విహంగావలోకనం - A bird's eye view - విహంగ వీక్షణం !
రామాయణం లో పుష్పక విమాన వర్ణన సుందర కాండ లో వస్తుంది. హనుమంతుల వారు పుష్పక విమానాన్ని చూడటం జరుగుతుంది .
వాల్మీకి అత్యద్భుత వర్ణన - ఈ పుష్పక విమానాన్ని గురించి సుందర కాండ లో ఏడవ సర్గ లో లో చెప్పడం జరుగుతుంది. ఆ పై ఎనిమిదవ సర్గ ఈ పుష్పక విమాన వర్ణన కి కేటాయించ బడి ఉన్నది .
ఏడవ సర్గ లో ఈ పుష్పక విమానం గురించిన వర్ణన ఒక విహంగావలోకనం లాంటి దైతే ఎనిమిదవ సర్గ లో వర్ణన 'a detailed description' లాంటిది !
పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడాన్ని వాల్మీకి వర్ణన - ఈ పుష్పక విమానం - మహా విమానం - 'best of the best! - वेश्म उत्तमानाम् अपि च उच्च मानम् |! ఉత్తమ మైన వాటిల్లో అత్యుత్తమ మైన విమానం అని !
అంటే ఆ కాలం లో ఇది ఒక్కటే విమానం కాక మరెన్నో విమానం ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి విమానా ల లో ఈ విమానం అత్యుత్తమ మైన విమానం !
ఇక ఈ విమానని గురించి న మరిన్ని వివరాలు ఎనివిదవ సర్గ లో మొత్తం ఏడు శ్లోకాలలో వాల్మీకి వర్ణన చేయడం జరుగుతుంది . మహద్విమానం మణి వజ్ర చిత్రితం !
महद्विमानम् मणिवज्रचित्रितम् |!
విశ్వకర్మ చేత నిర్మింప బడ్డది. అక్కడ 'వాయుపథం' లో నిలిచి ఉన్నది ! (ఈ వాయుపథం అన్నది మన కాలపు 'Run way' అనుకోవచ్చా ? ) ఆదిత్య పథ వ్యరాజవత్ !
తపోబలము చేత రావణుడు దీన్ని పొందాడు . 'ఇది మనోబలము చేత ప్రయాణిస్తుంది' అంటాడు వాల్మీకి !
అంటే ఈ విమానం ఆ కాలం లో ప్రయాణం చేయడానికి మనోబలం ఇంధనం లాంటిదన్న మాట . - मनःसमाधान विचारचारिणम् | -
तपह्समाधानपराक्रमार्जितम् |
मनःसमाधानविचारचारिणम् |
अनेकसंस्थानविषेषनिर्मितम् |
ततस्ततस्तुल्यविशेषदर्शनम् || ५-८-४
ఈ మధ్య మన కాలం లో నే స్పీచ్ రెకగ్నిషన్ పరికరాలు వస్తున్నాయి . వీటి తరువాయి సాయిన్సు డెవలప్ మెంట్ ఇక మనో బలం (Thought Power) చేత పరికరాలు నడప బడే స్థాయి కి రావచ్చు అనుకుంటా .
అంటే ఆ రామాయణ కాలపు డెవెలప్ మెంట్ ఒక స్థాయి ముందర ఉన్నట్టు అనుకోవచ్చు. మనోబలం చేత నడప బడే విమానం లాంటివి ఉన్నట్టు !
ఇక ఇది కాల్పనిక మైనదేమో అన్న సందేహం చాలా మందికి ఉండనే ఉన్నది. ఆ కాల్పనిక కథ అన్న మాటలని పక్కన బెట్టి - ఈ రామాయణ కాల ఘట్ట కాలం నాటికి వాల్మీకి సమకాలీకుడు అన్న మాటలని బట్టి ఆ కాలం లో తాను చూసినదానిని ఒక కవి వర్ణించాడు అని కూడా అనుకోవచ్చు. అట్లా అయిన పక్షం లో ఇది ఆ కాలపు ఒక విమానానికి సరియైన వర్ణన అయ్యే ఆస్కారం కూడా ఉన్నది.
ఇక దాని రూపం ఎట్లా ఉన్నది ? విచిత్ర కూటం బహుకూట మండితం ! -like a mountain with wonderful peaks adorned by many peaks!
ఇంతే గాక మనోభిరామం శరదిందు నిర్మలం ! - చంద్రుని లా నిర్మలం గా మనోభిరామం గా ఉన్నదట దాన్ని చూడడడం !
సో, ఈ విచిత్ర కూటం బహుకూట మండితం అన్నది చూస్తే దాని రూపు రేఖలు - మన కాలపు 'flyingsaucer' వర్ణన లా ఉన్నది !
ఈ వర్ణన లో అన్నిటికన్నా ముఖ్యమైనది నా కనిపించింది - ఇది మనో బలం చేత నడప బడుతుంది అన్నది . ఈ వాక్యం నిజంగా ఆలోచింప దగ్గ వాక్యం అనుకుంటా . ఎందు కంటే ఇప్పుడు మన మున్న కాలం లో thought power మీద జరుగుతున్న విశేష రీసెర్చ్ రాబోయే కాలం లో ఇట్లాంటి వనరులని మనకి తేవచ్చు కూడాను .
ఆ మధ్య ఎక్కడో చదివా ... హ్యూమన్ క్లోనింగ్ రీసెర్చ్ లో భాగం గా - ఒక బ్రెయిన్ లో జరిగే విశేష మైన లాజికల్ మేపింగ్ ని మరో బ్రెయిన్ లో కి ట్రాన్స్పోర్ట్ చేయ గలిగితే తద్వారా knowledge transfer mechanism చాలా సులభ తరమై పోతుంది అని !
సో ... ఇవ్వాల్టికి ఈ పుష్పక విమాన విహంగావ లోకనం పరి సమాప్తం !
మీకు నచ్చిందని ఆశిస్తూ ...
मनःसमाधान विचार चारिणम् |
ఎప్పట్లా చీర్స్ సహిత -
మీ
జిలేబి
సైనింగ్ ఆఫ్ !
మనోభిరామం శరదిందు నిర్మలం !
here manobalam stands for todays remote sensing nd wi-fi technology..that means if u r in that puspakam nd if u want to slow down the vehicle in ur thought,it automatically slows dwn nd fast means.vicecersa..
ReplyDeletePlease keep write good posts like this.. Valuable and informative and spiritual.. thanks..
ReplyDeleteరామాయణం చదువుతున్నట్లుందే! వాల్మీకి చాలా చెప్పేడు!! మరో సారి చదవండి!!! టపా బాగుంది.
ReplyDeleteపురాణాలనీ, ఇతిహాసాలనీ పవిత్రగ్రంథాలుగా యథాతథంగా నమ్మేవారు మొదటిరకం.రెండోరకం అవి కల్పనలని,హంబగ్ అని కొట్టిపారేసేవారు 3.మూడోరకం, చరిత్ర,పురాతత్వ శాస్త్రజ్ఞులు.వీరు పరిశొధించి రుజువులు ,సాక్ష్యాలు అన్నీ బేరీజు వేసి నిర్ణయిస్తారు.ప్రస్తుతం వీరి అభిప్రాయం రామాయణ,భారతాల మూలకథలు జరిగివుంటాయి కాని కొన్ని అతిశయోక్తులు,కల్పనలు ఉన్నాయని.(మునిగిపోయిన ద్వారక,రామసేతు అవశేషాలు కనుగొనడం ఒక రుజువుగ భావించవచ్చు.) వీరి అభిప్రాయం ప్రకారం ఇంకా చాలా తవ్వకాలు,పరిశోధనలు జరగాలని.మనం కూడా నిష్పక్షపాతంగా,శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించాలి.
nice post and thought provoking jilebi garu.. keep writing.
ReplyDeleteత్రిజట కలలో కూడా ఈ పుష్పక విమాన వర్నన ఉంది, రాముడు రావణుని సంహరించి సీతను తీసుకువెళ్ళినట్లు ఆమెకు కల వస్తుంది, ఆమె ఈ విష్యాన్ని సీతాదేవికి వివరిస్తుంది. మీ పోస్ట్ చాలా ఉందాగా ఉంది సర్.
ReplyDelete