Sunday, June 10, 2012

శబ్దం నిశ్శబ్దం

రెండు పదాల మధ్య నిశ్శబ్దం
వాటి  అర్థాన్ని చెబుతోంది


రెండు హృదయాల మధ్య
నిశ్శబ్దం వాటి అర్థాన్ని చెబుతోంది.


రెండు పదాల మధ్య
శూన్యత లోపిస్తే
వాటికి అర్థాలు లేవు.


ప్రభూ, నీకూ నాకూ మధ్య
శూన్యత లోపిస్తే
నా ఉనికి కి అర్థం లేదు.

జిలేబి.

4 comments:

  1. భావుకతలో ములిగిపోయారు. రెండు హృదయాల నిశ్శబ్దం, ప్రవాహపు ఉరవడి, అలజడి, తడబడి, కలబడి....

    ReplyDelete
  2. ప్రభూ, నీకూ నాకూ మధ్య
    శూన్యత లోపిస్తే
    నా ఉనికి కి అర్థం లేదు.
    abbabba emi chepparandi,
    with 333 cheers

    ReplyDelete
  3. ప్రభూ, నీకూ నాకూ మధ్య... శూన్యత లోపిస్తే...నా ఉనికి కి అర్థం లేదు.

    ఎలా అర్థం చేసుకోవాలి? కవి హృదయాన్ని!

    ప్రస్తుతం నాకు నా ప్రభువు మధ్య తరాల తరబడి పెరిగిన అంతరం ఉంది అది శూన్యం కాదు,
    అందుకే ఆయన సనాతనుడు దేవుడయ్యాడు, నేను ప్రారబ్ధ వశాత్తు పుట్టిన జీవుడ నయ్యాను.
    శూన్యం అంటే ఏమీ లేని స్థితి,
    నిజానికి నా ప్రభువు నాకు మధ్య శూన్యం ఏర్పడితే
    నేను లేను ఉన్నది ఆతడే! (జీవో బ్రహ్మైవ నా పర:)
    మరి అప్పుడే అత్తిస్థితి లో మాత్రమే నా ప్రభువుకన్న వేరుగా నాకు ఉనికి లేదు,

    కానీ నాకు నా ప్రభువుకు మధ్యన శూన్యం లోపించి అహం చేరితే,
    నాకు ఉనికి ఉంది, నా ప్రభువుకన్న వేరైనా ఉనికి ఉన్నది,
    కాని (ఇ) అప్పుడు నా ఉనికికి అర్థం లేదు,

    నిజమే ఉనికి లేక పోయిన పర్లేదు,
    కాని అర్థం లేని ఉనికి ఉండీ ఉపయోగం లేదు.

    ప్రభువా నా ఉనికే నీవైపో తండ్రీ!!

    ReplyDelete
  4. క్షమించాలి. దగ్గరగా పదిరోజులనుంచి దర్శనం లేదు, కులాసాగా ఉన్నారా?

    ReplyDelete