"ఈ మధ్య మరీ భారీ అయి పోతున్నా ఏదైనా చేసి ఓ ఐదు నించి పది కిలోల బరువు తగ్గాలి అనుకుంటూ ఉన్నా ' చెప్పా " మా అయ్యరు గారి తో .
'ఇదిగో జిలేబి ఏదైనా చేసి ఎందుకు ? ఈ మధ్య దేశం లో ఎన్నో ప్రాబ్లెమ్స్ ఉన్నాయి . ఏదో ఒక డానికి నిరాహార దీక్ష మొదలెట్టు ఓ వారం లో ఐదు కిలో లేమి ఖర్మ, వీలయితే శాల్తీ శాల్తీ యే కరిగి పోవచ్చు కూడాను " అయ్యరు గారు రిటార్టు ఇచ్చారు .
ఆ హా ఇదేదో మంచి సలహా గా ఉన్నదని నిరాహార దీక్ష డిల్లీ లో నే మొదలెట్టే సా . నా తోడు అన్ని పార్టీల నేతలు నేత్రి లు , కూడా నిరాహార దీక్ష మొదలెట్టడం చూసి నాకు కూడా ముచ్చటేసింది !
అబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఎట్లా బరువు ఖర్చు చేసు కుంటారు సుమీ అని వార్ని మేచ్చేసు కున్నా మనసులో .
సో , బ్లాగు చదువరులారా, చదువరీ మణు లారా ! ఇదే మీకు జిలేబి అందించు 'నిరాహార దీక్షా ఆహ్వానం ! మీరు బరువు తగ్గాలను కుంటు న్నారా ! వెంటనే నాతొ బాటు డిల్లీ కి వచ్చి నిరాహార దీక్ష మొద లెట్టే య్యండి !
పుణ్యమూ పురుషార్థమూ అంటారు చూడండి , అట్లా మీ బరువు తగ్గ వచ్చు, దాంతో బాటు బోలడంత పేరు కూడాను !
ఇవ్వాళే రండి ! వేగిర పడండి ఆలసించిన ఆశా భంగం ! భలే మంచి చౌక బేరము !
నిరాహార !
నీకు సరిలేదు దేనికైనను !
ఇదే నీకు చీర్సు
జిలేబి (పది కిలోల బరువు తగ్గు ప్లాను లో ఉన్నది!)
బాగా బరువు తగ్గాగా భారీగా పార్టీ చేసుకోవటం మర్చిపోకండేం!
ReplyDeleteమేమైతే బందులు స్ట్రయికులు బాధల్లో ఉన్నాం. మీరు డిల్లీలో నిరాహార దీక్షలో ఉన్నారా? ఈ మధ్య కనపడకపోతే ఏమయ్యారబ్బా అనుకున్నాం. శ్యామలీయం గారన్నట్లు పార్టీ చేసుకోండి.
ReplyDeleteనాకు లో బీపీ, అండర్ వెయిట్ లాంటి సమస్యలున్నాయి. నేను ఓలిజబులేనా... ఆ తర్వాత నాకు ఆర్టీసీకో, మరోదానికో ఛైర్మన్ పదవి ఇప్పిస్తారా... క్లియర్గా తెలియజేస్తే ఆన్నం తినేసి ఇప్పుడే బయలుదేరుతా
ReplyDelete