Friday, May 20, 2011

బులుసు వెర్సస్ ఐరన్ లెగ్ శాస్త్రి ఒక అపరాధ పరిశోధన

బులుసు గారేమైనా ఐరన్ లెగ్ శాస్త్రి గారా ?
నా బ్లాగులో ఆయన గురించి టపా రాయాగానే
ఝామ్మని నా టపా ఎగిరి పోయింది ?

ఆ టపా మాయ మై పోక ముందు రెండు కామెంటులు కూడా ఉండింది
(అందులో ఒకటి మళ్ళీ ఈ బులుసు గారిదే)

హుష్ కాకి ఆ కామెంటులు  కూడా హులుక్కి ఐపాయింది !

కొన్ని రోజుల తరువాత టపా తప తప తిరిగి వచ్చింది కాని
కామెంటులు గల్లంతు ఐపోయినై !

అంతా విష్ణు మాయ కాకుంటే అమెరికా వొడి మాయ అని అనుకోవాలా ?
కాకుంటే ఇది ఖచ్చితం గా ఐరన్ లెగ్ శాస్త్రి గారి పనే  అనుకోవాలా ?
ఈ అపరాధ పరిశోధన కి ఎవరి కైనా సమాధానం తెలుసా ?

చీర్స్
జిలేబి.

3 comments:

  1. నేను మొదటి కామెంటు పెట్టితే అక్కడ ఇంక కామెంట్లు రాలవు. మధ్యలో పెట్టినా అక్కడితో ఆగిపోతాయి. నేనెదురు పడితే వాళ్ళ పని మటాష్. నా గురించి వ్రాస్తే ఇంకేమౌతుంది ఇంతే అవుతుంది. నా పాదం ఐరన్ లెగ్ కన్నా ఎక్కువ. బహు పరాఖ్.

    ReplyDelete
  2. అవునా బులుసు గారూ!!

    ReplyDelete
  3. గురువు గారి గురించి పోస్ట్ రాసారు , దానికి ఆయన కామెంట్ పెట్టారు
    మరి ఈ బ్లాగ్ ఇంకా ఉంది ఏంటి చెప్మా ?

    ReplyDelete