Saturday, September 21, 2013

జిలేబి వారి జాంగ్రి !


చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీటె  . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో  వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు  గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా  అని ?

వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది  పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం  ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



ఈనాటి  e-జాంగ్రీ తో
చీర్స్ సహిత
జిలేబి
 

4 comments:

  1. ఓ... జిలేబీ గారు నాదీ రాయచోటే. ఆ సాయృబు అడ్రస్ చెప్పండి. జిలేబీలు పార్సిల్ చేసేస్తా...

    ReplyDelete
  2. రాష్ట్రం తగలపడి పోతుంటే జిలేబీ , జాంగ్రీ ఏమిటి ?

    ReplyDelete
  3. జిలేబి కోడి గీసిన అక్షరాలైతే.....జాంగ్రీ అందమైన అమ్మాయి వేసిన ముగ్గులాంటిది :-) ఏదేమైనా రెండూ స్వీట్లేనా....హాట్ హాట్ గా ఏమైనా పెట్టొచ్చుగా

    ReplyDelete
  4. మా జపాన్ ఫ్రెండ్స్ జిలేబీ అనమంటే జలేబీ అంటారు! ఓసారి ఏదో ఈవెంట్ లొ స్టాల్ లో దొరికితే తినిపించాను. అప్పటినుంచి ఇండియా స్వీట్ అంటే జలేబీ నే అనుకుంటున్నారు.

    ReplyDelete