Sunday, December 28, 2008

కృష్ణా తీరం

రాయలసీమ వాళ్ళకి కృష్ణా తీరం అంటే ఓ పాటి ఉత్సుకత తప్పకుండ ఉంటుందనుకుంటా. రాయలసీమలో నీళ్ళకి ఎప్పుడు ఇరకాటమే. అట్లాంటిది కృష్ణా తీరం గురించి చదివినప్పుడు , ఆ కృష్ణా నీళ్ళ గురించి విన్నప్పుడు చిన్నప్పట్లో నిజంగా నాకైతే ఓ మారైనా కృష్ణా తీరం చూడాలని బలీయమైన కోరిక ఉండేది. అంతే కాకుండా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి "కృష్ణా తీరం" పుస్తకం చదివాక ఈ కృష్ణా నది ని ఓ మారిన దర్శించాలని కోరిక ఎక్కువైంది
జీవితపు కాల వాహిని లో ఉద్యోగ పయనం చేసేటప్పుడు మొట్టమొదటిసారి కృష్ణ సందర్శనం విజయవాడని కోరమండల్ ఎక్ష్ప్రెస్స్ ట్రైన్ లో క్రాస్ చేసినప్పుడు లభ్యమైంది. అదే మొదటిసారి కృష్ణ ని చూడడం. చూసాక అనిపించింది - బిర బిర కృష్ణమ్మా అని మన గేయకారులు శంకరంబాడి సుందరాచారి గారు ఊరికే అనలేదు అని. ఎంతైనా కృష్ణా దర్సనం మదిలో నిలచిపోయే ఓ తియ్యటి అనుభవం.

జిలేబి.

7 comments:

  1. విజయవాడలో పుట్టిపెరిగిన నాకు మీ యీమాటలు చదువుతుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా, విజయవాడలో కృష్ణమ్మ బిరబిర పరుగులు ఏనాడోనే ఎండి పోయాయి! ఆ బిరబిరలు చూడాలంటే ఏ శ్రీశైలమో వెళ్ళాలిసిందే

    ReplyDelete
  2. మన రాయలసీమోళ్ళకి ఎక్కడ నీళ్ళు చూసినా ఆనందమే!

    ReplyDelete
  3. నాది కూడా మహేష్ గారి మాటే. "మన రాయలసీమోళ్ళకి ఎక్కడ నీళ్ళు చూసినా ఆనందమే"! :)

    ReplyDelete
  4. నేను కాలేజీ కి వెళ్ళేటప్పుడు, రోజూ కృష్ణ మీదుగానే వెళ్ళేదాన్ని... బ్రిడ్జ్ మీద బస్ వెళుతున్నంతసేపు, దాన్ని అలా చూడడం అదొక ఇది!

    ReplyDelete
  5. malladi ramakrishna sastry gari krishna theeram novel ekkada dorukuno koncham vivaralu cheppagalara?

    Dr VST KRISHNA
    ASSOCIATE PROFESSOR
    DEPT OF PSYCHIATRY
    JSS MEDICAL COLLEGE HOSPITAL
    2 FLOOR RAMANUJA ROAD AGRAHARA MYSORE 4

    ReplyDelete
  6. dear vst-

    you can try getting krishna teeram navala from visaalaandhra publications probably if they have reprints

    zilebi.

    ReplyDelete
  7. i want to read the novol krishna teeram . how can i down load it. nkbabu_nk@yahoo.com

    ReplyDelete