Friday, September 30, 2011

కాలజ్ఞానం - 3 - వ్యాఖ్య - వివరణ

తెలుగు యోగి శర్మ గారి కాలజ్ఞానం మూడు :



మేధస్సుకు ఔన్నత్యం పైపూతల అదోగమనం

సాహితీవేత్తల కళాకారుల నిష్క్రమణం

రాజుకు పట్టిన దోషం రాజ్యాలకేమో గ్రహణం

త్రిమూర్తుల చూపులతో చెదిరిపోయె వీరత్వం

లేత ఆశలను తుంచుతున్న ఉచ్చు.

తండ్రీ కొడుకుల మధ్యన చిచ్చు

తానింతటి భారాన్ని ఎన్నాళ్ళని మోస్తుంది?

చటుక్కున ఒకసారి కళ్ళు తెరిచి మూస్తుంది.


------
నా వ్యాఖ్య :

భారత దేశం మేధస్సు మళ్ళీ భూమండలం లో విఖ్యాతం అవుతుందా?
౨. సాహితీ వేత్తల కళా కారుల నిష్క్రమణం - చాల సర్వ సాధారణమైన విషయం - గొప్పేమీ అనిపించడం లేదు.

రాజు, గ్రహణం, రాజ్యాలు - మళ్ళీ ఐరోపా ఖండాన్ని సూచిస్తోందా ఇది ?
లేక భారత దేశం లో నే మళ్ళీ ప్రోబ్లెంసా ?

తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు - ఎ తండ్రీ ఎ తనయుడు ? అరవ దేశపు కరుణా నిధి యా ?


చీర్స్
జిలేబి. 

1 comment:

  1. వుష్.. అలా అడక్కూడదు. రగస్యం! మనలోనే దాచుకుని కుమిలిపోవాల. అడిగితే అన్నగారికి కోపమొస్తుంది. :)) :P

    ReplyDelete