శాకాహారుల తిండికి బెంగాలీ బాబుల తిండి ప్రామాణికం కాదండి రాజారావు మాస్టారు.
ReplyDeleteఅందుకొని , జిలేబీ వా
ReplyDeleteరెందుకొ ! ' దద్దోజనంబు ' తినుడని వలుకన్ ,
అందు , కయిష్టం బంటిని ,
ఎందుల కీ తిండి గోల ? హితుడా ! బుధుడా !
-
ReplyDeleteచేప పులుసును తినననెడు
పాపాయమ్మలను గాన పరితాపంబా
యే! పరిణామక్రమమున
చేపయె పరమాత్ముని మొదటి అవతరణమోయ్
-
ReplyDeleteమదనజనక !నగధర! నీ
వె దిక్కు!గోవింద! నీల విషధపు వర్ణా!
మధురిప! ముకుంద! కృష్ణా!
సుదర్శనా! వాసుదేవ! సూరి! గిరిధరా!
జిలేబి
-
ReplyDeleteపరమపురుష! శరణు! పరమాత్మ! తవ చర
ణముల కంజలిడుదు ! నగధర! హరి!
పరమ పావనా! కృపాసింధు! రుక్మిణీ
వల్లభ! వృషనాశ! వ్రజ కిశోర !
జిలేబి
-
ReplyDeleteవారున్వీరవియివియున్
వేరను భ్రమ వోవ జేతు వేడెద కృష్ణా!
సారధి, గుర్రంబారథ
మా రథియును నీవె! అచ్యుతా! కంబుధరా!
జిలేబి
-
ReplyDeleteపరిపరి నిను పరాత్పర ! ప్రభు! కొలిచెద
మయ్య!చిరు దివ్వె మదిలోన మాకు వెలుగు
నొసగ వరమీయ వయ్య మనోజ్వలమ్ము
గా నదే నిన్ను జేర ప్రకటనమవగ
జిలేబి
-
ReplyDeleteమంచి గైనంక కలిచెద మానుడయ్య
లార అమ్మలారా కల్వ పద పదండి
ఇండ్లకు తరలి వెళ్ళండి యీప్సితమిదె
నాది క.చ.రా. పలికిరి ప్రణతుల తోడు
జిలేబి
-
ReplyDeleteమాయంబడని జనులెవరు ?
ఆ యవనారి కరుణా కటాక్షములకు జే
గీయంబగు మూర్తికి ? జగ
మేయాతని లీల ప్రాణమే భిక్ష కదా!
జిలేబి
🙏🙏🙏🙏🙏
DeleteJust my 2 cents ఏకవచనమా బహువచనమా :)
ReplyDeleteఇచ్చేటపుడు ఏకవచనం, పుచ్చుకునేటప్పుడు బహువచనం. సరిపోయుండ్లా! :)
Delete-
ReplyDeleteమీరే రైటండి సుమా
ఊరికె రాసానలా ! అడుగుదోముల పై
నా రేకుల పీకుట యే
లా!రస పట్టు హరిమన వలను వలయునకో :)
జిలేబుల్స్
లిప్ లాక్స్ :)
ReplyDeleteఏకవచనంబగు నొసగు వేళ లోన
పుచ్చుకొనువేళ లోన బహువచనమగు
చూడ చూడ దంపతులు కచోరి యున్ జి
లేబు లైజత గూడెడు లిప్పులాకు :)
జిలేబి
-
ReplyDeleteచాదస్తపుటోళ్లు సుమీ
గోదాముల గంపెడంత కొనుగోళ్లున్, బ
స్తా దంగుళ్లు, బఠాణీల్!
సీదా స్విగ్గీ ల కొనని సీసపు జనులున్
జిలేబి
అనునయము , మనో సింహాసనమున , మాధ
ReplyDeleteవుండు కూర్చుండి మరి కొలువుండ , నింక
లేని దేముంది , ఆనంద మూని , సతత
మాడి పాడుదు , పరమాత్మ తోడి , కృష్ణ !
-
ReplyDeleteసతతంబాడుచు పాడెద
స్తుతింతు కృష్ణ! యవనారి సుమనోహర! స
న్మతినీయుమనునయము మది
ని తిరముగ నిలచి ముకుంద నిను జేరంగన్
జిలేబి
శ్రీకృష్ణుని మురళీ గా
ReplyDeleteనాకృష్టులు గాని వార , లవనీస్థలమున్
ఆ కృష్ణుని మోహన రూ
పాకృష్టులు గాని వార లసలున్నారా ?
-
ReplyDeleteఆహారము నిద్ర భయం
బాహా! మైథునము సర్వ ప్రాణుల కొకటే
దేహంపుటూర్ము లారు
న్నూ హంతువెవరిది వారె పొలియిక సుమ్మీ!
జిలేబి
-
ReplyDeleteఅవనీ స్థలమున గలరో
యవనారిని గాంచని ప్రజ ? యావత్భువియున్
భవహర మా వెన్నుని ప్రా
భవమ్ము మురళీ రవమ్ము, ప్రణమిల్లు సఖీ!
జిలేబి
-
ReplyDeleteఎవరి నిహతి వారే చా
వవలె విదురులు పలికిరి వివరముగ తెలుపం
గవలయు నోపిక లేకన్
భువిలో కారణములు మన పూర్వపు కర్మల్
జిలేబుల్స్
నను నీ యారవ ప్రాణం
ReplyDeleteబనుకొనుమే , మాధవ ! పరబ్రహ్మ స్వరూపా !
విను , నీవే నేనని , నా
మనమున నెఱ నమ్మినాడ , మాధవా హరీ !
-
Deleteఅనుకొనుము నీదు ఆరవ ప్రాణమంచు
మాధవా! నీవె నేనని మదినెర నిను
నమ్మితి పరాత్పరా! యవనారి! పాహి!
రుక్మిణీప్రాణ వల్లభ! బ్రోవుమయ్య!
కృష్ణు డొక అద్భుతమ్ము , ఊహించి చూడు
ReplyDeleteచూడ , నరమోడ్పు కన్నుల శోభనములు
చేత , వంశీ వినోదంపు చేతన యుత
తన్మయత్వంబు , చిత్త మంతర్ముఖంబు .
-
Deleteఅరమోడ్పు కన్నుల సొబగు
లరయన్, వంశీ వినోదమరయన్ సంవి
త్తరసి మది తన్మయత్వం
బరయగ నంతర్ముఖమగు వడి చిత్తంబున్
జిలేబి
జగ మేలే పరమాత్మా !
ReplyDeleteనిగమా ! నిగమాంతరంగ ! నీరజ నయనా !
మగటిమి గల పురుషోత్తమ !
వగ పేటికి , నన్ను గావ , వసుదేవ సుతా !
-
Deleteజగము నేలు పరాత్పర! సన్మతినిడు
నీరజనయన వగపేల నిగమ మమ్ము
గావ! నిగమాంతరంగ! మగటిమి యున్న
వాసుదేవ! ముకుంద! మురారె! కృష్ణ!
జిలేబి
-
ReplyDeleteనానుళ్ళ తాత గారం
డీ! నుడివిన విషయముల్ వడి చదివి నామం
డీ! నూత్నదంపతులకు ప్ర
ధానము గా వలయు విజ్ఞత తెలిపిరి సుమా
జిలేబి
-
ReplyDeleteఎవరు చేసిన కర్మవారెవ్వ రైన
ననుభ వింపక తప్పదు! నాడె పల్కె
తాత వేమన మనకమ్మ తమ్మికంటి
తెలుసు కున్న మేలు గలుగు తీగబోడి
జిలేబుల్స్
మదిలో మెదిలెన్ మాధవు ,
ReplyDeleteడది యిది యన నేల , డెంద మానంద మహాం
బుధి మునిగెన్ , పరమాత్మను
గదిసిన , ఈ హాయి కంటె , కలిమి గలుగునా !
-
Deleteకలిమి కలుగున ఈ హాయి కంటె హరిని
వెన్నుని మదిని నిలుపుచు వేడుకొనుచు
కన్న! మాధవా యనగ హృత్కమలము విక
సించి పరమాత్మ చాయను చేరుకొనగ!
-
ReplyDeleteసమకాలీనంగా ఉం
ది మీ కథ! యిదివరలో చదివనట్లనిపిం
చె మరి సుమా! కథ బావుం
ది! మీ ప్రయత్నమ్ము కూడ దేవి ధరిత్రీ!
జిలేబి
-
ReplyDeleteBharhut స్తూపంపై ఉన్నది రామాయణ ఘట్టమా?
బొల్లోజు బాబాగారి విశ్లేషణాత్మక థ్రిల్లర్
https://sahitheeyanam.blogspot.com/2023/12/bharhut.html
పన్నుగ మదిలో నున్నను
ReplyDeleteకన్నులు నీకేసి చూచు , కాంక్ష విడదురా !
మన్నించు మాధవా ! నిను
నెన్నక నిదురేమిరాదు , నీరజ నయనా !
-
ReplyDeleteనీరజనయన ! మాధవ! నిను తలచక
నిదుర యేరాదు పన్నుగ నీవె మదిని
నిలచి యున్నను యవనారి నిన్ను చూడ
వలెననెడు కాంక్ష విడదోయి వాసుదేవ!
జిలేబి
shaving blade = क्षुरपत्रम् (క్షురపత్రమ్) అన్న పదం ఉన్నదీ అంటే మనవాళ్ళకి కూడా షేవింగ్ గురించి తెలుసు అనే కదా అర్ధం!
ReplyDeleteర
Deleteతెలీకుండా వుండేదానికి ఆస్కారాలే లేవండీ రాముల వారు కృష్ణుల వారు மழ மழ క్లీన్ షేవ్ లో ఎప్పుడూ కని పించేవారు కదా మన పౌరాణికాలలో ? అంటే ఏమని అర్థము ? ఇదే కదా !
నీవు నా యెదలో కోరి నిలిచి , కృష్ణ !
ReplyDeleteనన్ను మన్నించి , నాచేత , సన్నుతించి
తెంత భాగ్యము మాధవా ! ఏమి కృపయొ !
ఎన్ని జన్మల పుణ్యమో ఇది , ముకుంద !
-
Deleteనా యెద లో కోరినిలిచి
శ్రేయస్సును జేర్చినావు శ్రీకృష్ణ! ముకుం
దా!యవనారి! కృపాసిం
ధో!యెన్నెన్ని జననముల పుణ్యమ్మొ! ప్రభో!
పడికట్టురాళ్ళు తప్పవా?
ReplyDeleteపడి, కట్టు వేయించుకున్నానంటున్నారా ?
Deleteపడితే కట్టూ తప్పదు :)
Deleteసమతూకానికి పడికట్టూ తప్పదు :)
-
Deleteపడితే కట్టూ తప్పదు!
వడి సమభారమునకు పడికట్టున్ను జిలే
బి డిగనురుకులకు తప్పదు
గడియారమ్మువలెను తిరుగాడుటకున్నూ
జిలేబి
ఇది నీకు దెలుస ? కృష్ణా !
ReplyDeleteసదయా ! నీ హృదయసీమ సంస్థిత విధ , స
మ్ముదితునిగా నేనున్నా ,
వదరితి , నీకు దెలియదని , వందనము హరీ !
-
ReplyDeleteవదరి నాను మాధవ! అనవసరమై న
గధర! నీహృదయమున ప్రగాఢమై ని
లచితి నన్నది తెలియక, లసితవంత
మైన జీవన వాహిని మైమరపున!
-
ReplyDeleteజగనన్నే మన ప్రభువోయ్
ప్రగతిపథమున మనల నడుపగలడతండే
మొగదల ఆరోగ్యశ్రీ
దిగులన్నదె లేదు! మరల దేవర యతడే!
జిలేబి
-
ReplyDeleteఅన్నమో రామ చంద్రాయటంచు నలమ
టించు ప్రజల నడుమ తన ఠీవి తగ్గ
కుండ వారిని పీడించు కుత్సితునికి
తన సొగసు దయ్యముగ దోచె దర్పణమున
జిలేబుల్స్
-
ReplyDeleteఅలవి కాని చీకటి కావలగల వంట!
కృష్ణ! తాళుకొనగల ప్రకృతి గలదయొ?
రార నామది దివ్వెపు ప్రస్ఫురమున
రాధనము గైకొనుమయ మురద్విష! హరి!
ఏమి మాయయో !
జిలేబి
-
ReplyDeleteమేధావులను జిలేబీ
మేధావులె గుర్తుపట్టి మెచ్చుకొనవలెన్
సాదాసీదా తాతల్
భేదమ్ము కనగొనగలరొ వెంకాయమ్మా :)
జిలేబి
కొట్టు కొచ్చిన పదాలతో కందము
ReplyDeleteసకలసుగుణధాము డితడు
అకళంకచరితు డితండు హరియే నండీ
వికచాంబుజనేత్రు డితడు
సకలభువిని వందితు డగు చక్రియు నితడే
జిలేబి
-
ReplyDeleteకమలా పసందు యాడ్లో
సుమీ గవాస్కరు తదుపరి సూపర్సెహవాగ్
ప్రముఖముగా కనబడినా
రు!మరివ్వన్నియును తినెద రో? సందేహమ్ !
జిలేబి
మధురాధీశా ! కృష్ణా !
ReplyDeleteమధు వొలికే నీ అధరము , మన్మోహనమై
కధ లెన్నో వినిపించును
ముదితలతో , బృంద సరస మోదిత ప్రణయాల్
-
Deleteమధువొలికెడు నీదధరము మదిని దోచు
కథలు బృందావనపు రసికతనములకు
కృష్ణ! మధురాధిప! ప్రణతి! కృప కురియగ
నీదు మా జీవితమ్ములు నిగ్గుదేలు!
జిలేబి
-
ReplyDeleteరాము డనినా జగద్గురు డనిన కృష్ణు
డనుచు సరి మ్రొక్కినన్ పన్నగంపు భూష
ణుడని నా దేవుడనుచు ప్రణుతియు చేయ
నీవె నన్నియు పరమాత్మ నిక్కమిదియె!
జిలేబి
-
ReplyDeleteఒదిగి దేవత లెల్లరు మ్రొక్కుచు నడు
వంగ శ్రీకృష్ణమూర్తి గహ్వరిని జనుల
దిక్క గుచు మక్కువ గొనుచు దిగె ప్రభలను
జూపి జనులకు దర్శన మొసగ గాను
నీ వెంటే , హరి ! పరమాత్మా !
ReplyDeleteపూవును విడివోని , తావి బోలి , వసింతున్
సేవింతును , శ్రీకృష్ణా !
కావుము ! శ్రీరంగ రంగ ! కరుణా పాంగా !
-
Deleteపూవును విడని తావినిబోలి నిన్ను
వీడక వసింతు పరమాత్మ!వేంకటేశ!
కావుమయ్యకృపాపాంగ!కంబుధరుడ!
నల్లదేవర! శ్ర్రీరంగ! నగధర! హరి!
జిలేబి
-
ReplyDeleteపరమగురుడగుచు తెలిపె ప్రాకటముగ
నేడె గీతాసుధను కృష్ణు డే రణమ్ము
సేయ ననుచు పలికినట్టి స్నేహితునికి
జనులు కార్యోన్ముఖులు గాన సత్వరముగ!
జిలేబి
పరగ ' శ్రీకృష్ణ గురు పరబ్రహ్మణే న
ReplyDeleteమ ' - యని , పరమాత్మ దలచి , నమస్కరించి ,
కెరలి సాష్టాంగ పడి , మ్రొక్కి , శరణు కోరి
నేడు వేడిన , హరి యిచ్చు , నేది యేని .
-
Deleteహరి యిచ్చు నేది యడిగిన
పరగన్ శ్రీకృష్ణ! దేవ! పరమాత్మ యనన్
కెరలుచు సాష్టాంగముగా
మొరలిడ యేకాదశి దినమున శరణనుచున్!
-
ReplyDeleteయతికుత మనన్ జిలేబీ
అతివాగుడె యత్కృతమ్మె నహొ జనులారా
హితులార! తాత పలికిరి
సుతిమెత్తగ స్తోత్రపు టొరసుగొనుచు సుమ్మీ :)
జిలేబుల్స్
-
ReplyDeleteతుమ్ముకుని చిరంజీవిని
సుమ్మీ అనుకోవడమ్ము సుదతి జిలేబీ
కిమ్మగు చర్యయె మనమో
బొమ్మాళి పలుకుల వినుచు బుర్రూపుటయున్
అంతట తానయైవెలుగు నాపరమాత్మదలంచి , మ్రొక్కి, భా
ReplyDeleteస్వంతతనూమనోఙ్ఞవిభవమ్ముల , మంగళ భూషణమ్ముల ,
న్నెంతయు వంశిగానముల , నెత్తిన నా శిఖి పింఛ శోభలన్
చెంతనె వాసుదేవుడువసించెడు ,గాంచుడు,శోభనమ్మగున్
-
Deleteతానైవెల్గెతివీవు విశ్వ మున నాద్యంతంబుగా వేణునా
దానందమ్ముగ కాలవాహినిగ కాంతారమ్ము గా వేదమై
ప్రాణంబై జనులెల్ల తృప్తి గొను సారంగమ్ముగా నిక్కమై
నీ, నా భేదము లేని కంబుధరుడా! నిన్మ్రొక్కెదన్ కావుమా!
అద్భుతమైన వ్యాసం
ReplyDeletehttps://sahitheeyanam.blogspot.com/2023/12/blog-post_26.html?sc=1703547055376&m=1#c3189821574713155488
విస్మృత సామ్రాజ్యాన్ని వెలికితీసిన పండితుడు -జేమ్స్ ప్రిన్సెప్
సాహితీ యానపు బొల్లోజు బాబా
ఆహా ! యెంతటి వర్ణనా చతురతల్ ! ఆనంద మాయెన్ హృదిన్ ,
ReplyDeleteస్నేహార్తుల్ గలవోసి ! కృష్ణ ప్రభునిన్ , శ్రీమన్మహా కీర్తులన్
మోహావేశములొప్పగా వొగిడె , సమ్మోదంబు గన్పట్టగా ,
ధీ హేలల్ గన నిట్టివే , హరిని 🙏 ప్రార్థింతున్ , జిలేబీ హితా !
ఆహా! యెంతటి వర్ణన
Deleteయో! హాయి గొలిపెను హృదిని యోష! జిలేబీ
మోహావేశము లొప్పగ
ధీ హేలలివి యవనారి తీరులివి సుమీ
వెతుకులాట లోనే కాలము గడిచి పోవుచుండె
ReplyDeleteఅవునా అండీ ? రాముని
భవతారకుని పొగిడెడు ప్రబలమౌ ఆ పా
ట వివరముగ వెతికెద నా
ర్చివు డాటార్గున త్వరితము సేవగ నిపుడే
-
ReplyDeleteకళ్లలోన కళ్లెట్టుచు కలువ కండ్ల
గాన వాపును కోరిక గల్గె రాజు
గార్కి త్వరితము గ్లిజరిను కండ్ల కిడుము
గార బాష్పాంబువుల్ నయగారమగుచు
ఆ , శ్రమము, రీ ట్రీటుల్ :)
ReplyDeleteలౌకిక జీవితముల రొ
చ్చూ, కుళ్లు బ్రతుకులు కపటముల్ కల్లోలా
లూ,కట్టిపెట్టి ఆశ్రమ
లోకపు టానందమున పులుకడిగిరి జనుల్
జిలేబుల్స్
చేరెడంత కనులు , చెఱసాల జననంబు
ReplyDeleteపేరు కృష్ణమూర్తి , ఊరు బృంద
గోకుల పిల గ్రోవి , గోవుల కాపరి
జగతికి పరమాత్మ , చేరి కొలుతు .
జననమ్మో చెరసాలని
Deleteమనకెల్లరికి పరమాత్మ మాధవుడాతం
డు! నివాసమ్మదె బృందా
వనమ్ము గోకులపు పిల్ల వాని స్తుతింతున్
సునిసిత హాస్యమ్మునకు చి
ReplyDeleteరునామ జంధ్యాల చెప్పి రోరన్నా తా
త! నెనరులు వారికి తెలుపు
కొనదగు నమ్మా జిలేబి కొరతయు లేకన్!
-
ReplyDeleteఅనుమానమండి! అన్నియు
మనకొకటె జిలేబి తీత మాదిరి సుమ్మీ
కనుకొలకులలో కన్నీ
ళ్లను చూచి మదిని కరుగవలదు బోనగిరీ!
జిలేబుల్స్
-
ReplyDeleteమీ కామింటును వేయం
డీ కనిపించదహొయెవ్వరికి నా బ్లాగ్లోన్
మాకాడ రహస్యముగా
స్వీకృత మై బుట్టలోకి చేరు హళహళిన్
జిలేబుల్స్
-
ReplyDeleteబానిసత్వపు టలవాటు వడివదులున?
గుడ్డు గాడు బ్లెస్సింగను కోతి మూక
లే కదా నేటి మన ప్రజ లెల్ల విన్న
కోట నరసింహ! నాగరీకులు ! ప్రణతులు!
జిలేబుల్స్
కోడిగము తాత మీదనె ,
ReplyDeleteబాడబులను వదలి నట్లె ? బహుశా అనుకో
గూడున , యేమి జిలేబీ ?
పోడుమ లెడబాసి నటులెపో , ఇక మీదన్ .
కదిలిరి కృష్ణానందపు
ReplyDeleteకథలు వినుచు , భాగవతులు , ఘన గురువులతో
ముదితలు , బాలలు , వృధ్ధులు
ముదమున పురుషులును , నంద మోదము లలరన్ .
-
Deleteకదిలిరి కథలు వినుచు భా గవతులచట
ఘన గురువులతో ముదితలు గాన బాల
లున్ వయోవృద్ధులు ముదమారు పురుషలల
రంగ నందమోదములతో రమణ! కృష్ణ!
-
ReplyDeleteజోకొక్కటి విన్నానం
డీ కాస్తా తుమ్మితే భడి! చిరంజీవా
నీ కాయుష్షందురు హిం
దీ కుల్యుల్ బచ్చనందురేమో సుమ్మీ
-
ReplyDeleteతాత మీదనె కోడిగమా! జిలేబి?
బాడబుల వదిలినటులె నా జిలేబి?
పోడుమ లెడబాసెనకో? చకోరి చెప్ప
వే జిలేబి !సందేహమయెన్ జిలేబి!
జిలేబి
-
ReplyDeleteప్రాంతముల బట్టి తేడా
లెంతో కొంతగల వప్ప! లెస్స పలికిరోయ్
కాంతా! అక్కా, పితరుడి
దంత తెలుగు తమిళమున నుటంకింతురుగా!
జిలేబి
చూడరె చెలులార ! హరిని ,
ReplyDeleteఆడెను గోపాలబాలు డావులతోడన్ ,
కూడిరి గోపిక రమణులు
వేడుకతో , జగతి మురిసె వెన్నుని జూడన్ .
-
Deleteజగతి మురిసెను వెన్నుని జాడతోడు
చూడరే చెలు లా హరి శోభ! ఆడె
బాలుడై గోపికలు గూడ పైరవమ్ము
లచట వేణుగానమ్మున లాస్యమాడ
-.
ReplyDeleteప్రజలు స్పిరిట్యువలస్ట్రా
లజి మాది వినండి చవటలారా మీలాం
టి జనుల కిది చెప్పనురోయ్
సుజనులు మా గ్రూపు కొమలు, సోదరులకె నోయ్
తాత! చిరం జీవ! పదము
ReplyDeleteనే తూచగ రెండు పదములే కనులబడెన్
మిత్ర! "చిరం" - యెల్ల హరిమ
చేతన మే తోడు, "జీవ", జీవించుమయా!
జిలేబుల్స్