Saturday, September 24, 2011

యూరో మటాష్ ?

మటాష్ అన్న పదం ఎ భాషో తెలీదు.
యూరో అన్న 'రూపాయి' ఓ పదేళ్లముందు పుట్టింది.
రాజకీయ సమీకరణం లేకుండా , 'రూపాయి' సమీకరణం తో ఏర్పడ్డ యూరో ఇప్పడు కూడలి లో నిలబడి
దిక్కులు చూస్తోందా అని పిస్తోంది.

ఆ మధ్య గ్రీకు , ఇప్పుడు ఇటాలి - ఆ తరువాత ఎ ఐరోపా దేశం? ప్రశ్న మార్కు !

జర్మనీ దేశం , ఫ్రెంచు దేశం - యూరో ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాయి.

సందులో సడేమియా అని అమెరికా వాడు - ' మా దేశం తప్పేమీ లేదు - ఐరోపా వాళ్ళు నిబద్ధత లేకుండా , ఉండటం వల్లే ప్రపంచ ఎకోనోమి దెబ్బ తింటోందని ప్రక్క వాడి పై చెణుకు వేస్తున్నాడు.

మన దేశం ప్రాబ్లం లో ఉంటె - ప్రక్క వాడి వల్లే ఇది ఇలా ఐయింది అనడం సర్వ సాధారణం ! కరప్షన్ సర్వతా ఉంది , ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదు సుమా అని మన నేతలన్నుట్టు ఈ వ్యాఖ్య అమెరికా వాడిది. !

వేచి చూడ వలసినదే - ఐరోపా నా లేక అమెరికానా లేకుంటే ఆసియా నా 'ప్రపంచ' కొంప ముంచేది ?

ప్రపంచ 'కొంప' మునుగుతుందో లేదో తెలీదు గాని, మనం - ప్రజానీకం వీళ్ళ రాజకీయాలతో దెబ్బ తిన కుండా ఉంటామా అన్నది పెద్ద కోస్చేన్ మార్కు !

చీర్స్
జిలేబి.

1 comment:

  1. రాజకీయంగా దేశాలు విడివిడిగా ఉండి, ఎవరి ఆర్ధిక విధానాలు వాళ్ళకు ఉండి, అందులో కొన్ని బాగా పారిశ్రామీకరణ జరిగిన దేశాలై, మరి కొన్ని దేశాలు వ్యవసాయిక ప్రధానమైనవిగా ఉండి, వాళ్ళందరూ ఒక్కటె కరెన్సీ అనుకుంటె, యూరోలాగానే అవుతుంది. ఏ దేశం వాళ్ళు వాళ్ళ పధ్ధతిలో వాళ్ళని వాళ్ళు పరిపాలించుకుంటూ వాళ్ళ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకోవటానికి సదా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటప్పుదు, కామన్ కరెన్సీ ఎక్కువకాలం మనలేదు. యూరో ఇన్నాళ్ళు ఉండగలగటమే గొప్ప. ఏమైనా ఇంగ్లాండు వాళ్ళు ఈ యూరో కరెన్సీ తెచ్చుకోలేదు.

    ఇంకా నయం!శోషలిజం, సెక్యూలరిజం మరీ పెచ్చరిల్లిపోయి, పంచశీల మంత్రం జపిస్తూ, మనదేశమూ చైనా, పాకిస్తాన్, శ్రీలంక అన్నీ కలిపి ఒక్కటె కరెన్సీ అనలేదు. బతికిపోయాం.

    ReplyDelete