Saturday, May 20, 2017

కనకన లాడెను లతాంగి కామెంటులటన్ ! 
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 

ధనజాతకమునకు జిలే
బి, నవనవ యనియటు కాసు బిరబిర వచ్చున్ !
గనవమ్మా నీవున్నటు
కనకన లాడెను లతాంగి కామెంటులటన్ !
 
 
జిలేబి
39 comments: 1. కష్టేఫలే శర్మగారి సాయిన్సు తేట గీతి - ట్వీటు ట్రీటు :)

  బిందె నీటిని తలకిందు బెట్టి చక్క
  గాను పలుచని వస్త్రము గట్టి కొంకి
  నసరి గట్టి దానిచలువ నతల నిడిన
  మండు వేసవిలో చలి మెండు సుమ్ము


  జిలేబి

  ReplyDelete


 2. భీముని పలుకులు చంద్రశ్రీ వృత్తము

  ప్రకోపమ్ముల్గూడున్, రణమున పారింతు రక్త
  మ్మకో! శాపమ్ముల్ తీర జనుల మారాటముల్ ప
  న్నుకో! పాపమ్ముల్ పండగ మిము నూర్చంగ నిక్క
  మ్మకో! తాపమ్మున్ తీర్చనిక సమాఘాతమే కో !

  జిలేబి

  ReplyDelete


 3. జిలేబీ! పద్యమ్ముల్ చదువను చింతించ లేనౌ!
  భలే! పన్నుల్ వేయన్ తగుదువు భాసించ వమ్మా!
  చలాకీ ! నీ భాగ్యమ్ము గద సొసాయించ లేద
  మ్మ లాఠీదెబ్బల్లన్ గురువులు మాసక్క గానౌ :)

  జిలేబి

  ReplyDelete

 4. ఓయమ్మా! ప్రాసలకై
  న్యాయమ్మా యిటుల మమ్ము నాదమ్ములతో
  వేయించడము జిలేబీ !
  సోయగముల నోలలాడు సొగసరి వలదే !

  జిలేబి

  ReplyDelete


 5. కోయంటే కొల్లలుగా
  నేయగ పదముల జిలేబి నేతరి వోలెన్
  మేయము లాయెన్ పద్యము
  లౌ యతి గణముల జతగని లావుగ నిచటన్ !

  జిలేబి

  ReplyDelete


 6. కలికి! కౌగిలి ప్రాణాంతకారి గాదె,
  పలుకుల కొలికి! నెలతుక! పదముల వలె
  నను పిడినిడుచు పట్టుగ నలిపి పిండి
  జేయ వలదు జిలేబియ! చేవిడు చెలి :)

  జిలేబి

  ReplyDelete


 7. కోపము నషాళమున కం
  టే! పాగల్పన్ జిలేబి టేటే పలుకుల్ !
  సాపాటు రాయుల టపా
  మా పై తోసితివి గాద మర్కట రమణీ :)

  జిలేబి

  ReplyDelete


 8. ధారా ళంబుగ గాధల
  నేరాలంబుగ జిలేబి యెన్నిటి నో శ
  య్యై రాసెన్నందులనన్
  శ్రీరామునిఁ గని యహల్య శిలగా మారెన్!

  జిలేబి

  ReplyDelete


 9. పద్యలక్షణాల గురించి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన “అనుభవాలూ – జ్ఞాపకాలూను” పుస్తకంలో ఇలా అన్నారు (రెండవ భాగంలో 23వ అంకం/Chapter లో) :-

  ” ఛందస్సు తెలిస్తే కవే అయివుండనక్కరలేదే దెవరయినా కట్టెయవచ్చు పద్యాలు.

  అయితే, అవి కమ్మెచ్చున లాగినట్టు నడిపించడం వొక విశేషం.

  కొలతలు తప్పకుండా సమపాళాల్లో బొమ్మ గియ్యడం యెలాంటిదో, వ్యాకరణ దోషాలు దొర్లకుండా రచన చెయ్యడం యెలాంటిదో, నడక చెడకుండా పద్యం కట్టడమూ అలాంటిదే. పద్యాని కుండవలసిన యోగ్యతల్లో మొదటి దిది.

  నడక అంటే యెగుడు ల్లేకపోడం మాత్రమే కాదు, రెయిలు పెట్టెలకు లాగ అనుస్యూతత యేర్పడాలి.

  ఏమంటే?

  ఎంత నేర్పుండినా యిటుకలు పేర్చినంతమాత్రాన గోడ కాదు, బెందడీ – సున్నమూ – లేక సిమెంటూ వంటి బంధకాలుండాలి, యథోచితంగా.

  అలాగే, గణయతిప్రాసలు సరిపుచ్చి మాటలు బిగించినంతమాత్రానా పద్యం కాదు, ఆ మాటలకు పొందికా, బిగువూ ఏర్పడాలి, విశిష్ట సంధానంతో.

  అలా చెయ్యగలగడానికి చాలా సాధన చెయ్యాలి, ప్రత్యేక శ్రద్ధతో.


  గురువుల మాట గురుతెరిగి పలుకౌ :)

  జిలేబి

  ReplyDelete
 10. రావాడ కృష్ణ గారని ఒక హైస్కూలు మాష్టారు గారుండేవారు. ఆయన నాకన్నా చాలా పెద్ద వారు. కాని నాపై ఎంతో స్నేహాభిమానాలు కలిగి ఉండేవారు. అప్పట్లో నాకింకా హైదరాబాదులో ఉద్యోగం‌ కాలేదు. కొంతమంది పిల్లలకి కాలక్షేపానికి ట్యూషన్‌లు చెప్పేవాణ్ణి. అందులో సీఐగారమ్మాయి కూడా ఉండేది. ఒకనాడు నాదగ్గర పాఠం చెప్పించుకొని వెడుతూ కృష్ణగారిని చూసి మాష్టారూ‌ నా బొమ్మవేయరా అని బ్రతిమాలింది.

  అన్నట్లు ఆయన మా ప్రక్కవాటాలోనే ఉండేవారు. పైగా చాలాపేరున్న చిత్రకారులు. ఆ అమ్మాయి బ్రతిమాలితే అలవోకగా నాలుగ్గీతల్లో ఆమె బొమ్మ వేసేసారు! పోలికలు నూటికి నూరుపాళ్ళూను!

  అయన బాగా చేయితిరిగిన కళాకారుడు కనుక ఆయన అలా కొద్దినిముషాల్లో కాసిని గీతల్లో ఆమెచిత్రం గీయగలిగారు.

  లలితకళల్లో దేనిలోనైనా అటువంటి స్థాయి ఒకటి తప్పక ఉంటుంది. అలా అలా సులువుగా బొమ్మగీసేయగల ప్రజ్ఞ ఎలాగో అతి ధారాళంగా పద్యం చెప్పగలిగే‌ ప్రజ్ఞకూడా అటువంటిదే.

  మొదట కళ అన్నది పుట్టుకతో కొంత వస్తుంది. సాధన వలన మరింత మోరుగవుతుంది. పెద్దలవద్ద మెళుకువలు గ్రహిస్తే అది మహోన్నతమైన దశకు వెడుతుంది.

  గళ్ళుకట్టి బొమ్మలు వేసే దశ ప్రాధమికం. అలాగే గణాల్లో అక్షరాలు పేర్చుకుంటూ వ్రాయటం‌ కూడా ప్రాథమికం. గళ్ళుకట్టివేసిన బొమ్మను అంతర్జాతీయప్రదర్శనకు ఎవరూ ఎలా పంపరో - గణాల్లో అక్షరాలుపొదిగి కిట్టించిన పద్యాలవంటి వాటిని అందరిముందూ ప్రదర్శించటమూ ఎవరూ చేయకూడదు సుమా అని విజ్ఞులు గ్రహించగలరు.

  ReplyDelete
  Replies

  1. సృష్టి సమస్తము జిలేబియే గద !
   సృష్టి విలాసము జిలేబియే గద !

   చీర్స్
   జిలేబి

   Delete

  2. హరి ఓం తత్సత్ !

   జిలేబి

   Delete


 11. తమ కలహ యత్నములికన్
  గమనించదగును జిలేబి గట్టేరదు సూ
  వె! మదియు రాపాడ తగదు
  సుమముల కురిపించవమ్మ సుందరి నీవున్ :)

  జిలేబి

  ReplyDelete


 12. కలయైన జీవితమున
  న్నిలకడ లేని మదికోరె నిచట నలుగురిన్ !
  నలుగురి కోసము పాపము
  వలలో చిక్కిరి జిలేబివరులిచటగదా !

  జిలేబి

  ReplyDelete


 13. సీరియలుల గనన్నట చిత్ర మెల్ల
  మానసమ్మును చెట్టగ మంకిపట్టు
  నేరమగుఁ, జేయఁ గాత్యాయనీ వ్రతమ్ము
  మేలగు జిలేబి విడువమ్మ మేరమీఱ!

  జిలేబి

  ReplyDelete


 14. ఇటుకల పేర్పుల పద్యము
  లటుగావు వినవలెనమ్మ లకుమికి పిట్టా !
  దిటవుగనవమ్మ యీ పలు
  కు టమారమ్ముల సడి సణుగుడు మన కేలా !

  జిలేబి

  ReplyDelete


 15. మాంచెస్టరు మారణ హో
  మం!చెట్టగు విధము గాద మనుజుల తీరుల్ !
  సాంచహు లోచిక్కిరిబో
  బాంచెను జనులటు జిలేబి బద్మాష్ గాళ్లై !

  జిలేబి

  ReplyDelete


 16. మాంచెస్టరు మారణ హో
  మం!చెట్టకు కారణంబు మా జ్యోతిష్యం
  టంచను గా గాంచెనహో !
  సోంచా యించిరి జిలేబి సోకుడుబుడుగుల్ !

  జిలేబి

  ReplyDelete

 17. రగడల దినముల పదముల
  పగడము గడగడ సరియగు పసగుల గననౌ
  సగపడ, కవనపు పలుకుల
  బిగువుల గురుడటు నెలకొన బిరబిర వచ్చెన్ !

  జిలేబి

  ReplyDelete

 18. పునర్జన్మల్ మీదన్ గురుడటు పూచీగ తాన
  య్యెనమ్మా !మాయాజా లమిదనియే యేసు జెప్పె
  న్ననెన్ ! యేమా యెన్బో యమెరిక! నాగాడుచుండెన్!
  సునాయాసంబౌ ధ్యానము మనసున్నన్ ఫలించున్ !

  జిలేబి

  ReplyDelete


 19. హా!తల్కము! దాశరథికి
  సీతను బెండ్లాడి, శివుఁడు శిశువుం గనియె
  న్నా తామసి పెనిమిటియై,
  లేతరి కమ్మన జిలేబు లేమరి యేనౌ !

  జిలేబి

  ReplyDelete


 20. శయ్యాసౌభాగ్యంబుల్
  వయ్యా రపునడక పద్య వాగ్ఝరి బాగుం
  దయ్యా మీ మధురగతియు
  సయ్యాటగ సాగెనయ్య శ్యామల రాయా !

  జిలేబి

  ReplyDelete


 21. మనదేశమునన్ ప్రాచీ
  న, నవ్య కథయౌ ధరణిజ నాగటిచాలున్
  తనుబుట్టెను,పెనిమిటి రా
  ముని సాంగత్యమున నారి పుత్రులఁ గనియెన్!

  జిలేబి

  ReplyDelete


 22. హ! తు పా కులబెది రించి నె
  లతుకను పెండ్లాడెనుగద లాపర్వాహీ
  వెతలు తొలగ పడతి తిరిగె
  బతుకున్నీడ్చన్ ‌జిలేబి బార్డర్ వాగ్వా !

  జిలేబి

  ReplyDelete


 23. బుడతా బడికొస్తావా?
  పెడతా బువ్వను జిలేబి పేర్మిని గూడన్
  సడిజేస్తో ఆడుకొన
  మ్మ డమడమల యాడు వయసు మరియిదియేనౌ !

  జిలేబి

  ReplyDelete


 24. పెళ్ళికి ముందే తల్లై
  కళ్ళెము వేస్తా జిలేబి కన్నడి కనుచున్
  భళ్ళన కుండను కొట్టెను
  చెళ్ళని హాసనుడి పిల్ల చెకుముకి రాయీ‌ :)

  జిలేబి

  ReplyDelete


 25. ఓ! వైవీ ! యీ రాత
  న్నేవో మారెక్కడో గనేనుగ ద? జిలే
  బీవోలెవున్న దే ! య
  బ్బీ! వూ రేదో ? విషయము బిగిబిగి తెలుపన్ :)

  జిలేబి

  ReplyDelete


 26. ఎక్కడి కథలన్ పట్టితి
  వక్కమ్మా ! మజ జిలేబి వార్చితివిగదా
  చిక్కుల్ బడితిని సుమ్మీ
  తక్కిడి జేయంగ వాడు తప్పే వెదుకున్ :)

  జిలేబి

  ReplyDelete


 27. అమా వాస్యా ! నీవే సుమ జన భారమ్ము లెల్లన్
  సమానమ్మై జేయన్ కడియము సంజోకమున్ జే
  సి మా ప్రాణమ్ముల్లాగితివి మసిన్ బూసి! ఓ చం
  ద్రమా ! మా పాడెన్గట్టితివి సుతారమ్ము గానన్

  జిలేబి

  ReplyDelete


 28. ణిసిధాత్వర్థము కోరగ
  ముసిముసి నవ్వుల జిలేబి ముగ్ధగ నిలువన్
  మిసుకుల తడబాటుల పడి
  పసదనములను తొలగింప పతి దరి జేరెన్ :)

  జిలేబి

  ReplyDelete


 29. అర్నాబదిగో మళ్ళీ
  చర్నాకోల గొనివచ్చె సందడి జేయన్
  ధర్నాలన్ జేయన్నం
  తర్నగరమునన్ జిలేబి తాటన్వొల్చున్ :)

  జిలేబి

  ReplyDelete

 30. మానవుడు మనసు పెట్టిన
  కాని పని యని యిల నేది గలదు జిలేబీ
  ఆ నింగి నీది యత్నము
  పూనించగ నీవు సృష్టి పుట్టించెదవోయ్ !

  జిలేబి

  ReplyDelete


 31. సమసంఘనోటు ఫైవున
  జమగట్టి మనుజుడు చిత్ర చామర వీచన్
  గమనింపవచ్చి గురుడొక
  సమస్యను కెలికె జిలేబి సహచరుడుగదా :)

  జిలేబి

  ReplyDelete


 32. కొండలచట మునులవలెన్
  నిండుగ వినయముగ నిలిచె నిర్మల జలమున్
  మెండుగ యర్ఘ్యంబిడనౌ
  చండాంశునికిన్ జిలేబి చక్కటి చుక్కా !

  జిలేబి

  ReplyDelete


 33. కాఫీ త్రాగుచు కందము
  సాఫీ గా తేటగీతి చంద్రశ్రీల
  న్నాఫీసులోన సరసీ
  యే ఫీచరునైన లేమ యెక్ రంగీలా :)

  జిలేబి

  ReplyDelete


 34. టీకా తాత్పర్యములన్
  బాకా జేయుచు జిలేబి బాగుగ జేసెన్ !
  మా కాలపు మడిసి గదా !
  రాకింగుల వైవి సూవె రంగం జాలం !

  జిలేబి

  ReplyDelete


 35. మెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు 
  మండు టెండలో కురిసెను మంచు జల్లు
  యండగొట్టక చల్లని యాశుగమ్మె
  చండ రుక్కటు దాగెను జలధరమున ! 

  జిలేబి

  ReplyDelete
 36. ఏమయ్యారండీ జిలేబి గారు !! మీ పద్యాలని మిస్ అవుతున్నామండీ :)

  ReplyDelete