పిచ్చి గీతలు పచ్చి నిజాలు అన్నది ఓ కవితా సంపుటి పేరు. రాసిన వారి పేరు గుర్తుకు రావడం లేదు సరిగా. మా చిత్తూరు జిల్లా వారు . ఆ మాత్రం తెలుసు. బంగారుపాలెం జమీందారు గారి కాకుంటే - బంగారు పాలెం వాస్తవ్యులనుకుంటా.
ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకంటే - అప్పు డప్పుడు మనమంతా ఏదో రాసే పిచ్చి గీతలు - అంటే ఈ బ్లాగు టపాలన్న మాట - ఎప్పుడైనా రాసే ' పచ్చి నిజాలు' - ఇవన్నీ వచ్చే జమానాలో - రాబోయే కాలం లో నిలిచి ఉంటాయా అన్న సందేహం వచ్చింది.
ఎందుకంటే - ఒక జమాన పూర్వ కాలం లో కవి అంటే - చేతిలో సారా బుడ్డీ - కదిలితే - సిరా కదలుతుంది అన్న దానికి ప్రతీక గా ఉండే వాడు. ఏదో వాడి మానానికి వాడు రాసుకున్నవి ఐతే ప్రసిద్ధి కాకుంటే - ఫ్లాప్ షో అయ్యేవి.
అట్లాగే - మన బ్లాగు కాలానికి - చేతిలో ఏముంటుందో తెలియదు - ఎందుకంటే - అంతా మిథ్యా ప్రపంచం కాబట్టి.
రాసే సమయం - రాసే పరిసరాలు - అంతర్జాతీయ - అంతర్జాలం ! మహేంద్ర జాలం ! - కట్ పేస్ట్ మేటర్ లేక స్వంత మేటారా అన్నది తెలియకుండా పొయ్యే కాలం !
సో, ఈ నేపథ్యం లో - మన బ్లాగు రాతలు - కాల గతిలో - ఎ తీరానికి చేరుతాయి ? వీటికి 'సాహిత్యం' లో స్థానం ఉంటుందా? ( సాహిత్యం అన్నది పెద్ద పదమైతే - క్షమించి - రాతకోతలలో - స్థానం ఉంటుందా అని చదువుకోగలరు!)
చీర్స్
జిలేబి.
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
-
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
*కింది విషయాలు తమ కామెంటులో బోనగిరిగారు (courtesy: What"s app) చెప్పేరు.
ఇందులో ఎన్ని మనం ఆచరిస్తున్నాము,ఎన్ని సంపాది...
11 hours ago
It is asking for too much.
ReplyDelete>> సో, ఈ నేపథ్యం లో - మన బ్లాగు రాతలు - కాల గతిలో - ఎ తీరానికి చేరుతాయి ?
ReplyDeleteగుండెకాయ లేకుండా గుంభనంగా హార్డ్ డిస్క్ లో చేరతాయి.