Tuesday, November 9, 2010

రౌడీ అమ్మ గారు - రౌడీ గారి అమ్మ గారు కథా కమామీషు !

ఈ మధ్య ప్రమదావనం మహిళల మీట్ - భాగ్యనగరం లో జరిగిన సందర్భం లో ప్రచురించిన బ్లాగు పరంపరలని చదివాక - అందులో - రౌడీ అమ్మగారు (రౌడీ గారి అమ్మగారు) ఇంటర్వ్యూ చదివాక ఈ టపా రాయాలనిపించింది.

పాపం ఆ అమ్మగారు ఎంత బాధ పడి ఉంటారో అని ! - ఔరా - నా కిదేమి పేరని. !

పోనీ లే - అబ్బాయి ఏమైనా అంత పనికి మాలిన పని ఏమి అయినా చేసాడంటే - అదీ కాదు. ఓ మోస్తరు బ్లాగు తుమపరాల మధ్య - మిధ్యా లోకం లో నివసించే సాదా సీదా (కాకుంటే - వెరైటీ) అమెరికన్ కాకుంటే కంపూటర్ మానవుడు. పాపం పేరు కి రౌడీ తగిలించు కున్నాడు. !

దీని వల్ల తెలియ వచ్చేది ఏమంటే - మిధ్యా లోకం లో కూడా కాస్త సేన్సిబెల్ గా ఉండవలేన్ అని !

ఎంతైనా - ప్రమదావనం వాళ్ళు అలా రౌడీ అమ్మగారని రాయకుండా వుండవలసినది. !
తల్లి హృదయం - ఎక్కడ నోచ్చుకుంటుందో ఎవరికీ ఎరుక? వెంకటేశా- తప్పులు కాయి.

చీర్స్
జిలేబి.

6 comments:

  1. ".....రాయకుండా వుండవలసినది....." I agree.

    ReplyDelete
  2. Thanks for the concern both of you. కానీ వాళ్ళది సరదాగా వ్రాసింది లెండి. వినీ వినీ మా అమ్మకి కూడా అలవాటయిపోయింది :))




    ఎంత బాధ పడి ఉంటారో అని ! - ఔరా - నా కిదేమి పేరని. !
    _______________________________________

    తప్పుతుందా మరి నన్ను కన్నాక - దుర్యోధనుడిని కన్న గాంధారిలా :))

    ReplyDelete
  3. అయ్యో వరూధినిగారు,

    నేను సరదాగా రాసాను. అంతకుముందు నుండే ఆవిడ నాకు మంచి స్నేహితురాలు.. ఇలా రాస్తున్నా అని రౌడీకి చెప్పాను కూడా.. సరే అన్నాడు.. రౌడీ గురించి మేము చెప్పింది విని ఆవిడ కూడా బాగా నవ్వుకున్నారులెండి.. :))

    ReplyDelete
  4. నల్లనయ్యకే తప్పలేదు నీలాపనిందలు..
    హయినా హెంత మాట హన్నారు.. ఈ గడుసరి ఆడువారు :)

    (ఒహ బ్లాగుకాలం లేట్ స్పందిచుటలో)

    ReplyDelete
  5. వరూధిని గారు ,
    మీ పోస్ట్ నేను ఇప్పుడే చూశాను .
    నా పుట్టిన రోజున , జ్యొతి గారి ప్రోద్భలము తో , సీతాలక్ష్మి గారు , మలక్పేట్ రౌడీ గారి అమ్మగారు , పాట రాసారు . భర ద్వాజ గారు , సంగీతం సమకూర్చగా , వారి అమ్మాయి పాడింది . అది బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో జ్యోతి గారు పబ్లిష్ చేసారు . నేనెవరో తెలియకపోయినా , అంత మంచి పాట రాసిన సీతాలక్ష్మి గారికి , థాంక్స్ చెప్పటము నా ధర్మం గా భావించి , వారి కి ఫోన్ చేసాను . ఆవిడ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడటము తో , మా గెట్ టుగేదర్ కు రమ్మని ఆహ్వానించాను . అక్కడ , అసలు మేమంతా కూడా , బ్లాగ్ ల ద్వారా , ప్రమదావనం ద్వారా పేర్లు తెలిసినవారమే కాని , ముఖాముఖి పరిచయం వున్నవారము కాదు . ఐనా అందరమూ ఎన్నో సంవత్సరాల నుండి స్నేహితులము అనంట్లుగా చాలా సరదాగా గడిపాము . సీతాలక్ష్మి గారు కూడా మాతో కలిసిపోయారు . ' రౌడీ అమ్మ ' అన్నది ముందుగా ఆవిడ అన్న మాటే . ఎవరమూ దానిని సీరియస్ గా తీసుకోలేదు . అక్కడ జరిగింది సరదా గెట్ టుగేదర్ , దాని గురించి జ్యోతి గారు , పి యస్ యం లక్ష్మి గారు రాసినవి , మా సంతోషాన్ని అందరికీ తెలపాలి అని రాసిన సరదా పోస్ట్ లు , మేము ఇచ్చినవి మా సరదా కామెంట్స్ . అంతే కాని ఎవరినీ కించపరిచినవీ కాదు . మేము బెదిరిపోయి రాసినవీ కాదు !
    లక్ష్మి గారు ,
    మీకూ , ఇదే నా సమాధానము . ఇంకా మీరు " ఎబ్బెట్టు " గా భావించరనే తలుస్తాను .
    థాంక్ యు .

    ReplyDelete
  6. To all who responded-

    I am very happy to note that this is taken in a lighter vein by the mother of the blog writer. Hats off to her sportive spirit!

    Hope we all take a cue of this, and as usual go as collective bloggers! ('blaagodarulu' anavachha?)

    cheers
    zilebi.

    ReplyDelete