Friday, September 30, 2011

టపా రాసేసాను తన్నుకు చావండి !

ఈ మధ్య కన్యా శుల్కం సినిమా చూడడం, అందులోని పాపులర్ డైలాగు - తాంబూలా లిచ్చేసాను, తన్నుకు చావండి విన్నాక, ఈ  టపా తిట్లు సారీ టైటిల్ !

ఈ మధ్య బ్లాగ్ లోకం వచ్చే టపాలు చూస్తూంటే , ఈ టపా టైటిల్ వాటికి దీటుగా ఉందని నా ప్రగాఢ విశ్వాసం !

ఆ మధ్య బ్లాగ్ లోకం, బజ్జు లోకం కి మధ్య పోటీ పెరిగి పోతోందని , బజ్జు లోకం బ్లాగ్ లోకాన్ని బజ్జో అని పిస్తోందని చదివినట్టు గుర్తు.
 

నేను బ్లాగులు రాయటం మొదలెట్టి గమనించిన ఈ మూడేళ్ళలో జరిగిన మార్పు - మార్పు లేనిది కూడలి.  స్టాండర్డ్ గా ఉందని చెప్పవచ్చు.

హారం పలు విధాల మార్పు లు చేర్పులు చేసుకుంటూ, ఇప్పుడు, తెలుగు సమాహారం నుంచి ప్రొమోషన్ తీసుకుని, భారత భాషా బ్లాగుల సంకలిని ఐ పోయింది.

మరి మిగిలిన జాలం, జల్లెడ ఓ మోస్తరు మేమూ ఉన్నామని పిస్తున్నై.

తెలుగు బ్లాగు నించి పై కి ఎదిగిన హారం , తెలుగు బ్లాగు లకి ముఖ్యమైన లంకె స్థాయినించి, తగ్గిందోమో అని నా ప్రగాఢ విశ్వాసం. ( గరిష్ట లంకెలు కూడలి నించి అని బ్లాగ్ హిట్ విశ్లేషణలు బ్లాగర్ వారి వి చదివికా|)

సో టపా రాసేసాను, తన్నుకు చావండి !

చీర్స్
జిలేబి.

2 comments:

  1. తన్నాడమా ? చావడమా? ఏదో ఒకటే చెప్పండి . రెండూ ఒకే సారి చెయ్యడం మాకు రాదు

    ReplyDelete
  2. @తెలుగు బ్లాగు లకి ముఖ్యమైన లంకె స్థాయినించి, తగ్గిందోమో అని

    హ హ, మొదట నేను అలాగే అనుకున్నాను అ౦డి. కాని రె౦డురోజులకు అలవాటయ్యిపోయి౦ది :)

    ReplyDelete