Sunday, June 3, 2012

ఇచ్చట ఉప (ఉప్మా) వాసములు చేయబడును !

మా కాలనికో బామ్మ ఉండేది మాకు.

ఆవిడ ఆరోగ్యం అమోఘమైనది కూడాను. అంటే, ఏమి తిన్నా జీర్ణించుకొనేది అన్న మాట. ఆ మాటే మాతోటీ చెప్పేది- జిలేబీ, రాళ్ళు తిన్నా జీర్ణించుకోవాలి సుమా అని.

మధ్య మధ్య లో చెప్పా పెట్ట కుండా ఇవ్వాళ ఉప వాసం అని హటాత్తుగా అల్టిమేటం ఇచ్చేది.

ఏమి బామ్మా ఉప వాసం అంటున్నావ్ ఇవ్వాళ అంటే, జీడి పప్పు ఉప్మా పెసరెట్టు (మన యరమణ గారి స్టైల్ అన్న మాట) తినాలని ఉంది జిలేబీ అందుకే ఇవ్వాళ ఉపవాసం అని 'సీక్రెట్' గా చెప్పేది.

అట్లా, మన దేశం లో ఇప్పుడు మన 'సోషల్ ఏక్టివిస్ట్  ' లు చెప్పా పెట్టకుండా ఇవ్వాళ నిరాహార దీక్ష సుమీ అని చెప్పేస్తున్నారు. వాళ్ళకీ జీడిపప్పు ఉప్మా పెసరట్టు తినాలని కాకుంటే, ఉత్తర భారత దేశం వారైతే, హాట్ హాట్ జిలేబీ, వేడి పాలు తాగాలని ఏమన్నా కోరిక గలిగితే వెంటనే నిరాహార దీక్ష చెయ్యాలని 'పూనకం' తెచ్చేసు కుంటారేమో సుమీ !

మా మనమోహనుల వారు 'డీప్ థింకింగ్' ముఖం తో కనిపించారు ఇవ్వాళ.

ఏమి దేవర ఇట్లా ముఖం వేలాడేసు కుని ఉన్నారు అంటే,

క్యా కరూంగా మేం సాహెబ్, 'కరప్షన్' ఫ్రీ కేబినేట్ నడపాలని నిరాహార దీక్ష చే బట్టారు అందుకే దిగాలు గా ఉన్నా అన్నారు వారు.

అది ఎట్లా వీలవు తుంది జీ సాహెబ్ అన్నా హాశ్చర్య పోయి.

'కేబినేట్ నడపొచ్చు. కరప్షన్ నడపొచ్చు. కాని కరప్షన్ ఫ్రీ కేబినేట్ నడప కూడ దంటా రేమి వీరు మరి' మా జీ సాహేబు వారు మళ్ళీ వాపోయారు.

'సాహెబ్, కరప్షన్ ఇండియా కా ప్రాబ్లెం అలోన్ నహీ హాయ్ '  అని పూర్వం దేవేరి వారు దీటు గా చెప్పెసేరు కాదా' అన్నా.

'మంచి మాట జ్ఞాపకానికి తెచ్చేరు మేమ్' అన్నారు సంతోష పడి పోయి మన మొహనుల వారు.

అబ్బా, వీరు పాలిటిక్స్ కి వచ్చాక ఇంత దద్దమ్మ ఎలా అయి పోయారు చెప్మా అని అనుకున్నా. దేశాన్ని దివాలా స్థితి నించి తీసుకొచ్చిన పెద్ద మనిషి, దేశ ఖజానాని ఘట్టి గా నడి పిన పెద్ద మనిషి, అదేమీ ఖర్మో, పాలిటిక్స్ కి వస్తూనే, ఇట్లా బుద్ధి మందగింపు ఎట్లా వచ్చేస్తుంది సుమీ !

అంతా విష్ణు మాయ కాకుంటే, వీరి కి ఇన్ని కష్టాలా మరి . దేశం లో అసలు వ్యవస్థే లేకుండా పోయింది సుమీ


జిలేబి.

2 comments:

  1. ఉపవాసం వేరే, నిరాహార దీక్ష వేరే. దీక్ష చేసేటప్పుడు పెసరట్టులు సమోసాలు బొక్కరాదు.

    ReplyDelete