ఫ్లైట్ నుంచి దిగబడి హమ్మయ్య మా భారత భూమి పై కాలు మోపాను అని సంతోషం పడి పోవడం ప్రతి భారత ప్రవాసి కి ఓ పిచ్చి ఆనందం ! ఆ ఆనందం ఓ రెండు మూడు రోజులలో హుష్ కాకి ఐపోయి "మా దేశం లో ఇట్లా - ఇక్కడ ఇట్లాంటి కంపరిసన్ కి దిగి పోవడం సర్వ సాధారణం!
అట్లాంటి బడుగు మధ్యతరగతి భారత ప్రవాసి మహానగర సందర్శనార్థం బయలు దేరడమునను ఆ హా మా దేశం ఏమి ఉన్నతి చెందింది- "ఇండియా షైనింగ్ " అంటే ఇదే కామోసు అన్న అధ్బుతమైన ఆలోచనతో సరే ఈ ఊరి బస్సు కూడా ఎక్కి చూసేద్దాం అన్న ఆలోచనకి వచ్చి బస్సు ఎక్కడమున్ను ఆ పై బస్సులో ఒఊపిరి ఆడక ( ఆ పాటి ఓ రోజుకే అల ముహం వేలాడ దీసుకుంటే ఎలా మరి- ఇదే దేశం లో ఈ కార్యక్రమం రోజువారి జరుగుతోందే మరి?) ఎందుకొచ్చిన నగర సందర్శనం రా బాబు అనుకోవడమూ కద్దు!
కాని ఈ మారు గమనించిన దానిలో విశేషం బెట్టి దంటే- నగరం లో దుకానులు కలర్ ఫుల్ గా ఐయిపోయీయి! బస్సులు ట్రాఫ్ఫిక్ అట్లాగే మరీ ఎక్కువై పోయేయి. అంటే దరిమిలా దేశానికి ఎ ఇన్ఫ్రా స్త్రక్తుర్ అన్నది ఎట్లా వస్తుందో తెలియకుండా పోయింది.
బస్సులలో చెవులకి ఎఅర్ ఫోన్ లు ఉన్నాయి. చేతుల్లో ఐపాడ్ ఉన్నాయి. జనాల చేతుల్లో తినడానికి జుంక్ ఫుడ్ బోల్డంత ఉంది. కాని రోజువారి ప్రయాణం లో పదనిసలు ఎప్పుడు సరిగమలు పాదతాయో ?
ఇది ఎ ఒక్క మహానగర దుర్భాగ్యం మాత్రం కాదనుకుంటా? అన్ని మహా నగరాల పరిస్థితి ఇంచు మించు ఇట్లా గే ఉన్నది. జనత సౌకర్యం గా పయనం చెయ్యలేక ప్రైవేటు వాహనాలు రోడ్ల పై ఎక్కువై అవి ఇంటి వటుడింతై అన్నట్టు గా ఇటు రోడ్ ని అటు ఫుట్ పాత్ లని అధిగమిస్తూ సర్కస్ చేస్తూ పోతూంటే- ఓ భారత దేశమా - ప్రగతి కి నిర్వచనం ఎక్కడ ఉన్నది?
జన ప్రభంజనం లో మహా ప్రవాహ వాహినిలో కొట్టుకు పోతున్న దేశమా - కాస్త నిలిచి జనాలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలని అనుకుంటున్నావో ఓ మారు ఆలోచించు అని అనుకోకుండా మానుకోడు సామాన్య మానవుడు!
అయినా దేశం ఇట్లాంటి సమస్యల ప్రవాహాన్ని పట్టించుకోదు! పట్టించు కావలసినవి చాల ఉన్నాయి- ఉదాహరణకి రాష్ట్ర విభజన లాంటి నిఖార్సైన విషయాలు!
మీరేమంటారు? తెలుసు లెండి సామాన్య మానవులం మరి- ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే- మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి చూసీ చూడకుండా వెళ్లి పోవడం మన ఆరోగ్యానికి క్షేమ కరం!
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
అంతే అంటాను.
ReplyDeleteఅవునవును. మా రాష్ట్రం మాకు కావాల్సిందే. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎన్నో వుంటాయి కానీ వాటిని చూసీ చూడనట్లు పోవాలి మరి.
ReplyDeleteనాదో సందేహమండీ, మీ బ్లాగుకు మొదట్లో నేని ఆ "ఛీర్స్" అనే పదంకోసమే వచ్చేవాడిని. అది తీసేసారేమి?
మీ పిచ్చి అంతా.. దేశం బాగా డెవలప్ అయ్యి ప్రతి ఒకరికో కారు వచ్చే రోజులొచ్చేస్తే ఏమిటో బుస్ లు బస్ ల అంటారు, ఈ ప్రవాసాంధ్రుల తో ఇదేనండి చిక్కు ఆలోచనలలో బాగా వెనుకబడీ వుంటారు. ;-)
ReplyDelete