చిత్తూరు నీవా నది తీర ప్రాంతంలో విరాజిల్లిన గుడి శ్రీ వరదరాజస్వామి గుడి. ఈ గుడి కి వెళ్ళడానికి నీవా నదిని దాటి వెళ్ళాలి. పూర్వ కాలం లో నది నీళ్ళతో నిండి ఉంటె నదిని దాటి ఈ గుడికి వెళ్ళడం ఒక పెద్ద విషయం. ఆ తరువాయి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వస్తే చిత్తూరు నీవా నదికి నీళ్ళు పోయేయి. నీవా నది లో చిత్తూరు లో కాలుష్యం అన్ని నదుల్లా దీనికి పట్టింది. కాలుష్యం తో బాటు చిత్తూరు నాయుడు గారి "సురాపానం" (అదేనండి మదిరం- లికర్ అంటారు అట ఆంగ్లం లో ఐతే) కార్ఖానా "పుణ్యమా" అని నదిలో "సురాపానం" కాలువై ప్రవహించింది. ఆ కాలంలో దగ్గిరి వీధిలోని నీళ్ళు "మత్తు" గా గమ్మత్తు గా పసుపు కలర్ తో జనాలకి ఓ కిక్ ఇచ్చింది! నది బెడ్ చేరబడింది - ఆ మధ్యలో ఈ నాయుడు గారు సాయిబాబా గారి నీటి పధకానికి కొట్లిచ్చారని వినికిడి. పర్సనల్ కాలుష్య నివారణార్థం కామోసు అనుకున్నాను ! ఈ నది కాలువని - సురా కాలువ సువాసలని భరించలేక చాలామంది ఈ గుడి కి వెళ్ళడం మానుకున్నారు కూడా. ఆ పై ఆ గుడి దొంగల బడి అయ్యింది. అప్పుడప్పుడు మంచి ఎండలో ధైర్యం చేసి ఆ కాలపు కుర్రాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ! ఆ తరువాయి ఎవరో పుణ్యమా అని మళ్ళీ గుడి లో దీపం కొన్ని రోజులు వెలిగింది.
ఇవన్ని ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే- ఈ పై కహానికి కోపెన్ హగెన్ సభలకి సామరస్యం ఉంది కాబట్టి. భూప్రపంచాల కాలుష్యం నివారించడానికి ౧౯౨ దేశాలు సమావేశమై తమకు తామే పాడుచేసుకున్న గుడిని మళ్ళీ నిలబెట్ట తామోచ్ అని వాక్రుచ్చి హాట్ తోపిక్ తో కిందా మీదా పడుతున్నాయి- మా నాయుడు గారు సాయిబాబా గారి నీటి పథకానికి డబ్బిచ్చినట్టు గా ( ఆ మాత్రమైన ఇచ్చాడు గా అన్నది మరో వాదన - అదీ ఇవ్వకుంటే ఏమయి ఉండేది చిత్తూరోల్ల నీటి కష్టాలు ?)
నదులకి నీళ్ళు లేవు. జనాలకి నదులే ఇల్లులు కట్టుకోదాని స్థలాలు అయి పోయేయి.
నదులలో నీళ్ళు లేవు. నది మట్టి ఇల్లులు కట్టుకోడానికి రాష్ట్రేతర రావాన అయి పోతోంది
నదీనాం సాగారో గచ్చతి అన్నది ఆ నాటి వాక్కు!
నదీనాం రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాకెట్ మనీ గాచ్చాసి అన్నది నేటి వాక్కు
నదీనాం న ప్రవహంతి - నదీనాం న జీవసి అన్నది రేపటి వాక్కు !
అంతా విష్ణు మాయ కలికాలం ప్రభావం ! మాయ తేరా దిగితే - మనిషి ఆకస హర్మ్యాల నుండి భూమ్మి మీద కి రావటం - ఓ త్సునామి క్షణం అంత సేపు !
జిలేబి.
సమస్య - 4952
-
25-11-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మద్యముఁ గొన దాశరథిని మారుతి పిలిచెన్”
(లేదా...)
“మద్యముఁ గ్రోల రమ్మనుచు మారుతి పిల్చెను...
7 hours ago
బాగా చెప్పారండి. ఇలాగే కొనసాగితే ఫలితం అదే మరి.
ReplyDeleteబాగా చెప్పారండి! నేను చిత్తూరులోనే పుట్టి పెరిగినా ఈ వరదరాజ స్వామి గుడి ఎక్కడుందో తెలియలేదు. చిత్తూరు నాయుడి కార్ఖానా పుణ్యమాని నీళ్ళేగాక, గాలి కూడా కలుషితమై బాధ పడినవాళ్ళలో నేనొకడిని.
ReplyDelete