Sunday, April 28, 2013

పోట్లాడు కుందాం రండి !


ఇదిగో నండీ అయ్యరు  గారు ఇవ్వాళ్టి నించి రోజూ మీతో పోట్లాడ బోతా అల్టిమేటం ఇచ్చా మా అయ్యరు  గారి కి

ఏమోయ్ జిలేబి ఏదో కొత్త గా జెబ్తున్నావ్ ? నలభై ఏళ్ల దాంపత్యం లో మీ బామ్మ చలవ నీతో పోట్లాడని రోజు ఉందా అన్నారు మా అయ్యరు గారు .

పోట్లాడ కుండా నాకు మాటల్రావే మరి ఏం  చెయ్య మంటారు ?

కుమారీ సుకుమారీ అని మీ బామ్మ అంటే ఏమిటో అనుకున్నా ! పెళ్ళైన తరువాయే తెలిసింది ' అழగాన రాక్షసి అని !

పోదురు లెండి ! మీరు మాత్రం ఏమిటి మరి ?

సరెలేవే జిలేబి, ఇంతకీ ఇవ్వాళ్టి  నించి కొత్తగా పోట్లాడ బోతా నన్నావ్ ఎందుకోయ్ మరి ? అడిగారు అయ్యరు గారు

'అదండీ, కష్టే ఫలే శర్మ గారు, 'కోలాటం' బొమ్మ పెట్టి , బెల్లం కొట్టిన రాయిలా ఉండ మాకండీ, కూసింత పెనిమిటి తో మాట్లాడండీ అన్నారండీ ! మాట్లాడండీ అంటే, మనం పోట్లాడడమే కదాండి  ? అందుకే అట్లా చెప్పా '

కోలాటం లో కోలాటం 'శబ్దం' చేసినా దాంట్లో రిథమ్ ఉంటుందోయ్ ! అట్లాగే మన పోట్లాటల్లో కూడా రిథమ్  ఉంటే ఫర్లేదు లే !

అయితే పోట్లాడు కుందాం రండి !!!


చీర్స్
జిలేబి 

15 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. దాంపత్యం నిత్యనూతనంగా ఉండడమంటే ఇదే!

    ReplyDelete
    Replies

    1. జలతారు వెన్నెల గారూ,

      నిత్యనూతన'ధనం'!


      జిలేబి

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. భావ రాజు గారూ,

      మూడు మార్లు పోట్లాడి కామెంటు పెట్ట డానికి ప్రయత్నించి పోట్లాట ఎందుకే లె అనుకున్నట్టు ఉన్నారు !!

      జిలేబి

      Delete
  5. Dhampatyam lo potlatalu lekapothe.. adi ruchi leni vante authundi... mee rachanaapaataveeyam baagundhandee.. :)

    ReplyDelete
    Replies
    1. pubakadotorg గారూ,

      ఈ మీ పేరు ఎట్లా తెలుగు లో రాయడం తెలియడం లేదు !!

      నెనర్లు ! అంతే కదా మరి 'డాం' పత్యం !!

      జిలేబి

      Delete

  6. "అళఘాన రాక్షసి " అని మీరన్నా ,దాంపత్యంలో అందమే .
    దాంపత్యం ఓ ఉపనిషత్ లాంటిదేనని మునిమాణిక్యం నరసిం హా రావు
    గారు నుడివారు . దాంపత్యంపై నవలలు కూడా వ్రాశారు . చాలా
    బాగుంటుంది . అది గుర్తుకు వచ్చింది ఈ దాంపత్యాన్ని పఠనం చేస్తుంటే .


    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ,

      దాంపత్యమ్ ఉపనిషత్ అనుకుంటే ఈ దాంపత్యం, 'బృహదారకోపనిషత్ '!!

      జిలేబి

      Delete
  7. అవునులెండి. నిత్య పోట్లాట పచచ తోరణం. హ్యాపీ పోట్లాట:)

    ReplyDelete
    Replies

    1. జయ గారూ,

      నిత్య యుద్ధం 'కచ్చ' తో 'రణం'!!

      జిలేబి

      Delete
  8. పోట్లాట ఒక కళ, దాన్ని మొదలు పెట్టడం తేలిక, ఎంతలో ఆపాలో తెలిసుంటేనే....:)

    ReplyDelete
    Replies

    1. కష్టే ఫలే వారు,

      పోట్లాడటం ఒక కళ ! ఈ టపా టైటిలు బాగుందండోయ్ ! మీరు ఈ పేరుతొ మరో టపా రాయాల్సిందే మరి !!!

      జిలేబి

      Delete
  9. సింధు గారూ,

    మూడు మార్లు రెండు చుక్కలు బ్రాకెట్లు !!


    జిలేబి

    ReplyDelete