Saturday, August 11, 2012

కాలక్షేపం కబుర్లు - కన్నయ్య విజిట్ !

మీర జాలగలడే నా యానతి సత్యా పతి అని మురిసిపోతున్న సత్యభామ అదిరి పడింది. స్వామీ వారూ చెప్పా పెట్టకుండా బయలు దేరారు.

ఏమండీ ఎక్కడికి ప్రయాణం ? సత్యకున్ చెప్పక, మురళి యున్ చేత పట్టక పరధ్యానం లో స్వామీ వారు వేగిర పడ్డారు.

ఊహూ జవాబు లేదు. కన్నయ్య టపీ మని మాయమయ్యి అనపర్తి లో దీక్షితుల గారింటి ముందు నిలబడ్డాడు పొద్దున్నే.

తెల తెలవారి - శుభ భ్రాహ్మీ ముహూర్తం. లోపల టప టప మని శబ్దం వస్తోంది.

కన్నయ్య తలుపు తట్టాడు.

ఎవరూ అంటూ బ్లాగ్ గాంధీ బయటకు వచ్చేరు.

'నన్ను కన్నయ్య అంటారు.  నన్ను తలిచారు మీరు '

కన్నయ్య ?

అవును

చేతివంక చూసారు దీక్షితులు గారు.

మురళీ లేదే మరి ?

సిరికిన్ చెప్పక పద్యం మీరే ఎన్నోమార్లు బ్లాగ్ టపాలో రాసేరు కదా శర్మ గారు ? స్వామీ వారి పృచ్చ!

శర్మ గారు తలూపారు.

లోపలి రావచ్చా ?

అప్పటికి తెప్పరిల్లి శర్మ గారు, 'క్షమాపణలు స్వామీ మీరు వచ్చిన రీతిన కలిగిన దిగ్భ్రాంతి ఇంకా నన్ను వదల లేదు. ఇది మీ గృహం. మీకు అనుమతి కావాలా... దయ చేయండి, చెంపలేసు కున్నారు శర్మ గారు.

స్వామీ వారు వచ్చేరు.

ఏమయ్యా ఇది.

బ్లాగు అంటారండి. టపా ఒలిచి స్వామీ వారి చేతిలో పెట్టి శర్మ గారు, కీబోర్డు చేత పెట్టు కున్నారు.

స్వామీ వారు టపా లని మూషికా ధారి అయి అంకోపరి నించి ఆ నాడు కుచేలుడు తెచ్చిన అటుకులు లాగించి నట్టు లాగిస్తున్నారు.

సత్య భామ భయ పడ్డది. ఇలా స్వామీ వారిని వదిలి పెడితే ఇక బ్లాగు లకే అంకితం అయి పోతారేమో స్వామీ వారు. ఆ పై సత్యాపతి, బ్లాగ్పతి అయిపోతాడేమో మరి అనుకుంటూ.

శర్మ గారు, ఈ బ్లాగు బహు బాగు అన్నారు స్వామీ వారు.

మీరు నేర్చుకుంటారా స్వామీ ? శర్మ గారికి మహదానందం స్వామీ వారే వచ్చి బ్లాగుని మెచ్చు కుంటే ఇక వేరే ప్రశంశలు కావాలా మరి ?

నేర్పిద్దూ...

సత్య ధామ్మని వచ్చి, 'ఇదిగో, శర్మగారు, ఇది మీకు తగదు, మీ శ్రీమతి మీకెన్ని మార్లు చెప్పేరు అలా షికారు కెళ్ళి రండి ' అని మాట మార్చింది.

అమ్మ్మో, ఇక్కడా జిలేబీ యే మరి అని శర్మ గారు మౌనం దాల్చేరు.

సత్యా ఈ బ్లాగు నువ్వు కూడా నేర్చుకో రాదు మరి ?

ఎందుకు ?

అప్పుడప్పుడు మనమిద్దరం బ్లాగ్ లోకం లో ముచ్చట్లాడు కోవచ్చు గా ?

'అవునండీ మా బ్లాగ్ లోకం లో భమిడిపాటి  శ్రీ వారు శ్రీమతి వారు ఇట్లాగే ముచ్చట్లాడు కుంటుంటారండి ' శర్మ గారు ఉప్పందించేరు.

మురళీ ధారి శ్రీ కృష్ణుల వారు మూషికాధారి అయ్యేరు.

సత్య పక్కాల నిలబడి, కొలిచే!

కథ కంచికి మనమింటికి !


శ్రీ కృష్ణం వందే జగద్గురుం!

చీర్స్
జిలేబి.

1 comment:

  1. జిలేబి గారు,
    కన్నయ్య మా ఇంటికి వచ్చారన్న మీ మాట నన్ను మా కుటుంబ సభ్యులను ఆనందవర్షంలో తడిపేసింది.కన్నయ్యను ఊహ లోనైనా దర్శించే భాగ్యం కలగచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను కన్నయ్య ఎల్లవేళలా కాచి కాపాడాలని వేడుకుంటూ, శలవు.

    ReplyDelete