Friday, October 11, 2013

జిలేబి నిరాహార దీక్ష - ఐదు కిలోల బరువు తగ్గుదల స్కీమ్


"ఈ మధ్య మరీ భారీ అయి పోతున్నా ఏదైనా చేసి ఓ ఐదు నించి పది కిలోల బరువు తగ్గాలి అనుకుంటూ ఉన్నా ' చెప్పా " మా అయ్యరు గారి తో .

'ఇదిగో జిలేబి ఏదైనా చేసి ఎందుకు ? ఈ మధ్య దేశం లో ఎన్నో ప్రాబ్లెమ్స్ ఉన్నాయి . ఏదో ఒక డానికి నిరాహార దీక్ష మొదలెట్టు ఓ వారం లో ఐదు కిలో లేమి ఖర్మ, వీలయితే శాల్తీ శాల్తీ యే కరిగి పోవచ్చు కూడాను " అయ్యరు గారు రిటార్టు ఇచ్చారు .

ఆ హా ఇదేదో మంచి సలహా గా ఉన్నదని నిరాహార దీక్ష డిల్లీ లో నే మొదలెట్టే సా . నా తోడు అన్ని పార్టీల నేతలు నేత్రి లు , కూడా నిరాహార దీక్ష మొదలెట్టడం చూసి నాకు కూడా ముచ్చటేసింది !

అబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఎట్లా బరువు ఖర్చు చేసు కుంటారు సుమీ అని వార్ని మేచ్చేసు కున్నా మనసులో .

సో , బ్లాగు చదువరులారా, చదువరీ మణు లారా ! ఇదే మీకు జిలేబి అందించు 'నిరాహార దీక్షా ఆహ్వానం ! మీరు బరువు తగ్గాలను కుంటు న్నారా ! వెంటనే నాతొ బాటు డిల్లీ కి వచ్చి నిరాహార దీక్ష మొద లెట్టే య్యండి !

పుణ్యమూ పురుషార్థమూ అంటారు చూడండి , అట్లా మీ బరువు తగ్గ వచ్చు, దాంతో బాటు బోలడంత పేరు కూడాను !
ఇవ్వాళే రండి ! వేగిర పడండి ఆలసించిన ఆశా భంగం ! భలే మంచి చౌక బేరము !


నిరాహార !
నీకు సరిలేదు దేనికైనను !
ఇదే నీకు చీర్సు

జిలేబి (పది కిలోల బరువు తగ్గు ప్లాను లో ఉన్నది!)

Thursday, October 3, 2013

రామాయణం లో పుష్పక విమానం - ఒక విహంగావలోకనం !


విహంగావలోకనం  - A bird's eye view - విహంగ వీక్షణం !

రామాయణం లో పుష్పక విమాన వర్ణన సుందర కాండ లో వస్తుంది. హనుమంతుల వారు పుష్పక విమానాన్ని చూడటం జరుగుతుంది .

వాల్మీకి అత్యద్భుత వర్ణన - ఈ పుష్పక విమానాన్ని గురించి సుందర కాండ లో ఏడవ సర్గ లో  లో చెప్పడం జరుగుతుంది.  ఆ పై ఎనిమిదవ సర్గ ఈ పుష్పక విమాన వర్ణన కి కేటాయించ బడి ఉన్నది .

ఏడవ సర్గ లో ఈ పుష్పక విమానం గురించిన వర్ణన ఒక విహంగావలోకనం లాంటి దైతే ఎనిమిదవ సర్గ లో వర్ణన 'a detailed description' లాంటిది !

పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడాన్ని వాల్మీకి వర్ణన - ఈ పుష్పక విమానం - మహా విమానం - 'best of the best! - वेश्म उत्तमानाम् अपि च उच्च मानम् |! ఉత్తమ మైన వాటిల్లో అత్యుత్తమ మైన విమానం అని !

అంటే ఆ కాలం లో ఇది ఒక్కటే విమానం కాక మరెన్నో విమానం ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి విమానా ల లో ఈ విమానం అత్యుత్తమ మైన విమానం !

ఇక ఈ విమానని గురించి న మరిన్ని వివరాలు ఎనివిదవ సర్గ లో మొత్తం ఏడు శ్లోకాలలో వాల్మీకి వర్ణన చేయడం జరుగుతుంది . మహద్విమానం మణి వజ్ర చిత్రితం !

महद्विमानम् मणिवज्रचित्रितम् |!

విశ్వకర్మ చేత నిర్మింప బడ్డది. అక్కడ 'వాయుపథం' లో నిలిచి ఉన్నది ! (ఈ వాయుపథం అన్నది మన కాలపు 'Run way' అనుకోవచ్చా ? ) ఆదిత్య పథ వ్యరాజవత్ !

తపోబలము చేత రావణుడు దీన్ని పొందాడు . 'ఇది మనోబలము చేత ప్రయాణిస్తుంది' అంటాడు వాల్మీకి !

అంటే ఈ విమానం ఆ కాలం లో ప్రయాణం చేయడానికి మనోబలం ఇంధనం లాంటిదన్న మాట . - मनःसमाधान विचारचारिणम् | -

तपह्समाधानपराक्रमार्जितम् |
मनःसमाधानविचारचारिणम् |
अनेकसंस्थानविषेषनिर्मितम् |
ततस्ततस्तुल्यविशेषदर्शनम् || ५-८-४


ఈ మధ్య మన కాలం లో నే స్పీచ్ రెకగ్నిషన్ పరికరాలు వస్తున్నాయి . వీటి తరువాయి సాయిన్సు డెవలప్ మెంట్ ఇక మనో బలం (Thought Power) చేత పరికరాలు నడప బడే స్థాయి కి రావచ్చు అనుకుంటా .

అంటే ఆ రామాయణ కాలపు డెవెలప్ మెంట్ ఒక స్థాయి ముందర ఉన్నట్టు అనుకోవచ్చు. మనోబలం చేత నడప బడే విమానం లాంటివి ఉన్నట్టు !

ఇక ఇది కాల్పనిక మైనదేమో అన్న సందేహం చాలా మందికి ఉండనే ఉన్నది. ఆ కాల్పనిక కథ అన్న మాటలని పక్కన బెట్టి - ఈ  రామాయణ కాల ఘట్ట  కాలం నాటికి వాల్మీకి సమకాలీకుడు అన్న మాటలని బట్టి ఆ కాలం లో తాను చూసినదానిని  ఒక కవి వర్ణించాడు అని కూడా అనుకోవచ్చు. అట్లా అయిన పక్షం లో ఇది ఆ కాలపు ఒక విమానానికి సరియైన వర్ణన అయ్యే ఆస్కారం కూడా ఉన్నది.

ఇక దాని రూపం ఎట్లా ఉన్నది ? విచిత్ర కూటం బహుకూట మండితం ! -like a mountain with wonderful peaks adorned by many peaks!

ఇంతే గాక మనోభిరామం శరదిందు నిర్మలం ! - చంద్రుని లా నిర్మలం గా మనోభిరామం గా ఉన్నదట దాన్ని చూడడడం !

సో, ఈ విచిత్ర కూటం బహుకూట మండితం అన్నది చూస్తే దాని రూపు రేఖలు - మన కాలపు 'flyingsaucer' వర్ణన లా ఉన్నది !

ఈ వర్ణన లో అన్నిటికన్నా ముఖ్యమైనది నా కనిపించింది - ఇది మనో బలం చేత నడప బడుతుంది అన్నది . ఈ వాక్యం నిజంగా ఆలోచింప దగ్గ వాక్యం అనుకుంటా . ఎందు కంటే ఇప్పుడు మన మున్న కాలం లో thought power మీద జరుగుతున్న విశేష రీసెర్చ్ రాబోయే కాలం లో ఇట్లాంటి వనరులని మనకి తేవచ్చు కూడాను .

ఆ మధ్య ఎక్కడో చదివా ... హ్యూమన్ క్లోనింగ్ రీసెర్చ్ లో భాగం గా - ఒక బ్రెయిన్ లో జరిగే విశేష మైన లాజికల్ మేపింగ్ ని మరో బ్రెయిన్ లో కి ట్రాన్స్పోర్ట్ చేయ గలిగితే తద్వారా knowledge transfer mechanism చాలా సులభ తరమై పోతుంది అని !

సో ... ఇవ్వాల్టికి ఈ పుష్పక విమాన విహంగావ లోకనం పరి సమాప్తం !

మీకు నచ్చిందని ఆశిస్తూ ...

मनःसमाधान विचार चारिणम् |

ఎప్పట్లా చీర్స్ సహిత -
మీ
జిలేబి
సైనింగ్ ఆఫ్ !

మనోభిరామం శరదిందు నిర్మలం !

Wednesday, October 2, 2013

నేను కుర్చీ ని వదలను గాక వదలను !


మీ వాడే మీ పట్ల అంత విముఖమైన వ్యాఖ్య సంధిస్తే మీరు రాజీనామా చేస్తారా ?" అడిగాడు విలేకరి.


"ఏదో మనవాడు అట్లా మనలని తెగిడా డని నన్ను కుర్చీ వదల మంటే ఎట్లా? అట్లాంటి వన్ని నేను చేయ దలచు కోలేదు " చెప్పాడాయన సంతృప్తి గా కుర్చీ ని తడివి చూసుకుంటూ .

కుర్చీ కిర్రు మంది .

అబ్బా ఎన్నాళ్ల ని ఇట్లా ఒక శాల్తీ నీ భరిస్తూ ఉండడం ? కుర్చీ మరో మారు నిట్టూర్చింది .

అట్లా కాదండీ ఇది మీ ప్రేస్టిజ్ కి సంబంధించింది కదా మరి ? విలేకరి అమ్మాయి ఎగ దోసింది .

ఆ పెద్దాయన నిదానించి చూసాడు ఆ విలేకరి ని - "అమ్మాయ్ నీకు పెళ్లయ్యిందా ? పిల్లా జెల్లా ఉన్నారా ?' అడిగేడు .

ఈ ప్రశ్న కి ఆ విలేకరి కోమలాంగి తత్తర పడి 'ఒక అబ్బాయి మూడేళ్ళ వాడు ' చెప్పింది .

పెద్దాయన నవ్వేడు.

"అమ్మాయి - ఆ నీ బుడతడు నడతలు, నడకలు మాటలు నేర్పేటప్పుడు నిన్నే ఎన్ని సార్లు ఏకవచనం లో సంబోధించి ఉంటా డం టా వ్ ? ఆ బుడతడి మాటలు నువ్వు ఎన్ని మార్లు చిలిపి చిలిపి అని ఆస్వాదించి ఉండవు ? "

విలేకరి కోమలాంగి తలూపింది

ఇదీ అట్లాగే ..  మా బుడతడు ఇప్పుడిప్పుడే నడతలు నడకలు నేరుస్తున్నాడు ... వాడేదో అన్నాడని నా ప్రియతమ మైన కుర్చీ ని వదలదమనడం ఎట్లా మరి ?'

మరో విలేకరి ... మరో ప్రశ్న సంధించ బోయాడు .

పెద్దాయన 'ఓకే గైస్ ... నౌ హేవ్ గుడ్ డిన్నర్' చెప్పాడు .

విలేకరులు అందరు టప్పున 'ప్లేటు ఫిరాయించి ' డిన్నరు మీద పడ్డారు ....

ఆకసాన హంస ఎగిరింది...

విలేకరి అమ్మాయి చెప్పింది మరో విలేకరి తో ... మన పీ ఎం యు నో ... హీ ఈజ్ సో లైవ్లీ "

యా యా ... దిజ్ ఈజ్ మై ఫస్ట్ డిన్నర్ ఇన్ ది స్కై .... "


కథ కంచికి మన మిక ఇంటికి !!


శుభోదయం
జిలేబి

Monday, September 30, 2013

మేరా భుక్తి మీరా భక్తి !



 
మీరాబాయ్ లా
 
భక్తీ శ్రద్దల తో
 
ఉండా లను కుంటా 
 
ప్చ్ మేరా భుక్తి
 
నన్ను భక్తీ కి శ్రద్ద్దకి మధ్య
 
ఊగిస లాడిస్తున్నది 
 
భక్తీ భుక్తి సమ ఉజ్జీలా ?
 
 
 
జిలేబి 
 
 
 

Saturday, September 28, 2013

కురవని మేఘం !

 
ఘనీభవించిన మేఘం
కురవ నని మొరాయించింది
మలయ మారుతం
ప్రచండ మారుత మై మీద పడితే
చిన్నా భిన్నమై
దూది పింజలా
చెల్లా చెదురై పోయింది !
 
 
శుభోదయం
జిలేబి

Friday, September 27, 2013

బ్లాగు సన్యాసం - ఆఖరి భాగం !


బ్లాగు సన్యాసం కథ భాగం రెండు ఇక్కడ

బ్లాగు సన్యాసం - ఆఖరి భాగం !

ఆ కోమలాంగి ట్వీటరీ దేవి స్వామి వారి సన్నిధి కి వెళ్ళే దారిలో మరో ఇద్దరు ముగ్గురు 'స్వామీ' సోదరీ సోదరులను పరిచయం చేసింది జిలేబి కి ...

వీరు పరివ్రాజ జీమైలానందా  వారు- మన ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ వీరే చూస్తూ ఉంటారు 

ఈవిడ అక్షరాముద్రితమాయి, మన ఆశ్రమ కంటెంట్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్

ఈ 'యంగ్' అశ్రమ వాసిని  ఇవ్వాళే స్వామీ వారు ఈవిడకి దీక్ష ఇచ్చేరు  "సమ సంఘ గాలాక్షీ పంచముఖీదేవి మాయి !"

అబ్బా స్వామీ ముఖ పుస్తకానందా వారికి ఎంత 'జ్ఞాన మో '! ఆ ట్వీ ట రీ దేవి నిజ్జంగా బుగ్గన వేలు పెట్టు కోవడం ఒక్కటే తక్కువ మరి !

జిలేబి అదిరి పడింది. తాను పొరబాటున మళ్ళీ అంతర్జాలం లో కి వచ్చేసిందా ? అన్నీ మరీ తెలిసిన పేర్ల లాగే ఉన్నాయే మరి ?

ఆ ఈ హిమాలయాల్లో అస్సలు సెల్ ఫోన్ పని చేయని ప్రాంతాల్లో అంతర్జాలం ఎట్లా ఉంటుంది ? తనది భ్రమ ! అంతా విష్ణు మాయ ఈ పేర్లన్నీ తనకు తెలిసినవి లా ఉండడం కూడా మాయే !

తను ఈ మాయాజాలం నించి బయట పడ డానికే గదా హిమాలయానికి ఈ ఆశ్రమానికి వచ్చింది !?

మాడరన్ డెన్ ధ్యాన గుహ లో స్వామీ ముఖ పుస్తకానందా వారు తన 'wall' మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్వాలసంగా కూర్చుని ఉన్నారు
 
'ఆహా స్వామి వారి ముఖం ఎంత 'తేట తెల్ల' గా ఉన్నది జిలేబి అబ్బుర పడింది . కొద్దిగా మరింత గమనికగా గమనిస్తే ఫేషియల్ చేసుకుని ఉన్నారేమో అని పించింది

మరీ మేకప్ వేసుకుని ఏమైనా ఉన్నారా ? అబ్బే అంతా విష్ణు మాయ ! అసలు తన బుర్ర సరి లేదు  జిలేబి తన్ను తానె నిందించు కుంది చ చ కైలాసం వచ్చిన తన జిలేబి బుద్ధులు పోలే మరి అనుకుంటూ !

స్వామీ ము.పు ఆనందా వారు చిరు నవ్వు నవ్వేరు ! - జిలేబీ మీరు ఇక్కడి వస్తారని నాకు తెలుసు !  చెప్పెరాయన .

వామ్మో ! ఈ స్వామీ మరీ త్రికాలవేది లా ఉన్నాడే ! తన పేరు కూడా ఈయనికి తెలుసు !

'మీరు ఇక్కడి కి రావడం అంతా 'పరదేవత' ఇచ్చ !' స్వామీ వారు చెప్పేరు ' నిన్నే మా కేంపస్ నించి ఒక ఎనభై ఏళ్ల అమెరికన్ భక్తుడు - బ్లాగా నందా అమెరికా వెళ్లి పోయేడు తనకు 'ఫాదర్ లేండ్' చూడా లని ఉందని '

అప్పుడే అమ్మ చెప్పింది --> నో ప్రాబ్లెం ముఖ్ పుస్తక్ బేటా - ఒక  old lady జిలేబి రేపే నీ చెంతకు వచ్చును ' అని !

జిలేబి ఈ త్రికాల వేదాన్ని విని సంతోష పడ్డది గాని --> తన్ని old lady అనడం నచ్చలే !

ప్చ్ ప్చ్ ఇట్లా ఓల్డ్ అయిపోతూ ఉంటే ఎట్లా !

స్వామీ వారు ట్వీ ట రీ దేవిని దగ్గరకి పిలిచి చెప్పేడు  -  'ఈ జిలేబి వారికి మన ఆశ్రమాన్ని చూపించి ఆ పై ఆ బ్లాగు రూములో సెటిల్ అయి పొమ్మని చెప్పు --> నిన్నటి నించి అస్సలు మన ఆశ్రమ బ్లాగు అప్డేట్ లేకుండా పోయింది --> ఇది మరీ అర్జెంట్ ' అన్నాడు .

ఆ దేవి తిరిగి వస్తూం టే మళ్ళీ పిలిచి ఏదో గుస గుసలాడేడు -- అవి గుస గుసలా లేక ముద్దు ముచ్చట్లా అని జిలేబి కి సందేహం వచ్చినా ఛీ ఛీ ఇవన్నీ విష్ణు మాయ అంశాలే అనుకుంది .

జిలేబి కి వయసు ఎక్కువైనా ఇంకా చెవులు పాము చెవులే --> స్వామీ వారి చుంబన మాటలు విన బడ్దేయి -->

'ట్వీటర్ దేవి--> ఈవిణ్ణి ఆ బ్లాగు రూమ్ నించి బయటకు రానీ కుండా చూసుకో ! మన ఆశ్రమం 'వృద్ధాశ్రమం ' అని పేరు వచ్చే బోతుంది I dont want that to happen --> we are youngish you know!" అన్నాడు !

జిలేబి అదిరి పడింది --> స్వామీ వారితో ఏదో చెప్ప బోయింది --> స్వామీ వారు చేయి గుమ్మం వైపు చూపిస్తూ --> యు ఆర్ డిశ్ మిస్డ్ అన్నాడు --> తన అపెల్ 'లేపతాపమును ' ఓపెన్ చేస్తూ !

హా హత విధీ అని జిలేబి మూర్చ పోయి ' Oh My God' ఇక్కడ కూడా అమ్తర్జాలమే నా !' అని ఎలుగెత్తి పైనున్న భగవంతుణ్ణి పిలిచింది

పై నించి ఆకాశ వాణి సమాధానం వచ్చింది -

" God 'is' no more willing to answer distress calls - you can send your issues by mail only send to God@gmail .com - When He has time he will reply, now shut your mouth and go back to open your mail Aashram updates blog"

*********

జిలేబి మంచం పై నించి దబ్బున నేల మీద పడింది !

జిలేబి జిలేబి ఏమయ్యింది ! అయ్యరు గారు జిలేబి ని తట్టి లేపేరు ! 'ఏమన్నా పీడ కల కన్నావా జిలేబి ?' అయ్యరు పృచ్చ !


చీర్స్
జిలేబి

(సరదా సరదా గా ... ఈ మధ్య కష్టే ఫలే వారు బ్లాగు వదిలి సన్యాసం పుచ్సుకుంటా - సెల్ నెట్ లేని ప్రదేశాలకి వెళ్లి పోతా నన్నారు ! ఆలోచిస్తే ఈ మధ్య ఏ స్వాములోరైనా ఈ ఆశ్రమ మైనా అస్సలు 'నెటిజెన్' కాకుండా ఉన్నదా అన్న సందేహం వచ్చింది -- ఆలోచిస్తా ఉంటే ఈ కల వచ్చింది -

ఈ టపా బ్లాగు సన్యాసం పుచ్చుకోవాలని అనుకున్న మన శర్మగారికి మరి పుచ్చు కోవాలని అనుకుంటున్న మరెవైరనా 'బ్లాగోదరీ' బ్లాగోదరులకు ' అంకితం !!)

 

Thursday, September 26, 2013

బ్లాగు సన్యాసం కథ - భాగం రెండు

బ్లాగు సన్యాసం కథ - భాగం ఒకటి ఇక్కడ -

'నిర్ణ యించేసు కున్నా. ఫైనల్ గా వెళ్లి పోవడాని కే - బ్లాగు సన్యాసం స్వీకరించ డానికే ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి వెళ్లి పోతున్నా ' పెట్టా బేడా సర్దేసుకుని అయ్యరు గారితో ఖరా ఖండి గా చెప్పేసింది జిలేబి

'ప్చ్ ప్చ్ అని అయ్యరు గారు 'సరెలేవే జిలేబి వెళ్లి, రా ' అన్నారు

'వెళ్లి మళ్ళీ రావడమే. అబ్బే వెళ్ళడమే ఇక అంతే '

సర్లే . యథో కర్మః అని .. పోయి రా . ఆల్ ది బెష్టు ! దీవించేరు అయ్యరు గారు జిలేబి ని .

జిలేబి అయ్యరు గారికి ప్రణామములు తెలిపి తూరుపు దిక్కు తిరిగి దండం పెట్టి ఉత్తర దిశ గా హిమోత్తుంగ పర్వత దిశ గా బయలు దేరింది .

^^^^

హిమాలయా పర్వత శ్రేణులు .

'జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ముఖపుస్తాకా నందా స్వామి ఆశ్రమం'

బోర్డు చూసి ఆశ్రమం లోకి కాలు పెట్టింది జిలేబి .

ఫ్రెష్ గా నున్న గా షేవింగ్ చేసుకున్న ఒక స్వామీ జీ వారు ఎదురోచ్చేరు .

చూడ్డా నికి మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడే ఈ స్వామీ అనుకుంది జిలేబి  స్వాములోరికి వయసు తక్కువైతే ఏమి మరి ఉండ కూడదా అనుకుని 'దండాలు స్వామీ దండాలు ' చెప్పింది జిలేబి .

స్వామీ వారు ఓ మారు తలపంకించి - 'వెల్కం టు అవర్ కుబేరా పార్క్ - ఇది స్వామీ ముఖ పుస్తకానందా వారి ఆశ్రమం ' అన్నారు .

జిలేబి పులకరించి పోయింది స్వామీ వారి స్వాగతానికి .

'నా పేరు జిలేబి నేను సన్యాసం తీసుకోవాలను కున్నా అందు కని ఈ వైపు వస్తోంటే మీ ఆశ్రమం కనబడింది  ... '

చెప్పింది జిలేబి .

అంతా పర దేవత ఇచ్చ ! మీ రాక మా స్వామీజీ వారికి చెబుతా ' అంటూ ఆ కుర్ర సన్యాసి ఆశ్రమం లో పల వున్న ఓ మాడరన్ బంగ్లా లాంటి చీఫ్ స్వామీ వారి ప్రార్థనా గుహ లో కి వెళ్లి ఓ ఐదు నిముషాల లో తిరిగి వచ్చేడు మరో సుందరి తో .

అబ్బా ఈ అమ్మాయి ఎంత నాజూగ్గా ఉందో అనుకోకుండా ఉండ లేక పోయింది జిలేబి తన భారీ శరీరాన్ని చూసు కుంటూ . చ చ చ ఈ అయ్యరు గారు పెట్టె తిండి తిని ఇట్లా బలుపు ఎక్కువై పోయి ఇట్లా లావై పోయి ఉన్నా. ఇక ఆ పై వార్ధక్యం కూడా వచ్చి పడిందా యే . ఎట్లా అయినా ఈ ఆశ్రమం లో సేద దీరి ప్రతి రోజూ ఉప్మా వాసం చేసైనా సరే సన్న బడి నాజూకు గా తీగలా తయారై పోవాలనుకుంది జిలేబి

ఆ కుర్ర స్వామీ ఈ నాజూకు అమ్మాయి ని పరిచయం చేసేరు - ఈ అమ్మాయి పేరు 'ట్వీటరీ దేవి - ఈవిడ మిమ్మల్ని స్వామీ వారి దగ్గరికి తీసుకు వెళుతుంది . ' చెప్పేడు ఆ కుర్ర స్వామీ.

స్వామీ మీ పేరు చెప్పేరు కారు అడిగింది జిలేబి .

'యు నో హి ఈజ్ యు ట్యూబానందా స్వామీ' కలకంటి ట్వీ టరీ దేవి తేనె లోలి కే కంటం తో  గారాలు పోయింది స్వామీ వారి మీద వాలి పోతూ .

జిలేబి కి ఎందుకో ఇది కొంత ఇబ్బెట్టు గా అనిపించింది . అదేమిటి ఈ అమ్మాయి ఇట్లా వాలి పోతోంది సభ్యత లేకుండా ! ఇది ఆశ్రమం కూడాను మరి  అనుకుంటూ .

ఆ ట్వీట రీ దేవి జిలేబి ఆలోచనలు టప్ మని పట్టేసి --> 'ఆంటీ ' యు నో యూ ట్యూబ్ ఆనందా 'is' మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ' అంది ! ఆ మాటలు జిలేబి కి అప్పటి అర్థం కాలేదు --> 'How can an ex-boyfriend be 'is' ! '


(సశేషం)
జిలేబి






***

 

Wednesday, September 25, 2013

బ్లాగు సన్యాసం కథ !

 బ్లాగు సన్యాసం కథ

నే పోతా చెప్పింది జిలేబి

ఎక్కడికోయ్ ?

ఈ బ్లాగు లోకం విడిచి పోతా

ఎందుకోయ్ ? అడపా దడపా రాస్తూండు ; చదివిన వాళ్ళు చదువుతారు ; నీ లాంటి టైము ఉన్న వాళ్ళు కామెంటు తారు ; నీకూ టీం పాస్ అండ్ టైం పాస్.

అన్నీ వదిలి ఇట్లా పోతా నంటా వె మరి ? నీ వెలా కాలం గడుపుతావ్ ?

లేదు నేను సన్యాసం స్వీకరించి వెళ్లి పోతున్నా . అంతర్జాలం అన్నది లేని ప్రదేశానికి .
నిశ్చయించుకున్నా.

అయ్యరు గారు అడిగేరు - ఎక్కడి కి వెళతా వోయ్ ?

ఏ హిమాలయాలకో తుంగా తీరానికో ఏ కోన లో కో అసలు నన్ను ఈ అంతర్జాలం తాక నంత దూరానికి వెళ్లి పోతా .
ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి, తొందరలో వెళిపోవాలని నిశ్చయించుకున్నా.


నువ్వెళ్ళి పొతే నీ రెగ్యులర్ బ్లాగ్ రీడర్ల ఏమయి పోతారు జిలేబి ? పాపం తెల్లారి లేస్తే నీ టపా కసమిసలు చదవందే వాళ్లకి పొద్దు పోదే మరి ? వాళ్ళని 'పని లేని' వాళ్ళు గా చేసేసి వెళ్లి పోతే ఆ కర్మ ఫలం నీకు చుట్టు కుంటుంది సుమా !'

ఆ నోరు తెరిచా . ఈ అయ్యరు గారు ఎట్లా అయినా మాట్లాడ టానికి తగుదురు ! వీరి మాటలని వినకూడదు గాక విన కూడదు . వెళ్ళా ల్సిందే మరి

పెట్టా బేడా సర్దు కున్నా . పోతూ పోతూ ప్చ్ పాపం మన రీడర్లు ఏమి పోతారో అన్న బెంగ పట్టుకుంది . సర్లే ఓ టపా కొట్టి పోతా నను కుని ఓ టపా కొట్టింది జిలేబి - నే వెళ్లి పోతున్నా ఈ పంచ దశ లోకం విడిచి పెట్టి అని.

టపా పెట్టెక చూసింది జిలేబి ; సరే కామెంట్లు ఏమి వచ్చాయో చూసి నాలుగు రోజులు తరువాయి వెళ్దాం లే అనుకుంది .

నాలుగు రోజులు గడిచేయి

యథా ప్రకారం గా కామెంట్లు వచ్చి పడ్డేయి

కామెంట్లు వస్తున్నాయి - ఆయ్ జిలేబి ఇట్లా ఒకే మారు వెళ్ళ మాకు కావాలంటే రెష్టు తీసుకో ఆ పై తిరిగి వచ్చేయి

ఆయ్ జిలేబి నీ టపా చదవందే నాకు పొద్దు గడ వదు వగైరా వగైరా ...

జిలేబి ఆలోచనలో పడింది . ఇప్పుడెం చెయ్యాలి ? అయ్యరు గారితో నొక్కి వక్కాణించే సా నే వెళ్లి పోతా నని ?

ఇప్పుడు ప్చ్ ప్చ్ ఈ బ్లాగర్ల ని కష్ట పెట్టి వెళ్ళా ల్సిందే నా మనం ?

రాత్రి గడిచింది ... తెల్లారి ఓ నిర్ణయానికి వచ్చేసింది జిలేబి .....


(సశేషం)
జిలేబి

Monday, September 23, 2013

నమస్కారం !


 
'మస్కా '
 
రామ్  
 
 
జిలేబి 

Saturday, September 21, 2013

జిలేబి వారి జాంగ్రి !


చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీటె  . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో  వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు  గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా  అని ?

వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది  పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం  ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



ఈనాటి  e-జాంగ్రీ తో
చీర్స్ సహిత
జిలేబి