Sunday, November 21, 2010

కొండాట్టమే కొండాట్టం

కొండాట్టం అన్నది అరవ పదం . తెలుగు లో ఐతే సెలేబ్రషన్ అని చెప్పవచ్చు. ( ఇదేమిటండి ఇంగ్లీష్ లో చెప్పి తెలుగు లో అంటారు అంటే - మేము తెలుగు వారము సుమండీ - అంగ్రేజీ పదం లేక పొతే మా తెల్గు వట్టి పోదూ మరి?)

ఈ కొండాట్టం పదం చిత్తూరు ( అరవ వాళ్ళ తెలుగులో) మాండలీకం క్రింద చేర్చాలని నా మనవి. ఎందుకంటే చాల అంగ్రేజీ పదాలు తెలుగు లో ఉన్నట్టు ఈ పదం కూడా తెలుగు లో పడి ఉండవచ్చు కదా? జాను తెలుగు - తేట తెలుగు తో బాటు - అరువు దేచ్చుకున్న తెలుగు కూడా ఒక భాగం గా చేర్చుకోవచ్చు అనుకుంటా!

ఏమి అమ్మాయ్ - కొండాట్టమే కొండాట్టం గా ఉండావు ? అని ఎవరి నైన అడిగితే చిత్తూరు అమ్మాయి ఐతే సిగ్గు పడి పోయి - ' అక్కోయి నాకు పెళ్లి కుదిరింది ' అని మెలికలు తిరిగి పోక మానదు. కొండాట్టం కాదంటారా మరి ఇది?

చీర్స్
జిలేబి

5 comments:

  1. నాకు బాగా ఇష్టమైఅన్ తమిళ పదం :)

    ReplyDelete
  2. ఈ కొండాట్టనికి సరి అయిన పదం తెలుగులో ఏమిటా అని నేను చానాళ్ళు ఆలోచించించా...మీరన్నట్టు నాకు సెలెబ్రేషన్స్ మాత్రమే స్పురించేది. అలా చించగా చించగా "పండగ చేసుకో" అన్నది సరిపోయినట్టే అనిపించింది. ఇక అప్పటినుండీ సెలెబ్రేషన్ అన్న పదం మానేసి పండగ అనే పదం వాడుతున్నా. :)

    ReplyDelete
  3. hmm.kotha padam nerchukunna... kottadam..kottadam

    ReplyDelete
  4. me blog ki ipude vachanu...motham chusi chepthanu..ela vundoo... :D

    ReplyDelete